
సాక్షి, హైదరాబాద్: యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతపరిచిన దిశ కేసులో పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో బాధ్యతరాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. బాధితురాలిని కించపరిచేలా, అత్యాచారాలను సైతం సమర్థించేలా కొందరు వికృతంగా కామెంట్లు పెడుతున్నారు. నీచంగా పెడుతున్న కామెంట్లు ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. వాటిపై పోలీసులు కూడా సత్వరంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిపై సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌కు చెందిన స్టాలిన్ శ్రీరామ్‌ను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలి పేరుతో సోషల్ మీడియాలో నిందితుడు ఆన్‌లైన్‌లో అసభ్య ప్రచారం చేశాడు. ఫేస్‌బుక్‌లో ఒక గ్రూప్‌గా ఏర్పడి దిశపై ఇష్టారీతిలో శ్రీరామ్ గ్యాంగ్ కామెంట్లు చేసింది. ఈ ఘటన తమ దృష్టికి రావడంతో సుమోటోగా పోలీసులు కేసును స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment