బాలీవుడ్ బుల్లితెరలో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ OTT 2 జియో సినిమాలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా అందులోని పోటీదారుల మధ్య జరిగే తగాదాలతో షో హీటెక్కుతుంది. అయితే ఈసారి మరో కారణంతో షోను హీటెక్కించారు కంటెస్టెంట్స్. కెమెరాలు లైవ్‌లో ఉంటాయని తెలిసి కూడా బాలీవుడ్ నటుడు జాద్ హదీద్ చేసిన పనితో పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దుబాయ్‌కి చెందిన మోడల్ ఆకాంక్ష పూరి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు.
దీంతో అతనిని దారుణంగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఎంతోమంది చూస్తున్నటువంటి షోలో ఇలా చేయడం మంచిది కాదు. ఈ విషయంపై హోస్ట్‌గా ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ చర్యలు తీసుకోవాలని బిగ్ బాస్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: అభిమానితో ఇంత సాదాసీదాగా ఉన్న ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..)
షో ప్రారంభం నుంచే నటి ఆకాంక్ష పూరి పట్ల జైద్ హదీద్ ప్రవర్తన కూడా కొంచెం తేడాగానే ఉంది. తాజాగా కెమెరాలు లైవ్ స్ట్రీమ్‌లో ఉండగా.. ఆకాంక్ష నడుమును హదీద్ పట్టుకున్నాడు.. అంతటితో ఆగని అతను దగ్గరకు లాగడం ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె అసౌకర్యంగా భావించినట్లు వీడియోలో కనిపిస్తుంది. అంతేకాకుండా హదీద్‌ను దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తూ.. అతని ప్రవర్తనను మందలించింది. ఇలా తనను తాకడం ఇష్టం లేదని కూడా అక్కడే చెప్పింది. ఈ వీడియోను చూసిన వారు.. సోషల్ మీడియాలో జైద్ హదీద్‌పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలో బీజేపీ అన్నారు)
Comments
Please login to add a commentAdd a comment