
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంలో ఆర్చర్ జ్యోతి సురేఖకు చోటుదక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఆగస్టు 19 నుంచి ఇండోనేసియాలోని జకర్తా వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో బరిలో దిగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడం ఆమెకు ఇది రెండోసారి.
ఆసియా క్రీడలకు ముందు సురేఖ జూన్ 19 నుంచి అమెరికాలో జరిగే ప్రపంచకప్ స్టేజ్–3, జూలై 16 నుంచి జర్మనీలో జరిగే వరల్డ్‌కప్ స్టేజ్–4 పోటీల్లో పాల్గొననుంది.
Comments
Please login to add a commentAdd a comment