భయపెడుతున్న రాజమౌళి సోదరుడు | Rajamoulis Brother Kanchi Directorial Show Time Movie | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న రాజమౌళి సోదరుడు

Jun 21 2016 11:12 AM | Updated on Jul 14 2019 4:05 PM

భయపెడుతున్న రాజమౌళి సోదరుడు - Sakshi

భయపెడుతున్న రాజమౌళి సోదరుడు

బాహుబలి సినిమాతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి. ఇప్పటి వరకు ఫ్లాప్ అంటూ లేకుండా కెరీర్ కొనసాగిస్తున్న జక్కన్న స్కూల్ నుంచి ఇప్పటికే ఒకరిద్దరు...

బాహుబలి సినిమాతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి. ఇప్పటివరకు ఫ్లాప్ అన్నది లేకుండా కెరీర్ కొనసాగిస్తున్న జక్కన్న స్కూల్ నుంచి ఇప్పటికే ఒకరిద్దరు దర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే తాజాగా రాజమౌళి సోదరుడు ఎస్ ఎస్ కాంచీ దర్శకుడిగా మారుతున్నాడు. ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా, రాజమౌళి తెరకెక్కిన పలు చిత్రాల్లో హాస్యనటుడిగా కనిపించారు కాంచీ.

మర్యాదరామన్న సినిమా ట్రైన్ ఎపిసోడ్లో సునీల్ కొబ్బరి బొండం కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు అతన్ని ఆటపట్టించే వ్యక్తిగా కనిపించిన నటుడే కాంచీ. నటుడే కాక రచయిత, కథకుడు కూడా అయిన కాంచీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షో టైం పేరుతో ఓ హారర్ సినిమాని తెరకెక్కిస్తున్న కాంచీ, ఆ మూవీ ఫస్ట్ టీజర్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకి సంబందించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement