జిమ్నాస్ట్‌పై లైంగిక వేధింపులు
Published Thu, Sep 18 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లే కొద్ది గంటల ముందు కోచ్ మనోజ్ రాణా, చందన్ పాఠక్‌లు కలిసి ఓ జిమ్నాస్ట్‌ను అశ్లీల వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నెల 2న ఢిల్లీలో ప్రాక్టీస్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన లోదుస్తుల గురించి మనోజ్, చందన్ అసభ్యకరంగా మాట్లాడినట్టు ఆసియా గేమ్స్ జట్టులో చోటు దొరకని 20 ఏళ్ల జిమ్నాస్ట్ పేర్కొంది. ప్రస్తుతం మనోజ్, చందన్ జట్టుతో పాటు ఇంచియాన్‌కు బయలుదేరి వెళ్లారు. అయితే వీళ్లపై కేసు నమోదు చేశామని, అక్టోబర్ తొలి వారంలో ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. లైంగిక వేధింపులపై కోచ్, ఆటగాడు దోషిగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సమాఖ్య పేర్కొంది.
ఇరాన్ అధికారిపై వేటు: దక్షిణ కొరియూ వుహిళా వాలంటీర్‌ను లైంగికంగా వేధించిన వ్యవహారంలో ఇరాన్ ఫుట్‌బాల్ ఎక్విప్‌మెంట్ మేనేజర్ అమెరెహ్ అహ్మద్‌పై వేటు పడింది. ఈ మేరకు ఆసియూ ఒలింపిక్ వుండలి (ఓసీఏ) అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయుం తీసుకుంది.
Advertisement
Advertisement