బంజారాహిల్స్: పెళ్లికి ముందు మద్యం మత్తులో అసభ్యకంగా ప్రవర్తించడంతోపాటు పెళ్లికుమార్తె మీద దాడికి పాల్పడిన వ్యవహారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెళ్లికొడుకు ప్రవర్తనతో పెళ్లి రద్దు కాగా తీసుకున్న ఆభరణాలను, పెళ్లి ఏర్పాట్ల కోసం పెట్టిన డబ్బు తిరిగి ఇవ్వలేదంటూ పెళ్లికుమార్తె ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదయింది. వివరాలివీ... జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే యువతి(24) కుటుంబానికి కామన్ ఫ్రెండ్స్ ద్వారా చిత్తూరు పట్టణంలో ప్రముఖ ఫైనాన్స్ వ్యాపారి, తేజ స్వీట్స్ అధిపతి ఎ.రవిబాబు కుటుంబంతో పరిచయం ఏర్పడింది. తమ కొడుకు ఎ.వైష్ణవ్(27)తో పెళ్లి సంబంధం ప్రతిపాదనను యువతి కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇరువర్గాలు అంగీకరించాయి. పెళ్లి కోసం రూ. 3 కోట్లు కట్నంగా ఇవ్వాలని, పెళ్లిని ఆడంబరంగా డెస్టినేషన్ మ్యారేజ్‌లా చేయాలని వైష్ణవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
► ఈ క్రమంలో పెళ్లికి అంగీకరించిన యువతి కుటుంబ సభ్యులు గత ఏడాది సెపె్టంబర్‌లో ఎంగేజ్‌మెంట్‌ను తిరుపతిలోని తాజ్ హోటల్‌లో అరేంజ్ చేశారు. చివరి నిమిషంలో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసిన వైష్ణవ్ కుటుంబ సభ్యులు నవంబర్ 20న లగ్న పత్రిక రాసుకున్నారు. ఆ సమయంలో రూ. 6 లక్షల విలువచేసే డైమండ్ రింగ్, రూ. 2 లక్షల విలువ చేసే రోలెక్స్ వాచీ, రూ. 2 లక్షల విలువైన బంగారు గొలుసును వైష్ణవ్‌కు పెట్టారు.
► ఫిబ్రవరి 9న మొయినాబాద్‌లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్స్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఫిబ్రవరి 7 నుంచి 10 దాకా బుక్ చేశారు. పెళ్లి ఏర్పాట్ల కోసం రూ. 50 లక్షలను ఖర్చు చేశారు. కాగా ఫిబ్రవరి 7న రిసార్ట్‌కు వచి్చన బంధువులంతా మరుసటి రోజున సంగీత్ కార్యక్రమానికి సన్నాహాలు ప్రారంభించారు. అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో సంగీత్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించారు.
► అప్పటికే వైష్ణవ్‌తో పాటు స్నేహితులంతా కలిసి మద్యం సేవించారు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పీకలదాకా మద్యం సేవించి మత్తులో ఉన్న వైష్ణవ్ కొరియోగ్రాఫర్‌తో పాటు ఇతర మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గమనించిన పెళ్లికూతురు నిలదీసింది. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. స్నేహితులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
►మరోసారి అదే విధంగా ప్రవర్తించడంతో గట్టిగా మందలించిన పెళ్లికూతురిపై వైష్ణవ్ బూతులు మాట్లాడటంతో పాటు దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న ఆమె సోదరుడు అడ్డుకునేందుకు యతి్నంచగా అతడిపై స్నేహితులతో కలిసి దాడి చేశారు.
►తన కళ్లముందే మద్యం సేవించడంతో పాటు డ్రగ్స్ తీసుకుంటూ మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వైష్ణవ్‌ను పెళ్లి చేసుకునేదిలేదని పెళ్లి కుమార్తె తేల్చిచెప్పింది. దీంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లిని రద్దు చేశారు.
► పెళ్లి కోసం పెట్టిన రూ. 50 లక్షల ఖర్చును, తమకు పెట్టిన ఆభరణాలను తిరిగి ఇస్తామని చెప్పిన వైష్ణవ్ కుటుంబ సభ్యులు ముఖం
చాటేశారు.
► రెండు నెలలు గడిచినా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న వైష్ణవ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బా«ధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను
ఆశ్రయించారు.
► ఈ మేరకు వైష్ణవ్, అతడి తండ్రి ఎ.రవిబాబు, తల్లి దేవితో పాటు బంధువులు తేజు, శ్రవణ్, శరత్‌కుమార్‌రెడ్డి తదితరులపై ఐపీసీ 354, 420, 406, 506లతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment