Behavior
-
మా వారి ప్రవర్తనతో విసిగిపోయాను...
మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తన పనిలో నిత్యం బిజీగా ఉంటారు. తన ఉద్యోగం చాలా ఒత్తిడితో కూడుకుని ఉండటం, ఇంటిదగ్గర ఉన్నప్పుడు కూడా ఏదో ఒక మీటింగ్‌కు అటెండ్ అవాల్సి రావడం, వర్క్ ఫ్రమ్ హోం, రాత్రుళ్లు లేటుగా పడుకోవడం వంటివి కోవిడ్ సమయం నుంచి ఎక్కువయ్యాయి. పడుకున్న కొన్ని గంటలు సరిగా నిద్ర పోకపోవడం, పొద్దున్నే చిరాకుగా ఉండటం చీటికీ మాటికీ కోపం తెచ్చుకోవడం ఈ మధ్య ఎక్కువయ్యాయి. పిల్లల మీద ఉట్టిపుణ్యానికి అరుస్తున్నారు. నా భర్త వేరే ఏ దురలవాట్లు లేని మంచి వ్యక్తి అని ఎంతో ఆనందించే నేను ఈ మధ్య ఆయన ప్రవర్తనతో విసిగిపోయాను. మీ సలహా కోసం ఎదురు చూస్తూ...– ఓ సోదరి, హైదరాబాద్ప్రియమైన చెల్లెమ్మా! మీ భర్త దీర్ఘకాలిక వత్తిడి వలన కొన్ని మానసిక లక్షణాలకు లోనవుతున్నట్లు కనిపిస్తుంది. కోవిడ్ తర్వాత పని సంస్కృతిలోని మార్పుల వలన ఈ రోజులలో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఇంటికి, ఆఫీస్‌కి తేడా కనుమరుగవుతోంది. మీ వారి లక్షణాలను ‘బర్న్ అవుట్’ అని అంటాము. మీ ఆయనకు ఎలాంటి వ్యసనాలు లేవన్నారు. కాని వారు తన ఉద్యోగాన్ని, ఫ్యామిలీ లైఫ్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. నిద్ర సరిగా లేకపోవడం, అతి కోపం, చిరాకు ఇవి తన పనిలో సామర్థ్యాన్ని తగ్గించడమే గాక, తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే మున్ముందు శారీరక సమస్యలు కూడా రావచ్చు. పనివేళలపై ముఖ్యంగా ఇంటి వద్ద పని వేళలపై సరిహద్దులు పెట్టడం, సరైన సమయపాలన చేయడం ద్వారా వృత్తి, జీవిత సమతుల్యం మెరుగుపరుచుకోవాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతపని ఇతరులకు అప్పగించడం లేదా నిరాకరించడం చేయగలగాలి. మీ కుటుంబ సమయం, విశ్రాంతి సమయాన్ని కూడా మీ మీటింగుల లాగే, అనివార్యమైనవిగా మీ కేలండర్లో రాసుకోవాలి. సరైన నిద్ర, వ్యాయామం, సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడిని చాలా వరకు నియంత్రించవచ్చు. మీ వారి ప్రవర్తన ఎలా కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందో వారితో సానుభూతితో చర్చించండి. ఒక జీవిత భాగస్వామిగా మీ మద్దతు తనకు ఉందని తెలిసినప్పుడు వారు కూడా మార్పునకు గట్టిగా కృషి చేస్తారు. మీరు కూడా ఈ పరిస్థితుల వలన ఒత్తిడికి లోనవకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అప్పటికీ మార్పు రాకపోతే ఒక సైకియాట్రిస్ట్‌ను కలిసి థెరపీ ద్వారా, మందుల ద్వారా వారి ఒత్తిడిని తగ్గించి మీ కుటుంబ జీవన నాణ్యతను ఖచ్చితంగా మెరుగు పరుచుకోవచ్చును. -
నాడు అత్యుత్సాహం.. నేడు అతి వినయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచీ వివాదాలే.. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని వివాదాల మయం చేస్తున్నారు. ఏదోక దుందుడుకు చర్యతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సైతం వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత క్యాడర్లోనే అసంతృప్తి రేగింది. ఆది నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నవారిని లెక్క చేయపోవడంతో ఆయన తీరుపైన పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఆయన ప్రవర్తనలో మాత్రం మార్పురాలేదు. తీరా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదం అవుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త, చెన్నారావు నిర్మించిన భవనాన్ని అక్రమ కట్టడం పేరుతో కూల్చివేసే ప్రయత్నం చేశారు. తానే స్వయంగా బుల్డోజర్ని తీసుకెళ్లి కూల్చివేస్తానని హంగామా చేశారు. పోలీసులు, అక్కడ అధికారులు వారిస్తున్నా వినకుండా డాబా దిగువన ఉన్న గదిని కూల్చేశారు. రోడ్లపైన ఉన్న గోతులను పూడ్చాల్సింది అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయనదే బాధ్యత. అయితే బాధ్యత మరిచి రోడ్డుపై ఉన్న నీటి గుంత ముందు కూర్చొని నిరసన తెలిపారు. సొంత పార్టీనేతలను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో విస్సన్నపేటలో గ్రామ కమిటీ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పారు.తాజాగా మరొక వివాదంతో..తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదానికి తెరతీశారు. ఎమ్మెల్యే ప్రధానవీధిలో నడిబొడ్డున ఉన్న ఒక భారీ అక్రమ కట్టడంపై నగరపంచాయతీ తీసుకున్న చట్టపరమైన చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఆ కట్టడం ఒక వార్డు కౌన్సిలర్‌కు చెందినది కావడంతో ఆ సామాజికవర్గానికి తాను అండగా ఉంటానంటూ సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే చేస్తున్న హడావుడి చర్చనీయాంశమైంది. దీనికి తోడు అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోవాలని మరో వార్డు కౌన్సిలర్ చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే రాజకీయ రంగు పులిమారు. మంగళవారం అక్రమ కట్టడాలపై నగర పంచాయతీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ పాలకవర్గం వైఎస్సార్ సీపీ ఆధీనంలో ఉండగా, వ్యాపారులకు నష్టం కలిగించే చర్యలకు ఆ పార్టీ పాల్పడుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే పోస్టు చేస్తున్నారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ, అక్రమ కట్టడాలపై చర్య తీసుకోవాలంటూ 9వ వార్డు కౌన్సిలర్ దుర్గారావు నగరపంచాయతీ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.ప్రజల దృష్టి మళ్లించేందుకే..అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికే తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఏనాడూ తిరువూరులో వ్యాపారులతో కక్షసాధింపు ధోరణికి పాల్పడలేదని, సామరస్య పూర్వకంగానే వ్యవహరించిందని పార్టీ నాయకులు చెబుతున్నారు.పార్టీకి సంబంధం లేదు..అక్రమ కట్టడాల విషయంలో అధికారులే తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు సైతం తనకు సంబంధం లేని అంశాల్లో తలదూరుస్తూ నియోజకవర్గంలో అభద్రతా వాతావరణాన్ని సృష్టించడం సరికాదు. ఆయన వివాదాస్పద వైఖరి ఇకనైనా మార్చుకోవాలి.– నల్లగట్ల స్వామిదాసు, తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి -
తెలంగాణ సీఎం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా?
రాజకీయ నేతలు ఒక్కోసారి తాము మాట్లాడేది తమకే తగులుతుందన్న సంగతి మర్చిపోతుంటారు. ఎదుటివారిపై నోరు పారేసుకోవడంలో ఉత్సాహం చూపే క్రమంలో తమకే నష్టం చేసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అలాగే ఉన్నాయి. తాను కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నట్లు రేవంత్ అనుకోవడం లేదు. ఇంకా టీడీపీలోనే ఉన్నట్టుగా... ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత విధేయుడినన్నట్లే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మాదిరి రాజకీయాలలో రేవంత్ కూడా అదృష్టవంతుడే. దాన్ని ఆయన నిలబెట్టుకుంటే మంచిదే. కానీ అందుకు భిన్నంగా నోటి దురద తీర్చుకుంటున్న వైనం ఆయనకు నష్టం చేస్తుందని చెప్పక తప్పదు.ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ, మంత్రులను, పార్టీ నేతలను అజమాయిషీ చేయలేని నిస్సహాయ స్థితిలో పొరుగు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడి తృప్తి పడుతున్నారనుకోవాలి. ఫిరాయింపు రాజకీయాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రమాణికతను తెలియచేస్తుంది. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓడిపోవడంపై రేవంత్ రెడ్డి అతిగా స్పందించారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు గుణపాఠం చెప్పారని ఆయన అంటున్నారు. ప్రత్యర్ధులపై కక్షకట్టి పాలనను విస్మరించారని, టీడీపీని ఖతం చేయాలని పగబట్టారని, చివరికి సొంత పార్టీనే ఖతం చేసుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్నే మింగేస్తాయి అని ఆయన ప్రవచనాలు వల్లించారు. వీటిలో దాదాపు అన్నీ ఆయనకు, ఆయన ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న పార్టీకే వర్తిస్తాయి.అంతకన్నా ముందుగా రేవంత్ ఒక విషయాన్ని గుర్తించాలి. తెలుగుదేశం ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. అయినా రేవంత్ ఆ పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇస్తున్నారు. తద్వారా తన నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు. అది కరెక్టా? కాదా? అన్నది ఆయన, కాంగ్రెస్ అధిష్టానం తేల్చుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు జనం గుణపాఠం చెప్పారని అంటున్న రేవంత్ గత పదేళ్లలో రెండు ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయింది కదా! అనేదానికి తన విశ్లేషణ చెబుతారా! పలు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది కదా! అయినా అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.అంతెందుకు కొడంగల్ లో 2018లో ఆయనే ఓటమి పాలయ్యారు కదా! అంటే అప్పుడు ఆయనకు ప్రజలు పాఠం చెప్పారని అంగీకరిస్తారా? తను చేసిన పాపం వల్లే అప్పుడు ఓడిపోయానని అంటారా! ఈ విషయాన్ని పక్కనబెడితే మరో సంగతి చూద్దాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉండేది కదా. ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితం అయ్యిందంటే ఆ పార్టీ చేసిన పాపాల వల్లే మునిగిపోయిందా! గత మూడు టరమ్ లుగా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతోంది కదా! అంటే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు చేసిన పాపాలే కాంగ్రెస్ ను మింగేశాయని రేవంత్ చెప్పదలిచారా!అలాగే, ఒకప్పుడు రెండు లోక్ సభ సీట్లతో ఉన్న బీజేపీ నిరాఘాటంగా మూడు దఫాలుగా పాలన చేస్తున్నది కదా! అలాగే ఏపీలో నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాకూడదని ఏమైనా ఉందా? 2019లో కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి జనసేన, బీజేపీలతో ప్రత్యక్షంగాను, కాంగ్రెస్, సీపీఐలతో పరోక్షంగానూ జతకట్టి అధికారంలోకి వచ్చింది కదా! చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం మూడుసార్లు ఓటమి చెందింది. అంటే ఆ మూడుసార్లు పాపాలు మూట కట్టుకోవడం వల్లే టీడీపీ ఓడిపోయిందని రేవంత్ చెబుతున్నారా! టీడీపీని ఖతం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నారట.రేవంత్ ఎలా అబద్దం చెబుతున్నారో చూడండి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వైఎస్సార్సీపీని ఖతం చేయాలని ప్రయత్నించడం పగ పట్టినట్లు కాదట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేయకపోయినా ఖతం చేసినట్లట. ఆ మాటకు వస్తే తెలంగాణలో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఖతం అయింది? ఓటుకు నోటు కేసు ద్వారా చంద్రబాబుతోపాటు రేవంత్ కు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లే కదా! టీడీపీని ఖతం చేసిన తర్వాత రేవంత్ కాంగ్రెస్ లో చేరిపోయారే!. ఇంకో విషయం చూద్దాం. రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం అయిన మహబూబ్ నగర్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే 2019లో తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో సైతం ఈసారి బీజేపీ గెలిచింది. దీనికి నైతికంగా రేవంత్ బాధ్యత వహించారా? ఆయన ఏ పాపం చేస్తే ఈ రెండుచోట్ల ఇలా జరిగింది. కొడంగల్‌తోపాటు కామారెడ్డిలో శాసనసభకు పోటీచేసిన రేవంత్ కొడంగల్ లో గెలిచినా, కామారెడ్డిలో ఓడిపోవడమే కాకుండా మూడోస్థానానికే ఎందుకు పరిమితం అయ్యారు? ముఖ్యమంత్రి కాండిడేట్ కు అది అవమానం కాదా! తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ ను ఖతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్ ఏపీ రాజకీయాలలో తలదూర్చి నీతులు చెబుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య.. ఇలా ఎవరు దొరికితే వారిని కాంగ్రెస్ లోకి లాక్కొని ముఖ్యమంత్రి హోదాలో స్థిరపడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు! గతంలో ఇదే రేవంత్ ఫిరాయింపులు చేసేవారిని రాళ్లతో కొట్టాలని అన్నారు కదా? ఇప్పుడేమో ప్రభుత్వ సుస్థిరతకు ఇతర పార్టీల నుంచి చేరికలు అవసరమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఫిరాయింపు రాజకీయాలు చేసిన కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని, క్షమాపణలు చెప్పాలని నీతి వాక్యాలు చెప్పారు. బాగానే ఉంది. మరి అదే పని ఇప్పుడు ఆయన కూడా చేస్తున్నారే. భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారం కోల్పోతే అప్పుడు ఈయన ముక్కు నేలకు రాస్తారా! రేవంత్ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రిపైన అయినా అజమాయిషీతో ఉండగలుగుతున్నారా!జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ లోకి తెచ్చినప్పుడు పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇచ్చిన జెర్క్ కు రేవంత్ ఎందుకు భయపడ్డారు. ఆయన పార్టీ నుంచి పోతే పోయారులే అని అనుకుని ఊరుకోకుండా తప్పు ఎందుకు ఒప్పుకున్నారు! ప్రత్యర్ధులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారని రేవంత్ అంటున్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసులు వస్తే అవన్ని సక్రమం, తన గురువు అయిన చంద్రబాబుపై అవినీతి కేసులు వస్తే అవన్ని కక్ష అని ఆయన చెబుతున్నారన్నమాట.ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలపై జ్యుడిషియల్ కమిషన్ లు ఎందుకు వేశారు? అవి కక్ష కిందకు రావా! ఆయా కేసుల్లో తమ నేతలను ఇరికించడానికి ప్రభుత్వం యత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రేవంత్ కూడా తన గురువు చంద్రబాబు స్టైల్ లోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా అదంతా కరెక్టు అని, అదే పని తన ప్రత్యర్ధులు చేస్తే, అవే మాటలు వారు మాట్లాడితే మాత్రం పెద్ద ఎత్తున దూషణలకు దిగుతుంటారు.సరిగ్గా అదే తరహాలో రేవంత్ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు మాదిరే తాను కూడా ఎన్ని మాటలు మార్చినా ప్రజలను ఏమార్చవచ్చని అనుకుంటే అది పొరపాటు. ఏపీ రాజకీయాలలో వేలు పెట్టి చంద్రబాబుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిను దూషించడం ద్వారా రేవంత్ రెడ్డి తనకు తానే నష్టం చేసుకున్నవారు అవుతారు. ఆ సంగతి అర్ధం అవడానికి రేవంత్ కు మరికొంత కాలం పట్టవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘బాబు.. అధికారులను అవమానించడం సమంజసమేనా?’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అప్పుడే తప్పులు చేయడం ఆరంభించినట్లు అనిపిస్తుంది. వయసు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఈసారి అందరి అభిమానాన్ని చూరగొనేలా ప్రభుత్వాన్ని నడిపితే మంచి పేరు వస్తుంది. టీడీపీ కొద్ది రోజుల క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అనుసరించిన వైఖరి కానీ, పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు అధికారుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన తీరు కానీ చర్చనీయాంశం అవుతున్నాయి.కౌంటింగ్‌లో టీడీపీ గెలుస్తోందన్న సంకేతం వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులకు పైగా పార్టీ శ్రేణులు, గూండాలు విరుచుకుపడ్డ వైనం, చెలరేగిన హింసాకాండ చంద్రబాబుకు అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. అయినా ఆయన దానిని లెక్కలోకి తీసుకున్నట్లు కనిపించదు. ఆయన ధోరణి గమనించిన పోలీసు ఉన్నతాధికారులు కొట్టుకు చావండి.. వైఎస్సార్సీపీ వారిని చంపితే చంపండి అన్న రీతిలో ఉదాసీనంగా ప్రవర్తించారు. ఇది దారుణమైన విషయం. వెంటనే అదుపు చేయాలని చంద్రబాబు ఆదేశించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిని బట్టి ప్రభుత్వ విధానం ఏమిటో అర్ధం అవుతుంది.ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కనుక సంప్రదాయం ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంతా వచ్చి ఆయనను కలుస్తారు. కానీ గతంలో తనను ఆయా స్కామ్‌లలో అరెస్టు చేసిన కొందరు అధికారులను తన ఇంటివైపు రానివ్వలేదు. సచివాలయంలో చంద్రబాబు పదవీబాధ్యతలు తీసుకున్న తదుపరి మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన అధికారుల పట్ల ఆయన చాలా కఠిన వైఖరి అవలంబించారు. ఈ అధికారులు గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ పాత్ర పోషించారన్నది ఆయన భావన కావచ్చు. వారి నిర్ణయాల వల్ల టీడీపీకి ఏమైనా ఇబ్బంది వచ్చిందేమో తెలియదు. అయినా తనకు అధికారం వచ్చిన తర్వాత దానిని పట్టించుకోకుండా పాలన సాగించడం సాధారణంగా జరుగుతుంటుంది. అలాకాకుండా పాత విషయాలను గుర్తులో ఉంచుకుని అధికారులను వేధించాలని, అవమానించాలని చంద్రబాబు వంటి సీనియర్ నేత తలపెట్టడం వ్యవస్థలకు మంచిది కాదు.సీనియర్ అధికారులను కిందిస్థాయి సిబ్బందితో చెప్పించి వెనక్కి పంపించడం, పుష్పగుచ్చం ఇవ్వడానికి చొరవ తీసుకుంటే వారికి అవకాశం ఇవ్వకుండా నిరోధించడం వంటివి జరగడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఒక పక్క గత ప్రభుత్వం వ్యవస్థలను ద్వంసం చేసిందని చెబుతూ, ఇప్పుడు అంతకు మించి విద్వంసం చేసేలా ప్రవర్తిస్తే దాని ప్రభావం ఇతర అధికారులపై కూడా పడుతుంది. కీలకమైన బాధ్యతలలో ఉన్న అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే ఎక్కువ సందర్భాలలో పనిచేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం అయినా అంతే. చంద్రబాబు ఇచ్చే ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏ అధికారి అయినా వెళతారా? ఆ ఆదేశాలు సరికాదని సంబంధిత అధికారి భావించినా, దానిని ఫైల్ మీద రాస్తారేమో కానీ, అంతిమంగా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు వినవలసి ఉంటుంది. దీనిని విస్మరించి చంద్రబాబు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.పని అప్పగించి సరిగా నెరవేర్చకపోతే అప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తే అదో పద్దతి. అలాకాకుండా వారు కనిపించగానే అవమానించే రీతిలో వ్యవహరిస్తే మిగిలిన ఆఫీసర్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో గుర్తించాలి. ఒకవేళ వారు గత ప్రభుత్వ టైమ్‌లో ఏదైనా తప్పు చేశారని అనుకుంటే వారిపై విచారణకు ఆదేశించి చర్య తీసుకోవచ్చు. అది ఒక సిస్టమ్. కానీ అందరి మధ్యలో వారిపట్ల అమానవీయంగా చికాకు పడితే అది తప్పుడు సంకేతం పంపుతుంది. ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై కక్ష కట్టి అవమానించారన్న అభిప్రాయం ఏర్పడింది. ఆయన సెలవుపై వెళ్లారు. గతంలో ఆయన లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖను పర్యవేక్షించారు. లోకేష్ వద్ద పనిచేశారు కనుక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్నారా? లేదే! అదే జవహర్ రెడ్డిపై వీరికి ఎందుకో కోపం వచ్చింది.ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. ప్రవీణ్ ప్రకాష్ గత ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకు వచ్చారు. స్కూళ్ల రూపు రేఖలు మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అదే సమయంలో టీచర్లతో గట్టిగా పనిచేయించే యత్నంలో కొంత విమర్శకు కూడా గురి అయ్యారు. టీచర్ల సంఘాలు ఆయనపై కక్ష కట్టాయి. ఇందులో ఆయన తప్పులు ఏమున్నాయో తెలియదు. కేవలం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు సన్నిహితంగా మెలిగారన్న కారణంగా ప్రవీణ్ ప్రకాశ్ పట్ల అసహనంగా ఉండడం సరైనదేనా అనే చర్చ వస్తుంది.మరో సీనియర్ అధికారి అజయ్ జైన్ పై కూడా చంద్రబాబు గుర్రుగా ఉన్నారని వార్తలు వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటులో జైన్ ప్రముఖ పాత్ర వహించారు. అవి చాలా వరకు సక్సెస్ అయ్యాయి. కాకపోతే ఆయన ఎవరు అధికారంలో ఉంటే వారిని పొగుడుతారన్న భావన ఉంది. 2014లో చంద్రబాబు పాలన టైమ్ లో కూడా ఆయన కీలకంగానే ఉన్నారు. తదుపరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు. దీనికి అనుగుణంగానే ఆయన వ్యవహరిస్తారు. ఆ విషయాన్ని విస్మరించి ఆయనపై కూడా ద్వేషం పెట్టుకోవడం సరికాదు. మరో అధికారి శ్రీలక్ష్మి పుష్పగుచ్చం తీసుకు వస్తే ఆమె వైపు చూడడానికి కూడా సుముఖత కనబరచలేదట. ఇవన్నీ మీడియాలో వచ్చిన వార్తలే.అలాగే సునీల్ కుమార్, రఘురామిరెడ్డి , పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి మరికొందరు అధికారులతో కూడా అలాగే వ్యవహరించారట. ఏ అధికారి అయినా సంబంధిత ప్రభుత్వం ఏమి చెబితే దానికి అనుగుణంగానే పనిచేస్తారు. ఆ ప్రభుత్వ విధానాలతోనే వెళతారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే వారి ఆదేశాలను పాటిస్తారు. ఇది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఒకవేళ ఆ అధికారులపై సరైన అభిప్రాయం లేకపోతే వారికి ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వరు. విశేషం ఏమిటంటే ఆయా ముఖ్యమంత్రులు తమకు మొదట ఇష్టం లేరన్న అధికారులు తదుపరికాలంలో వారికి సన్నిహితులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు వద్ద పనిచేసిన ఒక సీనియర్ అధికారి స్వచ్చంద పదవీ విరమణ చేసి ఆయన కంపెనీలలో సీఈఓ ఉద్యోగంలో చేరారు. అంటే వారి మధ్య అంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనే కదా! మరో పోలీసు అధికారి తెలుగుదేశం పార్టీ అంతరంగిక వ్యవహారాలలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. మరి దానిని ఏమంటారు. గత ప్రభుత్వాన్ని తప్పు పట్టి, ఏదో జరిగిపోయినట్లు ప్రచారం చేయడం చంద్రబాబుకు కొత్తకాదు. ఆయన అధికారంలో ఉంటే అధికారులంతా సచ్చీలురుగా ఉన్నట్లు, లేకుంటే పాడైపోయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అదే పంధా అనుసరిస్తున్నట్లుగా ఉంది.ఇంకోరకంగా చూస్తే వారివల్లే ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని, తత్పఫలితంగా తాను అధికారంలోకి వచ్చానని ఆయన సంతోషించవచ్చు కదా! అలాకాకుండా కక్ష కట్టడం ఏమిటి! గత ప్రభుత్వంపై ప్రజలలో కసి ఏర్పడడానికి గత ఐదేళ్లలో జరిగిన విద్వంసకర పాలన అని, అందులో ఐఏఎస్, ఐపీఎస్ లకు పాత్ర ఉందని చంద్రబాబు అన్నారు. బాగానే ఉంది. మరి 2014 నుంచి 2019 వరకు పాలన చేసిన తర్వాత టీడీపీకి 23 సీట్లే ఎందుకు వచ్చాయి? అంతకుముందు 2004 ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? అధికారుల శైలి వల్ల అని ఆయన చెబుతారా! అప్పట్లో కూడా ప్రజలలో అలాంటి అభిప్రాయం ఏర్పడినట్లా?ఉన్నతాధికారులు అప్పుడు కూడా తప్పుగానే ప్రవర్తించినట్లేనా అనే ప్రశ్నకు జవాబు దొరకదు.ఏది ఏమైనా అధికారులను బెదిరించడానికి ఇలా చేస్తున్నారా? లేక వారిపై ఏదైనా చర్య తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారా? అన్నది తెలియదు. కానీ ఇది ఒక చెడు సంప్రదాయం అవుతుందని చెప్పక తప్పదు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కూడా చంద్రబాబు అక్కడ ఉన్న టీడీపీ నేతలతో మాట్లాడిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా గత ప్రభుత్వం చేసిందని చంద్రబాబు అన్నారట. అంటే ఎన్నికల ప్రచారంలో చెప్పిన అబద్దాలనే ఆయన కొనసాగిస్తున్నారని అనుకోవాలి. అది నిజమే అయితే ఆయన శాసనసభలో ఈ చట్టానికి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలి కదా! పైగా హైకోర్టులో నిలిచిపోయి ఉన్న చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు.కేంద్రం పంపిన ఈ నమూనా చట్టంపై జనంలో అవవగాహన కలిగించకుండా గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనానికి బాగానే వాడుకున్నారని చెప్పాలి. నైపుణ్య గణన అంటూ మరో ఫైల్ పై ఆయన సంతకం చేశారు. దానిని ఎలా ఆచరణలోకి తీసుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇలా చంద్రబాబు తాను మారానని, ఎవరిపై కక్ష పూననని అంటూనే సీనియర్ అధికారులను అవమానించడంపై విమర్శలు వస్తున్న మాట వాస్తవం. అధికారం ఎవరికి శాశ్వతం కాదని తెలిసినా, ఒక్కసారి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక, తమకు తిరుగులేదని ఎందుకు ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవడం మనబోటి సామాన్యులకు కష్టమేనేమో!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బ్లడ్ వేరు బ్రీడ్ వేరు..బ్రాందీ తోనే నడుస్తుంది
-
రష్యన్ మహిళకు వింత అనుభవం : రీల్ తెచ్చిన తంటానేనా?
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రష్యాకు చెందిన మహిళాప్రయాణీకురాలికి చేదు అనుభవం ఎదురైంది. రష్యన్ ట్రావెల్ వ్లాగర్ దినారాకు బోర్డింగ్ పాస్‌పై ఒక పాస్‌పోర్ట్ అధికారి ఫోన్ నంబర్‌ను రాసి ఇవ్వడంతో పాటు మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు కాల్ చేయాలని పేర్కొన్నాడన్న ఆరోపణలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దినారా సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలోని పాస్‌పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ తన బోర్డింగ్ పాస్‌పై అతని ఫోన్ నంబర్‌ను రాసి, నెక్ట్స్ టైం వచ్చినపుడు సంప్రదించాలని పేర్కొన్నట్టు దినారా వీడియోలో ఆరోపించింది. దీనికి సంబంధించిన బోర్డింగ్ పాస్‌ను కూడా చూపించింది. ‘‘అరే యార్, ఈ ప్రవర్తన ఏమిటి?" అంటూ ప్రశ్నించింది. అంతేకాదు దీనిపై ఇది సరి అయినదేనా అంటూ పోల్ కూడా నిర్వహించింది.అయితే ఆ అధికారి ఎవరు అనేది స్పష్టంగా వెల్లడించలేదు. అటు అధికారులనుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol)అయితే, దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా గతవారం ఇండియన్ భర్త కావాలంటూ ఇటీవల ఆమె చేసిన రీల్‌ను కొంతమంది గుర్తుచేసుకున్నారు. బహుశా అందుకే సదరు ఆ అధికారి అలా చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో, దినారా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని QR కోడ్‌తో పాటు, "లుకింగ్ ఫర్ ఏ ఇండియన్ హస్బెండ్" అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసింది. గోడపై పోస్టర్ అతికిస్తున్న ఈ చిన్న క్లిప్‌కు మూడు మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol) భారతదేశంలో పర్యటిస్తూ తన అనుభవాలతో వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంద్వారా పాపులర్ అయింది దినారా. ప్రస్తుతం స్వదేశానికి వెళ్లి పోయింది. మాస్కో నుండి ఇన్‌స్టా స్టోరీలను పోస్ట్ చేస్తోంది. -
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్‌ను పొందేందుకు ట్రోలింగ్‌ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్‌ను ఎంచుకుంటారు. ట్రోల్స్‌లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్‌కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్‌ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్‌ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
తిట్టడం సులభం.. ఫలితం అనూహ్యం
ఇంటికి రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన టీనేజ్ కుమారుణ్ణి తల్లిదండ్రులు మందలిస్తే ఆ కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన తాజా ఘటన ఇది. తల్లిదండ్రులు పిల్లల నడవడికను సరి చేయాలని ఆందోళన చెందడం మంచిదే కాని పిల్లల వయసును దృష్టిలో పెట్టుకుని వారి పొరపాట్లకు కారణాలను తెలుసుకోకుండా వారు చెప్పేది అర్థం చేసుకోకుండా తిడితే అసలుకే ప్రమాదం వస్తుంది. టీనేజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి? ఇంటర్ చదివే కుర్రాడు కాలేజ్ అయిపోయాక రెండు గంటల ఆలస్యంగా ఇంటికొచ్చాడు. తల్లిదండ్రుల ఆలోచన: వీడు టైమ్ వేస్ట్ చేస్తున్నాడు. ఏ పనికిమాలిన బ్యాచ్తోనో తిరుగుతున్నాడు. ఏదో సినిమాకు వెళ్లి ఉంటాడు. ఇలా అయితే వీడు ర్యాంక్ తెచ్చుకున్నట్టే. వీడు ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు. ఇవాళ వీడికి బాగా పడాలి. కుర్రాడి ఆలోచనలు: ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్లాసులు చాలా స్ట్రెస్‌గా ఉంటున్నాయి. కొంచెం కూడా రిలాక్స్ అవడానికి లేదు. మా బ్యాచ్ అంతా కాసేపు బేకరీకి వెళ్దామంటున్నారు. నేను వెళ్లకపోతే వాళ్లు నన్ను ఐసొలేట్ చేస్తారు. అలుగుతారు. బ్యాచ్ నుంచి కట్ చేస్తారు. అందరూ వెళుతుంటే నేనెందుకు వెళ్లకూడదు. వెళ్లి ఇంటికి వెళతా. రెండు వెర్షన్లు సరైనవే. కాని ఒక వెర్షన్ వారికి ఆధిపత్యం ఉంటుంది. మరో పక్షం వారికి ఆందోళన ఉంటుంది. తల్లిదండ్రులు ఇంటి యజమానులు. కుర్రాడికి కూడా యజమానులు. వారు యజమానులు కాకుండా తల్లిదండ్రులు ఎప్పుడవుతారంటే ఆ కుర్రాడు ఏదీ దాచకుండా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు. చెప్పుకునే వాతావరణం ఉన్నప్పుడు. దానిని అర్థం చేసుకుని ఎంతవరకు అలౌ చేయాలో అంత వరకూ అలౌ చేయగలిగినప్పుడు. పై సందర్భంలో ఆ కుర్రాడు ‘మా బ్యాచ్ అంతా బేకరీకి వెళ్దామంటున్నారు’ అని కాల్ చేస్తే తల్లిదండ్రులు ‘సరే.. వెళ్లు. కాని దాని వల్ల నీ టైమ్ వేస్ట్ అవుతుంది. అలాగని వెళ్లకపోతే బాగుండదు. ఒక గంట సేపు ఉండి వచ్చెయ్’ అనగలిగితే ఆ కుర్రాడు 45 నిమిషాలే ఉండి వచ్చే అవకాశం ఉంది. కాని తిడతారనే భయంతో చెప్పకుండా, లేట్‌గా ఇంటికొచ్చినప్పుడు... తల్లిదండ్రులు ముందు వెనుకా చూడకుండా చెడామడా తిడితే ఆ చిన్న హృదయం ఎంత ఇబ్బంది పడుతుంది? సెన్సిటివ్ పిల్లలు అయితే అఘాయిత్యానికి పాల్పడితే? అంగీకరించాలి: టీనేజ్‌లోకి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రస్తుత స్థితిని అంగీకరించాలి మొదట. తమ టీనేజ్ కాలానికి ఇప్పటి టీనేజ్ కాలానికి కాలం చాలా మారిపోయి ఉంటుందని గ్రహించాలి. తమలాగే తమ పిల్లలు ఉండాలనుకుంటే అది కాలానికి విరుద్ధం. ఈ కాలంలో పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉంటారు. అందులో ఏ మేరకు చెడు ఉందో చూసి దానిని పరిహరించడానికి మాత్రమే తల్లిదండ్రులు ప్రయత్నించాలి. పిల్లలకు సవాళ్లు: మీ పిల్లలు మీకు సమస్య సృష్టిస్తున్నారా? లేదా మీరు మీ పిల్లలకు సమస్య సృష్టించారా? మీ పిల్లలు వారికి ఇష్టమైన కోర్సు చదివేలా చూశారా? వారు యావరేజ్ స్టూడెంట్ అయినా ఫస్ట్ ర్యాంక్ రావాలని వెంట పడుతున్నారా? వారి జ్ఞాపకశక్తి పరీక్షలకు వీలుగా ఉందా? వారికి అన్ని సబ్జెక్ట్‌లు అర్థం అవుతున్నాయా? వారికి పరీక్షల వొత్తిడి ఎలా ఉంది? వారికి ఏ మాత్రమైన ఆహ్లాదం అందుతోంది? ఇవన్నీ గమనించకుండా పిల్లలు మరబొమ్మల్లా ఎప్పుడూ చెప్పినట్టల్లా వింటూ కేవలం పుస్తకాలు మాత్రమే పట్టుకుని కూచోవాలని ఆశిస్తే ఆ పిల్లలకు ఉక్కిరిబిక్కిరి ఎదురవుతుంది. దాని నుంచి బయటపడాలని తల్లిదండ్రులకు తెలియకుండా దొంగపద్ధతులకు దిగుతారు. అది తల్లిదండ్రులకు ఇంకా తప్పుగా కనిపిస్తుంది. వారు తప్పు చేసేలా చేసింది తల్లిదండ్రులే మరి. పనిష్మెంట్ వద్దు ఇన్స్పిరేషన్ ముఖ్యం: పిల్లలు టీనేజ్‌లోకి వచ్చాక మానసికంగా, శారీరకంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటారు. ఆ సమయంలో వారు ఫోకస్ పెట్టి చదవాలని అనుకున్నా కొన్ని డిస్ట్రాక్షన్లు ఉంటాయి. అంతేగాక ఈ సమయంలో వారు ఎన్నో సందేహాలతో ప్రవర్తనకు సంబంధించి సంశయాలతో ఉంటారు. తల్లిదండ్రులు ఎంతో సన్నిహితంగా ఉంటూ వారితో సంభాషిస్తూ ‘ఏదైనా మాతో చెప్పి చేయండి’ అనే విధంగా మాట్లాడితే చాలా సమస్యలు తీరుతాయి. చదువు పట్ల, ప్రవర్తన పట్ల వారిని తల్లిదండ్రులు ఇన్‌స్పయిర్ చేసేలా ఉండాలి తప్ప పనిష్మెంట్ చేసేలా ఉండకూడదు. తిట్టడం, కొట్టడం అనేవి కాదు చేయాల్సింది. బుజ్జగించడం, బతిమాలడం కూడా కాదు. కేవలం స్నేహంగా గైడ్ చేయడం. వారి వల్ల జరిగే తప్పులను, పొరపాట్లను జడ్జ్ చేయకుండా వారి వైపు నుంచి ఆలోచించి వారికి అర్థమయ్యేలా సరి చేయడం. టీనేజ్‌లో ఉన్న పిల్లలకు పెద్దవాళ్లు చెప్పేది అర్థమవ్వాలంటే వారు పెద్దవాళ్లంత వయసుకు చేరాలి. కాబట్టి తల్లిదండ్రులే పిల్లల వయసుకు దిగి పిల్లలతో వ్యవహరించడం ఇరుపక్షాలకు శ్రేయస్కరం. -
ఎడతెగని మంత్రాంగంలో పవన్.. ‘తూర్పు’లో ఏం జరుగుతుందో?
సాక్షి, కాకినాడ: కాకినాడలో నిన్నటి నుంచి ఎడతెగని మంత్రాంగంలో మునిగిపోయారు పవన్ కళ్యాణ్. తన వైఫల్యాలను నియోజకవర్గ ఇంఛార్జ్‌లపై నెడుతూ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్లపై అసంతృప్తి వెళ్లగక్కారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ముఖాముఖి సమీక్షలో పవన్ మాట్లాడుతూ వార్డు స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోలేరా? అంటూ మండిపడ్డారు. పవన్ తీరుపై జనసేన నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు త్యాగాలకు సిద్దం కావాలని స్పష్టత ఇచ్చిన పవన్ ముందు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ సహకరించడం లేదంటూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేతల ఫిర్యాదులను కూడా పవన్ పట్టించుకోవడం లేదు. మరోవైపు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు మాట దేవుడెరుగు.. కనీసం సమన్వయం కూడా కుదరడం లేదు. రెండు పార్టీ నాయకులు పైకి పొత్తులు.. లోపల కత్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రేణులు సైతం ధృతరాష్ట్ర కౌగిలి తరహాలోనే వ్యవహరిస్తున్నాయి. సమన్వయం కోసం నిర్వహిస్తున్న సంయుక్త సమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి. జగ్గంపేట సీటు టీడీపీకి ఇస్తే సహకరించేది లేదని పాఠంశెట్టి సూర్యచంద్ర తేల్చిచెప్పారు. పెద్దాపురం సీటు జనసేనకు ఇవ్వాలని తుమ్ముల బాబు పట్టుబడుతున్నారు. పిఠాపురం నుండి జనసేన పోటీ చేస్తే టీడీపీ నేత వర్మ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉందని తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్.. పవన్‌కు చెప్పారు. మిగతా సీట్లు సరే, భీమవరంలో పరిస్థితేంటని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. భీమవరంలో జనసేన గెలిచే అవకాశాలపై ఆరా తీశారు. తెలుగుదేశం మద్ధతిస్తే జనసేన బయటపడుతుందా అన్న విషయంపై చర్చ జరిగింది. మరో సారి భీమవరం నుంచి అదృష్టం పరీక్షించుకునే యోచనలో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ సారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోతే.. పొలిటికల్ కెరియర్ ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనలో ఉన్నారు. ఇదీ చదవండి: అందుకేనట బాబు రహస్య మంతనాలు! -
'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహిరించిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2కు సోమవారం శుభం కార్డ్ పడింది. ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్లో గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్టులో మనీషా రాణి ఒకరు. అయితే ఈ షోలో ప్రత్యేక అతిథిగా ఆలియా భట్ ఫాదర్ మహేశ్ భట్ పాల్గొన్నారు. హోస్‌మేట్స్‌తో ముచ్చటించిన ఆయన.. అదే సమయంలో మనీషా రాణి చేతిని సరదాగా ముద్దాడారు. అయితే దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. సోషల్ మీడియాలో ఆయన ట్రోల్స్‌కు గురయ్యారు. వయసులో పెద్దవ్యక్తి అయినా మహేశ్.. ఆమెను అసభ్యకరంగా తాకడం ఏంటని నెటిజన్స్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెపై వస్తున్న ట్రోల్స్‌పై మనీషా రాణి స్పందించింది. మహేశ్ భట్ తీరు పట్ల ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. (ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి! ) మనీషా రాణి మాట్లాడుతూ..'మహేష్ భట్ చాలా పెద్ద డైరెక్టర్. అతడిని కలవాలనేది నాకల. ఆయన అలా చేయడం వల్ల నాకు అసౌకర్యంగా అనిపించలేదు. అలా తాకాడని ప్రజలు భావిస్తే.. అది చాలా తప్పు. అతను నాకు అంకుల్‌తో సమానం. వృద్ధులు తమ ప్రేమను కొన్నిసార్లు వారిని తాకడం ద్వారా వ్యక్తం చేస్తారు. ఆయన ఉద్దేశం చాలా స్వచ్ఛమైంది.' అని చెప్పింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఫైనలిస్ట్, మహేశ్ భట్ కూతురు పూజా భట్ మీడియాతో మాట్లాడింది. మనీషాతో పాటు తన తండ్రి ఇతర కంటెస్టెంట్స్‌ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడని తెలిపింది. బిగ్ బాస్ హౌస్‌లో కొద్ది సమయమే ఉన్నారని పేర్కొంది. మనీషా ఇతరులను కౌగిలించుకుని ముద్దులు పెట్టినప్పుడు ఎవరికీ సమస్య ఉండదు..కానీ ప్రజలు నిజంగా అలా ఆలోచిస్తే వారికి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పింది. అంతే కానీ దీనిపై మా నాన్న, నేను ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని పూజా భట్ తెలిపింది. ఈ సీజన్లో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ విన్నర్‌గా నిలిచి.. ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఈ సీజన్లో టాప్ -5 ఫైనలిస్ట్‌లలో ఎల్విష్, అభిషేక్ మల్హన్, మనీషా రాణి, బేబికా ధుర్వే, పూజా భట్ ఉన్నారు. (ఇది చదవండి: అమ్మపై దారుణ కామెంట్స్.. ఇప్పుడు కూడా: బుల్లితెర నటి) #Livefeed !! Mahesh Bhatt ne #Manisha ke hath pe kiss kiya!! #BiggBossOTT2pic.twitter.com/mt1ZVVKmuD — Livefeed Videos (@BBosslivefeed1) August 1, 2023 -
ఒక్కసారి ఇటు చూడు చంద్రబాబూ..
చంద్రబాబు హయాంలో జరగని అభివృద్ధి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరుగుతోంది. దీంతో మనుగడ కొల్పోతామన్న భయంతో టీడీపీ హింస రాజకీయాలకు తెరతీస్తోంది. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి రా.. నా కొడకల్లారా.. వాళ్లను తరమండిరా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు.. పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాక్షస మనస్తత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబు.. రాయలసీమ జిల్లాలకు తీరని ద్రోహం చేశారు. పుంగనూరులో ప్రాజెక్టులపై స్టే ఎందుకు వేశారో సమాధానం లేదు. ఇదిలా ఉండగా, పుంగనూరు అభివృద్ధిపై ఆ ప్రాంత వాసి పేరుతో ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ►పుంగనూరుకి వస్తున్నట్టు ఉన్నావ్.. వచ్చేటప్పుడు అలా నువ్వు నీ బంధువులు, తెలుగుదేశం కార్యకర్తలతో కేసులు వేసి నిలిపివేసిన నేతి గుట్లపల్లి ప్రాజెక్ట్ కనిపిస్తుంది. చూస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది కావాలంటే కొంత సేవు ఈతకొట్టు.. ►పుంగనూరు శాశ్వత తాగు, సాగునీటి అవసరాల కోసం 95 శాతం పూర్తయిన ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని చూస్తున్న నీ వక్రబుద్ది తెలుస్తుంది ►అలాగే ముందుకు వస్తే రూ.40 కోట్ల రూపాయలతో పుంగనూరు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమైంది ఒక్కసారి చూడు ►ఇంకొంచెం ముందుకు వస్తే పెద్దిరెడ్డి గారి సహకారంతో నిర్మించిన డయాలసిస్ సెంటర్ ఉంటుంది తలపైకి ఎత్తి చూడు ►ఇంకొంచెం ముందుకొస్తే ఒక్క కారు బస్సు వెళ్లాలంటే ఇబ్బంది పడే మినీ బైపాస్ ఇప్పుడు ఎంత విశాలంగా సర్వాంగా సుందరంగా ఉందో చూడు ►ఇంకొంచెం ముందుకొస్తే నువ్వు అధికారంలో ఉండగా అడ్డుకున్నా ఆర్టీసీ డిపో.. నేడు రాష్ట్రంలోనే అతిపెద్ద గ్యారేజ్‌తో మా పెద్దాయన నిర్మించిన ఆర్టీసీ డిపో కనిపిస్తుంది చూడు. ►ఇంకొంచెం ముందుకు పోతే ప్రభుత్వ ఆసుపత్రి కనబడుతోంది.. దాని వెనకాల కడుతున్న భవనాలను చూడు.. ఇటీవల 100 పడకల ఆసుపత్రిగా మారి ప్రజల అన్ని సౌకర్యాలు తీర్చడనికి రూపుదిద్దుకున్న తీరును చూడు.. ►ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు సొంత నిధులతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ని చూడు ►ఇంకొంచెం ముందుకు వెళ్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కనబడుతుంది.. కావాలంటే కొంతసేవు గట్టుపై సేదదీరు ►ఈ మధ్య సమ్మర్ స్టోరేజ్‌లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి పుంగనూరుకి విద్యుత్ అందించనున్నారు ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకో ►ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎంపీ మిథున్ రెడ్డి గారి డ్రీమ్ బైపాస్ రోడ్డు కనబడుతోంది చాలా బాగుంటుంది ►అలా బోయకొండ వెళ్తే కోట్ల రూపాయలతో బోయకొండను బంగారు కొండగా మార్చిన తీరును చూస్తే ఆశ్యర్యం కలగక మానదు.. ►ఇదంతా పుంగనూరు అభివృద్ధిలో కొంత భాగం మాత్రమే కేవలం 4సంవత్సరాల లొనే పెద్దాయన ఇంత చేస్తుంటే.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కుప్పానికి ఏమి చేశావు అని మాత్రం ఆలోచించకు చంద్రబాబూ.. -
మాజీ మంత్రి నారాయణపై తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు
సాక్షి, నెల్లూరు: మాజీ మంత్రి నారాయణ ఒక డేగలా తనపై కన్నేశాడంటూ ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. ‘‘డేగ.. ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్టు నా పరిస్థితి మారింది. ఇంట్లో భార్య ఉండగానే నేను అన్నం తీసుకురాలేదని నారాయణ కొట్టాడు. నన్ను టార్చర్ చేసేవాడు’’ అంటూ నారాయణ తమ్ముడి భార్య ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నారాయణ నన్ను తీవ్రంగా హింసిస్తున్నారు. అర్ధరాత్రి పూట నన్ను టార్చర్ పెడుతున్నారంటూ ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ప్రియా పొంగూరు కన్నీటి పర్యంతమయ్యారు. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియా.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. -
అతని కోపం ప్రళయం.. మస్క్ గురించి కీలక విషయాలు చెప్పిన మాజీ ఉద్యోగిని
ట్విటర్ మాజీ ఉద్యోగిని ఎస్తేర్ క్రాఫోర్డ్.. ఈమె పేరు చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. క్రాఫోర్డ్ ట్విటర్లో పనిచేస్తున్నప్పుడు రాత్రిళ్లు అక్కడే ఆఫీస్‌లోనే నిద్రిస్తున్న ఫొటో గతేడాది నవంబర్‌లో వైరల్ అయిన తెలిసిందే. ప్రొడక్ట్ మేనేజర్‌గా అంతలా కష్టపడి పనిచేసినా ఆమెను ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కనికరించలేదు. ట్విటర్ గత ఫిబ్రవరి నెలలో చేపట్టిన లేఆఫ్స్‌లో ఆమె ఉద్యోగం కూడా పోయింది. ఇదంతా తెలిసిందే. అయితే ఐదు నెలల తర్వాత ఆమె మస్క్‌తో పనిచేయడం ఎలా ఉంది, ఆయన అసాధారణ ప్రవర్తన ఉద్యోగులను ఎలా భయపెట్టేది తదితర ఆసక్తికర విషయాలు తెలియశారు. ఎలాన్ మస్క్ ఆధీనంలో లేక ముందు ఇతర కంపెనీల మాదిరిగానే ట్విటర్ కూడా చాలా బాగా ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం పని చేస్తేనే సరిపోదు.. రాజకీయాలు కూడా చేస్తేనే రాణిస్తారంటూ ఎస్తేర్ క్రాఫోర్డ్ ఇటీవల ట్విటర్లో సుదీర్ఘ పోస్ట్‌లో రాశారు. అపరిచితుడు! ఇక ఎలాన్ మస్క్‌తో కలిసి పని చేయడం గురించి వివరిస్తూ.. “వ్యక్తిగతంగా ఎలాన్ మస్క్ చాలా అసాధారణంగా ఉంటాడు. కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాడు. చెప్పన కథలు, జోకులే పదే పదే చెప్తాడు” అని పేర్కొంది. ఇక ఉద్యోగులు ఎదుర్కొన్న సవాలు ఏమిటంటే, మస్క్ ఉత్సాహంగా ఉన్న బాస్ నుంచి క్షణాల్లో కోపంగా మారిపోతాడని రాసుకొచ్చారు. ఇదీ చదవండి ➤ 'X' Replacing Twitter Blue Bird Logo: పిట్ట పోయి ‘ఎక్స్’ వచ్చె.. మారిపోయిన ట్విటర్ లోగో "అతను ఎప్పుడు ఎలాంటి మూడ్‌లో ఉంటాడో, ఏ విషయానికి ఎలా ప్రతిస్పందిస్తాడో అంచనా వేయడం చాలా కష్టం. దీంతో మీటింగ్‌కి పిలిచినప్పుడల్లా ఉద్యోగులు భయపడేవారు. ఆయనతో ప్రతికూల విషయాలను చర్చించడానికి సంశయించేవారు" అని క్రాఫోర్డ్ పేర్కొన్నారు. కాగా 2022 నవంబర్‌లో ట్విటర్ భారీ తొలగింపులు చేపట్టిన సమయంలో ఎస్తేర్ క్రాఫోర్డ్.. తాను ఆ కంపెనీలో ఉన్నందుకు సంతోషిస్తున్నానంటూ మస్క్ ఆలోచనలను సమర్థించడంపై సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. -
ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్
బాలీవుడ్ బుల్లితెరలో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ OTT 2 జియో సినిమాలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా అందులోని పోటీదారుల మధ్య జరిగే తగాదాలతో షో హీటెక్కుతుంది. అయితే ఈసారి మరో కారణంతో షోను హీటెక్కించారు కంటెస్టెంట్స్. కెమెరాలు లైవ్‌లో ఉంటాయని తెలిసి కూడా బాలీవుడ్ నటుడు జాద్ హదీద్ చేసిన పనితో పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దుబాయ్‌కి చెందిన మోడల్ ఆకాంక్ష పూరి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. దీంతో అతనిని దారుణంగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఎంతోమంది చూస్తున్నటువంటి షోలో ఇలా చేయడం మంచిది కాదు. ఈ విషయంపై హోస్ట్‌గా ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ చర్యలు తీసుకోవాలని బిగ్ బాస్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: అభిమానితో ఇంత సాదాసీదాగా ఉన్న ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..) షో ప్రారంభం నుంచే నటి ఆకాంక్ష పూరి పట్ల జైద్ హదీద్ ప్రవర్తన కూడా కొంచెం తేడాగానే ఉంది. తాజాగా కెమెరాలు లైవ్ స్ట్రీమ్‌లో ఉండగా.. ఆకాంక్ష నడుమును హదీద్ పట్టుకున్నాడు.. అంతటితో ఆగని అతను దగ్గరకు లాగడం ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె అసౌకర్యంగా భావించినట్లు వీడియోలో కనిపిస్తుంది. అంతేకాకుండా హదీద్‌ను దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తూ.. అతని ప్రవర్తనను మందలించింది. ఇలా తనను తాకడం ఇష్టం లేదని కూడా అక్కడే చెప్పింది. ఈ వీడియోను చూసిన వారు.. సోషల్ మీడియాలో జైద్ హదీద్‌పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by 𝕣ꫀꪖꪶⅈ𝕥ꪗ 𝕥ꪖᦔ𝕜ꪖ (@reality__tadka) (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలో బీజేపీ అన్నారు) -
సీఎం జగన్ ఫోటోను పెట్టడాన్ని ప్రశ్నించిన మేయర్ పై ఆగ్రహం
-
ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తోంది.. మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ల తీరుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజ్యాంగ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయంటూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేటీఆర్ తన ట్వీట్లో ప్రస్తావించారు. బీజేపీయేతర రాష్ట్రాలను చూస్తే కేంద్రం సహాయ నిరాకరణ, ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన విమర్శించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాల నేపథ్యంలో చాలాకాలం నుంచి రాజ్‌భవన్‌లో పెండింగ్ పడిన బిల్లుల వ్యవహారంలో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. మూడు సాధారణ బిల్లులపై ఆమోదముద్ర వేశారు. కీలకమైన యూనివర్సిటీల నియామక బోర్డు, అటవీ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన రెండు బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం కోసం నిలిపివేశారు. మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం తిప్పిపంపారు. మరింత పరిశీలన అవసరమంటూ ఇంకో రెండు బిల్లులను రాజ్‌భవన్‌లోనే అట్టిపెట్టుకున్నారు. మొత్తంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇటీవలి వరకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లులకు సంబంధించి.. రాజ్‌భవన్ ఇచ్చిన వివరాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీంకోర్టుకు అందజేశారు. మరోవైపు, చట్టసభల్లో ఆమోదించిన బిల్లులు, తీర్మానాలపై ఆమోదముద్ర వేసేందుకు గవర్నర్‌కు కాల పరిమితి నిర్ణయించాలని రాష్ట్రపతిని, కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. చదవండి: తమిళనాట హైలైట్ ట్విస్ట్.. స్టాలిన్ దెబ్బకు దిగివచ్చిన గవర్నర్ Sad state of affairs where top constitutional posts have become political tools in the hands of Union Govt Have a look at all Non-BJP Governed states; you will see a similar clear pattern of Non-Cooperation & vengefulness Is this the Cooperative Federalism model and Team India… https://t.co/kHtvnCjGKm — KTR (@KTRBRS) April 11, 2023 -
3 కోట్లు కట్నం .. పెళ్లికి ముందు మద్యం మత్తులో యువకుడి వీరంగం
బంజారాహిల్స్: పెళ్లికి ముందు మద్యం మత్తులో అసభ్యకంగా ప్రవర్తించడంతోపాటు పెళ్లికుమార్తె మీద దాడికి పాల్పడిన వ్యవహారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెళ్లికొడుకు ప్రవర్తనతో పెళ్లి రద్దు కాగా తీసుకున్న ఆభరణాలను, పెళ్లి ఏర్పాట్ల కోసం పెట్టిన డబ్బు తిరిగి ఇవ్వలేదంటూ పెళ్లికుమార్తె ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదయింది. వివరాలివీ... జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే యువతి(24) కుటుంబానికి కామన్ ఫ్రెండ్స్ ద్వారా చిత్తూరు పట్టణంలో ప్రముఖ ఫైనాన్స్ వ్యాపారి, తేజ స్వీట్స్ అధిపతి ఎ.రవిబాబు కుటుంబంతో పరిచయం ఏర్పడింది. తమ కొడుకు ఎ.వైష్ణవ్(27)తో పెళ్లి సంబంధం ప్రతిపాదనను యువతి కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇరువర్గాలు అంగీకరించాయి. పెళ్లి కోసం రూ. 3 కోట్లు కట్నంగా ఇవ్వాలని, పెళ్లిని ఆడంబరంగా డెస్టినేషన్ మ్యారేజ్‌లా చేయాలని వైష్ణవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ► ఈ క్రమంలో పెళ్లికి అంగీకరించిన యువతి కుటుంబ సభ్యులు గత ఏడాది సెపె్టంబర్లో ఎంగేజ్‌మెంట్‌ను తిరుపతిలోని తాజ్ హోటల్లో అరేంజ్ చేశారు. చివరి నిమిషంలో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసిన వైష్ణవ్ కుటుంబ సభ్యులు నవంబర్ 20న లగ్న పత్రిక రాసుకున్నారు. ఆ సమయంలో రూ. 6 లక్షల విలువచేసే డైమండ్ రింగ్, రూ. 2 లక్షల విలువ చేసే రోలెక్స్ వాచీ, రూ. 2 లక్షల విలువైన బంగారు గొలుసును వైష్ణవ్‌కు పెట్టారు. ► ఫిబ్రవరి 9న మొయినాబాద్‌లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్స్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఫిబ్రవరి 7 నుంచి 10 దాకా బుక్ చేశారు. పెళ్లి ఏర్పాట్ల కోసం రూ. 50 లక్షలను ఖర్చు చేశారు. కాగా ఫిబ్రవరి 7న రిసార్ట్‌కు వచి్చన బంధువులంతా మరుసటి రోజున సంగీత్ కార్యక్రమానికి సన్నాహాలు ప్రారంభించారు. అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో సంగీత్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ► అప్పటికే వైష్ణవ్‌తో పాటు స్నేహితులంతా కలిసి మద్యం సేవించారు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పీకలదాకా మద్యం సేవించి మత్తులో ఉన్న వైష్ణవ్ కొరియోగ్రాఫర్‌తో పాటు ఇతర మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గమనించిన పెళ్లికూతురు నిలదీసింది. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. స్నేహితులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ►మరోసారి అదే విధంగా ప్రవర్తించడంతో గట్టిగా మందలించిన పెళ్లికూతురిపై వైష్ణవ్ బూతులు మాట్లాడటంతో పాటు దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న ఆమె సోదరుడు అడ్డుకునేందుకు యతి్నంచగా అతడిపై స్నేహితులతో కలిసి దాడి చేశారు. ►తన కళ్లముందే మద్యం సేవించడంతో పాటు డ్రగ్స్ తీసుకుంటూ మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వైష్ణవ్‌ను పెళ్లి చేసుకునేదిలేదని పెళ్లి కుమార్తె తేల్చిచెప్పింది. దీంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లిని రద్దు చేశారు. ► పెళ్లి కోసం పెట్టిన రూ. 50 లక్షల ఖర్చును, తమకు పెట్టిన ఆభరణాలను తిరిగి ఇస్తామని చెప్పిన వైష్ణవ్ కుటుంబ సభ్యులు ముఖం చాటేశారు. ► రెండు నెలలు గడిచినా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న వైష్ణవ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బా«ధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ► ఈ మేరకు వైష్ణవ్, అతడి తండ్రి ఎ.రవిబాబు, తల్లి దేవితో పాటు బంధువులు తేజు, శ్రవణ్, శరత్‌కుమార్‌రెడ్డి తదితరులపై ఐపీసీ 354, 420, 406, 506లతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎన్నేళ్లు గడిచినా.. టీడీపీ తీరు మారలేదంతే!
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇద్దరు.. ముగ్గురు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య జరిగిన తోపులాటను ఎవరికి వారు తమకు అనుకూలమైన పద్దతిలో ప్రచారం చేసుకుంటారు. రాజకీయ పార్టీలు అలా చేశాయంటే ఓ అర్థం ఉంటుందేమో. కానీ, ఒక వర్గం మీడియా కూడా అదే తరహాలో ఏకపక్షంగా వార్తలు రాస్తోంది. ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. శాసనసభ మొదలైనప్పటి నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏదో ఒక సాకు చూపి అల్లరి చేయడం, సస్పెండ్ అవడం, బయటకు వెళ్లి హీరో పనిచేసినట్లు, ప్రభుత్వమే తప్పు చేసిందన్నట్లుగా ప్రచారం చేయడం అలవాటుగా మారింది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడే.. మధ్యలోనే నినాదాలు చేసుకుంటూ వీరు బయటకు వెళ్లిపోయారు. ఉన్నంత సేపు రన్నింగ్ కామెంటరీతో డిస్టర్బ్ చేయడానికి యత్నించారు. ఆ తర్వాత నుంచి కూడా అదే విధానం అవలంభిస్తున్నారు. రోజూ ఏదో రకంగా గొడవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. వాళ్లు శాసనసభ పోడియంలోకి వెళ్లి స్పీకర్ తమ్మినేని సీతారాంను రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేయడం, కాగితాలు చించి ఆయనపైనే పోయడం,ప్లకార్డులను ఆయన ముఖం మీద పెట్టడం, టేబుల్ మీద ఉన్న వస్తువులను లాగడం వంటివాటితో పాటు స్పీకర్ చైర్ కు అటూ ఇటూ చేరి మోకాలితో పొడవం వంటివి కూడా చేస్తున్నారట. ప్రతిపక్షంలో అంతా కలిపి 20 మంది లేరు. వారిలో సగం మంది సభలో ఉండరు. మిగిలిన పది, పన్నెండు మంది అల్లరి చేయడానికే వచ్చినట్లు హడావుడి చేసి వెళ్లిపోవడం నిత్యకృత్యంగా మారిందన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతుండగా కూడా దానిని అడ్డుకునే యత్నం చేశారు. గతంలో.. శాసనసభలో సమర్ధంగా తమ వాదన వినిపించి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి యత్నించేవారు. అయితే ఇటీవలికాలంలో సభలో అల్లరి చేయడం ద్వారానే ప్రజలను ఆకట్టుకోవాలని చూడడం దురదృష్టకరం. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి ఎంత మంచిదన్న సంగతిని.. అంతా ఆలోచించాలి. ఇలాంటి ఘటనలలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది తేల్చడం అంత తేలికకాదు. కానీ, అసలు మూలం ఏమిటి? గొడవకు ముందు ఎవరెవరు ఎలా వ్యవహరించారు? అనే దానిని పరిశీలించవచ్చు. రోడ్లపై బహిరంగ సభలు పెట్టవద్దన్న జివో నెంబర్ 01ని వ్యతిరేకిస్తూ.. టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దానిని ప్రశ్నోత్తరాల తర్వాత చూస్తానని స్పీకర్ చెప్పారు. అయినా వినకుండా టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. వెళ్లినవారు నిరసన చెప్పడానికి అన్నట్లు వ్యవహరించలేదు. అధికార పక్షాన్ని రెచ్చగొట్టేలా, గౌరవ స్పీకర్‌ను అవమానించేలా చేష్టలకు దిగారు. దాదాపు రోజూ ఇలాగే చేస్తున్నారు. అయినా స్పీకర్ ఏ రోజుకారోజు సస్పెండ్ చేస్తూ.. టీడీపీ సభ్యుల్ని బయటకు పంపుతున్నారు. బహుశా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా సభ జరపడం బాగోదని ఆయన అనుకుంటున్నారు కాబోలు. ఇదిలా ఉంటే.. తెలంగాణ శాసనసభలో 2018లో గవర్నర్ ప్రసంగం సమయంలో పోడియం వైపు మైక్రోఫోన్లు విసిరారన్న అభియోగంపై ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లను శాసనసభ నుంచి బహిష్కరించారు. అదే సందర్భంలో మరో పదకొండు మంది ఎమ్మెల్యేలను బడ్జెట్ సెషన్ అంతటికి సస్పెండ్ చేశారు. అలాగే మరోసారి.. ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు నిరసన తెలిపేందుకు యత్నించగా.. వారిని సెషన్ అంతటికి సస్పెండ్ చేశారు. ఈ ప్రభావం వల్లనో ఏమో.. అప్పటి నుంచి తెలంగాణ శాసనసభలో అంతస్థాయిలో సన్నివేశాలు చోటు చేసుకోవడం లేదనే చెప్పాలి. మహారాష్ట్రలో స్పీకర్‌ను అడ్డుకున్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను.. సభ నుంచి పంపించి వేసిన దాఖలాలు ఉన్నాయి. కొన్నిసార్లు.. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో అప్పుడప్పుడు గందరగోళ పరిస్థితులు ఏర్పడిన దాఖలాలూ ఉన్నాయి. అంతెందుకు.. కొన్నిసార్లు ముష్టిఘాతాలకు కూడా పాల్పడ్డారు కూడా. అసెంబ్లీలే కాదు.. కొన్ని దేశాల్లో పార్లమెంట్లలోనూ ఇలాంటి ఘర్షణలు జరిగాయి. మన దేశానికొస్తే.. పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల విభజన బిల్లు సమయంలోనూ తీవ్ర గందరగోళం చెలరేగింది. అప్పుడు ఈ టీడీపీ ఎంపీలే ఒకరినొకరు కొట్టుకున్నారన్న వార్తలు బయటకు వచ్చాయి. అంతకుముందు ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు కూడా. అయితే.. వీటి ప్రభావం ఎన్నికలలో ఎంతవరకు ఉంటుందనేది అనుమానమే. అయితే.. ప్రజలు ఇలాంటి వాటిని సీరియస్‌గా తీసుకుంటారని అనుకుంటేనే.. ప్రజాప్రతినిధులు కొంత క్రమశిక్షణతో ఉంటారు. కేసిఆర్ ప్రభుత్వం ఇలాంటి వాటిపై సీరియస్‌గా ఉండడంతో శాసనసభలో పెద్ద అలజడి లేకుండానే సాగిపోతోందని చెప్పాలి. అయితే ఇదే బీఆర్ఎస్(ఒకప్పుడు టీఆర్ఎస్) ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీని నడవనివ్వకుండా అడ్డుకున్న ఘటనలు, సస్పెండ్ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అప్పట్లో.. గవర్నర్ నరసింహన్ ప్రసంగం చేస్తుండగా, టీడీపీ సభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి, నాగం జనార్ధనరెడ్డిలు పోడియంపై ఉన్న కుర్చీని లాగేయడం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు పేపర్లు విసిరడం వంటివి చేయడంతో వారిని సభనుంచి సస్పెండ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉండవచ్చు. ఇక విభజన తర్వాత అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. విజయవాడ కాల్ సెక్స్ మనీ రాకెట్ పై మాట్లాడడానికి సిద్దమవుతున్న తరుణంలో ఆమెపై ఏదో నెపం పెట్టి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. అప్పట్లో ఆ అంశం పెద్ద వివాదం అయింది. ఆమె కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నా.. చంద్రబాబు ప్రభుత్వం, ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమెను సభలోకి అనుమతించలేదు. తాను అధికారంలో ఉన్నప్పుడు సభా సంప్రదాయాలు, విలువలు అంటూ చంద్రబాబు ఎన్నో సుద్దులు చెబుతుంటారు. అప్పుడు ఆయనకు అసెంబ్లీ అన్నది పవిత్రంగా కనిపిస్తుంది. కానీ, అదే టీడీపీ ప్రతిపక్షంలోకి రాగానే అసెంబ్లీని రణరంగంగా మార్చుతుంటారు. గతంలో యనమల రామకృష్ణుడు స్పీకర్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన సీటులో నుంచి కాగితాలు విసరడాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తదుపరి ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులు పోడియం వైపు వస్తే ఆటోమేటిక్ సస్పెన్షన్ అంటూ రూలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ ప్రతిపక్షంలోకి రాగానే ఈ విలువలను, సంప్రదాయాలను మంట గలిపి పోడియంలోకి వెళ్లడం నిత్యకృత్యంగా మార్చుకుంది. శాసనసభలో నిరసన చెప్పడం తప్పు కాదు. కానీ దానికంటూ ఓ రీతి, కొన్ని పరిమితులు ఉంటాయి. పైగా స్పీకర్ చుట్టూ చేరి అల్లరి చేయడం హేయం. ఆ టైమ్‌లోనే ఆయనకు రక్షణగా ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళితే గొడవ జరిగింది. చంద్రబాబు శైలి ఏమిటంటే , ఇలాంటి అల్లర్లకు దళిత ఎమ్మెల్యేని ముందు పెడుతుంటారు. తద్వారా ఆయన జోలికి ఎవరైనా వెళితే ఇంకేముంది?.. దళిత ఎమ్మెల్యేని అలా చేశారు..ఇలా చేశారు అంటూ ప్రచారం చేయడం మొదలుపెడతారు. నిజానికి.. ఏపీ సభలో జీవో నెంబర్ 1 గురించి ఆందోళనకు దిగడమే తప్పు!. ఆ జీవోని టీడీపీ వ్యతిరేకించింది. దానిపై హైకోర్టుకు వెళ్లగా, తొలుత వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఎగిరి గంతేశారు. కానీ తదుపరి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఈ జీవోను యథాతధంగా కొనసాగించమని తీర్పు వచ్చింది. అయినా ప్రతిపక్ష టీడీపీ కాని, మరికొన్ని పార్టీలు కాని దీనిపై ఆందోళనకు దిగాలని తలపెట్టాయి. ఆ క్రమంలో శాసనసభలో టీడీపీ అల్లరి చేసింది. అదే కనుక వైఎస్సార్సీపీ ఇలా చేసి ఉంటే..?. చంద్రబాబు నాయుడు ‘‘న్యాయస్థానాలంటే వీళ్లకు(వైఎస్సార్సీపీని ఉద్దేశించి..) లెక్కలేదు అంటూ విమర్శించేవాడు. ఇక్కడ మరో మాట కూడా చెప్పాలి. గతంలో ప్రతిపక్షంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఏమైనా నిరసనలు చెప్పినప్పుడు.. అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వెలిబుచ్చేవారు. దానిని ఈనాడు పత్రిక మొదటి పేజీలో ప్రచురించి స్పీకర్ వ్యాఖ్యలు వేదవ్యాక్యం అన్నట్లు ప్రచారం చేసేది. అదే స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని.. ఇప్పుడు ఎన్నిసార్లు ప్రతిపక్ష టీడీపీ అల్లర్లు,గొడవలపై తన ఆగ్రహం వెలిబుచ్చినా.. టీడీపీ ఎమ్మెల్యేలను తీవ్రంగా మందలించినా.. దాదాపు అసలు వార్తగానే రాయరు. ఇదంతా టీడీపీపై ప్రేమా? లేక ఆనాటి స్పీకర్ కోడెలపై ఉన్న ప్రత్యేక అభిమానమా?.. అంటే ఏమి చెబుదాం. ఏది ఏమైనా ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఇకనైనా అల్లరికి దిగే సభ్యులపై కఠినంగా ఉంటారా?. అన్నిసార్లు కాకపోయినా, మరీ హద్దుదాటి అరాచకంగా వ్యవహరించినవారిపైన అయినా తీవ్ర చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివి పునరావృతం కావేమో!. ::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
పిల్లలు... పరిమళించాలి
పిల్లలు ఎలా ఉండాలి? వికసించే పువ్వుల్లా ఉండాలి. సంతోషానికి చిరునామాలా ఉండాలి. ఆందోళన అంటే ఏమిటో తెలియకుండా పెరగాలి. స్కూల్ బ్యాగ్‌లో భవిష్యత్తును నింపుకెళ్లిన పిల్లలు... అదే స్కూల్ బ్యాగ్‌లో భయాన్ని పోగుచేసుకుని వస్తే... తల్లిదండ్రులు అప్పుడేం చేయాలి? పిల్లలను దగ్గరకు తీసుకోవాలి... చేతల్లో ధైర్యాన్నివ్వాలి. ఆనందాల రెక్కలను విరిచేసే దుష్టశక్తుల బారి నుంచి కాపాడాలి. పువ్వుల్లా పరిమళించడానికి కావల్సినంత భరోసా కల్పించాలి. స్కూల్లో అందరు పిల్లలూ ఒకేలా చేరుతారు. స్నేహానికి చిరునామాల్లా, ఉత్సాహంగా ఉంటారు. కొందరు అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుంటే, మరికొందరు మాత్రం వెనుకపడుతుంటారు. స్వతహాగా ఉండే ఐక్యూ లెవెల్స్ పరిమితులకు లోబడి చదువులో వెనుకబడడం కాదిది. ఉత్సాహంగా ఉంటే పిల్లలు కూడా నిరుత్సాహంగా మారి అన్నింటిలోనూ వెనుకబడుతుంటారు. ఆ వెనుకబాటు వెనుక వాళ్లను వెనుకపడేటట్లు చేసిన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఎందుకు బిడియపడుతున్నారో, ఎందుకు తమను తాము ఒంటరిని చేసుకున్నారో బయటకు తెలియదు. ఆ పిల్లల ప్రవర్తనలో అనారోగ్యకరమైన మార్పు మొదలవుతుంది. అది క్రమంగా మొండితనానికి, ధిక్కారతకు దారి తీస్తుంటుంది. స్కూల్ డైరీలో ‘డిస్ ఒబీడియెంట్, ప్రాబ్లమాటిక్ బిహేవియర్ అనే పదాలతో పేరెంట్స్‌కి పిలుపు వస్తుంది. ఆ పరిస్థితి పేరెంట్స్‌కి ఊహించని శరాఘాతం. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని అయోమయంలో, కొంత అపరాధ భావానికి లోనయ్యి, ఓవర్‌గా రియాక్ట్ అవుతూ పిల్లలను దోషులుగా నిలబెడుతుంటారు. ఈ పరిస్థితిని జాగ్రత్తగా సరిదిద్దకపోతే పిల్లలు దిక్కారతను అలాగే కొనసాగిస్తారు. ఈ సిచ్యుయేషన్ని సున్నితంగా డీల్ చేయడానికి కొన్ని సూచనలు చేశారు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ సుదర్శిని. పిల్లలు అద్దం వంటి వాళ్లు ‘‘పిల్లల్లో చురుకుదనం తగ్గడం, ఎప్పుడూ డల్‌గా ఉండడం, నిద్రలో ఉలిక్కి పడడం వంటివి కనిపిస్తుంటాయి. పిల్లల మనసులో చెలరేగిన అనేక ఆందోళనలు, భయాలు, అవమానం, అపరాధ భావం వంటి అనేక సమస్యలను వ్యక్తం చేసే లక్షణాలివి. ఈ లక్షణాలను గమనించిన తర్వాత ఇక ఆలస్యం చేయకూడదు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు దగ్గర కూర్చుని పిల్లలను మాటల్లో పెట్టాలి. నేరుగా ‘ఎందుకిలా ఉన్నావని’ అడిగే సమాధానం రాదు. స్కూలు గురించి, ఫ్రెండ్స్ గురించి కదిపితే వాళ్లే ఒక్కొక్కటీ చెప్పడం మొదలుపెడతారు. ఆ చెప్పిన కబుర్లలోనే కారణాలు ఉంటాయి. స్కూల్లో తోటి విద్యార్థులు బాడీ షేమింగ్, బుల్లీయింగ్, ఫిజికల్– ఎమోషనల్ అబ్యూజ్ చేస్తున్నట్లు, భయపెడుతున్నట్లు, బెదిరిస్తున్నట్లు అనిపిస్తే ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి పిల్లలను ఒకటికి రెండుసార్లు గద్దించి అడగడం ఏ మాత్రం సరికాదు. పిల్లలు మరింతగా బిగుసుకుపోతారు, కాబట్టి వాళ్ల క్లాస్ టీచర్ దృష్టికి తీసుకువెళ్లాలి. అయితే ఇక్కడ మన పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్న పిల్లలను దోషులుగా, నేరస్థులుగా చూడవద్దు. వాళ్లూ పసిపిల్లలేనని మర్చిపోవద్దు. అయితే వాళ్లు ఆరోగ్యకరంగా పెరగడం లేదని అర్థం. ఎందుకంటే... పిల్లలు తాము దేనిని తీసుకుంటారో దానినే డెలివర్ చేస్తారు. అమ్మానాన్నలు మరెవరినో ఉద్దేశించి ‘వాళ్ల ఎత్తుపళ్ల గురించో, నడక తీరు మీదనో, దేహం లావు– సన్నం, పొడవు, పొట్టి వంటి విషయాల్లో కామెంట్స్ చేసి నవ్వుతూ ఉంటే’ పిల్లలకు అదే అలవాటవుతుంది. పిల్లలు వాళ్లు చూసిన దాన్ని స్కూల్లో తోటి పిల్లల మీద ప్రదర్శిస్తారు. నిజానికి ఎదుటి వాళ్లను అనుకరిస్తూ గేలి చేయడం, లోపాలను ఎత్తి చూపుతూ ఎగతాళి చేయడం అనేది అభద్రతలో ఉంటూ, ఆత్మవిశ్వాసం లేని వాళ్లు చేసే పని. ఆ పని ఇంట్లో పేరెంట్స్ చేస్తుంటే పిల్లలకు అలవడుతుంది. బాల్యంలో ఇలాంటి బీజాలు పడితే ఇక అలాంటి వాళ్లు జీవితాంతం ఏదో ఒక సందర్భంలో ఈ లక్షణాలను బహిర్గతం చేస్తూనే ఉంటారు. జీవితంలో ప్రతి రిలేషన్షిప్కీ విఘాతం కలిగించుకుంటూ ఉంటారు. కాబట్టి చిన్నప్పుడే సరిదిద్దాలి. బొమ్మల్లో వ్యక్తమవుతుంది పిల్లలు మూడీగా ఉంటున్నట్లు గమనిస్తే వాళ్లను డ్రాయింగ్, క్లేతో బొమ్మలు చేయడంలో ఎంగేజ్ చేయాలి. ఇది మంచి స్ట్రెస్ బస్టర్ మాత్రమే కాదు, చక్కటి పరిష్కారమార్గం కూడా. బొమ్మలు వేయడం, బొమ్మలు చేయడం ఒత్తిడికి అవుట్లెట్లా పని చేస్తుంది. మాటల్లో చెప్పలేని విషయాలు బొమ్మల్లో వ్యక్తమవుతాయి. ఆ బొమ్మల్లోని పాత్రలు... పిల్లల్లో దాగి ఉన్న కోపాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని, భయాన్ని, బాధించే గుణాన్ని కూడా ప్రతిబింబిస్తుంటాయి. పిల్లల మానసిక సంఘర్షణకు అద్దం పడతాయి. పిల్లల మనసు చదవడానికి ఆ బొమ్మలు ఉపయోగపడతాయి. బాధించే పిల్లలు, బాధితులయ్యే పిల్లలను అధ్యయనం చేయడానికి కూడా ఇదే సరైన మార్గం. బిహేవియరల్ ప్రాబ్లెమ్స్‌తో మా దగ్గరకు తీసుకువచ్చిన పిల్లలకు మేమిచ్చే మొదటి టాస్క్ కూడా అదే. తల్లిదండ్రులకు సూచన ఏమిటంటే... పిల్లలు డల్‌గా ఉంటే ఉపేక్షించవద్దు, అలాగే మీ పిల్లల మీద టీచర్ నుంచి కంప్లయింట్ వస్తే ఆవేశపడవద్దు. టీచర్ ఒక సూచన చేశారంటే ఆ సూచన వెనుక బలమైన కారణం ఉండి తీరుతుందని గ్రహించాలి. టీచర్లు కూడా పిల్లల కాండక్ట్ మీద డిజ్ ఒబీడియెన్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్’ అని రాసే ముందు వాళ్ల పేరెంట్స్‌కు అర్థమయ్యేలా వివరించి చెప్పగలగాలి. ఎందుకంటే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగేది పేరెంట్స్– టీచర్స్ మధ్య సమన్వయం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది’’ అని వివరించారు డాక్టర్ సుదర్శిని. పిల్లల మనసు సున్నితం. పువ్వులాంటి పిల్లలు పువ్వుల్లానే పెరగాలి. వారి భవిష్యత్తు సుమపరిమళాలతో వికసించాలి. బాధించే పిల్లల మీదా శ్రద్ధ పెట్టాలి! పిల్లల్లో స్వతహాగానే ఒకరికొకరు సహకరించుకునే తత్వం ఉంటుంది. అలాంటిది టీచర్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని కొందరికి తెలియచేసి, వాళ్లకు కోపం ఉన్న పిల్లలకు సమాచారం చేరనివ్వరు, ఆ టాస్క్‌లో ఫెయిల్ అవ్వాలనే దురుద్దేశంతో ఇలాంటి పని చేస్తారు. ఇది ఏ రకంగానూ పిల్లలను వెనకేసుకు రాదగిన విషయం కాదని పేరెంట్స్ గ్రహించాలి. బాధితులవుతున్న పిల్లల పేరెంట్స్ అయితే విషయం తెలియగానే స్పందించి తమ బిడ్డను కాపాడుకుంటారు. కానీ బాధించే పిల్లల తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది. ఇది ఆ పిల్లలకు, సమాజానికి కూడా చాలా ప్రమాదకరం. – డాక్టర్ సుదర్శిని రెడ్డి సబ్బెళ్ల, క్లినికల్ సైకాలజిస్ట్, జీజీహెచ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి -
మనుషులకే కష్టాలు.. మానులకు కాదు! ఈ నాలుగు ప్రాక్టీస్ చేయండి చాలు!
Sakshi Funday Cover Story: కష్టాలు మనుషులకు కాకుండా.. మానులకొస్తాయా! ఓదార్పు కోసం పెద్దవాళ్లు చెప్పే సాధారణమైన మాటిది. నిజమే కానీ.. సమాజంలో ఒకరిద్దరికి కష్టాలొస్తే ఇలాంటి ఓదార్పు మాటలు ఉపయోగపడతాయి! కానీ.. వందలో 42 మందికి తాము కష్టాల్లోనే బతుకీడుస్తున్నట్లు అనిపిస్తే? ఆ దుఃఖంలోనే వారు కుంగి కృశించి పోతూంటే.. అప్పుడు ఆ కష్టాలకు పెట్టుకోవాల్సిన పేరు.. ఒత్తిడి. ఇంగ్లిష్‌లో చెప్పుకుంటే స్ట్రెస్! ప్రపంచ దేశాలన్నింటిలోనూ అతిసామన్యమైపోతున్న ఈ మానసిక సమస్య గురించి భారత్‌లో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. చాలామంది... పైన చెప్పుకున్నట్లు ఓదార్పు మాటలతోనే సరిపెట్టుకుంటున్నారు. అందుకే.. ఆందోళనకరమైన ఈ సమస్య ఆనుపానులు సులువుగా... సచిత్రంగా!!! సాధనం-1: గ్రౌండింగ్ గ్రౌండింగ్ అంటే మీతో మీరు కనెక్ట్ కావడం. అంటే.. మీ శరీరం, ఆలోచనలు, భావాలు, పరిసరాలతో కనెక్ట్ కావడం. మీరు భావోద్వేగాల తుఫానులో కొట్టుకుపోతున్నప్పుడు నెమ్మదిగా మీ పాదాలను నేలకు ఆనించండి. భూమితో కనెక్ట్ అవ్వండి. తర్వాత మీ దృష్టిని శ్వాసపై నిలపండి. ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం వాసన, రుచి చూడగలరనే విషయాన్ని శ్రద్ధగా గమనించండి. అంటే మీరు మీ ఆలోచనల నుంచి దూరంగా జరిగి.. మీతో, మీ చుట్టూ ఉన్న పరిసరాలతో మమేకం అవండి. గ్రౌండింగ్ అంటే సింపుల్‌గా ఇంతే. గ్రౌండింగ్‌ను ప్రాక్టీస్ చేయడానికి ప్రత్యేక సమయం అవసరంలేదు. ఒకటి రెండు నిమిషాలు చాలు. ప్రతిరోజూ మీరు తినడం, వంట చేయడం లేదా నిద్ర పోవడం వంటి పనులకు ముందు గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఆలోచనల నుంచి బయటపడి, ఒత్తిడికి దూరంగా ఆనందంగా మారడాన్ని గమనించవచ్చు. మొదట చిన్న చిన్న పనులకు ముందు గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో గ్రౌండింగ్ ఉపయోగించడం సులభం అవుతుంది. సాధనం-2: అన్ హుకింగ్ అన్ హుకింగ్ అంటే మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచనల గాలం నుంచి తప్పించుకోవడం. మూడు దశల్లో ఆ పని చేయవచ్చు. మొదట మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచన లేదా ఫీలింగ్‌ను గుర్తించండి. తర్వాత దాన్ని ఉత్సుకతతో గమనించండి. ఆ తర్వాత ఆ ఆలోచనకు లేదా అనుభూతికి ఓ పేరు పెట్టండి. ఇలా ఆలోచనలను, అనుభూతులను దూరంగా ఉండి గమనించడం, వాటికో పేరు పెట్టడం వల్ల.. మీరు, మీ ఆలోచనలు ఒకటి కాదనే స్పృహæ కలుగుతుంది. అది మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరంగా పెడుతుంది. ఆ తర్వాత మీతో ఎవరున్నారో, మీరేం చేస్తున్నారో దానిపై దృష్టి పెట్టండి. సాధనం-3: విలువలపై స్పందించడం ప్రతి మనిషికీ కొన్ని విలువలుంటారు. మీకు అత్యంత ముఖ్యమైన విలువలేమిటో ఎంచుకోండి. ఉదాహరణకు ప్రేమ, పని, ధైర్యం, దయ, కష్టపడి పనిచేయడం.. ఇలా చాలా! వీటికి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ముందుగా మీరు ముఖ్యమైన నాలుగైదు విలువలేమిటో నిర్ణయించుకోండి. వచ్చే వారమంతా మీ విలువలకు అనుగుణంగా పనిచేసే ఒక చిన్న మార్గాన్ని ఎంచుకోండి. మీ విలువలకు అనుగుణంగా జీవించండి. మీరు పాటించలేని విలువల గురించి ఒత్తిడికి గురికాకుండా, మార్చగలిగే వాటిని మార్చండి. మార్చలేని వాటిని వదిలేసి ముందుకు సాగండి. సాధనం-4: ప్రేమతో నింపుకోండి మీరు మీ పట్ల ప్రేమతో, దయతో ఉంటే ఒత్తిడిని అధిగమించడానికి కావాల్సిన శక్తి మీకు వస్తుంది. ఆ ప్రేమ, దయ ఆకాశం నుంచి ఊడిపడవు. మీరే ఊహించుకోవాలి, సృష్టించుకోవాలి. మీ మెదడుకు ఊహకు, వాస్తవానికీ ఉన్న తేడా తెలియదు. కాబట్టి మీరు జస్ట్ ఊహించుకున్నా చాలు దానికి అనుగుణంగా స్పందిస్తుంది. అందుకే మీ దోసిటి నిండా ప్రేమ లేదా దయ ఉన్నట్లు ఊహించండి. దాన్ని ఏ ఆకారంలో ఊహించుకుంటారనేది మీ ఇష్టం. తర్వాత, మీ శరీరంలో బాధ అనిపించే చోట చేతులుంచండి. మీ చేతుల నుంచి శరీరంలోకి ప్రవహించే ప్రేమను, దాని వెచ్చదనాన్ని అనుభవించండి. ఆ ప్రేమ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. -
ఊరేగుతున్న ఉన్మాదం
‘కామాతురాణాం న భయం న లజ్జ’ అన్నారు పెద్దలు. కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి సిగ్గు గానీ, భయం గానీ ఉండవని అర్థం. క్రోధంతో కళ్లు మూసుకుపోయిన వారి సంగతి కూడా అంతే! కక్షతోనూ, అసూయతోనూ, నిస్పృహ తోనూ కళ్లు మూసుకుపోయిన వారి పరిస్థితీ అంతే! అటువంటి దశలో ఉన్నవారు మాట్లాడే భాష సభ్యతా సంస్కారాల ఛందస్సును ధిక్కరిస్తుంది. ‘పోగాలము దాపురించినవారు దీప నిర్వాణ గంధమును ఆఘ్రాణించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని కనలేరు. మిత్రవాక్యాన్ని వినలేరు’ అనే సూక్తి మనకు ఉండనే ఉన్నది. దిగజారిన రాజకీయాలతో విసుగెత్తి ఒకాయన ‘పాలిటిక్స్ ఈజ్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎ స్కౌండ్రల్’ అని వ్యాఖ్యానించారు. అట్లాగే పొలిటీషియన్లకు చిట్టచివరి అస్త్రం – సానుభూతి. అది కూడా విఫలమైనప్పుడు ఏం చేస్తారు? సంస్కారం అటకెక్కుతుంది. క్రోధం కళ్లను కప్పేస్తుంది. అసూయ, ద్వేషాలు వివేకాన్ని నిద్రపుచ్చుతాయి. కంఠస్వరం నుంచి కాలకేయుల భాష దూసుకొస్తుంది. ఉన్మాద స్థితి ఊరేగింపు తీస్తుంది. కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విపరీత ప్రవర్తన చూసి జనం విస్తుపోతున్నారు. ఈ పర్యటనను తెలుగుదేశం పార్టీ వారు ఒక వ్యూహం ప్రకారం చాలా శ్రద్ధగా డిజైన్ చేశారు. కర్నూలు జిల్లా ప్రజలు అధికార వికేంద్రీకరణను కోరుకోవడం లేదని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కూడా వారికి ఇష్టం లేదని ఈ పర్యటన ద్వారా లోకాన్ని భ్రమింపజేయాలని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కలిసి ఈ పథకాన్ని రచించాయి. ఆయన సభలు జన సందోహంతో కిక్కిరిసినట్టు కనిపించేలా కొన్ని వీధి కూడళ్లను ఎంపిక చేశాయి. ఆ కూడళ్లలోకి నాలుగైదు వేల మందిని సమీకరిస్తే పెద్దఎత్తున జనం పాల్గొ న్నట్టు కనిపిస్తుంది. ఆమాత్రం సమీకరణకు కూడా పార్టీ బలం చాలకపోవడంతో దిన వేతనంపై ఎక్కువమంది సాధారణ ప్రజలను సమీకరించారు. వారిలో కొందరిని మిద్దెలపైకి ఎక్కించారు. ఈమధ్యకాలంలో జనసందోహానికి మొహంవాచి ఉన్న అధినేత డూప్ జనాన్ని చూసి పరవశించిపోయారు. ఆ పరవశం కారణంగా రాజకీయాల్లో చిట్టచివరిగా వాడవలసిన సానుభూతి ఆయుధాన్ని యథాలాపంగా వాడిపారేశారు. ‘మీరు ఓట్లు వేసి గెలిపించకపోతే ఇవే నాకు చివరి ఎన్నికలవుతాయ’ని బేలగా వాపోయారు. ఈ చివరి ఆయుధానికి స్పందనగా ‘నో... నో’ అని జనం హోరెత్తుతారని బహుశా ఆయన ఆశించి ఉండవచ్చు. ‘మీకు ఇవి చివరి ఎన్నికలు కావు, మళ్లీ మళ్లీ మీరే గెలుస్తారు’ అనే సమాధానాలు వారి నుంచి ఊహించి ఉండవచ్చు. జాతీయస్థాయి నినాదాల టైప్‌లో ‘జబ్ తక్ సూరజ్, చాంద్ రహేగా తబ్ తక్ ఆంధ్రామే బాబు రహేగా’ అంటారని కూడా స్వప్నించి ఉండవచ్చు. లాలూ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్జేడీ కార్యకర్తలు ఈ జాతీయ నినాదాన్ని లోకలైజ్ చేశారు. ‘జబ్ తక్ రహేగా సమోసామే ఆలూ... తబ్ తక్ రహేగా బిహార్ మే లాలూ’ అనేవారు. అటువంటి సృజనా త్మకతతో మనవాళ్లు కూడా మిరపకాయ బజ్జీలో మిర్చీ దాగినంతకాలం, ఉప్మాలో ఉల్లిపాయ వేగినంతకాలం బాబు రాజకీయాల్లో ఉంటారనే నినాదాలు వినిపిస్తారని ఆశించిన వారికి నిరుత్సాహమే మిగిలింది. సభికుల్లో అధికులు పేటీఎమ్ బ్యాచ్ కనుక ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. కొద్దిమంది కార్యకర్తల కేరింతలు క్లైమాక్స్ సన్నివేశాన్ని రక్తి కట్టించలేకపోయాయి. ఆ విధంగా ఆఖరి బాణం విఫలమైంది. ఆ తర్వాత? చివరకు మిగిలేది ఉక్రోషమే! ఆఖరి రోజు కర్నూలు పట్టణంలో బాబులోని ఉక్రోషం బయటకొచ్చింది. పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అక్కడికి కొంచెం దూరంలో నిలబడి విద్యార్థులు, లాయర్లతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కర్నూలులో న్యాయ రాజధానికి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. వారిని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని గట్టిగా చెబుతూ పార్టీ కార్యకర్తలు కూడా అనాలని వారిని బలవంతపెట్టారు. దీంతో మరింత బిగ్గరగా జేఏసీ సభ్యులు బాబుకు నిరసన తెలిపారు. సీనియర్ మోస్ట్ రాజకీయ వేత్త వెంటనే రెచ్చిపోయారు. ‘కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విపరీత ప్రవర్తన చూసి జనం విస్తుపోతున్నారు. ఈ పర్యటనను తెలుగుదేశం పార్టీ వారు ఒక వ్యూహం ప్రకారం చాలా శ్రద్ధగా డిజైన్ చేశారు. కర్నూలు జిల్లా ప్రజలు అధికార వికేంద్రీకరణను కోరుకోవడం లేదని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కూడా వారికి ఇష్టం లేదని ఈ పర్యటన ద్వారా లోకాన్ని భ్రమింపజేయాలని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కలిసి ఈ పథకాన్ని రచించాయి. ఆయన సభలు జన సందోహంతో కిక్కిరిసినట్టు కనిపించేలా కొన్ని వీధి కూడళ్లను ఎంపిక చేశాయి. ఆ కూడళ్లలోకి నాలుగైదు వేల మందిని సమీకరిస్తే పెద్దఎత్తున జనం పాల్గొన్నట్టు కనిపిస్తుంది. ఆమాత్రం సమీకరణకు కూడా పార్టీ బలం చాలకపోవడంతో దిన వేతనంపై ఎక్కువ మంది సాధారణ ప్రజలను సమీకరించారు. వారిలో కొందరిని మిద్దెలపైకి ఎక్కించారు. ఈమధ్యకాలంలో జనసందోహానికి మొహంవాచి ఉన్న అధినేత డూప్ జనాన్ని చూసి పరవశించిపోయారు. ఆ పరవశం కారణంగా రాజకీయాల్లో చిట్టచివరిగా వాడవలసిన సానుభూతి ఆయుధాన్ని యథాలాపంగా వాడిపారేశారు. ‘మీరు ఓట్లు వేసి గెలిపించకపోతే ఇవే నాకు చివరి ఎన్నికలవుతాయ’ని బేలగా వాపోయారు. ఈ చివరి ఆయుధానికి స్పందనగా ‘నో... నో’ అని జనం హోరెత్తుతారని బహుశా ఆయన ఆశించి ఉండవచ్చు. ‘మీకు ఇవి చివరి ఎన్నికలు కావు, మళ్లీ మళ్లీ మీరే గెలుస్తారు’ అనే సమాధానాలు వారి నుంచి ఊహించి ఉండవచ్చు. జాతీయస్థాయి నినాదాల టైప్‌లో ‘జబ్ తక్ సూరజ్, చాంద్ రహేగా తబ్ తక్ ఆంధ్రామే బాబు రహేగా’ అంటారని కూడా స్వప్నించి ఉండవచ్చు.’ లాయర్లు, విద్యార్థుల మీద బాబు నోటి వెంట అనర్ఘరత్నాలు రాలడం మొదలైంది. ‘‘పనికిమాలిన వ్యక్తుల్లారా... నేరాలు ఘోరాలు చేసే దరిద్రుల్లారా... రేయ్ వాణ్ణి తన్ను.. రేయ్ రారా చూపిస్తా... మా ఆఫీసుకే వస్తార్రా మీరు... ఎంత ధైర్యంరా మీకు... ధైర్యముంటే రాండ్రా గాడిద ల్లారా... బోడినాకొడుకులు తామాషాలాడతారా... రౌడీలకే రౌడీనిరా నేను.. తరిమి తరిమి కొట్టిస్తా... గుడ్డలిప్పదీసి కొట్టిస్తా..’’ ఇలా లాఠీ లేకుండా నోటి తుంపర్లతోనే ఆయన ఛార్జ్ చేశారు. ఈ వాక్ప్రవాహంలో కొసమెరుపు ఏమిటంటే కక్కాల్సినంత అసభ్యాన్నంతా వెళ్లగక్కుతూనే ఆయన సభ్యతను కూడా అడ్డం పెట్టుకున్నారు. ‘నన్ను రెచ్చగొట్టకండి. రెచ్చగొట్టిన వాళ్లంతా పతనమయ్యారు. నాకు వస్తున్న కోపానికి చెప్పు చూపించాలి. కానీ చూపించలేదు. అదీ నా సభ్యత’ అని చెప్పుకున్నారు. ఈ సభ్యత బాణం పవన్ కల్యాణ్ మీద కావచ్చని సోషల్ మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈమధ్యనే పవన్ కల్యాణ్ ఒక సభలో ఆవేశంతో ఊగిపోతూ చెప్పు తీసి చూపించిన సంగతి అందరికీ తెలిసిందే. బాబు తన తాజా వ్యాఖ్యానం ద్వారా పవన్‌కు సభ్యత లేదని చెప్పదలుచు కున్నారా? అదే నిజమైతే ఆయనకు ఎందుకింత కోపం వచ్చింది? లోగుట్టు తెలిసిన పెరుమాళ్లే దీనికి సమాధానం చెప్పాలి. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న చంద్రబాబునాయుడులో పెరుగుతున్న అసహనాన్నీ, నిస్పృహనూ అర్థం చేసుకోవచ్చు. అనుభవం కారణంగా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అంతో ఇంతో అంచనా వేయగలరనే అనుకోవాలి. అలా అంచనా వేయగలిగిన స్థితిలోనే ఉంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాదనే విషయం అర్థమయ్యే ఉండాలి. అర్థం కాలేదు, తాము గెలవగలమనే భ్రాంతిలోనే నిజంగా ఉన్నాడంటే ‘కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్’ అనే వాక్యాన్ని అక్షరాల నమ్ముతున్న అమాయకుడై ఉండాలి. ఆయన అమాయకుడు కాదు, గుండెలు తీసిన మొనగాడనే విషయం లోకోత్తర వ్యావహారికం. కనుక అసలు విషయం ఆయనకు తెలుసనే అనుకోవాలి. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించడం దాదాపు అసాధ్యమన్న భావన ఎందుకు ఏర్పడింది? దానికి కారణా లున్నాయి. గడచిన ఎన్నికల్లో ఆ పార్టీకి 50 శాతం ఓట్లు వచ్చాయి. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన పేదల అనుకూల విధానాలు, సాధించిన బలహీనవర్గాల సాధికారత, విద్య, వైద్యం, వ్యవసాయరంగాల్లో ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ మద్దతుదార్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. తమ గోబెల్స్ ప్రచారం ఫలితంగా అధికార పార్టీ ఓట్లలో రెండు మూడు శాతం ఓట్లను తగ్గించ గలమనే నమ్మకంతో ఎల్లో మీడియా – తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. ఒకవేళ అదే నిజమని నమ్మినా, అధికార పార్టీకి పేదవర్గాల నుంచి కొత్తగా జమ కానున్న ఓట్లతో పోల్చితే ఈ సంఖ్య తక్కువే. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి తగ్గని ఓట్ల బ్యాలెన్స్‌తో ఉన్న అధికార పార్టీని ఓడించేదెట్లా? రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదనే సామెత కూడా ఒకటున్నది. ఏవైనా అద్భుతాలు జరిగితే?... ఏమో... గుర్రం ఎగరావచ్చు అనే ఆశ ఏదో ఎల్లో కూటమిలో ఎక్కడో మిణుకు మిణుకుమంటూ ఉండేది. సదరు మిణుగురు ఆశను సాకారం చేసుకోవడానికి చాలాకాలం నుంచే ఎల్లో కూటమి ఒక ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయడం మొదలుపెట్టింది. ఇందులో మొదటిది – సుడిగాలి మాదిరిగా సాగించే గోబెల్స్ ప్రచారంతో వైసీపీ మద్దతు ఓట్లను తగ్గించడం! రెండోది – కుడి నుంచి ఎడమకూ, ఎడమ నుంచి కుడికీ సమస్త పార్టీలనూ, రథ గజ తురగ పదాతి శ్రేణులన్నింటినీ తమకు అనుకూలంగా ఏకం చేసుకోవడం! ఈమధ్య పవన్ కల్యాణ్‌ను పరామర్శించినప్పుడు చంద్రబాబు ఉద్ఘాటించిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యత’ అనే పిలుపులోని పరమార్థం ఇదే! ఈ ఐక్యతలో ముందుగా జనసేనను కూటమిలో కలుపుకోవాలి. జనసేన గాలంతో బీజేపీ చేపను పట్టేయాలి. ఆ తర్వాత ఎలాగోలా కమ్యూనిస్టులను పట్టేయాలి. బీజేపీ ఉన్న కూటమిలోకి కమ్యూనిస్టులు ఎట్లా వస్తారు? ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ కోసం వస్తారు. సీపీఐ నాయకుల్లో కొందరు చంద్ర బాబు పట్ల తమ వ్యామోహాన్ని బహిరంగంగానే ప్రదర్శించడం తెలిసిందే. వారి ద్వారా సీపీఎంకూ లైన్ వేయాలి. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యత’లో ముందుగా జనసేనను కూటమిలో కలుపుకోవాలి. జనసేన గాలంతో బీజేపీ చేపను పట్టేయాలి. ఆ తర్వాత ఎలాగోలా కమ్యూనిస్టులను పట్టేయాలి. బీజేపీ ఉన్న కూటమిలోకి కమ్యూనిస్టులు ఎట్లా వస్తారు? ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ కోసం వస్తారు. సీపీఐ నాయకుల్లో కొందరు చంద్రబాబు పట్ల తమ వ్యామోహాన్ని బహిరంగంగానే ప్రదర్శించడం తెలిసిందే. వారి ద్వారా సీపీఎంకూ లైన్ వేయాలి. ఇంకా ఎక్కడన్నా చిన్నా చితకా పార్టీలుంటే వాటికీ వల వేయాలి. ‘నోటా’ ఓట్లు, చెల్లని ఓట్లతో కూటమి కట్టడానికి ఏవైనా ఉపాయాలున్నాయేమో ఆలోచించాలి... ఇట్లా సాగుతున్న ఎల్లో కూటమి ఆలోచనా స్రవంతికి ఎక్కడో బ్రేక్ పడ్డట్టుగా కనిపిస్తున్నది. మోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ పర్యటన వార్తలను ఎల్లో మీడియా పూర్తిగా తగ్గించివేసిందని సోము వీర్రాజు అధిక్షే పించారు. చంద్రబాబేమో పవన్‌కు సభ్యత లేదన్నట్టు పరోక్షంగా బాంబులు విసురుతున్నారు. ఏం జరుగు తున్నదో? ఎల్లో కూటమి ప్రవచిస్తున్న ‘ప్రజాస్వామ్యం’ కోసం ఐక్యతా కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు పడిందా? లేక టీడీపీ – జనసేనల మధ్య తాత్కాలిక వియోగమే సంభవించిందా? తేలడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ, మళ్లీ ఆట మొదలుపెట్టాలి. ఈలోగా పుణ్యకాలం గడిచిపోవచ్చు. మరోపక్కన గోబెల్స్ ప్రచారం మునుపటి మాదిరిగా ప్రభావం చూపుతున్నట్టు లేదు. ’ ఇంకా ఎక్కడన్నా చిన్నా చితకా పార్టీలుంటే వాటికీ వల వేయాలి. ‘నోటా’ ఓట్లు, చెల్లని ఓట్లతో కూటమి కట్టడానికి ఏవైనా ఉపాయాలున్నాయేమో ఆలో చించాలి... ఇట్లా సాగుతున్న ఎల్లో కూటమి ఆలోచనా స్రవంతికి ఎక్కడో బ్రేక్ పడ్డట్టుగా కనిపిస్తున్నది. మోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ పర్యటన వార్తలను ఎల్లో మీడియా పూర్తిగా తగ్గించివేసిందని సోము వీర్రాజు అధిక్షేపించారు. చంద్రబాబేమో పవన్‌కు సభ్యత లేదన్నట్టు పరోక్షంగా బాంబులు విసురుతున్నారు. ఏం జరుగు తున్నదో? ఎల్లో కూటమి ప్రవచిస్తున్న ‘ప్రజాస్వామ్యం’ కోసం ఐక్యతా కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు పడిందా? లేక టీడీపీ – జనసేనల మధ్య తాత్కాలిక వియోగమే సంభవిం చిందా? తేలడానికి కొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ ఇది తాత్కాలిక వియోగమే అయినా, మళ్లీ ఆట మొదలుపెట్టడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ఈలోగా పుణ్య కాలం గడిచి పోవచ్చు. మరో పక్కన గోబెల్స్ ప్రచారం మునుపటి మాదిరిగా ప్రభావం చూపుతున్నట్టు లేదు. ఒక్కో బోగస్ కథనాన్ని వంద సార్లు అచ్చొత్తినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నేప థ్యంలో చంద్రబాబు నిర్వహించిన కర్నూలు తరహా యాత్రలు రాయలసీమ జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో కూడా చేపట్టవచ్చు. ఉరుములు మెరుపులతో కూడిన రెచ్చగొట్టే తుంపర్లు మరిన్ని రాలవచ్చు. ఇది రాజకీయ వాతావరణ హెచ్చరిక. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్మాదపు మేఘాలు ఆవరించకుండా ఉండుగాక! వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.com -
AP Assembly: టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ రూలింగ్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం కొత్త రూల్ ప్రవేశపెట్టారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనకు సంబంధించి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇకపై సెల్ఫోన్లు అసెంబ్లీలోకి తీసుకురావొద్దని ఆదేశాలిచ్చారు. లోపల జరిగే యాక్టివిటీ టీడీపీ రికార్డ్ చేస్తోందని స్పీకర్ అన్నారు. ఇకపై ఈ రూల్ అందరికీ వర్తిస్తుందని.. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. చదవండి: వేసవిలో 24/7 నాణ్యమైన విద్యుత్ ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ శాసన సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో ఒక రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సత్యప్రసాద్, చినరాజప్ప, రామ్మోహన్, అశోక్, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను సస్పెన్షన్ చేశారు. -
జ్వెరెవ్‌కు ఊరట.. జరిమానా, సస్పెన్షన్ నిలుపుదల
అకాపుల్కో(మెక్సికో): టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) నుంచి చెప్పుకోదగ్గ ఊరట లభించింది. ఏటీపీ జరిమానా, సస్పెన్షన్ వేటు నిలుపుదల చేసింది. గత నెల మెక్సికో ఓపెన్‌లో డబుల్స్ మ్యాచ్ ఓడిన వెంటనే జ్వెరెవ్ చైర్ అంపైర్ కుర్చికేసి బలంగా తన రాకెట్ విరిగేలా పదేపదే కొట్టాడు. దీంతో టోర్నీ నిర్వాహకులు సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన జ్వెరెవ్‌ను పంపించేశారు. దాంతో పాటు 40 వేల డాలర్లు (రూ. 30 లక్షలు), ఆ టోర్నీలో పొందిన ఏటీపీ పాయింట్లను జరిమానాగా విధించారు. ఇది పూర్తిగా మెక్సికో ఓపెన్‌కు సంబంధించిన పెనాల్టీ అయితే... ఏటీపీ నుంచి మరో 25 వేల డాలర్లు (రూ. 19 లక్షల 25 వేలు) జరిమానా, 8 వారాల సస్పెన్షన్ వేటు కూడా వేశారు. తాజాగా ఏటీపీ ఈ శిక్షను తాత్కా లికంగా నిలిపివేసి, ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంచింది. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ముగిసే ప్రొబేషన్ వరకు అతని ప్రవర్తన హుందాగా ఉంటే ఏ సమస్యా లేదు. ఏటీపీ శిక్ష కూడా ఉండదు. ఈ ప్రొబేషన్ కాలంలో జ్వెరెవ్ తన అనుచిత ప్రవర్తనను పునరావృతం చేస్తే మాత్రం ఏటీపీ శిక్షను తక్షణం అమలు చేస్తారు. -
భయం లేదు.. బాధ్యత లేదు..! విచిత్రంగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు..
సాక్షి, జీడిమెట్ల: కాలేజీలు, స్కూళ్లకు వెళ్లి చక్కగా చదువుకోవాల్సిన కొంతమంది విద్యార్థులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. చిన్న గొడవనే పెద్దదిగా చేస్తూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు.. మరికొందరు కాలేజీలకు వెళ్లకుండా బయట తిరుగుతూ మద్యం, గంజాయి సేవిస్తున్నారు.. అదే మత్తులో గ్యాంగు మాదిరిగా వెళ్లి ఏదో ఒక కారణంతో ఇతరులను చితకబాదుతున్నారు. ఇలాంటి దాడుల్లో కొంతమంది గాయపడుతుండగా మరికొంతమంది మృత్యువాత పడుతున్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులకు పెద్దలంటే గౌరవం లేదు.. పోలీసులంటే భయంలేదు.. భవిష్యత్తుపై కోరిక లేదు..వీరు కొట్లాడే సమయంలో ఎవరైనా వద్దని చెప్పినా వద్దనడానికి నువ్వెవరంటూ అగౌరవంగా మాట్లాడుతున్నారు. దీంతో రోడ్లపై కొట్లాడుతున్నా వీరిని విడిపించే సాహసం ఎవరూ చేయడం లేదు. దీంతో వారి భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటున్న తల్లిదండ్రుల అశలు ఆవిరైపోతున్నాయి. ఇలాంటి వారిలో 9,10, ఇంటర్ విద్యార్థులే అధికం.. పనిచేయని పోలీసుల కౌన్సెలింగ్.. ► గంజాయి, మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడి న కొందరిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పోలీసుల ఎదుట వారి ఇలాంటివి మళ్లీ చేయమని చెప్పి మళ్లీ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఒకవేళ మళ్లీ పోలీసులకు దొరికినా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ తల్లిదండ్రుల ఎదుట పోలీసులు వారిని మందలించి వదిలేస్తున్నారు. మాయ మాటలు చెప్తూ జల్సాలు.. ►కొంతమంది విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నామని తల్లిదండ్రులకు చెప్తున్నారు. పుస్తకాలు, పరీక్ష ఫీజులంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తల్లిదండ్రులకు వీరి గురించి కాలేజీలకు వెళ్లి అడిగే సమయం లేదు. దీంతో వారు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్తూ బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. చదవండి: రెండు రైళ్లు ఎదురెదుగా వస్తున్నాయ్.. మధ్యలో కవచ్ మద్యం సేవిస్తూ.. ►ఎస్ ఆర్ నాయక్‌నగర్‌లోని ఓ అపార్టుమెంట్లో కొంతమంది యువకులు, ఓ అమ్మాయితో కలిసి రాత్రిపూట ఓ ఫ్లాట్‌లో మద్యం సేవిస్తున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సదరు ఫ్లాట్ వద్దకు వెళ్లగా రాత్రి 11 గంటలకు గదిలో నుంచి ఐదుగురు అబ్బాయిలు, ఒకఅమ్మాయి బయటకు వచ్చారు. వీరిని విచారించిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తేలీదు. ►రెండు నెలల క్రితం చింతల్‌లోని ఓ బస్టాపులో ఒకేసారి సామూహికంగా వచ్చిన విద్యార్థులు బస్టాపులో నిల్చొని ఉన్న మరో విద్యార్థిని తీవ్ర ంగా కొట్టి గాయపరిచారు. దెబ్బలకు తాళలేక సదరు విద్యార్థి పరుగు లంకించాడు. అక్కడ ఉన్న కొందరు 100కు సమాచారం అందించారు. ►మూడు నెలల క్రితం ముగ్గురు పాఠశాల విద్యార్థులు ఓ అపార్టుమెంట్ గోడ దూకి లోపలికి వెళ్లారు. అక్కడే ఉన్న మరో విద్యార్థితో ఒక నిమిషం గొడవపడ్డారు. అనంతరం ముగ్గురు కలిసి 10వ తరగతి విద్యార్థిని కిందపడేసి కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులతో చితకబాదారు. దీంతో సదరు బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ►ఐదు రోజుల క్రితం ఓ కాలనీలోని పార్కులోమద్యం సేవించిన నలుగురు యువకులు టికెట్ లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సదరు పార్కు సూపర్వైజర్ టికెట్ తీసుకోవాలని కోరగా అతనిపైకి దాడికి ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానిక వ్యక్తి గొడవ ఎందుకు చేస్తున్నారని అడిగిన పాపానికి అతని తలపై సిమెంట్ రేకుతో కొట్టి గాయపరచి పరారయ్యారు. కాలనీ వాసులు వెంబడించి పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు. చదవండి: పెరిగిపోతున్న సుపారీ... సవారీ! రంగంలోకి కిరాయి హంతకులు ►ఆరు నెలల క్రితం ఓ ప్రాంతంలో కొంతమంది యువకులు గంజాయి సేవిస్తుండగా చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుల నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని వారిని కేవలం మాటలతో బెదిరించి పోలీసులు వదిలేసినట్లు సమాచారం. ఓ వ్యక్తిని కొట్టి గాయపరచిన దృశ్యం ఫిర్యాదు వస్తే కేసులు నమోదు మాకు ఫిర్యాదు అందితే కచ్చితంగా కేసులు నమోదు చేశాం. ఎవరైనా రోడ్లపై కొట్టుకున్నా విచారి ంచి కేసులు నమోదు చేస్తున్నాం. విద్యార్థులు కొట్టుకున్న సంఘటనల్లో కేసులతో పాటు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఎవరైనా గంజాయి లేక ఇతర మత్తు పదార్థాలు సేవించినట్లు గమనిస్తే మాకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటాం. – కె.బాలరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ జీడిమెట్ల మోటివేషన్ తరగతులు నిర్వహించాలి విద్యార్థులకు పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహ కార్యక్రమాలతో పాటు మోటివేషన్ తరగతులు నిర్వహించాలి. వీటితో పాటు పిల్లలు కచ్చితంగా కాలేజీలకు స్కూళ్లకు వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలి. 12 నుంచి 18సంవత్సరాల వరకు పిల్లల కదలికలను, మార్పులను తల్లిదండ్రులు గమనించాలి. సాధ్యమైనంత వరకు మంచి అలవాట్లు నేర్పించాలి. – డా.పి.జనార్దన్ రెడ్డి, రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
Jayanthi Narayanan: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు
Best Teacher Jayanthi Narayanan: స్పెషల్ చిల్డ్రన్‌కి ఆమె తల్లి, తండ్రి, గురువు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్న జయంతి ‘దేవుడు నన్ను ఈ పిల్లల కోసమే పుట్టించినట్టున్నాడు’ అని నమ్ముతుంది. దాదాపు 36 ఏళ్లుగా ఆమె చెన్నై మైలాపూర్‌లోని క్లార్క్స్కూల్లో ఇప్పటికి కనీసం వెయ్యిమంది స్పెషల్ చిల్డ్రన్కు కనీస చదువు, ప్రవర్తన నేర్పించింది. ‘నా జీవితం వారికే అంకితం’ అంటోంది జయంతి. మైలాపూర్‌లో ‘ది క్లార్క్ స్కూల్ ఫర్ ది డెఫ్’లో జయంతిని పిల్లలు ఎవరూ టీచర్‌గా చూడరు. వాళ్లు స్పెషల్ చిల్డ్రన్. కొంతమందికి వినిపించదు. కొందరు చూడలేదు. మరికొందరికి బుద్ధి వికాసంలో లోపం. వారికి ఆమే అమ్మ. గురువు. తండ్రి కూడా. ‘లాక్డౌన్లో నాకు చాలా కష్టమైంది. పిల్లల్ని విడిచి నేను ఉండలేకపోయాను. వాళ్లు నన్ను చూడక ఇరిటేట్ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు’ అంటుంది జయంతి. ఆమె చూస్తేనే వారికి సగం స్వస్థత. 1984 నుంచి ఆమె ఆ స్కూల్లో పని చేస్తోంది. ఎందరో పిల్లలు ఆమె చేతుల మీదుగా కనీస అవసర ప్రవర్తనను నేర్చుకుని స్కూలు దాటి పోయారు. వారందరూ ఇలాగే ఆమెకు ప్రేమను పంచి ఆమె ప్రేమను పొంది వెళ్లారు. అందుకే ఆమెను ప్రభుత్వం బెస్ట్ టీచర్‌గా గుర్తించింది. సహనమే శక్తి ఇది ఎడమ చేయి ఇది కుడి చేయి అని మూడేళ్ల పసివాడికి కూడా అర్థమవుతుంది. కాని బుద్ధి వికాసంలో లోపం ఉంటే పదేళ్లు వచ్చినా తెలియదు. ‘మనకు అది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. వీళ్లకు ఎందుకు అర్థం కాదు అనిపిస్తుంది. కాని బుద్ధి వికాసం లేని పిల్లలకు అది అతి పెద్ద పనితో సమానం’ అంటుంది జయంతి. ఆమె పని చేస్తున్న స్కూల్లో ప్రతి సంవత్సరం రకరకాల శారీరక, మానసిక లోపాలతో పిల్లలు చేరుతారు. వారి వారి లోపాలను, వాటి స్థాయులను బట్టి తర్ఫీదు ఇవ్వాల్సి వస్తుంది. ‘స్పెషల్ విద్యార్థులకు చదువు చెప్పే డిప్లమా కోర్సు చేశాక ఎం.ఎస్సీ సైకాలజీ చేశాను. ఆ తర్వాత ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు చేశాను. పిల్లల పట్ల సానుభూతి, కరుణతో ఉండాల్సిన టీచర్‌గా మారిపోయాను’ అంటుంది జయంతి. ఆమె కుటుంబం ఆమెను ఈ పనిలో ప్రోత్సహిస్తుంది. కాకపోతే వారికి ఒకటే సందేహం. ఇంత ఓపిక ఎలా? అని. ‘ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల తల్లిదండ్రులే ఒక్కోసారి విసిగిపోయి డస్సిపోతారు. తమ పిల్లల మీద తామే చిరాకు పడతారు. కాని నేను పొరపాటున కూడా వారిని విసుక్కోను. ఎన్నిసార్లు అర్థం కాకపోయినా చెబుతాను. ఒక పిల్లవాడు ప్లేటు కింద పడకుండా భోజనం ప్లేటు తీసుకుంటే, తనకు తాను వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తే అదే ఆ పిల్లవాడికి నాకూ కూడా పెద్ద ఘనవిజయంగా భావిస్తాను’ అంటుంది జయంతి. ఈ మహమ్మారి రోజుల్లో స్కూళ్లు తిరిగి తెరిచాక ఆ పిల్లలకు సరిగ్గా మాస్క్ ధరించేలా చేయడం పెద్ద పనిగా ఉంది. వారికి దానిని పెట్టుకోవడం కూడా పెద్ద పనే. కాని జయంతి ఓపిగ్గా చేస్తుంది. వీడియో పాఠాలు కొందరు తమది ఉద్యోగం మాత్రమే అనుకుంటారు. కొందరు తమది కర్తవ్యం అనుకుంటారు. అందుకే ఎన్ని విధాలుగా పని చేయవచ్చో అన్ని విధాలుగా చేస్తూ పోతారు. లాక్డౌన్ సమయంలో స్పెషల్ చిల్డ్రన్కు ఆన్లైన్ క్లాసులు తీసుకునే సాహసం చేసింది జయంతి. వారికి ఫోన్, లాప్టాప్ ఉపయోగించడం కష్టం. కాని ప్రయత్నించి తన పిల్లలతో కాంటాక్ట్‌లో ఉంది. అంతే కాదు స్పెషల్ పిల్లల తల్లిదండ్రులకు, వారికి పాఠాలు చెప్పే టీచర్లకు ఉపయోగపడేలా వీడియో పాఠాలు తయారు చేసి యూట్యూబ్‌లో పెట్టింది. ఈమె తయారు చేసిన 34 వీడియోలు ప్రశంసలు పొందాయి. ఎన్నో చేయాలి స్పెషల్ చిల్డ్రన్కు అవసరమైన ప్రత్యేక స్కూళ్లు, క్లాస్రూమ్ లు ప్రతి ఊళ్లో ఉండాలని అంటుంది జయంతి. ‘వారికి ఇండివిడ్యుయెల్ కోర్సులు ఉండాలి. వాళ్లు ఉపయోగించాల్సిన సాఫ్ట్వేర్లతో కంప్యూటర్లు ఉండాలి. బ్రెయిలీ ప్రింటర్లు ఉండాలి. స్పెషల్ పిల్లలు చదువును ఎంజాయ్ చేసే వాతావరణం ఏర్పాటు చేయాలి. వారికీ అన్ని సౌకర్యాలు పొందే హక్కు ఉంది’ అంటుంది జయంతి. ఇలాంటి మంచి మనసున్న టీచర్, అమ్మలాంటి టీచర్ ప్రతి స్పెషల్ చైల్డ్‌కు దక్కాలని కోరుకుందాం. -
పుస్తక పఠనం ప్రాధాన్యం తెలుసా? ఇలా చదవడం ఎంతో మేలు
మనల్ని కాళ్ళు కదపనీయక, ఇల్లు కదలనీయక కొత్త ప్రపంచంలో విహరింపచేసి కొత్త కొత్త అనుభవాలను, అనుభూతులను మనకు పంచి మన పరిణతికి, మనోవికాసానికి దోహదం చేసే అద్భుత మార్గదర్శకాలు. మనకు సంతోషాన్నిచ్చి, మన బాధను పంచుకునే మన చక్కని నేస్తాలు పుస్తకాలు. ఇప్పుడైతే పుస్తకాలు విరివిగా అందరి చేతుల్లోకి వస్తున్నాయి. కొన్నేళ్ల కిందట, పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. వార పత్రికలలో ధారా వాహికలను క్రమం తప్పకుండా చదివే అలవాటున్న వారు, నవలలు, కథలు చదివే అభిరుచి ఉన్నవారు, కొనుక్కోలేక గ్రంథాలయాలలో తెచ్చుకుని చదివేవారు. గృహిణులు, సరుకులు కట్టిన కాగితం పొట్లాలమీద ఉండే వార్తలు, కథలు కూడా వంటిల్లు సర్దుకుంటూ ఆసక్తిగా చదివేవారు. పఠ నాభిలాష అంత బాగా ఉండేది. రచయితలు గతించిపోవచ్చు. కాని, పుస్తకాలు నశించవు. శ్రీనాథ, పోతనాది కవులను మనమెవరం చూడలేదు. వాళ్ళ గ్రంథాలు వెలువడి శతాబ్దాలు గడిచేయి. అయినా మనం ఇప్పటికీ చదువుతూనే ఉన్నాం. ఆ గ్రంథాల నుంచి స్ఫూర్తిని పొందుతూనే వున్నాము. వాటిలోని సందేశాలను, నీతులను అనుసరిస్తూనే వున్నాము. శ్రవణం, భాషణం, పఠనం, లిఖితం అనే నాలుగు అభివ్యక్తి నైపుణ్యాలలో పఠన కళ ఒకటి. పుస్తకాలను చదవటం ఒక కళ. వేగంగా చదవాలి. అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రారంభించి కొన్ని పేజీలు చదవగానే అది ఉపయోగపడేదేనా, కాలక్షేపానికా అన్నది గ్రహించగలగాలి. ఏవి చదవాలి, ఎలా చదవాలి, ఏవి చదవకూడదు అనేది తెలిసి వుండటం కూడా పఠన కళలో భాగమే! ఎన్ని పుస్తకాలు చదివాము అన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా చదివాం, ఎంత లోతుగా చదివామన్నది ముఖ్యం. చదివిన ఒక వాక్యమైనా క్షుణ్ణంగా, లోతుగా చదవాలి. అపుడే మన మనస్సులో అవి నిలిచిపోతాయి. ‘కొన్ని పుస్తకాలను స్పృశించి వదిలేయాలి, కొన్ని జీర్ణించుకోవాలి, కొన్ని నెమరు వేసుకోవాలి’ అని అన్నాడు ప్రసిద్ధ ఆంగ్ల రచయిత బేకన్. పుస్తకాలు ఎలా చదవాలో మహాకవుల, మేధావుల జీవిత చరిత్రలు, డైరీల నుండి గ్రహించవచ్చు. చిరిగిన చొక్కానైనా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో’ అనే సూక్తి మనందరకు తెలుసు. కాని, నేటి యువత çపద్ధతి ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. బాగా చదివే అలవాటున్నవారిని పుస్తకాల పురుగు అంటారు. అలాంటివారు నిజంగానే తమ డబ్బును బట్టలకు కాకుండా పుస్తకాలు కొనటానికే ఖర్చు చేస్తారు. పుస్తకాలు పాఠకుణ్ణి ఊహలోకంలో, అద్భుత జగత్తులో విహరింపజేస్తాయి. మనను తమతో ప్రయాణింప చేస్తాయి. సంఘటనలు ఆయా ప్రాంతాలకు తమతో తీసుకువెళ్లిపోతాయి. చదువుతున్న సన్నివేశానికి మనం దృశ్య రూపాన్ని కల్పించుకుంటాం. పుస్తకాలు చదవటం శ్వాస పీల్చటం లాంటిది. శ్వాస ఆడకపోతే ప్రాణం నిలవదు. పుస్తకాలు అంతే! ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు... ఇవి ఈ ప్రపంచాన్నే మార్చగలవు. ఆస్తులు పోవచ్చు, భవనాలు కూలిపోవచ్చు, కాని పుస్తకాలు నశించవు. పుస్తకాలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం లాంటిది. అశాంతిమయ క్షణాల్లో, నిరాశా నిస్పృహలలో, ఒంటరి తనంలో పుస్తకమే నిజమైన నేస్తం. ప్రాణ స్నేహితులు కూడా ఒకొక్కసారి విభేదాలు వచ్చి మనతో విడిపోవచ్చు. కాని, పుస్తకాలు అనే స్నేహితులు మన సుఖ దుఃఖాలలో మనకు తోడు. ఎంతో వెన్నుదన్ను. ముఖ్యంగా మన బాధలో, మనని ఎప్పుడూ విడిచి పెట్టవు. మౌన మిత్రులు. మనలోని లోపాలను దిద్ది మంచి దారిలో పెడతాయి. మనలో మంచి ప్రవర్తనను ప్రోది చేసే అద్భుత సాధనాలు. శాశ్వతమైన స్నేహితులు. పుస్తకాలు జ్ఞానమనే నిధికి తాళాల్లాంటివి. సంతోషమనే ఇంటికి తలుపు లాంటివి. పుస్తకాలకు పెట్టిన ప్రతిపైసా మంచి పెట్టుబడే. పుస్తకాలు జీవితంలో కొత్తకోణాలను చూపిస్తాయి. ఎలా జీవించాలో మనకు నేర్పిస్తాయి. ఆశావహ దృక్పధాన్ని పెంచుతాయి. మెదడును వికసింప చేసి, స్వతంత్ర ఆలోచనా శక్తిని, విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. సత్యాన్ని శోధింప చేస్తాయి. మేధావి రచయితలు వారి రచనల ద్వారా ఎప్పుడూ జీవించే ఉంటారు. ప్రతి వారికి సొంతం గ్రంధాలయం ఉండాలి. ఇది విలాసం కోసం, ప్రదర్శన కోసం కాదు. జీవితంలో ఇదీ ఒక అవసరం. కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు, ఒక నిఘంటువు, ఒక విజ్ఞాన సర్వస్వం లేని ఇల్లు వెలుతురు రావటానికి కావలసిన కిటికీలు లేని ఇల్లు లాంటిది. ప్రపంచపు గొప్ప సాహిత్యాన్ని చదవటం వల్ల పద సంపద విస్తృతమవుతుంది. వేగంగా పెరిగిపోతున్న వయసులో ఒత్తిడుల నుంచి తప్పించుకోవటానికి గొప్ప ఆధారం పుస్తకాలు. ఎలా చదవాలి? ఒక పెన్సిల్ చేత్తో పట్టుకుని, ముఖ్యమైన వాక్యాల కింద గీత గీస్తూ, అర్థం చేసుకుంటూ చదవాలి. అప్పుడు ఆ పుస్తకంలో హృదయాన్ని వేగంగా సమీక్షించగలమని మేధావులు చెప్పారు. ప్రతిరోజూ ఎంతో కొంత చదవాలి. అది క్రమంగా ఓ అలవాటుగా మారిపోతుంది. రాత్రి పడుకునే ముందు మంచి పుస్తకం ఒక అరగంట చదివితే మనసు ప్రశాంతత పొందుతుంది. మంచి నిద్ర పడుతుంది. పుస్తక పఠనం అలసటలో, ఆవేదనలో, ఆర్తిలో, సుఖంలో, సంతోషంలో ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. పిల్లలకు బాల్యం నుంచే పుస్తకాలు చదవటం అలవాటు చేస్తే వాళ్ళ జీవితంలో అది స్థిర పడిపోతుంది. ♦ పుస్తకాలు చదవటం శ్వాస పీల్చటం లాంటిది. శ్వాస ఆడకపోతే ప్రాణం నిలవదు. పుస్తకాలు అంతే! ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు... ఇవి ఈ ప్రపంచాన్నే మార్చగలవు . ♦ సూక్తి సుధ అవకాశాలు సూర్య కిరణాలు వంటివి. వాటిని వీలయినంత త్వరగా దొరక బుచ్చుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు. – డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి -
అంగలకుదురులో టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన
తెనాలి/ తెనాలిరూరల్: గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండల గ్రామం అంగలకుదురులో టీడీపీ మద్దతుదారు విజయం సాధించటంతో ఆ పార్టీకి చెందిన కొందరు అవాంఛనీయంగా ప్రవర్తించారు. గ్రామ సచివాలయ బోర్డుపై దాడి చేశారు. బోర్డుపై సీఎం జగన్మోహన్రెడ్డి బొమ్మను కనిపించకుండా చేయాలన్న కసితో ఆ పనిచేసినట్టుగా అర్థమవుతోంది. సర్పంచ్ పదవికి ఎన్నికయ్యాక సర్పంచ్, ఉపసర్పంచ్లు గృహప్రవేశం చేసినట్టుగా ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మరొకరు మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫొటోలతో సహా సచివాలయంలోకి ప్రవేశించారు. వీరిని ఆ పార్టీ నేతలు అనుసరించారు. గ్రామంలో ఇదే అభ్యర్థులు నామినేషను దాఖలు రోజున టీడీపీ కండువాలు, జెండాలు ధరించి ఊరేగింపు చేసిన విషయం తెలిసిందే. గెలిచాక తమ అక్కసును సచివాలయం బోర్డుపై తీర్చుకున్నారు. దీనిపై స్థానికులు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఫ్లెక్సీ ధ్వంసంపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ ఎం. మురళి తెలిపారు. (చదవండి: నామినేషన్ వేస్తే చంపేస్తాం!) కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి! -
పాక్ మారాలంటే ముందు భారత్ మారాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలంటే ముందుగా భారత్ పాక్పట్ల తన ప్రవర్తనను మార్చుకోవాలని కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం తెలిపారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో చిదంబరం మాట్లాడుతూ..‘మనం బలమైన సైన్యాన్ని తయారుచేసుకునేది యుద్ధం చేయడానికి కాదు. యుద్ధంరాకుండా నివారించడానికే. ఈ విషయం తెలుసుకున్నప్పుడు అని సమస్యలు పరిష్కారమైపోతాయి. ఇందుకోసం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా సరికొత్తగా, విప్లవాత్మకంగా వ్యవహరించాలి’అని సూచించారు. భారత్–పాక్‌ల మధ్య సత్సంబంధాల కోసం ఇరుదేశాల పౌరులు విరివిగా రాకపోకలు సాగించేలా వీలు కల్పించాలని చిదంబరం అన్నారు. ఇరుదేశాల మధ్య సమస్యలకు యుద్ధం ఎన్నటికీ పరిష్కారం కాదన్నారు. -
విలువలతోనే సాఫల్యం
మానవుడికి లభించిన వరాల్లో మంచినడవడిక గొప్పవరం. మంచినడవడితోనే దైవసన్నిధికి చేరుకోవడం సాధ్యం. పరులకు సాయం చేయకపోవడం, వాగ్దానం చేసి భంగపరచడం, దేవుని పేరుతో మోసాలకు పాల్పడడం ఘోరమైన పాపాలు. ఇలాంటి వాళ్ళకు దైవశిక్ష తప్పదు. మంచినడవడితో కూడిన జీవితమే ఇహపరలోకాల్లో మానవుణ్ణి సాఫల్య శిఖరాలకు చేరుస్తుంది. ముహమ్మద్ ప్రవక్త(సం)ప్రవచనం ప్రకారం, మూడురకాల వ్యక్తులవైపు ప్రళయం రోజున దైవం కన్నెత్తి కూడా చూడడు. వారి పాపాలను క్షమించి వారిని పరిశుధ్ధపరచడు.పైగా వారిని తీవ్రంగా శిక్షిస్తాడు. వారిలో ఒకరకం మనిషి, అవసరానికి మించి ప్రయాణ సామగ్రి ఉన్నా, తోటి ప్రయాణీకులకు వాటిని ఇచ్చి ఆదుకోనివాడు. రెండోరకం వ్యక్తి, ప్రాపంచిక లాభాలను దృష్టిలో ఉంచుకొని, రాజ్యాధినేతకు అనుకూలంగా ప్రమాణాలు చేసేవాడు. మూడోరకం మనిషి, తన వ్యాపారవస్తువులను అమ్ముకోడానికి, దైవంపైప్రమాణాలు చేసేవాడు. తరువాత ప్రవక్తమహనీయులు, ఖురాన్ లోని వాక్యం పఠించారూ. ‘కొందరు తమ వాగ్దానాలను,దేవుని విషయంలో చేసిన ప్రమాణాలను అతి స్వల్పమూల్యానికి అమ్ముకుంటారు. ఇలాంటి వారికి పరలోకంలో ఎలాంటి ప్రతిఫలం లభించదు.దైవం వారితో మాట్లాడడు. ప్రళయదినాన వారివైపు కన్నెత్తికూడాచూడడు.వారిని పరిశుధ్ధపరిచే ప్రసక్తి అంతకన్నాలేదు. పైగా వారికి నరకంలో అత్యంత వ్యధాభరితమైన శిక్ష పడుతుంది.’ఈ ప్రవచనంలో ప్రవక్త మహనీయులు మూడురకాల మనస్తత్వాలను ప్రస్తావించారు. ఒకటి: అవసరానికి మించి ఉన్నప్పటికీ, అవరార్ధులైన తోటివారికి ఇవ్వకపోవడం, వారిని ఆదుకోకపోవడం మానవత్వం అనిపించుకోదని, ఇలాంటి అమానవీయ చర్యలను దైవం హర్షించడని, ఇలాంటి నేరానికి పాల్పడినందుకు తీవ్రంగా శిక్షిస్తాడని చెప్పారు. నిజానికి ఇది ప్రయాణ సందర్భానికే పరిమితమైన హితవుకాదు. నిత్యజీవితంలో అడుగడుగునా ఆచరించవలసిన అమృత ప్రవచనమిది. ఎంతోమంది అవసరార్ధులు, అభాగ్యులు నిత్యజీవితంలో మనకు తారసపడుతుంటారు. అలాంటి వారికి చేతనైన సహాయం చేయడం మానవత్వం. స్థోమత ఉన్నా పక్కవారిని గురించి పట్టించుకోకపోవడం అమానవీయం, అనైతికం. నేరం. అందుకే ప్రవక్తమహనీయులు, ‘నువ్వు తిని, నీ పక్కవాడు పస్తులుంటే నీలో విశ్వాసంగాని, మానవత్వం గాని లేదని తీవ్రంగా హెచ్చరించారు. మరోరకం మనిషి, స్వార్థం కోసం, స్వలాభంకోసం అధికారంలో ఉన్నవారికి వత్తాసు పలుకుతూ తన పబ్బం గడుపుకుంటాడు. తన పప్పులు ఉడుకుతున్నంత వరకూ, తనమాట సాగుతున్నంత వరకూ వారి చర్యలకు మద్దతు పలుకుతూ, సమర్థిస్తూ ఉంటాడు. ఇక లాభం లేదనుకున్నప్పుడు ప్లేటు పిరాయిస్తాడు. ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలను ఈనాడు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇలాంటి కుటిల, స్వార్ధపర, అవినీతి పరులకు కూడా వినాశం తప్పదు. మూడోరకం మనిషి, తన సరుకును అమ్ముకోడానికి దైవంపై ప్రమాణాలు చేసి ప్రజలను నమ్మిస్తాడు. నాసిరకం సరుకును నాణ్యమైన సరుకని, ఇదిగో ఇంతకు కొన్నాను, ఇంతకు అమ్ముతున్నాను. అంతా పారదర్శకం. అని ప్రమాణం చేసి మోసం చేసి తన వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకుంటాడు. సర్వశక్తిమంతుడైన దేవునిపై ప్రమాణం చేసిన కారణంగా ప్రజలు అతని మాయమాటలు ఇట్టే నమ్మేస్తారు. దీనివల్ల అతనికి తాత్కాలి క లాభాలు సమకూరినా, నిజమేమిటో ప్రజలకు కొద్దికాలంలోనే తెలిసిపోతుంది. ఇలాంటి వంచకులు, మోసకారులైన వ్యాపారులకు ఇహలోకంలో, పరలోకంలో కూడా వినాశనం తప్పదు. అందుకని ప్రాపంచిక జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ పాపభీతితో జీవితం గడపడం వివేకవంతుల లక్షణం. అలాంటివారే స్వర్గసౌఖ్యాలకు అర్హులు కాగలుగుతారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ప్రయాణం
‘‘బాబూ.. కారు ఆపు...’’ దాదాపు అరిచినంత పనిచేశాడు సృజన్. ఆ కేకకు నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచింది అలేఖ్య. సడెన్ బ్రేక్ వేశాడు డ్రైవర్. ‘‘వాట్ హ్యాపెండ్ సృజన్’’ గాబరాగా అడిగింది. ఆ మాట వినిపించుకోకుండానే.. ‘‘కాస్త వెనక్కి పోనియ్’’ చెప్పాడు డ్రైవర్‌కి. మెల్లగా రివర్స్ పోనిచ్చాడు డ్రైవర్. ‘‘ఆ..ఆ...స్టాప్.. స్టాప్. ఇక్కడ ఆపు’’ సృజన్.కారు ఇంకా పూర్తిగా ఆగకముందే హడావిడిగా డోర్ తెరుచుకుని దిగేశాడు. విస్తుపోతోంది అలేఖ్య భర్త ప్రవర్తన చూసి. కారు ఆగాక తనూ దిగింది. కారుకు రెండు అడుగుల దూరంలో ఉన్న ఓ వ్యక్తి వైపు పరిగెత్తాడు సృజన్. ‘‘నమస్కారం సర్..’’ అన్నాడు.ఆ వృద్ధుడు వణుకుతున్న చేతిని నుదుటికి అడ్డం పెట్టుకుంటూ పరీక్షగా చూశాడు సృజన్‌ను. ‘‘సర్.. నేను.. సృజన్‌ను. సాయిలు చిన్న కొడుకును’’ అతనికి జ్ఞప్తికి తెప్పించే ప్రయత్నం చేశాడు.‘‘ఏ సాయిలు? పెద్ది సాయిలా?’’ సృజన్‌ను పరీక్షగా చూస్తూ అన్నాడు ఆ పెద్ద మనిషి. ‘‘ఆ... అవును సర్. పెద్ది సాయిలు కొడుకునే..’’ వినమ్రంగా చెప్పాడు ‘‘కెనడాలో ఉంటున్నావట కదా..?’’ పెద్ద మనిషి.ఎండ మండిపోతోంది. అలేఖ్యకు చిరాగ్గా ఉంది. ‘‘సృజన్...’’ పిలిచింది. ఆమె వైపు తిరిగి ‘‘ఇటు రా’’ అన్నట్టు సైగ చేసి.. ‘‘అవును సర్.. కెనడాలో ఉంటున్నాను. ఆరేళ్లవుతోంది’’ అన్నాడు. ఈలోపే అలేఖ్యవాళ్లను చేరింది. ‘‘సర్.. అలేఖ్య.. నా భార్య’’ అంటూ ఆమెను పరిచయం చేశాడు. ‘‘నమస్తే’’ చెప్పింది అలేఖ్య ముభావంగానే. ‘‘నమస్తే బేటా..’’ వృద్ధుడు. ‘‘ఓకే..’’ అని చిన్నగా ఆమెతో చెప్పి.. ‘‘సర్.. ఎండలో ఇలా నిలబడ్డారు..’’ అడిగాడు సృజన్. ‘‘బంధువులదేదో పంచాయితీ ఉంటే.. రామాయంపేట్ వచ్చినా.. ఇప్పుడు ఇక్కడి నుంచి సదాశివ్నగర్వెళ్లాలే.చుట్టపాయన దింపిండు ఇక్కడ బస్దొరుకుతదని. ఒక్క బస్ ఆప్తలేరు బాబూ’’ అన్నాడు నీరసంగా వృద్ధుడు.‘‘రండి.. సర్.. మేం నిజామాబాద్ పోతున్నాం. దార్లోనే కదా.. సదాశివ్ నగర్లో దింపుతాం’’ అన్నాడు సృజన్. ‘‘మీకు ఇబ్బందేం లేదు కదా..’’ అన్నాడు. ‘‘అయ్యో.. ఏం లేదు సర్ రండి’’ అంటూ అతని బ్యాగ్ భుజాన వేసుకొని నడిపించుకుంటూ కారు దగ్గరకు తీసుకొచ్చాడు సృజన్. వెనకాలే అలేఖ్య. అయిష్టంగా. సృజన్ ఏం చెప్పబోతున్నాడో అర్థమై ముందు సీట్లో కూర్చుంది. వెనక సీట్లో ఆ వృద్ధుడు, సృజన్ కూర్చున్నారు. కారు స్టార్ట్ అయింది. సృజన్ బాల్య జ్ఞాపకాల వాక్ప్రవాహమూ మొదలైంది. ‘‘సర్.. మీరు అప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉండేవారు?! మీ వల్లే మా జనరేషన్ అంతా అవేర్ అయింది’’ అని ఆ వృద్ధుడితో అని వెంటనే ముందు సీట్లో ఉన్న అలేఖ్య భుజం మీద తడుతూ ‘‘అలేఖ్యా.. నీకుతెల్సా.. మాయలు, మంత్రాలు, చేతబడులు లేవని అవన్నీ మ్యాజిక్ ట్రిక్స్ అని మా ఊళ్లో వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సర్.. ఎవ్రీ సండే పంచాయితీ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ షో చేసేవారు’’ అంటూ ఉత్సాహంగా చెప్తున్నాడు సృజన్. మొహమాటానికి నవ్వుతూ వింటోంది అలేఖ్య. సృజన్ తనకు పరిచయమైన నాలుగేళ్లలో ఈ విషయాలను లక్షాతొంభైసార్లు విన్నది. ఇప్పుడు లక్షాతొంభై ఒకటవ సారి వింటోంది. కాకపోతే సృజన్ ఎడ్మైర్ చేసే వ్యక్తి సమక్షంలో. తన భర్త ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నాడంటే.. ఆ సర్ గురించి తనకు ఎన్నోమార్లు చెప్పిన విషయాన్ని ఇప్పుడు పరిచయంలో యాది మరిచిపోయేంతగా. సృజన్ మళ్లీ ఆ పెద్ద మనిషి వైపు తిరిగి.. ‘‘సర్.. మీకు గుర్తుందా? ఊర్లో సన్న మల్లేశం వాళ్ల అమ్మకు దయ్యం పట్టిందని అందరూ అంటే.. దయ్యాల్లేవ్.. భూతాల్లేవ్... కావాలంటే చూడండి.. నేను ఈ రాత్రికి శ్మశానంలో పడుకుంటా.. అని చాలెంజ్ చేసి మరీ మీరు ఆ రాత్రి శ్మశానంలో పడుకున్నారు. ఊరు ఊరంతా భయపడ్డది.. రాత్రికిరాత్రే మీకు ఏదో అయిపోతుందని. తెల్లవారి మీరు ఊళ్లోకి వచ్చి పంచాయితీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెడితే కూడా భయపడి ఎవ్వరూ రాలే. తర్వాత మీరే అందరి ఇళ్లకు పోయి.. దయ్యాల్లేవ్ ఏమి లేవు. రాత్రి నేను శ్మశానంలో నిక్షేపంగా పడుకొని వచ్చా.. ఆరోగ్యంగా ఉన్నా’’అని చెప్పారు... గుర్తుందా సర్!! సర్.. నిజంగా మీరు గ్రేట్. మీరంటే నాకెంత ఇన్సిపిరేషనో.. చెప్పలేను’’ సృజన్ కళ్లల్లో ఆ పెద్దాయన పట్ల ఆరాధన.. మాటల్లో గౌరవం పొంగిపొర్లుతున్నాయి. ఇదంతా ఆ పెద్దాయనకూ ఇబ్బందిగానే ఉంది. అందుకే సృజన్ వాగ్ధాటికి అడ్డుకట్ట వేస్తూ.. ‘‘ఇప్పుడు నా గురించి ఎందుకులే కానీ.. నీ గురించి చెప్పు సృజన్. కెనడాలో ఏం చేస్తున్నావ్?’’ అడిగాడు.‘‘రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాను.. సర్.. నాకు సైన్స్ మీద ఇష్టం పెరగడానిక్కూడా మీరే కారణం.. ’’ మళ్లీ అభిమానం కురిపించబోయాడు.‘‘సరే..సరే గానీ.. పెళ్లెప్పుడు అయింది? చాలా రోజుల తర్వాత ఇండియా వస్తున్నట్టున్నావ్?’’ పెద్దాయన.‘‘అవున్సార్. కెనడా వెళ్లినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైమ్ రావడం. సర్.. నాది లవ్‌మ్యారేజ్. పెళ్లై వన్ ఇయర్ అవుతోంది. పేరెంట్స్ ఒప్పుకోక.. ఇంటికి రాలేదు. ఇప్పుడిప్పుడే మాటలు కలిశాయి. అందుకే అమ్మవాళ్లను కలవడానికి వస్తున్నాం..’’ అన్నాడు. అలేఖ్య వెనక్కి తిరిగి ఆ పెద్దాయనను చూసి మర్యాదపూర్వకంగా నవ్వింది. ‘‘బాగుంది సృజన్.. మీ జంట.. నా ఆశీర్వాదాలు..’’ అన్నాడు ఆ పెద్దాయన సృజన్ భుజమ్మీద చేయి వేస్తూ. ‘‘సృజన్.. సదాశివనగర్ బోర్డ్ ...’’ మాటల్లో పడి అసలు విషయం మరిచిపోయిన భర్తకు గుర్తుచేసింది ఆ బోర్డ్‌ను చూపిస్తూ. ‘‘ఆ.. కొంచెం.. ముందుకు పోయాక ఆపయ్యా...’’ డ్రైవర్‌కు చెప్పాడు పెద్దాయన. ‘‘అయ్యో.. రోడ్డు మీదెందుకు సర్.. ఎక్కడికి వెళ్లాలో చెప్తే అక్కడే దింపేస్తాం..’’ అన్నాడు సృజన్. ‘‘పర్లేదు.. ఇక్కడి నుంచి దగ్గరేనడుస్తూ వెళ్లిపోతా’’ నిశ్చయంగా చెప్పాడు తర్వాత వాదనకు తావివ్వకుండా పెద్ద మనిషి. మాటల్లో గమ్యం రానే వచ్చింది. పెద్ద మనిషి దిగాడు. సెండాఫ్ ఇవ్వడానికి సృజన్, అలేఖ్యా కూడా దిగారు.ఆయన వెనుతిరగగానే ఇద్దరూ వెనక సీట్లో సర్దుకున్నారు. కారు దూసుకెళ్లింది. అలేఖ్యను ఆప్యాయంగానే ఆహ్వానించారు సృజన్ కుటుంబ సభ్యులు. స్నానాలు.. భోజనాలు అన్నీ అయ్యాయి. కెనడా నుంచి తెచ్చిన కానుకలు ఒకొక్కటే ఫ్యామిలీ మెంబర్స్‌కు ఇస్తున్నారు అలేఖ్య, సృజన్‌లు. వాటిల్లో అందమైన ఓ చేతి కర్ర కూడా ఉంది. అది తీస్తుండగా.. సృజన్ తండ్రి అన్నాడు.. ‘‘ఒరేయ్.. నేనింకా అంత ముసలాణ్ణి కాలేదురా.. చేతికర్ర ఊతం పట్టుకోడానికి?’’ అని. ‘‘అయ్యో.. నాన్నా.. ఇది మీకోసం కాదు. శంకర్ సర్ కోసం తెచ్చా!’’ అన్నాడు సృజన్. ‘‘ఏదీ.. సైన్స్ శంకర్ సర్ ఆ...ఆ..’’ సందేహం నివృత్తి చేసుకోవడానికి అడిగాడు సృజన్ తండ్రి. ‘‘అవున్నాన్నా.. మాకు రామాయంపేట్ దగ్గర కనిపిస్తే.. మేమే కార్లో తీసుకొచ్చాం.. సదాశివనగర్ దాకా. ఏదో పనుందని అక్కడ దిగిపోయిండు..’’ అన్నాడు సృజన్ ఆ కర్రను అటూ ఇటూ తిప్పిఅభిమానంగాచూసుకుంటూ.ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ‘‘ఏ శంకర్ సర్? శ్మశానంలో పడుకునే శంకర్ సర్ గురించే కదా నువ్ చెప్తుంది?’’ సృజన్ తండ్రి విస్మయంగా. ‘అవున్నాన్నా.. ఎందుకట్ల అడుగుతున్నారు?’’ వాళ్ల తీరు వింతంగా అనిపించింది సృజన్‌కు. ‘‘ఒరేయ్.. ఆయన చనిపోయి రెండేళ్లవుతోంది.. ఎవర్ని చూసి ఎవరు అనుకున్నావో..?’’ సృజన్ వాళ్లమ్మ. ఆ మాటకు సృజన్ చేతిలోంచి కర్రజారి కిందపడింది. చేష్టలుడిగి చూస్తోందిఅలేఖ్య భయంగా! - సరస్వతి రమ -
వివాదాస్పదంగా చొప్పదండి మునిసిపల్ కమిషన్ తీరు
-
పంచభూతాధికారి
ఎంతో ఎత్తులో ఉన్న నక్షత్రాలని లెక్కించడం ఎంత కష్టమో.. ఎంతో దగ్గరగానూ ఎదురుగానూ ఉన్నా కూడా ఓ చెరువులోని నీటి బిందువుల్ని ఎలా లెక్కించడం కష్టమో.. అలాగే తనకి తానే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని చేస్తున్నా ఓ రోజులో ఎన్నిమార్లు గాలిని పీల్చి విడిచామో చెప్పడం ఎంత కష్టమో.. అదే తీరుగా సాయి గురించి ఎన్ని విశేషాలనీ లీలలనీ విన్నా ఆయన తత్త్వమేమిటో వాటి అంతరార్థమేమిటో సంపూర్ణంగా చెప్పగలగడం అసాధ్యం. పరిచయం ఏ మాత్రమూ లేనివాణ్ణి పిలిచి మరీ దక్షిణ అడుగుతాడు. దక్షిణ ఇయ్యబోయిన పరిచయస్తుడ్ని ఇయ్యవద్దంటాడు. ఎవరైనా తమంత తాము దక్షిణనీయబోతే ఇంతమాత్రమే చాలంటాడు. మరికొందరు దక్షిణనిస్తూంటే ‘ఇంతకాదు. అంత ఇస్తావా? ఇయ్యగలవా?’ అంటాడు. తీరా దక్షిణని ఇచ్చాక దాన్ని వాళ్లకీ పంచేస్తాడు పోనీ! అందరికీ సమానంగానా? అంటే అదీ కాదు. ఒకరికి కొంత, మరొకరికి ఇంకోకొంత, ఆ వేరొకరికి ఊహించనంత. ఇదేమి దక్షిణ విధానమో? పోనీ! ప్రవర్తనని చూద్దామా? ఒకసారి చెప్పలేనంత ప్రేమతో ఓ తండ్రి లాలించినట్లుంటాడు. ఇంకొకసారి రాళ్లతో కొట్టడానికి పరుగెత్తివస్తూ రాతిని విసురుతాడు. ఆకాశం దద్దరిల్లేలా అరుస్తాడు. ఇంకొకసారి కంటితడి పెట్టుకుంటాడు. ఇదేమి ప్రవర్తన విధానమో? ఒకర్ని కావాలని తన వద్దకి రావలసిందిగా కబుర్లు పంపుతూనే ఉంటాడు. కావాలని దర్శిద్దామని షిర్డీకి వచ్చిన కొందరికి దర్శనమే ఈయడు. పైగా ‘తన వద్దకి అతడ్ని తేవద్దు. అతనిని రానీయవద్దు’ అంటాడు. ఇదేమి దర్శన అనుగ్రహ విధానమో?ఒకరోజున అసలు భిక్షానికే వెళ్లాడు. మరొకరోజున 4 నుంచి 8 మార్లు భిక్షాటన చేస్తాడు. ఆ తెచ్చిన రొట్టెలని కుక్కలకీ ఇతర జంతువులకీ ఇస్తాడు. ‘మా ఇంటికి ఆతి«థ్యానికి రండి’ అని పిలిస్తే సరేనంటాడు. ఏ పశువూ లేదా జంతువూ లేదా కీటకరూపంలో తిని– భోజనం బాగుందని వంటకం వివరాలతో సహా చెప్తాడు. ఇదేమి భిక్షాటన విధానమో? మరి ఎందుకు కొలవాలి? ఇంత అయోమయంగానూ లోఅర్థం తెలియకుండానూ ఉన్న సాయి చరిత్రని ఎందుకు తెలుసుకోవాలి? సంపూర్ణ ఆనందాన్ని పొందకుండానూ పొందవీల్లేని స్థితిలోనూ, ఈ సాయి చరిత్ర ఉన్నప్పుడు ‘ఆయన్ని ఎందుకు కొలవాలి?’ అనే సందేహం ఎందరికో కలుగుతుంది కదా! ఏ భయంతోనో వ్యతిరేకించినా, దుర్విమర్శ చేసినా, ఏమైనా కీడు జరుగుతుందేమో అనే ఆందోళనతోనూ సాయి చరిత్ర పారాయణం చేయడం ఎందుకు? అనే ఆలోచన కూడా కలుగుతుంది ఎవరికైనా. సమాధానం ఒక్కటే. ఇలా పైన అనుకున్న తీరుగా ఊహించుకున్నది నిజమే అయ్యుంటే ప్రతి సంవత్సరంలోని రోజుకీ మరో రోజుకీ భక్తజనుల సంఖ్య ఎందుకు పెరిగిపోతోంది? సాయిదేవాలయాల సంఖ్య కూడా ఎందుకు ఎదిగిపోతోంది? ప్రతిసాయి భక్తుడూ అనుకోకుండా మరొకర్ని సాయి భక్తునిగా చేసెయ్యగలుగుతున్నాడు? డబ్బిచ్చి.. ప్రలోభపెట్టి కాకుండా వీరు సాయి గురించి చెప్పగానే అవతలివారు కూడా తాను మాత్రమే కాకుండా సకుటుంబంగా షిర్డీకి ఎందుకు వెళ్లొస్తున్నారు?కారణం ఒక్కటే! ఒక కత్తిని గరుకునేలమీద ఎంత రాస్తే మరెంతగా రాస్తే (నూరితే) అంతగా అది పదునెక్కిపోతుందో అలా అర్థం కాలేదనుకుంటున్న సాయి చరిత్రని ఎన్నిమార్లు చదువుతూ ఎన్నిమార్లు వింటూ ఎన్నిమార్లు సాయిదర్శనాన్ని చేస్తూ ఉంటే అంతగానూ సాయికి దగ్గరైపోతూ ఎవరి అనుభవానికి వాళ్లకి పైననుకున్న అసందర్భ ప్రవర్తనలన్నింటికీ లో–విశేషాలు వాళ్ల వాళ్ల స్థాయికి అర్థమైపోతూ ఉంటాయి. అవన్నీ అసందర్భాలు అయోమయాలూ అనిపించవు.పంచదార తియ్యగా ఉంటుందని చెప్తాం. మరి బెల్లం కూడా అదే తీపిదనంతో ఉంటుందా? అంటే కొద్ది తేడా ఉందని చెప్తాం. వివరించవలసిందని చెప్తే.. కుదరడం లేదని చెప్పేస్తాం. ఇదీ అంతే! ఎవరి అనుభవం వారిదే! నదికి వెళ్లేటప్పుడు మనం ఎంత పరిమాణం గల జలపాత్రని తీసుకెడితే అన్ని నీళ్లని మాత్రమే తెచ్చుకోగలిగినట్లుగా, ఎవరెంత భక్తితో సాయిని సేవిస్తారో వారికి అంతలోతుగానూ లో–అర్థం స్పష్టంగా తెలిసి, వారు మరింత దగ్గరైపోతారు సాయికి.ఒక్కమాటలో చెప్పాలంటే నేడు మహాభక్తులైన అందరూ కూడా సాయిని నమ్మనివారూ. ఎవరి బలవంతం మీదనో మొదట్లో షిర్డీకి వచ్చినవాళ్లేనూ అనేది నిర్వివాదాంశం.‘ఇదంతా ఎందుకు? అంటే ‘సాయి పంచభూతాలకీ అధికారి ఎలా అవుతాడు? కాగలడు?’ అని వాదం చెయ్య బుద్ధి వేస్తుంది అందరికీ. అయితే ‘కొన్ని స్పష్టమైన స్వయమైన అనుభవాలని పొందాక అది నిజమే సుమా!’ అని అనిపించకమానదని తెలియజెప్పడానికీ! కాబట్టి సాయి చరిత్రని చదవండి. చదువుతూ ఉండండి. చదువుతూనే ఉండండి! ఈ నేపథ్యంలో ఆయన పంచభూతాల మీదా ఎలా అధికారం కలవాడయ్యడో చూద్దాం! పృథ్వి మీద అధికారం ‘నెలకి ఇంత!’ అని ఈ తీరుగా జీతాన్ని నిర్ణయించిన పక్షంలో ప్రతి సేవకుడూ యజమానికి అనుగుణంగా పనిచేస్తాడనేది అనుభవంలో కనిపించే అంశం. అలా సేవకుడొకడు తనకంటూ వచ్చినప్పుడూ పని చేస్తున్నప్పుడూ ఈ జీతాన్నిచ్చే వ్యక్తీ.. పని చేయించుకుంటున్న వ్యక్తీ ఓ అధికారి ఔతాడు. ఇది నిజం కదా!మరి సాయి ‘పంచభూతాలకీ అధికారి’ అని చెప్పుకోబోతున్నాం కదా! ఈ పంచభూతాలనీ ‘ఈయన ఏ తీరుగా పోషిస్తున్నాడని ఆ పంచభూతాలూ ఈయన కింద సేవకులుగా ఉండాలి?’ అనేది గట్టి సంశయం కదా! ఇలా ఆలోచించినప్పుడే యదార్థం తెలుస్తుంది. తత్త్వం అర్థమవుతుంది కూడా! ముందుగా పృథ్వి(భూమి)ని ఎలా తనకి సేవ చేయించుకుని ఆ పృథ్వికి అధికారి అయ్యాడో, భూమికి స్వాధీనం(స్వ+అధీనం – తన చెప్పుచేతల్లో ఉంచుకోవడం) చేసుకున్నాడో తెలుసుకుని ఎలా అది సాధ్యమయిందో ఆ తర్వాత తెలుసుకుందాం. పచ్చికుండల్లో నీళ్లు సాయి ఒక ప్రత్యేకమైన తోటని(వెండీ అని దాని పేరు) ఎంతో ఇష్టంగా పెంచుతూండేవాడు. ప్రతిరోజూ స్వయంగా తానే పచ్చికుండలలో నీళ్లు నింపుకుని ఆ నీటితో ఈ తోటలోని మొక్కలకి నీళ్లని పోస్తూండేవాడు. ఇదేదో అభూతకల్పనలతో నిండిన చరిత్ర కాదు. అందరూ ప్రతినిత్యం గమనించిన కళ్లకి కనిపించిన యదార్థం. కుండ అనేదాన్ని మట్టితో చేస్తారు. ఆ పచ్చికుండని ఆములో పెట్టి బాగా కాల్చిన తర్వాత అది గట్టిపడి కొద్ది బరువైన పదార్థాన్ని మోయగల స్థితికి వస్తుంది. అదే మరి పచ్చికుండ అయితే దానిలో నీళ్లు నింపి పైకి ఎత్తబోయేసరికే ఆ నీటి బరువుకి విచ్చిపోతుంది. పైగా సాయి ఆ కుండని తన భుజానికెత్తుకుని రెండు మూడు మార్లు నీళ్లు నింపి మొక్కలని తడిపి తిరిగి వస్తూండేవాడు. ఇది ఎక్కడైనా సాధ్యమా?ఆ పృథ్వి (కుండ ఏ మట్టితో చేయబడిందో ఆ పృథ్వి) తనకి వశమై ఉంది కాబట్టే కుండ విచ్చిపోకుండానూ తోట ఎండిపోకుండా నీరు పోసేందుకు సాధనంగానూ ఉపయోగపడింది. సాయికి తెలియకుండా.. సాయిని శ్రమకి గురి చేయరాదనే ఉద్దేశంతో ఎందరు ప్రయత్నించినా అలా పచ్చికుండతో నీళ్లు పట్టడం భుజానికెత్తుకోవడం తోటవరకూ వెళ్లగలగడం మొక్కలకి పోయడమనేది సాధ్యం కాలేదు ఏ ఒక్కరికీ. అంటే సాయికొక్కనికే పృథ్వి సహకరించిందని కదా అర్థం! ఎందుకు సహకరించిందో తెలుసుకునే ముందు మరో వృత్తాంతాన్ని కూడా చూద్దాం! నేలమాళిగలో 12 ఏళ్లు సాయి తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. అయితే అకస్మాత్తుగా సాయి 16 ఏండ్ల యువకునిగా ఓ వేపచెట్టు కింద కనిపించాడు. ఎప్పుడూ తపఃసమాధిలో ఉంటూండటం, అల్లాహ్ హో మాలిక్! అంటూ అనేక పర్యయాలు అంటూండటం, ఏ సౌకర్యాన్నీ కావాలని ఎవరినీ కోరకపోవడం పైగా ఎవరైనా వచ్చి తమ అనారోగ్యాన్ని వివరించి చెప్పుకుంటే కొంతదూరం వెళ్లి ఏదో చెట్టు ఆకు పసరు తెచ్చి ఇయ్యడం, అవతలివారిని ఆరోగ్యవంతుల్ని చేయడం... ఆయనలోని గొప్పదనం అర్థమవుతూ ఎవరింటికి తీసుకుపోదలిచి ప్రార్థించినా వెళ్లకపోవడమనే ఇన్నింటినీ గమనించిన జనులంతా ఆయన్ని గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఖండోబా దేవాలయంలో ఒకనికి పూనకం వస్తే ఈ బాలుడ్ని గురించి అడిగారు అక్కడి వారంతా. ఆ పూనకం వచ్చిన వ్యక్తి ఓ గునపాన్ని (గడ్డపార) తెమ్మనీ ఓ స్థలాన్ని చూపించి అక్కడ తవ్వవలసిందనీ చెప్పాడు. తవ్వి చూస్తే ఓ పెద్ద రాయి కనిపించింది. దాన్ని తొలిగించి చూడవలసిందన్నాడు. అలా చూస్తే ఓ పెద్ద భూగృహం, ఇంకా వెలుగుతూనే ఉన్న 4 దీపాలు, కర్ర బల్లలూ, జపమాలలూ, జపం చేసుకునేందుకు వీలైన ఓ చిన్న వేదిక వంటి ఎత్తు స్థలం కనిపించింది. ఇది అందరూ చూస్తూండగా బయటపడిన యదార్థం ఈ సొరంగంలోనే ఆ బాలుడు ఒకటి కాదు రెండు కాదు 12 ఏండ్ల పాటు తపస్సు చేసి సిద్ధుడయ్యాడని చెప్పాడు పూనకం వచ్చిన వ్యక్తి. ఇప్పుడాలోచిద్దాం! పృథ్వికి అంటే నేలకి ప్రతి వస్తువునీ తనలో కప్పేసుకునే గుణం ఉంటుంది. అందుకే ఏ వస్తువునైనా కొన్నినాళ్ల పాటు నేలమీదనే విడిచేస్తే క్రమంగా కప్పబడిపోతుంది. మరి ఇది పృథ్వి కుండే సహజలక్షణమవుతుంటే ఎలా ఆ భూమిసొరంగంలో ఒకటి కాదు రెండు కాదు అది కూడా నెలలు కాదు సంవత్సరాలు. ఆ సంవత్సరాలు కూడా ఒకటి కాదు రెండు కాదు 12 సంవత్సరాల పాటు ఆ సొరంగంలో ఉండిపోవడం సాయికి ఎలా సాధ్యమయింది? పోనీ ఏ సొరంగానికి ఏదైనా ఓ మార్గముందేమో అనుకునే వీలులేదు. దానికి కారణం ఆ పూనకం వచ్చిన వ్యక్తి తాను మైమరచిన స్థితిలో ఓ ప్రదేశాన్ని చూసి తవ్వవలసిందన్నప్పుడు గదా తవ్వి చూసి ఈ సొరంగ విషయాన్ని అర్థం చేసుకోగలిగారు అందరూ! కాబట్టి ఆ సొరంగమనేది ఎటూ ప్రవేశంలేని ఎవరూ ప్రవేశించలేని నేలమాళిగే తప్ప రాకపోకలకి వీలైనది కానేకాదు గదా! ఇక తగినంత గాలి లేని పక్షంలో ఏ దీపం వెలుగదనేది మనకి తెలిసిన అనుభవ సత్యమవుతూంటే అకస్మాత్తుగా హఠాత్తుగా తవ్వి చూస్తే అక్కడ నాలుగు దీపాలు వెలుగూ కనిపించడమా? ఇక భూమికి ఉండే మరో గుణం. ఎంతటి వస్తువునైనా నల్లబడిపోయేలా చేయడం. దానికి కారణం గాలి ఏ మాత్రమూ తగలని కారణంగా వేడిమి పుట్టడం. భూమిలో నల్లని బొగ్గు ఇంకా నల్లబడిన రాక్షసిబొగ్గు ఇంకా నల్లబడి లోహాలూ... ఇలా ఇన్ని లభించడానికి కారణం విపరీతమైన వేడిమి మాత్రమే. పెద్ద బండరాయి కప్పబడిన భూమి సొరంగంలో అంతకాలం ఉండడమనేది సాధ్యమా? కొన్ని గంటలయ్యేసరికి నీళ్లు మరికొన్ని గంటలయ్యేసరికి తిండీ ఇంకాకొన్ని గంటలయ్యేసరికి తగినంత గాలీ వెలుతురూ ఆవశ్యకమా? కాదా? ఎలా ఉండగలిగాడు సాయి? అదికూడా 12 ఏళ్ల పాటు. పోనీ! ఇదంతా అసత్యం ఓ కట్టుకథ అంటూ కొట్టిపారేద్దామా? అంటే అందరి సమక్షంలో గదా ఆ భూమి సొరంగం తెరవబడింది. ‘తత్ర గంధవతీ పృథ్వి’ అని భూమి లక్షణం. భూమికి వాసన ఉండటమనేది సహజ లక్షణమని దీనర్థం. ఇది నిజమని నిరూపిస్తూ వాన చినుకు పడగానే ఓ చక్కని వాసన నేల నుండి మనకి వస్తుంది గదా! ఆ వాసనే భూమి నుండి మొక్కని రప్పించగల శక్తి ఉన్న పదార్థం కదా! మరి ఇన్ని సంవత్సరాల పాటు మూసివేయబడ్డ నేలలో ఏ విధమైన దుర్వాసనా ఎందుకు రాలేదు? మనమే మన ఇంటిని ఓ వారం పాటు పూర్తిగా గాలి చొరకుండా మూసి ఉంచితే వచ్చే ఓ తీరు మాగుడు వాసన 12 ఏళ్ల పాటు గాలీ వెలుతురూ లేని భూ సొరంగం నుండి ఎందుకు రాలేదు? ఇలా అనేక ఆశ్చర్యకర అంశాలు మనకి కనిపిస్తాయి. సరే ఇంతకీ సాయికి పృ«థ్వి ఎందుకు సహకరించి పైతీరు ఇబ్బందులు లేకుండా ఆయనని అధికారిగా భావించి ఎందుకు తన సహజధర్మం నుండి పక్కకి వచ్చి సాయికి అధీనురాలు అయింది! లేదా కావలసివచ్చింది? గమనిద్దాం! ఇదీ కారణం! భూమి అని మనందరం పిలుస్తాం కానీ, సంప్రదాయం హిందూ ధార్మిక వ్యవస్థా ఆ భూమిని భూమాత అని, పుడమి తల్లి అని పిలుస్తుంది. తల్లి ఎలా తన సంతానానికి సకాలంలో అన్నాన్ని పెట్టి రక్షిస్తుందో, పెద్దగా వరదలోస్తే ఎలా సముద్రం వైపు పరుగెత్తేలా చేస్తూ కొంత నీటిని తానే స్వయంగా తాగేసి తన మీద ఉన్న ప్రాణులకీ అప్రాణులకీ కూడా నష్టాన్ని కలిగించకుండా చూస్తుందో అంతటి ఉత్తమురాలు భూమి(భూదేవి). అంతే కాదు. పెద్దపెద్ద మానులున్న వృక్షాల భారాన్ని భరిస్తుంది. అసలు వృక్షాలు అంతంత పెద్దగా ఎదగడానికి తాను నీరు తాగి ఆ నీటిని ఒకప్పటి ఆ మొక్కలకి అందించి ఆ మొక్కల్ని చెట్లుగానూ ఆ చెట్లని పెద్దపెద్ద వృక్షాలుగానూ ఎదిగేలా చేసింది కూడా ఈ పృథ్వియే. ఇలా చేసే లక్షణాలున్న పృథ్వి పనిని ఎవరైనా గానీ చేస్తే ఆ పృథ్వి తాను చేస్తున్న పనినే చేస్తూ తనకి పరోక్షంగా సహకరిస్తున్నాడు ఫలానా వ్యక్తి అనే భావంతో తప్పక ఆ పృథ్వి. ఆ వ్యక్తికి సహకరిస్తుంది. లోకమంతా ‘ఈ వ్యక్తి అధీనంలోనే భూమి ఉంది’ అనేంత అభిప్రాయాన్ని కలిగిస్తుంది జనులకి. ఇంతకీ సాయి ఆ పృథ్వి చేసిన ఏ పనుల్నీ చేశాడట? భూమిమీద ఏ 84 లక్షల జీవరాశులున్నాయో ఆ జీవరాశులన్నింటికీ ఆహారాన్ని అందేలా చేయాలనుకుంటూ కేవలం అనుకోవడమే కాకుండా షిర్డీకి వచ్చిన వ్యక్తులకి అన్నాన్నీ క్రిమికీటకాలకి తీపి పదార్థాలనీ పక్షులూ మొదలైన వాటికి తిండి గింజలనీ భూమి మీద మొక్కలకి నీటినీ, కుక్కలూ మొదలైన జంతువులకి తాను భిక్షాటన చేసి తెచ్చుకున్న ఆహారపదార్థాలనీ చేపలూ మొదలైన వాటికి వాటి ఆహారాన్నీ ఇలా భూమి ఏ తీరుగా అన్నాన్నీ అందిస్తూ ఉంటుందో ఆ పనినే సాయి చేశాడు. చేస్తూ ఉన్నాడు ప్రతిరోజూ. ఆ కారణంగా భూమి పరమానందాన్ని పొందింది. శ్రీమద్రామాయణంలో జటాయువు రెక్కల్ని రావణుడు నరికేస్తే... ఇంకా దాన్ని బాగా హింసిస్తే చావుబతుకుల స్థితికొచ్చేసింది ఆ పక్షి. ఆ సందర్భంలో సీతమ్మ జటాయువుని కౌగిలించుకుందంటాడు వాల్మీకి.సీతమ్మ భూమికూతురు. భూమి నుండి ఓషధులు మొక్కల రూపంలో పుడతాయి. ఆ మాటకొస్తే మన్ను పుట్టమన్ను ఇసుకతో కూడిన మన్ను నీటి అడుగున ఉండే బురద ఒండ్రుమన్ను... ఇవి కూడా ఔషధాలే. సీతమ్మ భూమికి కూతురై ఔషధి లాంటిది కాబట్టే ఆమె కౌగిలించుకున్న కారణంగా అంతగా గాయపడి చావుబతుకుల్లో ఉన్న జటాయువు కూడా రామలక్ష్మణులొచ్చేంతవరకూ జీవించి సీతాపహరణ విషయాన్ని చెప్పగలిగాడు. సాయి కూడా భూమి నుంచి ఏ మొక్క ఏ వ్యాధికి ఔషధమో గమనించి భూదేవి చేస్తున్న పనిని తాను కూడా నిస్వార్థంగా చేస్తున్నప్పుడు భూదేవి సాయికి ఎందుకు సహకరించదు? స్వాధీనురాలు కాకుండా ఉంటుంది? భూదేవి తట్టుకోలేనిది పాపుల భారాన్ని. అందుకే శ్రీహరిని వేడుకుంటూ పాపభారాన్ని తగ్గించవలసిందని ప్రార్థిస్తుంది. సాయి కూడా కొందర్ని అసహ్యించుకుంటూ కొందరికి జ్ఞానబోధ చేస్తూ కొందరికి దర్శనాన్నే ఈయక... ఎవరి తప్పుని వారు వారికి వారు తెలుసుకునేలా చేస్తూ పాపి అయినవారిలోని పాపగుణాన్ని ఆలోచనల్నీ తొలగిస్తూ ఉండటంతో భూదేవి ఆయనకి స్వాధీనురాలయింది. దేవతలు ఎప్పుడూ సజాతీయులు(తమ వంటి గుణలే ఉన్నవారు) అయినవాళ్లకి సహకరిస్తూ ఉంటారు తప్ప హోదా ప్రధానమని అనుకోరు.ఈ క్రమంలో పంచభూతాల్లో రెండు మూడు నాలుగూ ఐదూ అయిన నీరు తేజస్సు వాయువూ ఆకాశమూ కూడా ఎందుకు సాయికి అధీనులైపోయాయో గమనించుకుందాం! – సశేషం - డా. మైలవరపు శ్రీనివాసరావు -
ముక్కుసూటిగా వెళుతున్నారా?
ముక్కుసూటిగా వెళ్లేవాడికి అన్నీ ఆటంకాలే ఎదురవుతాయి. లౌక్యం తెలుసుకుని అందరితో కలివిడిగా ఉంటే నలుగురు మెచ్చుతారు. అలా కాకుండా ‘ఎస్ నేనంటే నేనే’ అనుకుంటే ‘అబ్బ ఛ’ అని పక్కవారంటారు. నేను చెప్పిందే అందరూ వినాలంటే ‘అది జరగదులే’ అంటారు. ఈ ఆటిట్యూడ్ ఉన్నవారికి దాదాపుగా ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మీరూ ముక్కుసూటిగా వెళుతున్నారా? లేక ఒక పని చేసేముందు ఆలోచిస్తారా? ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ లేని తంటాలు తెచ్చుకుంటుంటారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. 1. మీ ప్రవర్తన మార్చుకోమని తల్లిదండ్రులతో పాటు శ్రేయోభిలాషులు చెప్తుంటారు. ఆ సమయంలో సరే అని చెప్పినా తర్వాత మీ పంథా ఎప్పటిలానే ఉంటుంది. ఎ. అవును బి. కాదు 2. మీకు మీరే గొప్పతనాన్ని ఆపాదించుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. చిన్నతనం నుంచి ఎవరైనా పని చెప్తే మీకు నచ్చదు. సలహాలను పట్టించుకోరు. ముక్కుసూటిగా వెళ్లటం మీకు అలవాటు. ఎ. అవును బి. కాదు 4. మీ సూటితనం వల్ల మీ పనులు ఎక్కడివక్కడే ఆగిపోతుంటాయి. దీనివల్ల అసహనం, కోపం మీ వెంటే ఉంటుంది. ఎ. అవును బి. కాదు 5. వెనకా ముందు ఆలోచించకుండా మాట్లాడటం వల్ల మీరంటే ఎవరికీ ఇష్టం ఉండదు. ఎ. అవును బి. కాదు 6. మీ మాటలు, చేష్టలతో ఇతరులను నొప్పిస్తూ ఉంటారు. ఇతరుల భావాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎ. అవును బి. కాదు 7. బొత్తిగా మీకు లౌక్యం తెలియదు. దీనివల్ల మీ అభివృద్ధి ముందుకు జరగదు. ప్రమోషన్లు దాదాపు మీకు దూరంగా ఉంటాయి. ఎ. అవును బి. కాదు 8. మీ ప్రవర్తన వల్ల మీ కుటుంబ సభ్యులు కూడ ఇబ్బందుల పాలవుతుంటారు. మీతో ప్రేమగా ఉండటానికి సంకోచిస్తుంటారు. ఎ. అవును బి. కాదు 9. మీ ఆటిట్యూడ్ వల్ల పొరుగువారితో, సహచరులతో, చివరికి ప్రయాణాలప్పుడు కూడ విభేదాలు, గొడవలు వస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 10. ముక్కుసూటితనం వల్ల మీకు పరిచయాలు చాలా తక్కువగా ఉంటాయి. మిమ్ములను అర్థం చేసుకున్నవారే మీతో ఉంటారు. కొత్తవారు మీకు దాదాపు దగ్గర కారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్‌గా వెళుతుంటారు. దీనివల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరు పెరిగిన వాతావణ పరిస్థితులు కూడా మీ ప్రవర్తనకు కారణం కావచ్చు. ముక్కుసూటితనం ఎప్పటì కైనా ప్రమాదమే. దీనివల్ల కొన్నిసార్లు మీ పక్కవారికి కూడ ప్రమాదం జరగవచ్చు. మీలో ఇలాంటి లక్షణాలుంటే వాటికి వెంటనే ఫుల్స్టాప్ పెట్టండి. పదిమందితో కలివిడిగా ఉండటం నేర్చుకోండి. మీకు ‘బి’ సమాధానాలు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీలో స్ట్రెట్ఫార్వర్డ్ తత్వం లేనట్లే. -
మహిళా ఉద్యోగి కంటతడి
అనంతపురం సిటీ : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలో మహిళా ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులు కొనసాగుతున్నాయి. నిన్న ఐసీడీఎస్ పీడీ వెంకటేశం.. నేడు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా పరిషత్‌లోని ఆడిటింగ్ కార్యాలయంలో సరస్వతి ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 10.20 గంటల సమయంలో కార్యాలయంలోంచి గట్టిగా ఏడుస్తూ బయటకు వచ్చారు. తోటి ఉద్యోగులు, స్థానికులు ఏమని ఆరా తీయగా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి తనపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆమె గోడు వెల్లబోసుకున్నారు. అదే పనిగా అవసరం లేని ఫైళ్లను తెప్పించుకోవడమే కాకుండా పని చేయడం సరిగా రాదంటూ మానసికంగా హింసిస్తున్నారని తెలిపారు. మహిళా ఉద్యోగికి కనీస గౌరవం ఇవ్వాలన్న ఇంగితం లేకుండా తరచూ సూటిపోటి మాటలతో మనసు గాయపరుస్తుండటంతో పరిపాలనా అధికారి (ఏఓ) రామచంద్రారెడ్డి ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందనా లేకపోయిందన్నారు. గురువారం ఉదయం వచ్చీరాగానే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ నోటికొచ్చినట్టు మాట్లాడటంతో తట్టుకోలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. విచారణలో వెటకారం! అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి దురుసు ప్రవర్తన గురించి బాధితురాలు సరస్వతి సాయంత్రం ఏఓ దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురినీ తన ఛాంబర్లోకి పిలిపించుకున్న ఏఓ విచారణలో హుందాగా వ్యవహరించలేదు. వలవలా ఏడుస్తున్న బాధితురాలికి ధైర్యం చెప్పకుండా.. మహిళా ఉద్యోగుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో చివాట్లు పెట్టకుండా.. సమన్వయంతో పని చేసుకుని వెళ్లాలని అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌ను మందలించకుండా.. తన సీటులో వెనక్కు ఆనుకుని.. ‘ఏమ్ జరిగిందీ..’ అంటూ వెటకారంగా విచారణ మొదలు పెట్టారు. తన బాధను అర్థం చేసుకోవడం లేదని భావించిన సరస్వతి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్నట్లు చెప్పడంతో కంగుతిన్న అధికారులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడుతున్న అధికారి వ్యవహారంపై ఇప్పటిదాకా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. -
మీ పిల్లల మధ్య ఘర్షణను (సిబ్లింగ్ రైవలరీ) పరిష్కరించగలరా?
క్యావ్, క్యావ్ మంటూ అప్పుడే పుట్టిన చిన్న బాబు/పాప ఇంట్లో కేరింతలు కొడతారు. ఇంటిల్లిపాదీ సంతోషం, ఇంటి వారసుడొచ్చాడనో, మహాలక్ష్మి వచ్చిందనో... అయితే వీరందరికీ దూరంగా ముఖంపై దిండు పెట్టుకొని/మంచం కింద దూరి చిన్ని బుజ్జాయి కంటే ముందు పుట్టిన పాప/బాబు కంటి నిండా నీళ్లు నింపుకుంటారు. అమ్మ నన్ను పట్టించుకోవటం లేదనీ, మరెవరో వచ్చి అమ్మ ఒడిలో హాయిగా నిద్ర పోతున్నారనీ. క్రమంగా అమ్మ ఒడిలోని పాప/బాబు పెద్దవారవుతారు. వారి మధ్య తల్లిదండ్రుల ప్రేమకోసం పోరాటం మొదలవుతుంది. ఫలితం పిల్లల మధ్య ఘర్షణ. దీనినే ఇంగ్లీష్‌లో సిబ్లింగ్ రైవలరీ అంటారు. తమకు సరైన గుర్తింపు లభించటంలేదని, తమని బాగా చూడటంలేదనే నెగెటివ్ భావన పిల్లల్లో ఇలాంటి ప్రవర్తనకు కారణం అవుతుంది. దీన్ని ఎలా తగ్గించవచ్చో మీకు తెలుసా? మీ పిల్లల మధ్య ఘర్షణ వాతావరణాన్ని మీరు పరిష్కరించగలరా? 1. చంటి పిల్లలను గమనిస్తూనే, పెద్దపిల్లలపై దృష్టి సారిస్తారు. వారిని పట్టించుకోకుండా ఉండరు. ఎ. అవును బి. కాదు 2. పిల్లల అభిరుచులు, సామర్థ్యాలను గుర్తిస్తారు. దీనిద్వారా వారికి దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తారు. వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. ఎ. అవును బి. కాదు 3. పిల్లలందరికోసం ప్రతిరోజూ మీ సమయాన్ని కేటాయిస్తారు. వారి సమస్యలను గుర్తించి, పరిష్కరిస్తారు. ఎ. అవును బి. కాదు 4. కుటుంబమంతా ఒకచోట చేరినప్పుడు పిల్లలు చేసిన మంచి పనులను అభినందిస్తారు. అయితే పొగడ్తలవల్ల వారిమధ్య అసూయ రాకుండా జాగ్రత్తపడతారు. ఎ. అవును బి. కాదు 5. వయసులో పెద్దపిల్లలు చిన్నవారిని బాగా చూసుకోవాలని చెప్తారు, వారిమధ్య సంబంధాన్ని వివరిస్తారు. పిల్లల ఆందోళనను అర్థం చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. పిల్లలను దండించకుండా వారి సమస్యలను వారితో చర్చించటం వల్ల పిల్లల భావోద్వేగాలు అదుపులో ఉంటాయని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 7. పిల్లల పట్ల సానుభూతితో ఉంటారు. వారిపై చూపించే జాలి వారిలో ఉత్సాహాన్ని నింపుతుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 8. పిల్లలందరికీ ఒకే రకమైన ఇంపార్టెన్స్ ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. వారిమధ్య పోలికలు చూపించి, ఆత్మన్యూనతకు గురయ్యేలా చేయరు. ఎ. అవును బి. కాదు 9. పిల్లల మధ్య ప్రేమ, దయ, జాలి లక్షణాలు పెంపొందించి వారిమధ్య మంచి రిలేషన్ ఏర్పడటానికి కృషి చేస్తారు. ఎ. అవును బి. కాదు 10. ఒక్కొక్కరినీ విడివిడిగా ప్రశ్నించి, వారి మధ్య గొడవలకు గల కారణాలు తెలుసుకుని పరిష్కరిస్తారు. ఈ విధంగా వారిమధ్య ఆరోగ్య కరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే పిల్లల మధ్య పోటీతత్వాన్ని, ఘర్షణలను ఎలా నివారించాలో మీకు తెలుసు. పిల్లల మధ్య ఏర్పడే మనస్పర్థలను చక్కగా పరిష్కరించగలరు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే పిల్లల మధ్య తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరించాలో మీకు తెలియదు. వారి మీద కోపగించుకోవటం, దండిం^è టం ద్వారా క్రమశిక్షణలో పెట్టవచ్చని భ్రమ పడుతుంటారు. ఇది చాలా తప్పు. సిబ్లింగ్ రైవలరీ పిల్లల్లో సర్వసాధారణం. దీన్ని పరిష్కరించాలంటే వారిని బాగా అర్థం చేసుకోవాలి. ‘ఎ’ సమాధానాలను సూచనలుగా తీసుకుని పిల్లల మధ్య సఖ్యత ఏర్పరచటానికి కృషి చేయండి. -
మీరు మర్యాద రామన్నేనా?
సంఘ ప్రవర్తనతోనే సరైన గౌరవం సినిమా హాలుకు వెళతాం. సినిమా మొదలవుతుండగానే కాళ్లు ఎత్తి ముందు సీటు మీద పెడతాం. ఆ సీట్లో ఉన్నవాళ్లు చిరాగ్గా వెనక్కు తిరిగి ఏదో ఒక మాట అంటారు. అదా మనం కోరుకునే మర్యాద? ఇంటర్వ్యూకు వెళతాం. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మర్యాద కోసం షేక్ హ్యాండ్‌కు చేయి చాపుతాడు. మనం ఆత్మవిశ్వాసం లేని బిక్క చచ్చినట్టుండే చేతిని అతని చేతిలో పడేస్తాం. లేదా చెమటతో నిండిన చేతిని అతడి చేతిలో పెట్టి మన చెమటని అతనికి పూస్తాం. అతడు ఇబ్బందిగా మనవైపు చూస్తాడు. అదా మనం కోరుకునే మర్యాద? వ్యక్తిగత ప్రవర్తన వేరు. మనం ఒక్కళ్లమే ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలాగైనా ఉండొచ్చు. కాని నలుగురిలో ఉన్నప్పుడు ‘సంఘ ప్రవర్తన’ అవసరం. దీనిని ఇంగ్లిష్‌లో ‘ఎటికెట్’ అంటారు. ఈ ప్రవర్తన లేకపోతే నలుగురిలో మనం అమర్యాదకు లోనవుతాం. నలుగురి దృష్టిలో మనం పలుచన అవుతాం. నలుగురు మనల్ని మర్యాద తెలియనివారనుకుంటారు. ఇటీవలి ఉదంతం బ్యాంకింగ్ రంగంలో భారతదేశంలో నంబర్ వన్‌గా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలనే తన సిబ్బందికి ‘సరిగ్గా వ్యవహరించండి’ అని తాకీదు పంపింది. ‘మీలో ప్రతి ఒక్కరూ ఎస్బీఐకి అంబాసిడరే. మీ ప్రవర్తన, ప్రదర్శన ఎలా ఉంటుందనే దాని మీదే బ్యాంకు గౌరవం ఆధారపడి ఉంటుంది’ అని అది చెప్పింది. బ్యాంక్ అంటే నిత్యం కస్టమర్లు వచ్చిపోయే చోటు. అది పబ్లిక్ ప్లేస్. అక్కడ నలుగురు మెచ్చే విధంగానే ఉండాలి అని ఈ తాకీదు అర్థం. బ్యాంక్ చేసిన సూచనల ప్రకారం– ► సీనియర్ సిబ్బంది చక్కటి మర్యాదకరమైన బట్టలే అంటే ఫార్మల్సే ధరించాలి. ► జీన్స్, టీ షర్ట్స్, స్పోర్ట్ షూస్ వంటివి వర్క్‌ప్లేస్‌లో ధరించరాదు. ► స్త్రీలు కూడా భారతీయ లేదా వెస్ట్రర్న్ ఫార్మల్స్నే ధరించాలి. ► సరిగా దువ్వుకున్న తలకట్టు ఉండాలి. క్లీన్ షేవ్ చేసుకోవాలి. ► చెప్పులు, షూస్ శుభ్రంగా, పాలిష్‌తో ఉండాలి. ► చెక్ షర్ట్స్ మీద ప్లెయిన్ కలర్ టైలు, ప్లెయిన్ షర్ట్స్ మీద చెక్స్ టైలు ధరించాలి ► కస్టమర్స్‌తో సరిగా మాట్లాడాలి. వారితో మీటింగ్‌లో ఉన్నప్పుడు తేన్చడం, చీదడం వంటి పనులు చేయకూడదు. ఇలా ఎస్.బి.ఐ. తన సిబ్బందికి చాలా సూచనలే చేసింది. కాని ఇవి ఆ సిబ్బందికి మాత్రమే కాదు ఏ సిబ్బందికైనా వర్తిస్తాయని వాటిని చదివితే మనకు అర్థమవుతుంది. మనకు అన్నీ తెలియాలని రూల్ లేదు. కాని తెలిశాక అలా ప్రవర్తించడం మంచిది. మనిషి ఎదుగుదలలో సంఘ ప్రవర్తన ముఖ్య పాత్ర పోషిస్తుంది. దానిని పాటించడమే నేటి మర్యాద. నాగరికత. పర్సనల్ ఎటికేట్ వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. శరీరం నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవాలి. నోటి నుంచి దుర్వాసన రాకుండా జాగ్రత్త పడాలి. మురికి పట్టిన, నలిగిన బట్టలు ధరించకపోవడం మేలు. చేతి, కాలి గోళ్లు శుభ్రంగా తీసుకుని ఉండాలి. ముక్కును చెవులను శుభ్రంగా ఉంచుకోవాలి. దట్టమైన మేకప్‌లు ఎబ్బెట్టుగా ఉంటాయి. జుట్టు దువ్వుకోవాలి. చుండ్రు లేకుండా చూసుకోవాలి. పెర్ఫ్యూమ్స్ కానీ, డియోడ్రెంట్లు కాని ఎదుటివారికి ఆహ్లాదం కలిగించే స్థాయిలో ఉండాలి తప్ప ఘాటుతో ఉండి పక్కకు తప్పుకునేలా ఉండరాదు. సోషల్ ఎటికేట్ నలుగురిలో ఉన్నప్పుడు ఎదుటివారిని పలకరించాలి. కళ్లల్లో చూసి మాట్లాడాలి. మంచి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఇంట్లో ఉన్నవాళ్లతో కూడా మర్యాదగా ప్రవర్తించాలి. బయటకు వెళుతున్నప్పుడు తల్లిదండ్రులతో లేదా భార్యతో వెళ్లొస్తాను అని చెప్పాలి. బయటి నుంచి తిరిగి వచ్చాక సరిగ్గా పలకరించాలి. నలుగురి మధ్య తల దువ్వుకోవడం, బజారున నడుస్తూ వెళుతున్నప్పుడు ఏదైనా తింటూ వెళ్లడం చేయరాదు. అందరి మధ్య ఊయడం, స్మోక్ చేయడం కూడా మర్యాద కాదు. చూయింగ్ గమ్ నములుతూ కూడా మాట్లాడకూడదు. డైనింగ్ ఎటికేట్ నలుగురితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అందరితో పాటు మొదలెట్టడం ఆనవాయితీ. ప్లేట్లు, పదార్థాలు శబ్దం వచ్చేలా లాగకూడదు. డైనింగ్ టేబుల్ మీద మోచేలు పెట్టి కూర్చోరాదు. మీ పక్కన ఉన్నవారితో మాట కలుపుతూ భోజనం చేయండి. పెద్దగా చప్పుడు చేస్తూ నమలడం కాని తాగడం కాని చేయరాదు. మూతిని నేప్కిన్తో అద్దుకోవాలి. తుడుచుకోరాదు. టెలిఫోన్ ఎటికేట్ అనవసరమైన వేళలో ఫోన్ చేయకూడదు, ముఖ్యమైన విషయం ఉంటే తప్ప. మీరు కాల్ చేస్తే మొదట మీ పేరు చెప్పండి. ఎదుటి వ్యక్తి కాల్ చేస్తే వారు పెట్టేవరకు సంభాషణ కొనసాగించాలి. మీరు మధ్యలో ఫోన్ పెట్టేయకూడదు. ఎదుటివారు చెప్పేది వినాలి. ఒకరితో ఫోన్ మాట్లాడుతూ ఎదురుగా ఉన్న మరో వ్యక్తితో మాట్లాడకూడదు. అవతలి వ్యక్తికి తెలియకుండా స్పీకర్ ఆన్ చేయడం అమర్యాద. -
ఉత్తమ గృహస్థ ధర్మాలంటే ఏమిటి?
గృహస్థాశ్రమంలో భార్యాభర్తల పరస్పర ప్రవర్తన ఎలా ఉండాలనే విషయమై పెద్దలు చక్కగా చెప్పారు. ముందుగా భర్త, భార్య గురించి – ‘‘ఈమె తన తల్లి దండ్రులు, సోదరులు మొదలైన వారినందర్నీ విడిచి నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఈమెకు ఏవిధమైన కష్టమూ కలగనివ్వకూడదు. తిండి, బట్ట, ఇల్లు మొదలైన వాటికి లోటుండకూడదు. అన్ని విషయాలలోనూ ఈమెకే ఎక్కువ సుఖం లభించాలి’’ అని భావించాలి. ఆమె బాగోగులను, ఇష్టాయిష్టాలను దృష్టిలో ఉంచుకోవాలి. మరి భార్యకు ఎటువంటి భావం ఉండాలంటే – ‘‘నేను నా గోత్రాన్ని, కుటుంబాన్నీ, పుట్టినింటిలో ఉండే స్వేచ్ఛాస్వాతంత్య్రాలనూ వదులుకుని వీరి ఇంటికి వస్తున్నాను. వీరివల్ల నాకు అవమానం, కష్టం కలగకూడదు. అదేవిధంగా నా వల్ల వీరికి దుఃఖం, అవమానం, నింద, తిరస్కారం జరుగకూడదు. నేనెంత కష్టమైనా అనుభవిస్తాను కానీ, వీరికి మాత్రం నా వల్ల కొంచెం కూడా కష్టం నష్టం కలుగరాదు.’’ అంటూ ఆమె తన సుఖ సంతోషాలకన్నా, భర్త, అత్తమామలు, ఆడపడచులు, బావగార్లు, మరుదులు, తోటికోడళ్లు, తదితరుల సుఖసంతోషాలను దృష్టిలో ఉంచుకొని ఇహ పర శ్రేయస్సు కోరుకోవాలి. గృహస్థాశ్రమంలో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే గుణాన్ని అలవరచుకోవాలి. ఇబ్బందులు ఎదురైతే సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. భార్యను అర్థాంగిగా గుర్తించి అహంకారాలకు, అనుమానాలకు తావివ్వక అభిమానాన్ని, ఆనందాన్ని పంచుతూ భర్త తన పాత్రను గుర్తెరిగి గృహానికి యజమానిగా తనవంతు బాధ్యతను సదవగాహనతో పోషించాలి. అదేవిధంగా భార్య కూడా, భర్త మనోభావాలకు, అభిరుచులకూ అనుగుణంగా వ్యవహరించడం, పెద్దలను ఆదరాభిమానాలతో సేవించడం వంటి ఉన్నత విలువలు కలిగి ఉండాలి. అప్పుడే కుటుంబంలో శాంతి, సామరస్యాలు నెలకొంటాయి. పరిస్థితులు బాగా లేనపుడు వాటిని అవగాహనతో పరిష్కరించుకోగలిగే సామర్థ్యాలను పెంపొందించుకుంటూ అన్యోన్యతతో, అవగాహనతో వ్యవహరించాలి. -
తిరువూరులో ఏసీటీవో పద్మ కలకలం
-
లోక కల్యాణం
ఈ లోకంలో... మనిషికి మంచి గుణాలుంటే! ఈ లోకం తప్పకుండా... సుభిక్షంగా... సులక్షణంగా... ఆనందంగా ఉంటుంది. శ్రీరాముడిని... ఎలా పూజించాలనే మీమాంస అక్కరలేదు. ఈ సకలగుణాభిరాముడి సుగుణాల్లో... కొన్నింటినైనా మనవిగా చేసుకుంటే... ఆయనకు నైవేద్యం పెట్టినట్లూ ఉంటుంది! మనకు ప్రసాదం అందినట్లూ ఉంటుంది!! అదే లోక కల్యాణం. రామ... ఆ పేరే ఎంతో ప్రియమైనది. తియ్యనైనది. సుందరమైనది. పిబరే రామరసం... రాముని భక్తిలో ఐక్యమవడానికి మించిన ధన్యత ఏముంటుంది గనక. మానవునిగా పుట్టి దేవునిగా ఎదిగినవాడు రాముడు. బలహీన పడే సందర్భాలలో బలహీన పడక, తల వొగ్గాల్సిన సమయాలలో తల వొగ్గక, మాట తప్పాల్సిన సంకటాలలో కూడా మడమ తిప్పక... అదిగో నేను సంపూర్ణమై నిలిచాను... నా దారిలో నడవండి... ఈ దారిలో కష్టాలు ఎదురు కావచ్చు కాని విజయం మాత్రం తథ్యం... అని నిరూపించినవాడు పరంధాముడు. కుమారుడంటే ఇలా ఉండాలి... భర్త అంటే భార్య కోసం ఇలా పరితపించాలి... సోదరుడంటే తన సోదరుల మీద ఇంత ఆపేక్ష చూపాలి, స్నేహితుడంటే తన స్నేహితుడి కష్టాలలో అండగా ఇలా ఉండాలి... ఆహా... రాముడి చరితలో ప్రతి సామాన్యుడు వెతుక్కోవాల్సిన ఘట్టాలు ఎన్నో ఎన్నెన్నో... అందుకే ధర్మవర్తనకు, ప్రవర్తనకు ప్రతిరూపం ఆ శ్రీరామచంద్రుడు. ఆయన కల్యాణ వేడుక పుడమి పరవశించే పర్వదినం. ఆ రాముడు ఎందుకు అవతారమూర్తి అయ్యాడో ఈ శ్రీరామనవమిన చేస్తున్న భక్తిపూర్వక సందర్శనమిది. గొప్ప కుమారుడు అయోధ్యానగరం అంటే ఒక మూలన బంగారం... ఆ మూలన వెండి... ఎటు చూసినా ఐశ్వర్యం... అది రాముడి రాజ్యం. రామరాజ్యం. ఆ రాజ్యానికి ప్రభువు రాముడు. రాజయ్యాక, అవక ముందు కూడా తనను తాను దశరథ తనయుడనే చెప్పుకున్నాడు తప్ప రాజునని ఏనాడూ చెప్పుకోలేదు. అంతటి వినమ్రుడు రాముడు. చిన్ననాటి నుంచే ఆయనకు ఈ వినమ్రత ఉంది. విశ్వామిత్రుడు వచ్చి, యాగరక్షణ కోసం పంపమని అడిగినప్పుడు, తండ్రి ఆజ్ఞపై తమ్ముడు లక్ష్మణునితో కలసి విశ్వామిత్రుని వెంట నడిచాడు రాముడు. సీతాస్వయంవరానికి తీసుకెళ్లినప్పుడు లేశమాత్రంగా శివధనుర్భంగం చేసి సీతను గెలుచుకున్నా విశ్వామిత్రుడి ద్వారా తలిదండ్రులకు సమాచారాన్ని తెలియజేశాకే సీతను వివాహం చేసుకున్నాడు. తండ్రి మాట కోసం పూచికపుల్లతో సమానంగా రాజ్యాన్ని త్యజించినవాడు మానవుడవుతాడా మహనీయుడవుతాడుగానీ! గొప్ప స్థితప్రజ్ఞుడు కన్నతల్లి కౌసల్యను ఎంతగా ప్రేమించాడో పిన తల్లులు సుమిత్రను, కైకను కూడా అంతగా ప్రేమించినవాడు రాముడు. మరికొద్దిసేపటిలో యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన వాడు కైక వరం వల్లే సామాన్యుడిగా మిగిలాడు. కైకను నిందించినా కైకను ఎదిరించినా కైకకు తండ్రి ఇచ్చిన వరాలను తోసిపుచ్చినా, అతడి రాజ్యం అతడికి దక్కి ఉండేది. కాని కైక దుర్బలత్వాన్ని, రాజ్యం పట్ల, కుమారుడు భరతుడి పట్ల ఆమెకున్న లాలసను రాముడు అర్థం చేసుకున్నాడు. అందుకే కైకను పన్నెత్తి ఒక్కమాట అనలేదు. అపకారికి అపకారం చేయడం దానవ లక్షణమైతే, ఉపకారం చేయడం రాముడి లక్ష్యం. గొప్ప భర్త రాముడు ఏకపత్నీవత్రుడు. పురాణాలలో పతివ్రతలుగా అనేకమంది కనిపిస్తారు. కాని ఏకపత్నీవ్రతం వల్ల పూజలు అందుకున్న ఒకే ఒక పురుషుడు రాముడు. సీత సమక్షంలో లేని రాముడు అసంపూర్ణుడు. సీతారాములు అనేది జంటగా కనిపించే ఒకే మాట. రాముడూ సీతా వేరు వేరు కాదు. మనసా వాచా కలగలిసిపోయిన ఏకరూపం. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టినా సీతమ్మను తప్ప మరొకరి వంక కన్నెత్తి కూడా చూడలేదాయన. వనవాసానికి వెళ్లవలసి వచ్చినప్పుడు సుకుమారి అయిన సీతమ్మ తనతో అడవులకు వస్తే కష్టపడవలసి వస్తుందని వారించాడు. తనను అడవులకు రావద్దన్నందుకు ఎన్నో విధాలుగా సీతమ్మ నిష్టూరపడితే తప్ప ఆమె తనతో రావడానికి అంగీకరించలేదు. ఇంతి కష్టం తన కష్టం చేసుకునేవాడే పురుషుడు. మర్యాదరాముడు. గొప్ప శ్రేయోభిలాషి... శ్రీరాముడు అందరి బంధువు. ఆయనను చూడాలని, ఒక్కసారి దర్శించాలని కోరుకోని వారెవరు? శబరి శ్రీరాముణ్ణి ఆరాధించింది. ఆయన దర్శనం కోసం పరితపించిస్తోందని తెలిసి, ఆమెను మించిన స్థాయి లేదని, ఆమె వద్దకెళ్లి, ఆమె ఎంగిలిని మహాప్రసాదంలా స్వీకరించాడు. ఇక అడవుల్లో జడ పదార్థం వలే రాయిలా మారి ఉన్న అహల్య రాముడి ఓదార్పు వల్లే తిరిగి మామూలు మనిషయ్యింది. రాముడు శ్రేయోభిలాషి. ఎదుటివారి శ్రేయస్సు కోరే వాడే శ్రీరాముడు. గొప్ప స్నేహితుడు మన స్నేహంలో గొప్పతనం ఉంటేనే మనకు గొప్ప స్నేహితులుంటారు. శ్రీరాముడి గొప్పతనం సుగ్రీవుడితో స్నేహంలోనే తెలిసి వచ్చింది. ఇద్దరూ కష్టకాలంలోనే స్నేహితులయ్యారు. ఇద్దరూ రాజ్యాన్ని విడిచి, అడవులలో ఉంటున్నారు. రాముడు సుగ్రీవుడికి ధైర్యాన్ని ఇచ్చాడు. అతడి వల్ల ఆసరాను పొందాడు. అందుకే సుగ్రీవుడు ‘నువ్వు స్నేహితుడుగా లభించడం నా అదృష్టం. ఇలాంటి వ్యక్తి స్నేహితుడుగా ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. నీతో స్నేహం కలవడం నాకు దైవమిచ్చిన వరం అనుకుంటాను’ అంటాడు. పడవ నడిపేవాడైన గుహునితో కూడా రామునికి అంతే స్నేహం. రాముడిలాంటి స్నేహితుడు ఉంటే చేతిలో రామబాణం ఉన్నట్టే. గొప్ప సహోదరుడు అనుక్షణం నీడలా తనను అనుసరించే లక్ష్మణుడంటే శ్రీరాముడికి ఎంతో ప్రేమ. ఆ అన్నదమ్ముల మధ్య మౌఖిక సంభాషణ తక్కువ. వారి ఆత్మలే మాట్లాడుకునేవి. ఒకరి సమక్షమే మరొకరికి ఆనందం. అటువంటి లక్ష్మణుడికి ప్రాణం మీదకు వచ్చినప్పుడు రాముడు తల్లడిల్లిపోయాడు. ఇంద్రజిత్తు తన అస్త్రాలతో లక్ష్మణుడిని మూర్ఛిల్లజేసినప్పుడు హనుమంతుడు వెళ్లి సంజీవనీ పర్వతాన్ని తీసుకు వచ్చి లక్ష్మణుని బతికించాక ‘నా బహిఃప్రాణాన్ని తిరిగి నాకు తెచ్చిచ్చినందుకు నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను హనుమా’ అంటూ పట్టరాని ఆనందంతో హనుమను కౌగిలించుకుంటాడు. లక్ష్మణుడే రాముడికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. తమ్ముడి పర్యవేక్షణకు అంత విలువ ఇచ్చి రాముడు ఆదర్శనీయుడైనాడు. గొప్ప ధర్మపరాయణుడు తండ్రి కైకకిచ్చిన మాటకోసమే రాముడు వనవాసం వెళ్లవలసి వచ్చిందని తెలిసి భరతుడు మండిపడ్డాడు. వెంటనే కొంతమంది అనుచరులతో కలసి రాముడిని అన్వేషిస్తూ ఆయన ఉన్న చిత్రకూట పర్వతానికి వెళ్లి, ‘అన్నయ్యా! నిన్ను వనవాసానికి పంపించిన నాన్నగారు ఇక లేరు కదా, నీవు వచ్చి రాజ్యాన్ని ఏలుకో’ అంటూ అర్థిస్తాడు. రాముడు అంగీకరించడు. తండ్రికి ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోడు. దాంతో నిస్సహాయుడై రాముడి పాదుకలను నెత్తి మీద పెట్టుకుని వెళ్లి ఆ పాదుకలకే పట్టం కట్టి, పరిపాలన చేస్తాడు భరతుడు. అ–సామాన్యుడు రావణుడు మాయావి, అమిత బలవంతుడు, అపారమైన బలగం గలవాడు. తానేమో సామాన్య మానవుడు. కోతిమూక, తమ్ముడు తప్ప తనకు ఏ బలమూ, బలగమూ లేదు. అయినా సరే, రాముడు ఏమాత్రం అధైర్యపడలేదు. వారి సాయంతోనే సేతువు నిర్మించాడు. వారినే వెంటబెట్టుకుని, లంకా న గరానికి వెళ్లి, వారినే సైన్యంగా చేసుకుని యుద్ధానికి సిద్ధపడ్డాడు. మధ్యమధ్యలో రావణుని మాయోపాయాలకూ, కుతంత్రాలకూ కుంగిపోలేదు. గొప్ప యుద్ధతంత్రాన్ని రచించి రావణుని సేనను, సోదరులను, పుత్రులను, ఇతర బలగాన్నంతటినీ క్రమక్రమంగా మట్టుపెడుతూ, రావణుని ధైర్యాన్ని నీరుకార్చి, చివరకు అంతటి బలశాలినీ నేలకూల్చాడు. గొప్ప శిష్యుడు కులగురువైన వశిష్ఠుని మాటను శ్రీరాముడు ఏనాడూ మీరలేదు. ఆయన చెప్పిన శాస్త్రాలను, శస్త్రాస్త్రాలనూ ఆపోశన పట్టాడు. మధ్యలో వచ్చిన విశ్వామిత్రుడినీ గురువుగానే భావించాడు. ఆయన వద్ద యుద్ధవిద్యలన్నీ నేర్చుకున్నాడు. ఆయన తీసుకువెడితేనే సీతా స్వయంవరానికి వెళ్లాడు. శివధనుర్భంగానంతరం ఆయన అనుమతితోనే తల్లిదండ్రులనూ, ఇతర సోదరులనూ, పరివారాన్నీ వశిష్టునీ మిథిలానగరానికి రప్పించాడు. ఆదినుంచి అభిప్రాయ భేదాలతో రగిలిపోతున్న ఇరువురు గురువులనూ ఒక్కతాటిమీద నడిపించాడు. గొప్ప యజమాని చేసిన సాయాన్ని మరువని కృతజ్ఞతాభిరాముడు శ్రీరాముడు. అందుకే సీతమ్మ జాడ కనిపెట్టిన హనుమంతుని బిడ్డలా చూసుకున్నాడు. ఎవరికీ ఇవ్వనంతటి చనువును ఇచ్చాడు. కొన్ని సార్లయితే సీతమ్మకు సైతం దక్కని చొరవ ఆంజనేయునికి దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు. గొప్ప యజమానికే గొప్ప భక్తుడు దొరుకుతాడు. రాముడు గొప్ప యజమాని. హనుమంతుడు గొప్ప స్వామి భక్తుడు. ఈ జంట ప్రజల గుండెల్లో చెరగని జోడి. – డి.వి.ఆర్. భాస్కర్ -
శ్రీరంగ నీతులే...!
♦ చెప్పేదొకటి చేసేది మరొకటి ♦ ఎమ్మెల్యే పదవికి రాజీనామా గాలికి వదిలిన వైనం ♦ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలింతకు రెడీ... ♦ పీఆర్ పెద్దదండ్లూరు పర్యటన జీర్ణించుకోలేని పరిస్థితి ‘నోరు ఒకటి చెబితే.. చేతులు ఇంకొటి చేస్తాయి, దేని పని దానిదే’ ఇదీ ఓ సినిమాలో విలన్ డైలాగ్.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలి అచ్చం అలాగే కన్పిస్తోంది. రెండేళ్లుగా ఆయన మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. చెప్పేందుకే శ్రీరంగనీతులు.. అన్నట్లుగా ఆయన ధోరణి కన్పిస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: తాను ఏమి చేసినా పైచేయి సాధించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎవరిపైనయినా ఎలాంటి ఆరోపణలకైనా వెనుకాడడం లేదు. అందులో భాగంగానే తాజాగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన దివంగత సీఎం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులపై ఆరోపణలకు దిగినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఆ మధ్య అనేకమార్లు ‘నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. పార్టీ మారాల్సి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారుతా. ఏదైనా చెప్పే చేస్తా. ఎమ్మెల్యే పదవి తోకతో సమానం.’ అంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రకటనలు చేశారు. చెప్పిన మాటను పక్కనెట్టి ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయకుండానే టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే డొల్లతనం అక్కడే బహిర్గతమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం కోసం పార్టీ ఫిరాయిస్తుంటే, పదవికి ఎలా రాజీనామా చేస్తారని పరిశీలకులు ముందే అంచనా వేశారు. అయినప్పటీకీ పదేపదే ఎమ్మెల్యే వ్యాఖ్యల నేపథ్యంలో నైతిక విలువలకు కట్టుబడి ఉంటారని ప్రజాస్వామ్యవాదులు ఆశించారు. అధికారం ముందు నైతికత బలాదూర్ అయ్యిందని ఆయన వ్యవహారంతో తేటతెల్లమైంది. ఎమ్మెల్యే తన వియ్యంకుడు ఆస్తులను కాపాడుకోవడమే లక్ష్యంగా పార్టీ ఫిరాయించారని రాజకీయ పరిశీలకులు అంచనాకు వచ్చారు. ఈక్రమంలో తన తప్పును కప్పిపుచ్చుకుంటూనే పైచేయి సాధించడమే లక్ష్యంగా అనేక ఆరోపణలు తెరలేపుతున్నట్లు పలువులు వివరిస్తున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని.... నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చెప్పుకొస్తున్నారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని కలుగోలుగా వెళ్లేందుకు అభ్యంతరం లేదని ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యే చర్యలు ‘నోటీతో చెప్పడం నొసలుతో వెక్కిరించడం’ అన్నట్లుగా ఉండిపోయాయని మాజీ మంత్రి పీఆర్ వర్గీయులు పేర్కొంటున్నారు. వాస్తవంగా కలుపుగోలుగా వెళ్లాలనే సదుద్దేశ్యమే ఉంటే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని పెద్దదండ్లూరుకు ఆహ్వానించిన జన్మభూమి కమిటీ సభ్యులపై దాడి జరిగిండేది కాదని వారు వివరిస్తున్నారు. అనేక విషయాలల్లో అదే ధోరణి తేటతెల్లం అవుతోందని పీఆర్ వర్గీయులు చెప్పుకొస్తున్నారు. కార్యకర్తల సమావేశం ఉదయం పూట నిర్వహించేందుకు సన్నాహాలు చేసి కూడా, సాయంత్రం హాజరు కావాల్సిందిగా పీఆర్ వర్గీయులకు సెల్ మెసేజ్‌లు పంపారని పలువురు చెప్పుకొస్తున్నారు. ఆమేరకే టీడీపీ నేత పీఆర్ వర్గీయులు కార్యకర్తల సమావేశానికి గైర్హాజరయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రతిఘటన జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ఎదురుగా ప్రశ్నించే కార్యకర్తలు బహుఅరుదు. అలాంటిది బుధవారం కార్యకర్తల నుంచి ప్రతిఘటన నెలకొంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబసభ్యులపై ఆరోపణలు, దూషణల నేపథ్యంలోనే సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు బాహాటంగా స్పందించారని తెలుస్తోంది. వైఎస్ కుటుంబ వల్లే ఎమ్మెల్యే కుటుంబం ఉన్నతస్థాయికి చేరిందన్న విషయాన్ని మర్చిపోవడమే అందుకు కారణంగా విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. పార్టీ ఫిరాయించే వరకూ ఎమ్మెల్యే పదవి తోకతో సమానమని చెప్పుకొచ్చిన ఆయన అనంతరం పదవికి రాజీనామా ఊసే ఎత్తడం లేదని పలువురు పేర్కొంటున్నారు. వైఎస్ కుటుంబం సహకారంతో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి శ్రమకోర్చి జమ్మలమడుగులో నిర్మించిన రాజకీయ పునాదులపై అత్యంత తెలివితేటలతో 2004 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి వచ్చి వాలిపోయారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆపై వైఎస్ కుటుంబం మద్దతు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎంపిక కావడాన్ని కార్యకర్తల మదిలో తొలిగిపోలేదని పలువురు వివరిస్తున్నారు. ఆమేరకే ఎమ్మెల్యే అడ్డదడ్డంగా చేస్తున్న ఆరోపణలపై ప్రతిఘటిస్తున్నట్లు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. -
గేల్ ప్రవర్తన ఊహించిందే: వాట్సన్
మెల్బోర్న్: విండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ అనుచిత ప్రవర్తన ఊహించిందేనని ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్‌లో మహిళా జర్నలిస్టుతో అసభ్యకరంగా మాట్లాడిన గేల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ‘గేల్ గురించి తెలిసిన వారికెవరికైనా ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే వారందరికీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలుసు. గేల్ ఆటను చూసేందుకు చాలా మంది స్టేడియాలకు వచ్చే మాట వాస్తవం. అయితే క్రికెట్‌కు అవతల కూడా ఓ ప్రపంచం ఉంటుందనే విషయం అతడు తెలుసుకోవాలి. క్రీజులో ఎంత బాగా ఆడామన్నదే కాకుండా బయట ఎలా ఉంటున్నామన్నది కూడా ముఖ్యం. అభిమానులు క్రికెట్లో వినోదంతో పాటు మైదానం ఆవల సరైన ప్రవర్తననే గౌరవిస్తారు’ అని వాట్సన్ స్పష్టం చేశాడు. -
కీచక గురువు
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తన సెల్ఫోన్లు, వీడియో చిత్రీకరణ నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నానంటూ వేధింపులు నిలదీసిన సర్పంచ్, బాధితురాలి బంధువులు నక్కపల్లి: విద్యార్థిని వేధిస్తున్న ఉపాధ్యాయుడిని ఆమె బంధువులు, గ్రామస్తులు నిలదీశారు. మండలంలోని జానకయ్యపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలావున్నాయి. ఇదే స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న చినతీనార్లకు చెందిన బాలికపై ఇదే పాఠశాలకు చెందిన ఇంగ్లీష్ టీచర్ ఈశ్వరరావు కొద్దికాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. సెల్‌ఫోన్‌తో ఫొటో లు, వీడియోలు తీస్తూ నువ్వంటే నాకు ఇష్టమని చూడకుండా ఉండలేకపోతున్నానంటూ ఇబ్బంది పెడుతున్నాడు. ఉపాధ్యాయుడు కావడంతో భయపడి ఈవిషయాన్ని ఆమె ఎవరికి చెప్పలేదు. ఇతని చేష్టలు రోజురోజుకు శ్రుతిమించిపోతున్నాయి. నిన్ను చూస్తూ బైక్ నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నానని చెప్పేవాడు. అతని బర్త్‌డే కేక్‌పై బాలిక ఫొటోను డిజైన్ చేశాడని వేధిస్తున్నాడని విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది. వేధిస్తాడన్న భయంతోనే ఈ విషయం ఎవరికీ చెప్పలేదని ఆమె వాపోయింది. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆమె తండ్రి వేట నిమిత్తం పూరీ వెళ్లాడు. ఆమె తల్లి వద్ద ఉంటోంది. విద్యార్థిని వేధింపుల విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఎరిపల్లి శ్రీను, పెదతీనార్ల సర్పంచ్ కొర్లయ్య, గ్రామ నాయకులు ముసలయ్య తదితరులు పాఠశాలకు వెళ్లి వేధిస్తున్న ఉపాధ్యాయుడిని నిలదీశారు. విద్యాబుద్ధులు నేర్పుతూ కన్నపిల్లలా చూడాల్సింది పోయి ఇలా దుర్బుద్ధితో ప్రవర్తించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి బాగా చదువుతుందని దానివల్ల నువ్వంటే నాకిష్టమని చెప్పానని అంతే తప్ప మరో ఉద్దేశం లేదని ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. ఫోటోలు, వీడియోలు ఎందుకు తీశారని ప్రశ్నిస్తే పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం సందర్భంగా తీశానని తెలిపాడు. ఇలా చేయడం తప్పేనని ఒప్పుకున్నాడు. పాఠశాల హెచ్ఎం నూకరాజుతోపాటు, గ్రామస్తులు అతనిని మందలించారు. అయితే బాదితురాలు మాత్రం ఈశ్వరరావు ఈ పాఠశాలలో పనిచేస్తే తాను ఇక్కడ చదవనని చెబుతోంది. ఇటువంటి సమస్య మరే ఆడపిల్లకు రాకూడదని తక్షణమే సదరు ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మంచికే చెబుతున్నా... మొరాయిస్తే ఎలా?
కిడ్స్ మైండ్స్ మా బాబు పదో తరగతి చదువుతున్నాడు. మొన్నటి వరకూ బాగానే ఉండేవాడు. కానీ ఈ మధ్య వాడి ప్రవర్తనలో తేడా వస్తోంది. ఏదైనా సలహా ఇవ్వబోతే నాకు తెలుసులే అంటున్నాడు. నేనేం చిన్నపిల్లాడినా, వచ్చే యేడు కాలేజీకి కూడా వెళ్లబోతున్నా కదా అంటాడు. ఫ్రెండ్స్‌తో షికార్లు కూడా ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఇంతకు ముందులా స్కూలు అవ్వగానే తిన్నగా ఇంటికి రావడం లేదు. సరదాగా ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఈ నిర్లక్ష్యం వాడి చదువు మీద ప్రభావం చూపుతుందేమోనని భయంగా ఉంది. అసలే పదో తరగతి కదా! ఇప్పుడేం చేయాలో సలహా ఇవ్వండి? - సంగీత, హైదరాబాద్ బాబు స్నేహితులలో మార్పేమైనా వచ్చిందేమో కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొత్త స్నేహితులు వచ్చినప్పుడు మన పిల్లల ప్రవర్తనపై వారి ప్రభావం కనిపిస్తుంది ఒక్కోసారి. అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లడం తప్పేమీ కాదు. కానీ మీతో చెప్పకుండా, స్కూలు నుంచి డెరైక్ట్‌గా వెళ్లిపోవడం మాత్రం తప్పు. ఈ వయసులో పిల్లలు కొద్దిగా స్వాతంత్య్రాన్ని కోరుకోవడం, తీసుకోవడం మొదలవుతుంది. పెద్దవాళ్లు అవుతున్నారు కాబట్టి ఇంతకు ముందులా ప్రతిదీ మీకు చెప్పి చేయరు, మీరు చెప్పింది వినరు. కానీ మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకోవడం అంత మంచిది కాదు. ఏది సబబు, ఏది కాదు, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు అన్నది వాళ్లకి తెలియాలి. కాబట్టి ఓసారి కూర్చోబెట్టి బాబుతో వివరంగా మాట్లాడండి. మీ అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని చెప్పండి. వెళ్తే ఎలాంటి సమస్యలు రావొచ్చో కూడా వివరించండి. అలా అని మరీ రిస్ట్రిక్ట్ చేయకుండా కాస్త ఫ్రీగా వదలండి. కాకపోతే ఏ రూల్స్ కచ్చితంగా పాటించి తీరాలన్నది తనకు స్పష్టం చేయండి. వాటి విషయంలో మీరు కూడా స్ట్రిక్ట్‌గా ఉండండి. మా బాబు వయసు ఎనిమిదేళ్లు. చాలా చలాకీగా ఉంటాడు. కానీ ఎందుకో మాటలే సరిగ్గా రావడం లేదనిపిస్తోంది. గడగడా మాట్లాడలేడు. ఆగి ఆగి మాట్లాడతాడు. ఏదో ఆచి తూచి మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. కొన్ని పదాలు నత్తినత్తిగా పలుకుతాడు. తనకి ఏదైనా సమస్య ఉందంటారా? - వరప్రసాద్, ఏలూరు బాబుకి మాటలు ఇంకా పూర్తిగా వచ్చినట్టు లేదు. కొంతమంది పిల్లలకు మాటలు రావడం కాస్త ఆలస్యం కావొచ్చు. నత్తిగా మాట్లాడం కూడా స్పీచ్ ప్రాబ్లెమే. తనని ఓసారి స్పీచ్ థెరపిస్ట్ దగ్గరకు తీసుకు వెళ్లండి. వాళ్లు ఇచ్చే థెరపీ ద్వారా బాబుకి మాటలు బాగా వస్తాయి. నేను పెద్దగా చదువుకోలేదు. అందుకే మా బాబుని బాగా చదివించాలని అనుకుంటున్నాను. వాడిప్పుడు ఆరో తరగతి చదువుతున్నాడు. వాడిని మంచి స్థాయిలో చూడాలన్నది నా కల. అయితే మేము కాస్త వెనుకబడిన ప్రాంతంలో ఉంటున్నాం. అందుకే ఏడో తరగతికి తనని సిటీలోని ఓ మంచి స్కూల్లో చేర్చాలని నిర్ణయించుకున్నాను. కానీ హాస్టల్లో ఉండటానికి బాబు అస్సలు ఒప్పుకోవడం లేదు. ముందుగానే చెబితే తను ప్రిపేరవుతాడనుకున్నాను. కానీ చెప్పీ చెప్పడంతోనే వాడు బెంగ పెట్టేసుకున్నాడు. ఎట్టి పరిస్థితిల్లోనూ హాస్టల్‌కి వెళ్లనని, మమ్మల్నందరినీ వదిలి ఉండలేనని తెగేసి చెప్తున్నాడు. వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? - వై.రాజేంద్ర, ఎస్.కోట బాబును బయటకు పంపడమే తన భవిష్యత్తుకు మంచిదని మీరు నమ్ముతుంటే... తను బాధపడినా కూడా వెనకడుగు వేయకండి. అసలు మీరు తన గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు దూరంగా పంపాలనుకుంటున్నారు, అది తన భవిష్యత్తుకు ఎంత అవసరం అనేది వివరంగా చెప్పండి. తను ఇప్పటివరకూ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి బాధపడటం, వెళ్లనని అనడం సహజం. అది చూసి మీకూ బాధ కలుగుతుంది. కానీ తప్పదు అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేసి తనని కన్విన్స్ చేయాలి కదా! కాబట్టి మీరు కాస్త కఠినంగా వ్యవహరించి తనని హాస్టల్లో చేర్పించండి. కొత్తలో తరచూ ఫోన్లలో మాట్లాడితే దగ్గరగా ఉన్నట్లు ఫీలవుతాడు. మీరు వీలైనన్నిసార్లు వెళ్లి చూడటం, శెలవులు వచ్చినప్పుడు తనను ఇంటికి తీసుకు రావడం చేస్తుంటే... హాస్టల్లో ఉన్నా మీరందరూ తనను పట్టించు కుంటున్నారన్న ధైర్యం కలుగుతుంది తనకి. కాబట్టి తన బాధ చూసి సంశయించి మీరు వెనకడుగు వేయకుండా, తన భవిష్యత్తు కోసం మీ నిర్ణయాన్ని అమలు జరపండి. మొదట్లో కాస్త బెంగగా, బాధగా ఉంటాడు కానీ మెల్లగా అలవాటు పడిపోతాడు. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
ఆగర్భ మిత్రులుగా తీర్చిదిద్దండి
పేరెంటింగ్ టిప్స్ కేర్, కేర్ మంటూ అప్పుడే పుట్టిన చిన్న బాబును/పాపను చూస్తే ఇంటిల్లపాది సంతోషం, ఇంటి వారసుడొచ్చాడనో, మహాలక్ష్మి వచ్చిందనో! అయితే వీరందరికీ దూరంగా ముఖంపై దిండు పెట్టుకొని/మంచం కింద దూరి చిన్ని బుజ్జాయి కంటే ముందు పుట్టిన పాప/బాబు కంటి నిండా నీళ్లు నింపుకుంటారు. అమ్మ నన్ను పట్టించుకోవటం లేదని, మరెవరో వచ్చి అమ్మ ఒడిలో హాయిగా నిద్ర పోతున్నారని. క్రమంగా అమ్మ ఒడిలోని పాప/బాబు పెద్దవారవుతారు... సోదర సోదరిల మధ్య విరోధం వస్తుంది. ఆటల్లో పోటీ నిలుస్తుంది. తల్లిదండ్రుల ప్రేమకోసం పోరాటం మొదలవుతుంది. ఫలితం పిల్లల మధ్య ఘర్షణ. దీనినే ఇంగ్లీషులో సిబ్లింగ్ రైవలరీ అంటారు. తమకు సరైన గుర్తింపు లభించటంలేదని, తమ కన్నా సోదర, సోదరులనే బాగా చూసుకుంటున్నారనే నెగెటివ్ భావన పిల్లల్లో ఇలాంటి ప్రవర్తనకు కారణం అవుతుంది. ఇలా జరక్కుండా ఉండాలంటే... చంటి పిల్లలను గమనిస్తూనే, పెద్దపిల్లలపై దృష్టి సారించాలి. వారిని కూడా పట్టించుకుంటూ ఉండాలి. వయసులో పెద్దపిల్లలు చిన్నవారిని బాగా చూసుకోవాలని చెప్పాలి. వారిమధ్య సంబంధాన్ని వివరించాలి. పిల్లల ఆందోళనను అర్థం చేసుకోవాలి. పిల్లలందరికీ సమప్రాధాన్యత ఇవ్వడం వల్ల వారిమధ్య ఆత్మన్యూనత తలెత్తదు. సోదర, సోదరుల మధ్య ప్రేమ, దయ, జాలి లక్షణాలు పెంపొందించి వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడటానికి కృషి చేయాలి. ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నించి, వారి మధ్య గొడవలకు గల కారణాలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం వల్ల వారిమధ్య ఆరోగ్య కరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. -
పశ్చాత్తాపం ద్వారానే నిత్యశాంతి!
ఒకసారి సీమోను అనే పరిసయ్యుడు యేసును తన ఇంటికి విందుకు పిలిచాడు. పాపాత్మురాలిగా ముద్రపడిన ఒక స్త్రీ ఆహ్వానం లేకుండానే అక్కడికొచ్చింది. యేసును అత్తరుతో అభిషేకించి, ఏడుస్తూ కన్నీటితో ఆయన పాదాలు తడిపి, తలవెంట్రుకలతో తుడిచి, వాటికి ముద్దు పెట్టింది. నిజానికి ఇంటికొచ్చిన అతిథి కాళ్లు ఇంటి సేవకులు కడిగితే ఇంటి యజమాని అతనికి ముద్దుపెట్టి సాదరంగా లోనికి తీసుకెళ్లడం నాటి ప్రముఖులైన యూదుల ఇళ్లలోని ఆచారం. తాను చేయని పనులన్నీ ఆమె చేస్తూంటే అభ్యంతర పెట్టని సీమోను, ఈయన నిజంగానే ప్రవక్త అయితే ఆమె పాపాత్మురాలన్న విషయం గ్రహిస్తాడని మనసులో అనుకున్నాడు. యేసు అది గ్రహించి, ‘ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె చేసిన విస్తారమైన పాపాలూ క్షమించబడ్డాయి’ అంటూ, శాంతి గల దానవై వెళ్లమంటూ ఆమెను దీవించాడు (లూకా 7:36-50). ‘లోకంలో అందరూ పాపులే! కాకపోతే కొందరు క్షమించబడిన పాపులు, మరికొందరు ఇంకా క్షమించబడని పాపులు’అన్న సత్యాన్ని ప్రభువు సీమోనుకు పరోక్షంగా తెలిపాడు. సీమోను అతిథి మర్యాదలు చేయకపోగా, ఆ లోటును ఆ స్త్రీ పశ్చాత్తాపంతో కూడిన తన దివ్యప్రవర్తనతో పూడ్చి ఆ విందుకే అందాన్ని తెచ్చింది. అనామకురాలు, సమాజం చేత తృణీకరించబడినదే అయినా ఎంతో నిశ్శబ్దంగా ఆమె చేసిన అసమానమైన ఆనాటి ఆరాధన చరిత్ర పుటలకెక్కింది. దేవుని చేతే శ్లాఘింపబడింది. మనిషిదీ దేవునిదీ, పశ్చాత్తాపానికి, ప్రేమకూ మధ్య ఉన్న అనుబంధమే! యేసే ఇంటికొచ్చినా ఆయన నుండి నిత్యజీవాన్ని పొందలేకపోయిన దురదృష్టవంతుడు సిమోను కాగా, పిలవని అతిథిగా వచ్చి ప్రభువు పాదాల వద్ద తన పాపాల భారాన్నంతా వదిలించుకుని ఆయన ప్రసాదించిన శాంతిని, క్షమాపణను మూటగట్టుకుని వెళ్లిన ధన్యజీవి ఆ అనామకపు స్త్రీ!! అందుకే దేవుడిచ్చే నిత్యశాంతిని పొందడం, కోటిరూపాయలు కూడబెట్టినంత తేలిక కాదని మనం గ్రహించాలి. పాస్ పోర్టున్నోళ్లంతా విదేశాలకు వెళ్లినవాళ్లు కానట్టే, దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పేవాళ్లంతా నిత్యశాంతిని పొందిన వాళ్లు కాదు. చెమటోడ్చి పని చేసే రోజు కూలీ తన పూరి గుడిసెలోనే పచ్చడి మెతుకులు తిని, చింకిచాప మీద ఒళ్లు మరచి నిద్రపోతుంటే, ఏసీ గదుల్లో బతికే ధనికులు, బడాబాబులు ఆకలి లేక, నిద్ర రాక అలమటించడం వెనుక రహస్యం అదే! దేవుని నిత్యశాంతి అనే నది ‘పశ్చాత్తాపం’ అనే కాలువ ద్వారానే విశ్వాసి జీవితంలోకి ప్రవహిస్తుంది. ప్రేమ, నిస్వార్థత, కరుణ, పరిశుద్ధత, పరోపకారం, నిర్భయత్వం, నీతి అనే వృక్షాలు ఆ నీటితోనే విశ్వాసి జీవితంలో ఎదిగి ఫలిస్తాయి. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఈవ్‌టీ జింగ్ బంద్?
21 రోజులుగా నమోదు కాని టీజింగ్ కేసు షీట్‌మ్ ఏర్పాటే కారణం సిటీబ్యూరో: నగరంలో ఈవ్‌టీజింగ్ బంద్ అయ్యిందా? ఈవ్‌టీజర్లు పారిపోయారా? లేక ప్రవర్తన మార్చుకున్నారా ?... గత 21 రోజుల నుంచి షీ టీమ్ పోలీసులకు ఒక్క ఈవ్ టీజర్ దొరక్కపోవడం.. ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈవ్‌టీజింగ్‌కు పేరుగాంచిన మెహిదీపట్నం, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కోఠి, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో సైతం ఈవ్ టీజింగ్ జాడలు కనుమరుగయ్యాయి. నగరంలోని బస్టాపు, రైల్వేస్టేషన్లు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, మార్కెట్ల వద్ద మహిళలు ఎదుర్కొంటున్న ఈవ్‌టీజింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు రెండు నెలల క్రితం అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా నేతృత్వంలో నగరంలో 100 షీటీమ్‌లను కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఈ ప్రత్యేక పోలీసు బృందాలు ఆయా ప్రాంతాలలో సివిల్ దుస్తుల్లో కాపు కాశాయి. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న వారిని వీడియోలో బంధించి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ఇలా వీరు రెండు నెలల్లో సుమారు 82 కేసులు నమోదు చేశారు. వీరిలో 11 మందిని జైలుకు కూడా పంపారు. కౌన్సెలింగ్ చేయడం ద్వారా ప్రవర్తన మార్చుకున్న 20 మంది విద్యార్థులు తాము సైతం ఈవ్‌టీజింగ్‌కు చెక్ పెట్టేందుకు కళాశాలలు, బస్టాప్‌ల వద్ద ప్రచారం చేశారు. బస్సులు, ఆటోలు, ఎంఎంటీఎస్ రైళ్లలో సైతం పోలీసులు విస్తృతంగా ఈవ్ టీజింగ్ కలిగే అనర్థాలపై ప్రచారం చేసి మహిళలకు భరోసా ఇచ్చారు. ఎవరైనా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రచారం చేయడంతో పాటు 10 నిముషాలలో ఘటనా స్థలానికి చేరుకునేలా పోలీసులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ రెండు నెలల్లో 100 నెంబర్నుంచి వచ్చిన ఫిర్యాదులను ఏసీపీలు కవిత, శ్రీనివాస్‌లు స్వీకరించి వెంటనే రంగంలో ఉన్న షీ టీమ్స్ ఎస్ఐలు ముత్యాలు, రాజేందర్‌గౌడ్, రమేష్‌గౌడ్, రమేష్, బ్రహ్మచారి, హరికృష్ణలను అప్రమత్తం చేసి పది నిముషాల్లో ఘటనా స్థలానికి చేరుకునేలా చేశారు. షీ టీమ్స్ ప్రచారం వల్ల నగరంలో ఈవ్‌టీజింగ్ జాడ లేకుండా పోయింది. అప్రమత్తంగా ఉన్నాం: ఈవ్‌టీజింగ్ కోసం మేము తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. రెండు నెలల పాటు టాస్క్ఫోర్, సీసీఎస్ పోలీసులు చాలా కృషి చేశారు. 21 రోజుల నుంచి ఈవ్‌టీజింగ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఈవ్‌టీజింగ్ బంద్ అయ్యిందని అనుకుంటున్నాం. అయినా మేము అప్రమత్తంగానే ఉన్నాం. షీ టీమ్స్ కూడా నిరంతరం రంగంలో ఉంటాయి. ఈవ్‌టీజింగ్ చేస్తున్నట్టు అనిపిస్తే వెంటనే 100కు ఫోన్ చేయాలి. మహిళల నుంచి కూడా తమకు మంచి స్పందన వచ్చింది. -స్వాతిలక్రా, అదనపు పోలీసు కమిషనర్ -
విలువలు పాటించండి..!
బీజేపీ కొత్త ఎంపీలకు మోడీ దిశానిర్దేశం సూరజ్‌కుండ్‌లో ప్రారంభమైన శిక్షణ శిబిరం న్యూఢిల్లీ: ‘ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెంటులోనూ, ప్రజల్లో ఉన్నప్పుడూ మీ వ్యవహార శైలి, ప్రవర్తనపై దృష్టి పెట్టండి. విలువలతో కూడిన ప్రజాజీవితం గడపండి. మీ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయండి. సుపరిపాలన సందేశాన్ని వ్యాప్తి చేయండి’.. తొలిసారి పార్లమెంటులో అడుగుపెడుతున్న బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన కర్తవ్య బోధ ఇది. లోక్‌సభ, రాజ్యసభల్లో తొలిసారి అడుగుపెడుతున్న బీజేపీ ఎంపీలకు రెండురోజుల శిక్షణశిబిరాన్ని ఢిల్లీ శివార్లలోని సూరజ్‌కుండ్(హర్యానా)లో శనివారం మోడీ ప్రారంభించారు. ‘పార్లమెంటు సభ్యుడు కావడం గొప్పవిషయం. ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి రావడమంటే కొన్ని సీట్లు మారి అటునుంచి ఇటు వచ్చినట్లు కాదు. ఇదో కీలక మార్పు. ఇప్పుడు మీపై బాధ్యతలు మరింత పెరిగిన విషయాన్ని గుర్తించాలి’ అని వారికి బోధించారు. ‘నేనూ లోక్‌సభకు మొదటిసారే వచ్చాను. నేను కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది’ అన్నారు. నూతన ఎంపీలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కొందరు ఎగతాళి చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయ వ్యవస్థల్లో మానవవనరుల అభివృద్ధికి శిక్షణ వ్యవస్థ లేకపోవడం పెద్ద లోపమని వ్యాఖ్యానించారు. మోడీ దిశానిర్దేశం లోని కొన్ని ముఖ్యాంశాలు.. ⇒ సహచరులతో విభేదాలుంటే వాటిని బహిరంగంగా వ్యక్తపరచవద్దు. అంతా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్న స్నేహితుల్లా, ఒక కుటుంబంలా వ్యవహరించాలి. ⇒ చిన్నచిన్న విషయాలకు హైరానా పడవద్దు. రాజకీయాల్లో ఫుల్స్టాప్ ఉండదు. ⇒ పార్లమెంటులో చేసే ప్రసంగంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. అది క్లుప్తంగా ఉండేలా చూసుకోండి. వివిధ అంశాలపై లోతైన పరిజ్ఞానం పెంచుకోండి. ⇒ ఆరునెలల్లో నియోజకవర్గ అభివృద్ధిపై నివేదికను సిద్ధం చేయండి. ⇒ పార్లమెంటు రూల్‌బుక్‌ను భగవద్గీతలా భావించండి. దాన్ని అతిక్రమించకండి. ⇒ సభాధ్యక్షుడిని గౌరవించాలి. వారి అనుమతి లేకుండా చట్ట సభలో ఏమీ చేయకూడదు. ప్రభుత్వ నిర్ణయాలకు ఎంపీలు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారే పనులు చేసి విపక్షాలకు విమర్శించే అవకాశం ఇవ్వొద్దు. ⇒ కుటుంబపాలన, అవినీతితో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోరపరాజయం ఎదురైంది. అలాంటి మచ్చ తెచ్చుకోకుండా వాటికి దూరంగా ఉండాలి. ⇒ దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలేవీ తీరలేదన్న విషయాన్ని వీలైన ప్రతీచోటా ప్రముఖంగా ప్రస్తావించండి. పార్టీ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోండి. శిక్షణతో నాణ్యత..రాజ్‌నాథ్ కార్యక్రమంలో అధ్యక్షోపన్యాసం చేసిన రాజ్‌నాథ్ సింగ్.. ఇలాంటి శిక్షణల ద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను అత్యంత నాణ్యమైన ప్రజాస్వామ్యంగా రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని, ప్రజల ఆకాంక్షల భారాన్ని అర్థం చేసుకోవాలని ఎంపీలకు సూచించారు. కార్పొరేట్ సంస్థల వలలో చిక్కుకుపోవద్దని, కార్యదర్శుల నియామకంలో జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కొత్త ఎంపీలను హెచ్చరించారు. కొన్నేళ్ల క్రితం ప్రశ్నలడిగేందుకు డబ్బులు తీసుకుని సస్పెండ్ అయిన ఎంపీల ఉదంతాన్ని ఆమె గుర్తుచేశారు. శిక్షణ శిబిరానికి 170 మంది లోక్‌సభ, 25 మంది రాజ్యసభ సభ్యులకు ఆహ్వానాలు వెళ్లగా నలుగురైదుగురు మినహా అంతా హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. కాగా, బీజేపీ శిక్షణ కార్యక్రమంపై కాంగ్రెస్ వ్యంగ్యోక్తులు విసిరింది. ‘మొదటిసారి ఎంపీగా ఎన్నికైన నరేంద్ర మోడీ.. పార్లమెంటరీ వ్యవస్థ లోతుపాతుల గురించి 195 మంది కొత్త ఎంపీలకు పాఠాలు చెబుతున్నారు. ఇది వింతగా లేదూ?’ అంటూ ట్విట్టర్లో పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ఆదివారం ట్వీట్ చేశారు. -
తొలి గురువులకు మలిపాఠం
నేను సైతం.. పిల్లలకు తల్లిదండ్రులే తొలిగురువులు అన్నారు. నిజమే...ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మానాన్నల మాటలు, ప్రవర్తన, అలవాట్లు... ఇలా చెప్పుకుంటూపోతే అన్నింటిలో వారి ప్రభావం పిల్లలపై ఉంటుంది. పిల్లల భవిష్యత్తుకోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి, అవసరమైతే అప్పులు చేసి చదివిస్తున్న ఎంతోమంది తల్లిదండ్రులు తమ ప్రవర్తన వల్ల ఇబ్బందిపడుతున్న పిల్లల మనసుల గురించి ఆలోచించడం లేదని ఆవేదన పడతారు అనంతపురానికి చెందిన టీచర్ నల్లారి రాజేశ్వరి. ఓ ఉపాధ్యాయురాలిగా పిల్లలకు పాఠాలు చెప్పి ఊరుకోకుండా... వారి తల్లిదండ్రులకు ఉచిత కౌన్సెలింగ్‌లు ఇస్తూ తన వంతు సాయం చేస్తున్నారు రాజేశ్వరి. పిల్లలు చదువుకోబోయే పాఠశాల ఎంత విశాలంగా ఉండాలి, ఎంత శుభ్రంగా ఉండాలి, ఉపాధ్యాయుల బోధన బాగుంటుందా లేదా... ఇలా సవాలక్ష విచారణల తర్వాత గాని బిడ్డను స్కూల్లో చేర్పించడం లేదు. ‘మరి మీరెలా ఉంటున్నారు? మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది?’ అని విద్యార్థుల తల్లిదండ్రుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు రాజేశ్వరి టీచర్. ‘‘నాలుగో తరగతిలో ఒకబ్బాయి చాలా చురుగ్గా ఉండేవాడు. బాగా చదువుతాడు కూడా. ఉన్నట్టుండి నిరాశతో నీరసంగా అయిపోయాడు. నేను చాలా దగ్గరగా గమనించి వాళ్ల అమ్మానాన్నలకు కబురు పంపాను. అబ్బాయి తల్లి వచ్చింది. ఎంతసేపు మాట్లాడినా అసలు విషయం చెప్పలేదు. చివరికి తన కష్టాలు చెప్పింది. రోజు సాయంత్రమయ్యేసరికి తన భర్త తాగొచ్చి ఇంట్లో గోల చేస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి ప్రవర్తన కారణంగా పిల్లాడిలో చురుకుదనం పోయి ఏదో నలతపడ్డవాడిలా కనిపిస్తున్నాడని చెప్పింది. ఆ తల్లి మాటలు వినగానే నా మనసు గందరగోళంలో పడిపోయింది. అప్పటికి ఆమెకు నాలుగు ఓదార్పు మాటలు చెప్పి పంపించేశాను. తర్వాత పిల్లల తల్లిదండ్రులకు ‘ఇంటి వాతావరణం’ పై కౌన్సెలింగ్ ఇవ్వాలని నిశ్చయించుకున్నాను’’ అని చెప్పారు రాజేశ్వరి. అనంతపురం రాంనగర్‌లోని పాఠశాలలో ప్రతి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమె కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఇతరులకు కూడా... పేద విద్యార్థులకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహిస్తున్న రాజేశ్వరి టీచర్ ఆదివారం మాత్రం కౌన్సెలింగ్‌లతో బిజీగా ఉంటారు. ఆమె కౌన్సిలింగ్ కోసం విద్యార్థుల తల్లిదండ్రులే కాదు...చుట్టుపక్కల సమస్యలతో ఇబ్బందిపడుతున్న చాలామంది భార్యాభర్తలు వస్తుంటారు. ‘‘నా స్కూల్లో చాలామంది పిల్లల తల్లిదండ్రులు నా దగ్గర వారి సమస్యలు చెప్పుకుని పరిష్కారాలు తెలుసుకుని పిల్లల కోసం వారిని వారు మార్చుకున్నారు. తమ కోసం తాము మారని చాలామంది తల్లిదండ్రులు పిల్లలకోసం మారతారని నిరూపించారు. విషయాల్లో మారకపోయినా... పిల్లలకు కావాల్సిన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ఉన్నంతలో ప్రయత్నించారు. నా కౌన్సెలింగ్ గురించి తెలిసిన ఇతరులు కూడా నా దగ్గరకు రావడం మొదలుపెట్టారు. పిల్లలకు పాఠాలు చెప్పే నేను ఆదివారమయ్యేసరికి పెద్దలకు పాఠాలు చెప్పే సైకియాట్రిస్ట్‌గా మారిపోవాల్సివస్తోంది. నేనే కాదు... ఉపాధ్యాయులెవరైనా సరే తెలిసింది చెప్పకుండా, వచ్చింది నేర్పకుండా ఉండలేరు కదా’’ అని నవ్వుతూ అన్నారు రాజేశ్వరి టీచర్. ఆమె లాంటి వారి అవసరం విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఉంది కదూ! -
జగన్‌లా వేషం వేశారన్న అభిమాని పై దాడి చేసిన టీడీపీ