
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహిరించిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2కు సోమవారం శుభం కార్డ్ పడింది. ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్‌లో గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్టులో మనీషా రాణి ఒకరు. అయితే ఈ షోలో ప్రత్యేక అతిథిగా ఆలియా భట్ ఫాదర్ మహేశ్ భట్ పాల్గొన్నారు. హోస్‌మేట్స్‌తో ముచ్చటించిన ఆయన.. అదే సమయంలో మనీషా రాణి చేతిని సరదాగా ముద్దాడారు. అయితే దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. సోషల్ మీడియాలో ఆయన ట్రోల్స్‌కు గురయ్యారు. వయసులో పెద్దవ్యక్తి అయినా మహేశ్.. ఆమెను అసభ్యకరంగా తాకడం ఏంటని నెటిజన్స్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెపై వస్తున్న ట్రోల్స్‌పై మనీషా రాణి స్పందించింది. మహేశ్ భట్ తీరు పట్ల ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
(ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి! )
మనీషా రాణి మాట్లాడుతూ..'మహేష్ భట్ చాలా పెద్ద డైరెక్టర్. అతడిని కలవాలనేది నాకల. ఆయన అలా చేయడం వల్ల నాకు అసౌకర్యంగా అనిపించలేదు. అలా తాకాడని ప్రజలు భావిస్తే.. అది చాలా తప్పు. అతను నాకు అంకుల్‌తో సమానం. వృద్ధులు తమ ప్రేమను కొన్నిసార్లు వారిని తాకడం ద్వారా వ్యక్తం చేస్తారు. ఆయన ఉద్దేశం చాలా స్వచ్ఛమైంది.' అని చెప్పింది.
ఆ తర్వాత బిగ్ బాస్ ఫైనలిస్ట్, మహేశ్ భట్ కూతురు పూజా భట్ మీడియాతో మాట్లాడింది. మనీషాతో పాటు తన తండ్రి ఇతర కంటెస్టెంట్స్‌ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడని తెలిపింది. బిగ్ బాస్ హౌస్‌లో కొద్ది సమయమే ఉన్నారని పేర్కొంది. మనీషా ఇతరులను కౌగిలించుకుని ముద్దులు పెట్టినప్పుడు ఎవరికీ సమస్య ఉండదు..కానీ ప్రజలు నిజంగా అలా ఆలోచిస్తే వారికి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పింది. అంతే కానీ దీనిపై మా నాన్న, నేను ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని పూజా భట్ తెలిపింది. ఈ సీజన్‌లో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ విన్నర్‌గా నిలిచి.. ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో టాప్ -5 ఫైనలిస్ట్‌లలో ఎల్విష్, అభిషేక్ మల్హన్, మనీషా రాణి, బేబికా ధుర్వే, పూజా భట్ ఉన్నారు.
(ఇది చదవండి: అమ్మపై దారుణ కామెంట్స్.. ఇప్పుడు కూడా: బుల్లితెర నటి)
#Livefeed !!
— Livefeed Videos (@BBosslivefeed1) August 1, 2023
Mahesh Bhatt ne #Manisha ke hath pe kiss kiya!! #BiggBossOTT2pic.twitter.com/mt1ZVVKmuD