సాక్షి, నెల్లూరు: మాజీ మంత్రి నారాయణ ఒక డేగలా తనపై కన్నేశాడంటూ ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. ‘‘డేగ.. ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్టు నా పరిస్థితి మారింది. ఇంట్లో భార్య ఉండగానే నేను అన్నం తీసుకురాలేదని నారాయణ కొట్టాడు. నన్ను టార్చర్ చేసేవాడు’’ అంటూ నారాయణ తమ్ముడి భార్య ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నారాయణ నన్ను తీవ్రంగా హింసిస్తున్నారు. అర్ధరాత్రి పూట నన్ను టార్చర్ పెడుతున్నారంటూ ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ప్రియా పొంగూరు కన్నీటి పర్యంతమయ్యారు.
గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియా.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment