obscene comments
-
3 కోట్లు కట్నం .. పెళ్లికి ముందు మద్యం మత్తులో యువకుడి వీరంగం
బంజారాహిల్స్: పెళ్లికి ముందు మద్యం మత్తులో అసభ్యకంగా ప్రవర్తించడంతోపాటు పెళ్లికుమార్తె మీద దాడికి పాల్పడిన వ్యవహారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెళ్లికొడుకు ప్రవర్తనతో పెళ్లి రద్దు కాగా తీసుకున్న ఆభరణాలను, పెళ్లి ఏర్పాట్ల కోసం పెట్టిన డబ్బు తిరిగి ఇవ్వలేదంటూ పెళ్లికుమార్తె ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదయింది. వివరాలివీ... జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే యువతి(24) కుటుంబానికి కామన్ ఫ్రెండ్స్ ద్వారా చిత్తూరు పట్టణంలో ప్రముఖ ఫైనాన్స్ వ్యాపారి, తేజ స్వీట్స్ అధిపతి ఎ.రవిబాబు కుటుంబంతో పరిచయం ఏర్పడింది. తమ కొడుకు ఎ.వైష్ణవ్(27)తో పెళ్లి సంబంధం ప్రతిపాదనను యువతి కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇరువర్గాలు అంగీకరించాయి. పెళ్లి కోసం రూ. 3 కోట్లు కట్నంగా ఇవ్వాలని, పెళ్లిని ఆడంబరంగా డెస్టినేషన్ మ్యారేజ్‌లా చేయాలని వైష్ణవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ► ఈ క్రమంలో పెళ్లికి అంగీకరించిన యువతి కుటుంబ సభ్యులు గత ఏడాది సెపె్టంబర్లో ఎంగేజ్‌మెంట్‌ను తిరుపతిలోని తాజ్ హోటల్లో అరేంజ్ చేశారు. చివరి నిమిషంలో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసిన వైష్ణవ్ కుటుంబ సభ్యులు నవంబర్ 20న లగ్న పత్రిక రాసుకున్నారు. ఆ సమయంలో రూ. 6 లక్షల విలువచేసే డైమండ్ రింగ్, రూ. 2 లక్షల విలువ చేసే రోలెక్స్ వాచీ, రూ. 2 లక్షల విలువైన బంగారు గొలుసును వైష్ణవ్‌కు పెట్టారు. ► ఫిబ్రవరి 9న మొయినాబాద్‌లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్స్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఫిబ్రవరి 7 నుంచి 10 దాకా బుక్ చేశారు. పెళ్లి ఏర్పాట్ల కోసం రూ. 50 లక్షలను ఖర్చు చేశారు. కాగా ఫిబ్రవరి 7న రిసార్ట్‌కు వచి్చన బంధువులంతా మరుసటి రోజున సంగీత్ కార్యక్రమానికి సన్నాహాలు ప్రారంభించారు. అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో సంగీత్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ► అప్పటికే వైష్ణవ్‌తో పాటు స్నేహితులంతా కలిసి మద్యం సేవించారు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పీకలదాకా మద్యం సేవించి మత్తులో ఉన్న వైష్ణవ్ కొరియోగ్రాఫర్‌తో పాటు ఇతర మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గమనించిన పెళ్లికూతురు నిలదీసింది. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. స్నేహితులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ►మరోసారి అదే విధంగా ప్రవర్తించడంతో గట్టిగా మందలించిన పెళ్లికూతురిపై వైష్ణవ్ బూతులు మాట్లాడటంతో పాటు దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న ఆమె సోదరుడు అడ్డుకునేందుకు యతి్నంచగా అతడిపై స్నేహితులతో కలిసి దాడి చేశారు. ►తన కళ్లముందే మద్యం సేవించడంతో పాటు డ్రగ్స్ తీసుకుంటూ మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వైష్ణవ్‌ను పెళ్లి చేసుకునేదిలేదని పెళ్లి కుమార్తె తేల్చిచెప్పింది. దీంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లిని రద్దు చేశారు. ► పెళ్లి కోసం పెట్టిన రూ. 50 లక్షల ఖర్చును, తమకు పెట్టిన ఆభరణాలను తిరిగి ఇస్తామని చెప్పిన వైష్ణవ్ కుటుంబ సభ్యులు ముఖం చాటేశారు. ► రెండు నెలలు గడిచినా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న వైష్ణవ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బా«ధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ► ఈ మేరకు వైష్ణవ్, అతడి తండ్రి ఎ.రవిబాబు, తల్లి దేవితో పాటు బంధువులు తేజు, శ్రవణ్, శరత్‌కుమార్‌రెడ్డి తదితరులపై ఐపీసీ 354, 420, 406, 506లతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంతగా దిగజారాలా..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీటు కోసం నోటి దురుసు..! రాజకీయ గుర్తింపు కోసం నీచాతినీచంగా మాట్లాడాలా? బాస్ మెప్పు కోసం నోటికి పని చెప్పాలా..? అంటూ మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులే కాకుండా టీడీపీ వర్గాలు సైతం ఆమె వ్యాఖ్యల పట్ల విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. కావలి ప్రతిభాభారతి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకురాలిగా పేరు సంపాదించారు. ప్రస్తుతం విజయనగరంలో కలిసిపోయిన రాజాం నుంచి ఆమె ప్రాతినిథ్యం వహించారు. ప్రతిభాభారతి వారసురాలి గా గ్రీష్మ కొన్నాళ్లు ఇక్కడ హల్చల్ చేసినా ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఇన్నాళ్లూ ఉండి మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయనగా మళ్లీ జిల్లాకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒంగోలు వేదికగా జరిగి న టీడీపీ మహానాడులో అసభ్య పదజాలంతో ప్రసంగించి అధినేత చంద్రబాబు దృష్టిలో పడడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రసంగంతో పాటు ఆమె వైఖరి కూడా సర్వత్రా విమర్శల పాలవుతోంది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెను సమర్థించలేకపోతున్నారు. ఉన్నత పద వులు అలంకరించిన కుటుంబానికి చెందిన వ్యక్తిగా.. హుందాగా వ్యవహరించాల్సిన మహిళ ఇలా నిండు సభలో నోటి కి అదుపు లేకుండా మాట్లాడడాన్ని అంతా ఖండిస్తున్నారు. టిక్కెట్ కోసమేనా ఇదంతా..? గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నుంచి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. రాజకీయంగా జిల్లాలో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. కాలక్రమేణా ఆమె రాజకీయంగా బలహీనమయ్యా రు. ఆ పార్టీలోని గ్రూపు తగాదాలు, నేతల మధ్య విభేదాల తో పట్టు కోల్పోయారు. ఈ క్రమంలో తల్లి స్థానాన్ని తాను భర్తీ చేయాలని గ్రీష్మ తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్న రాజాం నుంచి పోటీ చే యాలని అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గం ఇప్పుడు వి జయనగరం జిల్లాలో ఉంది. అక్కడ టీడీపీలో తనకు పో టీగా కోండ్రు మురళీమోహన్ ఉండటం, ఆయనకు టిక్కె ట్ వస్తుందేమోనన్న అభద్రతాభావంతో ఇలా అధినేత దృష్టిలో పడడానికి పాట్లు పడుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
'ధోనికి మీరిచ్చే విలువ ఇదేనా'
ముంబై : ఐపీఎల్ 13వ సీజన్లో బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే గెలిచే మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా ధోని, కేదార్ జాదవ్ ఆటతీరుపై ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే కొంతమంది మాత్రం క్రికెటర్ల కుటుంబసభ్యులను టార్గెట్ చేసుకొని అసభ్యకరవ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఎంఎస్ ధోని కూతురు జీవాపై నీచమైన వ్యాఖ్యలు చేయడం పట్ల జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్ కూడా అయింది. తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా.. మ్యాచ్ ఓడిపోతే దానికి ఆటగాళ్ల కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డాడు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించి దిగ్గజ కెప్టెన్ల సరసన నిలిచిన ధోని లాంటి ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ పేర్కొన్నాడు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. (చదవండి : ‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’) 'ఇది మనమందరం పరిష్కరించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. ఇది కేవలం క్రీడకు సంబంధించిందో లేక వ్యక్తిగత విషయమో కాదు.. దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్న విషయం. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు.. అవతలి వ్యక్తికి అది చదివినప్పుడు చాలా డిస్టర్బ్ అవుతాడు. ఆటగాడిని విమర్శించడం వరకు ఓకే కానీ.. కుటుంబసభ్యులను ముడిపెడుతూ వ్యక్తిగత దూషణలు దిగడం తగదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరికి కుటుంబం ఉంటుంది.. పిల్లలు ఉంటారు. నాకు కొడుకు, కూతురు ఉన్నారు.. నా వృత్తి రిత్యా కొంతమంది మహిళలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆటలో ఎంఎస్ ధోని ప్రదర్శన గురించి ఎన్ని కామెంట్స్ రాసినా పట్టించుకోరు.. ఎందుకంటే అది ఆట.. అందులోనూ ప్రతీ ఆటగాడికి గడ్డుకాలం నడుస్తుంది. దీన్ని సాకుగా తీసుకొని కుటుంబసభ్యుల వరకు వెళ్తే ఎవరు ఊరుకోరు. మేము మనుషులమే.. మాకు మనుసులుంటాయి. ఎదుటివారి గురించి హాస్యాస్పదంగా చెప్పినంత వరకు మంచిగానే ఉంటుంది.. కానీ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో మీ వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను ఎంటర్టైన్మెంట్ జోనర్ వరకు ఉపయోగించండి తప్పులేదు.. ఉదా : ఆటగాళ్లు సరిగా ఆడడం లేదని ట్రోల్ చేయడం.. వారి ఆటతీరుపై ఫన్నీ మీమ్స్ పెట్టడం లాంటివి ఓకే. (చదవండి : జీవా ధోనికి భద్రత పెంపు) కానీ ఇదే సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని మరీ పిచ్చిరాతలు రాసున్నారు. అభిమానం పేరుతో హద్దుమీరి ప్రవర్తిస్తూ అసభ్యపరుషజాలం ఉపయోగిస్తున్నారు. కరోనా కాలంలో ఇలాంటివి మరీ ఎక్కువైపోయాయి.ఈరోజు ధోని, సచిన్ లాంటి వ్యక్తుల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల గురించి మాట్లాడేందుకు ముందుకు రావడం సిగ్గుగా ఉంది. టీమిండియాలో క్రికెట్ బతికున్నంత కాలం వారి పేర్లు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఎప్పటికి వాళ్లు దిగ్గజాలుగాను కనబడుతారు. అలాంటి వ్యక్తులు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు. కానీ ఇదంతా ఒక నాన్సెన్స్.. ఒక భారతీయుడిగా ఇలాంటి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ' విరుచుకుపడ్డాడు. కాగా ప్రజ్ఞాన్ ఓజా టీమిండియా తరపున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. -
ఫేస్బుక్లో దిశపై అసభ్య ప్రచారం
సాక్షి, హైదరాబాద్: యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతపరిచిన దిశ కేసులో పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో బాధ్యతరాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. బాధితురాలిని కించపరిచేలా, అత్యాచారాలను సైతం సమర్థించేలా కొందరు వికృతంగా కామెంట్లు పెడుతున్నారు. నీచంగా పెడుతున్న కామెంట్లు ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. వాటిపై పోలీసులు కూడా సత్వరంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిపై సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌కు చెందిన స్టాలిన్ శ్రీరామ్‌ను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి పేరుతో సోషల్ మీడియాలో నిందితుడు ఆన్లైన్లో అసభ్య ప్రచారం చేశాడు. ఫేస్బుక్లో ఒక గ్రూప్‌గా ఏర్పడి దిశపై ఇష్టారీతిలో శ్రీరామ్ గ్యాంగ్ కామెంట్లు చేసింది. ఈ ఘటన తమ దృష్టికి రావడంతో సుమోటోగా పోలీసులు కేసును స్వీకరించారు. -
జిమ్నాస్ట్‌పై లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లే కొద్ది గంటల ముందు కోచ్ మనోజ్ రాణా, చందన్ పాఠక్‌లు కలిసి ఓ జిమ్నాస్ట్‌ను అశ్లీల వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నెల 2న ఢిల్లీలో ప్రాక్టీస్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన లోదుస్తుల గురించి మనోజ్, చందన్ అసభ్యకరంగా మాట్లాడినట్టు ఆసియా గేమ్స్ జట్టులో చోటు దొరకని 20 ఏళ్ల జిమ్నాస్ట్ పేర్కొంది. ప్రస్తుతం మనోజ్, చందన్ జట్టుతో పాటు ఇంచియాన్‌కు బయలుదేరి వెళ్లారు. అయితే వీళ్లపై కేసు నమోదు చేశామని, అక్టోబర్ తొలి వారంలో ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. లైంగిక వేధింపులపై కోచ్, ఆటగాడు దోషిగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సమాఖ్య పేర్కొంది. ఇరాన్ అధికారిపై వేటు: దక్షిణ కొరియూ వుహిళా వాలంటీర్‌ను లైంగికంగా వేధించిన వ్యవహారంలో ఇరాన్ ఫుట్‌బాల్ ఎక్విప్మెంట్ మేనేజర్ అమెరెహ్ అహ్మద్‌పై వేటు పడింది. ఈ మేరకు ఆసియూ ఒలింపిక్ వుండలి (ఓసీఏ) అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయుం తీసుకుంది.