షోలో సస్పెన్స్! | Randhir, ruksar first movie show time | Sakshi
Sakshi News home page

షోలో సస్పెన్స్!

Published Mon, Nov 7 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

షోలో సస్పెన్స్!

షోలో సస్పెన్స్!

రణధీర్, రుక్సార్ జంటగా రామ రీల్స్ సంస్థ నిర్మించిన మొదటి సినిమా ‘షో టైమ్’. ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ సినిమాల రచయిత ఎస్.ఎస్. కాంచీ దర్శకత్వం వహించారు. జాన్ సుధీర్ పూదోట నిర్మాత. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ థియేటర్‌లో సినిమా చూడ్డానికి వెళ్లిన ఓ జంటకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయనేది కథ. ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు. సుప్రీత్, కార్తీక్, రవి ప్రకాశ్, సత్య, సంజిత్, ఆదిత్య నటించిన ఈ చిత్రానికి కళ: బాబ్జి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిరణ్ తనమల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement