Show Time
-
నా బిడ్డవు కదూ..!
రేఖ ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’! లత ‘క్వీన్ ఆఫ్ మెలడీ’! ఈ ఇద్దరు రాణుల మధ్య దూరం వయసులో 25 ఏళ్లు. ఇప్పుడైతే ఇంకా దూరం. లత రెండేళ్ల క్రితం నింగికేగారు. ఆ దేవరాగానికి ఒక ‘శ్రావ్యరూపం’గా రేఖ ఈ భువిని వెలిగిస్తూ ఉన్నారు. ‘‘కానీ అది దూరం కాదు. మరింతగా దగ్గరితనం’’ అంటారు రేఖ!‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ నెల 7న స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ‘ఎవర్గ్రీన్ ఐకాన్ రేఖ’ అనే ఎపిసోడ్లో ప్రేక్షకులకు కనువిందు చేసిన అందాల నటి రేఖ.. గాయని లతా మంగేష్కర్తో తనకున్న ‘రక్త సంబంధాన్ని’ గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకసారి లతాజీ నన్ను తన బర్త్‌డే పార్టీకి ఆహ్వానించారు. ఆ పార్టీలో నేను స్టేజి ఎక్కి, ‘లతా అక్కా.. నేను మీకు బిగ్ ఫ్యాన్‌ని’ అని గట్టిగా అరిచి చెప్పాను. ఆ వెంటనే, ‘దేవుడా, నువ్వు కనుక వింటున్నట్లయితే నాదొక కోరిక. వచ్చే జన్మలోనైనా లతా అక్కను నాకు కూతురిగా పుట్టించు..’’ అని వేడుకున్నాను. అందుకు లతాజీ వెంటనే, ‘వచ్చే జన్మ దాకా ఎందుకు. ఈ జన్మలో కూడా నేను నీ కూతురిని కాగలను’ అంటూ.. నేరుగా స్టేజి పైకి వచ్చి నన్ను ‘మమ్మా.. మమ్మా’ అని పిలిచారు. ఆ పిలుపు ఈనాటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది’’.. అని లతకు, తనకు మధ్య ఉన్న ‘తల్లీకూతుళ్ల బంధం’ గురించి కపిల్ షోలో.. చెప్పారురేఖ. లతకు, రేఖకు మధ్య ఉన్న గాన మాధుర్య బాంధవ్యం గురించైతే చెప్పే పనే లేదు. ‘తేరే బినా జియా జాయే నా’, ‘నీలా ఆస్మాన్ సో గయా’, ‘ఆజ్కల్ పాన్ జమీ పర్ నహీ పడ్తే’, ‘సలామే ఇష్క్ మేరీ జాన్’, ‘దేఖా ఏక్ ఖాబ్’ వంటి మనోహరమైన గీతాలను రేఖ కోసం లత పాడారో, లత కోసం రేఖ అభినయించారో చెప్పటం అంటే.. ఎన్ని జన్మలకైనా వాళ్లిద్దరిలో తల్లెవరో, కూతురెవరో గుర్తు పట్టే ప్రయత్నమే! -
ముత్యాల నగరంలో మత్స్యకన్యలు
సాక్షి, హైదరాబాద్: మత్స్యకన్యలు, సాగర కన్యల గురించి కథలుగా చెప్పుకోవడం, సినిమాల్లో చూడటం తప్ప నిజంగా వారిని చూసిన వారెవరూ లేరు. అయితే ఈ జల కన్యలు ఉన్నది వాస్తవమో కాదో కానీ... హైదరాబాద్ నగరానికి చేరుకున్న మత్స్య కన్యలు మాత్రం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ డబల్ డెక్కర్ ఎగ్జిబిషన్ మెర్మెయిడ్ షోలో మనం చూస్తుంది నిజమేనేమో అనిపించేలా మత్స్యకన్యలు ఆకట్టుకుంటున్నారు. ఫిలిప్పీన్ సాగర కన్యలు.. అమెజాన్ చేపలు.. అండర్ వాటర్ టన్నెల్ డబల్ డెక్కర్‌ను ఏర్పాటు చేసి, అందులో అరుదైన చేపల ప్రదర్శన, స్కూబా డైవింగ్ వంటి వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేయడం నగరవాసులకు పరిచయమే. కానీ ఊహాజనిత కథలుగా చెప్పుకునే సాగరకన్యలు, హాలీవుడ్ సినిమాల్లో అందంగా కనిపించే మత్స్యకన్యల ప్రదర్శన మాత్రం దేశంలోనే ఇదే మొదటిసారి.దీని కోసం పసిఫిక్ మహాసముద్రంలో ప్రదర్శననిచ్చే ఫిలిప్పీన్‌కు చెందిన ఆరుగురు యువతులు నగరానికి చేరుకున్నారు. మర్మెయిడ్గా పిలుచుకునే వీరు జల కన్యల వస్త్రధారణతో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్లో ఆక్సిజన్ లేకుండా ప్రదర్శన చేయడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఈ మమెడ్ షోలు గతంలో దుబాయ్, థాయ్‌లాండ్, హాంకాంగ్ వంటి దేశాలకు మాత్రమే పరిమితం. ఈ అండర్ వాటర్‌లో సింగపూర్, మలేసియాతో పాటు అమెజాన్ నది నుంచి తీసుకువచి్చన 600 అరుదైన చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడి స్కూబా డైవింగ్ కూడా మంచి అనుభూతిని అందిస్తుంది. మరో 37 రోజుల వరకు ఈ ప్రదర్శన జరగనుందని నిర్వాహకులు తెలిపారు. విజ్ఞానం, వినోదమే లక్ష్యంగా.. విదేశాల్లో మాత్రమే చూడగలిగే మెర్మెయిడ్ షోను కోట్ల రూపాయల వ్యయంతో, ఎంతో వ్యయప్రయాసలకోర్చి నగరంలో ఏర్పాటు చేశాం. ఎగ్జిబిషన్ రంగంలో మాకు 39 ఏళ్ల అనుభవం ఉంది. ప్రజలకు అద్భుత అనుభూతిని అందించేందుకు ఫిలిప్పీన్స్ నుంచి జలకన్యలను తీసుకువచ్చాం. ఆక్సిజన్ లేకుండా నిమిషానికిపైగా నీటిలోనే ఉంటూ ప్రదర్శన ఇవ్వడం అరుదైన కళ. వీటితో పాటు 27కు పైగా అమ్యూజ్మెంట్ గేమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విజ్ఞానం, వినోదం అందిస్తున్నాం. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. షో మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. – రాజారెడ్డి, నిర్వాహకుడు -
ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్
బాలీవుడ్ బుల్లితెరలో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ OTT 2 జియో సినిమాలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా అందులోని పోటీదారుల మధ్య జరిగే తగాదాలతో షో హీటెక్కుతుంది. అయితే ఈసారి మరో కారణంతో షోను హీటెక్కించారు కంటెస్టెంట్స్. కెమెరాలు లైవ్‌లో ఉంటాయని తెలిసి కూడా బాలీవుడ్ నటుడు జాద్ హదీద్ చేసిన పనితో పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దుబాయ్‌కి చెందిన మోడల్ ఆకాంక్ష పూరి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. దీంతో అతనిని దారుణంగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఎంతోమంది చూస్తున్నటువంటి షోలో ఇలా చేయడం మంచిది కాదు. ఈ విషయంపై హోస్ట్‌గా ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ చర్యలు తీసుకోవాలని బిగ్ బాస్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: అభిమానితో ఇంత సాదాసీదాగా ఉన్న ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..) షో ప్రారంభం నుంచే నటి ఆకాంక్ష పూరి పట్ల జైద్ హదీద్ ప్రవర్తన కూడా కొంచెం తేడాగానే ఉంది. తాజాగా కెమెరాలు లైవ్ స్ట్రీమ్‌లో ఉండగా.. ఆకాంక్ష నడుమును హదీద్ పట్టుకున్నాడు.. అంతటితో ఆగని అతను దగ్గరకు లాగడం ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె అసౌకర్యంగా భావించినట్లు వీడియోలో కనిపిస్తుంది. అంతేకాకుండా హదీద్‌ను దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తూ.. అతని ప్రవర్తనను మందలించింది. ఇలా తనను తాకడం ఇష్టం లేదని కూడా అక్కడే చెప్పింది. ఈ వీడియోను చూసిన వారు.. సోషల్ మీడియాలో జైద్ హదీద్‌పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by 𝕣ꫀꪖꪶⅈ𝕥ꪗ 𝕥ꪖᦔ𝕜ꪖ (@reality__tadka) (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలో బీజేపీ అన్నారు) -
సినిమా థియేటర్లు: మారిన టైమింగ్స్ ఇవే!
సాక్షి, హైదరాబాద్: రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లను కూడా రాత్రి 8 గంటలకే మూసివేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని మల్టీప్లెక్సులు, థియేటర్లు, సినిమా హాళ్లను 8 గంటలకే మూసేయాలి. వాటి సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రవేశద్వారాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. సామాజిక దూరం పాటించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. థియేటర్లలో 24 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత, 40–70 శాతం తేమ, లోపలికి, బయటికి గాలి ప్రసరించేలా ఏర్పాట్లు చేయాలి. ఇంటర్వెల్, ముగింపు సమయంలో ప్రేక్షకులు భారీగా గుమిగూడకుండా చూడాలి. షోల సమయాల్లో మార్పులు రాత్రి కర్ఫ్యూ విధిస్తూ మంగళవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. సినిమా థియేటర్ల యజమానులు సెకండ్ షోను రద్దు చేసుకున్నారు. మిగతా మూడు షోల సమయాన్ని సవరించారు. మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు మొదలై మధ్యాహ్నం 1.30గంటల వరకు.. మ్యాట్నీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు.. ఫస్ట్ షోను 5 గంటలకు మొదలై రాత్రి 8 గంటలలోపు ముగించేలా మార్చారు. అయితే తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ మాత్రం కొవిడ్ ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా నేటి (బుధవారం) నుంచి రాష్ట్రంలో సినిమా ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. చదవండి: కరోనా కష్టాలు మామ.. సినిమా చూపలేము మామా! రష్మికకు ప్రపోజ్ చేసిన రౌడీ హీరో.. వీడియో వైరల్ -
5జిల్లాల్లో క్లీన్ స్వీప్
-
మళ్లీ రుణమాఫీ..
-
దసరాలోపు తేల్చేద్దాం
-
మనకే నయం
-
అన్నయ్య భయపడితే చాలు... ఆనందమే!
– రాజమౌళి ‘‘అన్నయ్య (కాంచీ)లో వెటకారం ఎక్కువ. ప్రతి ఒక్కరిలోనూ తప్పులు ఎత్తి చూపిస్తూ వెక్కిరిస్తాడు. తన సినిమాలో తప్పులు ఉండకూడదని కోరుకుంటున్నాను. కానీ, అందరూ కలసి నన్నెక్కడ విమర్శిస్తారోనని అన్నయ్య నిలబడిన తీరు చూస్తే ఆనందంగా ఉంది. తను భయపడితే చాలు... నాకు ఆనందంగా ఉంటుంది’’ అన్నారు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన కజిన్, సంగీత దర్శకుడు కీరవాణి సోదరుడు ఎస్.ఎస్. కాంచీ దర్శకత్వం వహించిన సినిమా ‘షో టైమ్’. రణధీర్, రుక్సార్ మీర్ జంటగా జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ సినిమా పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. కీరవాణి స్వరపరిచిన పాటల సీడీలను అనుష్క విడుదల చేసి, తొలి సీడీని రచయిత శివశక్తి దత్తాకి అందజేశారు. రాజమౌళి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత జాన్ సుధీర్ పూదోట తెలిపారు. ‘‘ఓ థియేటర్లో జరిగే కథే ఈ సినిమా. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు చూస్తామా? అనే ఆసక్తి కలుగుతోంది’’ అన్నారు కె. రాఘవేంద్రరావు. ‘‘ప్రత్యేక గీతాలు, ఫైట్లు లేకుండా ప్రేక్షకులు ఆస్వాదించేలా కాంచీ సినిమా తీశాడు’’ అన్నారు కీరవాణి. కాంచీ మాట్లాడుతూ –‘‘నన్నెవరైనా విమర్శిస్తే సంతోషమే. నా తప్పులు తెలుసుకుంటాను. కానీ, నన్నెవరూ విమర్శించకుండా, నా తప్పులు వెతికే అవకాశం వాళ్లకి రాకూడదనే తపనతో ఈ సినిమా తీశా. సినిమాలో తప్పులేవైనా ఉంటే అవి నావి, ఒప్పులు మా టీమ్‌కి చెందుతాయి’’ అన్నారు. ‘‘మా అబ్బాయి కార్తికేయ బాగా పాడతాడని ఈ సినిమాలో పాట వినేవరకూ తెలియదు’’ అన్నారు రాజమౌళి. రచయిత విజయేంద్రప్రసాద్, నిర్మాత పీవీపీ, దర్శకుడు వైవీయస్ చౌదరి, సంగీత దర్శకుడు కల్యాణ రమణ తదితరులు పాల్గొన్నారు. -
షోలో సస్పెన్స్!
రణధీర్, రుక్సార్ జంటగా రామ రీల్స్ సంస్థ నిర్మించిన మొదటి సినిమా ‘షో టైమ్’. ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ సినిమాల రచయిత ఎస్.ఎస్. కాంచీ దర్శకత్వం వహించారు. జాన్ సుధీర్ పూదోట నిర్మాత. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లిన ఓ జంటకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయనేది కథ. ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు. సుప్రీత్, కార్తీక్, రవి ప్రకాశ్, సత్య, సంజిత్, ఆదిత్య నటించిన ఈ చిత్రానికి కళ: బాబ్జి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిరణ్ తనమల. -
ఒక అన్నయ్య రాజు.. ఇంకో అన్నయ్య మంత్రి
‘‘నా సక్సెస్ఫుల్ జర్నీలో కీరవాణి, రాజమౌళి తండ్రులకు భాగముంది. నాతో పనిచేసిన కీరవాణి, రాజమౌళి మంచి విజయాలు అందుకున్నారు. వారి సక్సెస్‌లు చూసి ఓ తండ్రి, గురువులా ఆనంద పడుతున్నా. కాంచి కూడా వారిలాగే సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. నటుడిగా, రచయితగా ప్రేక్షకులకు పరిచయమైన ఎస్ఎస్ కాంచి దర్శకత్వం వహించిన చిత్రం ‘షో టైమ్’. రణ్‌ధీర్, రుక్సర్ మీర్ జంటగా జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. రాజమౌళి మాట్లాడుతూ- ‘‘మా కుటుంబంలోని 13మంది కజిన్స్లో కీరవాణి అన్నయ్య కింగ్ అయితే కాంచి అన్నయ్య మంత్రి. టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను హీరో అవ్వాలనే తపనతో పూజలు చేసేవాణ్ణి. హీరో అవ్వాలనుందనే విషయాన్ని సిగ్గుతో ఎవరి వద్దా ప్రస్తావించలేదు. కాంచి అన్నయ్య ఏమవుదామనుకుంటున్నావు? అని అడిగితే హీరో కావాలనుందని చెప్పా. హీరో అవ్వాలంటే ఊర్లో ఉంటే ఎలా? ఇండస్ట్రీలో ఉండాలని చెప్పి నాకు గైడ్‌లా వ్యవహరిం చారు. ఆయన ఎప్పుడో దర్శకుడవ్వాల్సింది.. ఇప్పుడయ్యారు. ఫస్ట్ లుక్ టీజర్‌తోనే కట్టిపడేశారు. ట్రైలర్, సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా’’ అన్నారు. కాంచి మాట్లాడుతూ- ‘‘దర్శకత్వం చేయాలన్నది నా కల కాదు కానీ, ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘భారతీయ సినిమా ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే నా ఆశ. అందులో భాగంగానే ‘షో టైమ్’ నిర్మించా. హాలీవుడ్ నటుడు జాకీచాన్‌తో ఓ చిత్రం నిర్మించబోతున్నా’’ అని సుధీర్ పూదోట చెప్పారు. -
భయపెడుతున్న రాజమౌళి సోదరుడు
బాహుబలి సినిమాతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి. ఇప్పటివరకు ఫ్లాప్ అన్నది లేకుండా కెరీర్ కొనసాగిస్తున్న జక్కన్న స్కూల్ నుంచి ఇప్పటికే ఒకరిద్దరు దర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే తాజాగా రాజమౌళి సోదరుడు ఎస్ ఎస్ కాంచీ దర్శకుడిగా మారుతున్నాడు. ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా, రాజమౌళి తెరకెక్కిన పలు చిత్రాల్లో హాస్యనటుడిగా కనిపించారు కాంచీ. మర్యాదరామన్న సినిమా ట్రైన్ ఎపిసోడ్లో సునీల్ కొబ్బరి బొండం కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు అతన్ని ఆటపట్టించే వ్యక్తిగా కనిపించిన నటుడే కాంచీ. నటుడే కాక రచయిత, కథకుడు కూడా అయిన కాంచీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షో టైం పేరుతో ఓ హారర్ సినిమాని తెరకెక్కిస్తున్న కాంచీ, ఆ మూవీ ఫస్ట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకి సంబందించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.