Asian sport
-
ఆసియా క్రీడలకు జ్యోతి సురేఖ
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంలో ఆర్చర్ జ్యోతి సురేఖకు చోటుదక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఆగస్టు 19 నుంచి ఇండోనేసియాలోని జకర్తా వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో బరిలో దిగనుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనడం ఆమెకు ఇది రెండోసారి. ఆసియా క్రీడలకు ముందు సురేఖ జూన్ 19 నుంచి అమెరికాలో జరిగే ప్రపంచకప్ స్టేజ్–3, జూలై 16 నుంచి జర్మనీలో జరిగే వరల్డ్‌కప్ స్టేజ్–4 పోటీల్లో పాల్గొననుంది. -
2022 ఆసియా క్రీడల్లో వీడియో గేమ్స్
కువైట్ సిటీ: వీడియో గేమ్స్ ఇక చిన్న పిల్లల ఆట మాత్రమే కాదు... దేశానికి పతకం సాధించి పెట్టే క్రీడగా మారనుంది. 2022 ఆసియా క్రీడల్లో వీడియో గేమింగ్‌ను మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) బుధవారం ప్రకటించింది. చైనాలోని హాంగ్జులో 2022లో జరిగే ఆసియా క్రీడల్లో ఈ–స్పోర్ట్స్ (వీడియో గేమింగ్)ను అధికారికంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీనికి సన్నాహకంగా వచ్చే ఏడాది ఇండోనేసియాలో జరగనున్న ఆసియా క్రీడల్లో వీడియో గేమింగ్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. ఈమేరకు చైనాలోని ప్రముఖ ఈ–స్పోర్ట్స్ కంపెనీ అలీబాబా గ్రూప్‌కు చెందిన అలీస్పోర్ట్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ 11 ఏళ్ల పాటు ఈ–స్పోర్ట్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. కాగా ఆసియా క్రీడల్లో ఏ తరహా వీడియో గేమ్స్‌ను అనుమతిస్తున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ‘ఇన్నాళ్లూ సంప్రదాయ క్రీడలను అభివృద్ధి చేసిన ఓసీఏ రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త తరహా క్రీడలను అందుబాటులోకి తెస్తుందని’ ఓసీఏ ప్రెసిడెంట్ అహ్మద్ ఫహాద్ అల్ సబా అన్నారు. -
ఆశల పల్లకిలో...
నేటి నుంచి హాకీ వరల్డ్ లీగ్ బరిలో భారత జట్లు రియో ఒలింపిక్స్ బెర్త్‌పై మహిళల జట్టు గురి యాంట్‌వర్ప్ (బెల్జియం): ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత పురుషుల జట్టు... మూడున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో భారత మహిళల జట్టు... శనివారం మొదలయ్యే హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్)లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గత ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించి వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత పురుషుల జట్టు ఈ టోర్నమెంట్‌ను ప్రయోగాలకు వేదికగా చేసుకోనుంది. తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో తలపడనున్న సర్దార్ సింగ్ బృందం స్థాయికి తగ్గట్టు ఆడితే విజయంతో శుభారంభం చేసే అవకాశముంది. చీఫ్ కోచ్ పాల్ వాన్ యాస్ ఆధ్వర్యంలో భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో నూతన ప్రయోగాలకు పెద్దపీట వేసే అవకాశముంది. అగ్రశ్రేణి జట్లకు దీటుగా పోటీనిచ్చే స్థాయికి భారత జట్టు ఆటతీరు చేరుకుందని కోచ్ పాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. పెనాల్టీ కార్నర్లను సంపాదించడం, వాటిని గోల్స్‌గా మలచడంపైనే తమ దృష్టి ఉందన్నాడు. పురుషుల విభాగంలో మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, పోలండ్, ఫ్రాన్స్ ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో బ్రిటన్, బెల్జియం, మలేసియా, ఐర్లాండ్, చైనా జట్లకు చోటు కల్పించారు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య లీగ్ మ్యాచ్ జూన్ 26న జరుగుతుంది. మరోవైపు మహిళల జట్టు ఆతిథ్య బెల్జియంతో ఆడనుంది. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత మహిళల జట్టు మరోసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయింది. ఒకవేళ ఈ టోర్నీలో టాప్-3లో నిలిస్తే భారత జట్టుకు రియో ఒలింపిక్స్ బెర్త్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో మహిళల జట్టుపై అందరి దృష్టి నెలకొని ఉంది. భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు యెండల సౌందర్య (తెలంగాణ), రజని ఎతిమరపు (ఆంధ్రప్రదేశ్) ఉన్నారు. ‘తొలి మ్యాచ్‌లో గెలిస్తే తర్వాతి మ్యాచ్‌లకు ఆత్మవిశాస్వం పెరుగుతుంది. మా అందరి లక్ష్యం రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే’ అని కెప్టెన్ రితూ రాణి తెలిపింది. మహిళల విభాగంలోనూ మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో జపాన్, నెదర్లాండ్స్, అజర్బైజాన్, కొరియా, ఇటలీ... గ్రూప్ ‘బి’లో భారత్, బెల్జియం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పోలండ్ జట్లు ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక ఆయా గ్రూప్‌ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మహిళల విభాగంలో ఫైనల్ జులై 4న, పురుషుల విభాగంలో ఫైనల్ జులై 5న జరుగుతుంది. పురుషుల విభాగం భారత్ ఁ ఫ్రాన్స్ రాత్రి గం. 9.30 నుంచి మహిళల విభాగం భారత్ ఁ బెల్జియం రాత్రి గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
పోరాడి ఓడిన కశ్యప్
ఒడెన్స్: ఆసియా క్రీడల తర్వాత పాల్గొన్న తొలి సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో అంచనాలకు మించి రాణించిన పారుపల్లి కశ్యప్ సెమీఫైనల్లో నిష్ర్కమించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో కశ్యప్ 16-21, 15-21తో ప్రపంచ రెండో ర్యాంకర్, ప్రపంచ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. అంతకుముందు కశ్యప్ క్వార్టర్ ఫైనల్లో పెను సంచలనం సృష్టించాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 21-19, 21-15తో ప్రపంచ మూడో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను బోల్తా కొట్టించాడు. సెమీస్‌లో ఓడిన కశ్యప్‌కు 8,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 34 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది?
మాదిరి ప్రశ్నలు 1. 17వ ఆసియా క్రీడల్లో భారతదేశానికి ఎన్ని స్వర్ణ పతకాలు లభించాయి? 1) 14 2) 15 3)11 4) 10 2. {పపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? 1) సెప్టెంబర్ 5 2) అక్టోబర్ 5 3) అక్టోబర్ 6 4) అక్టోబర్ 24 3. 2014 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించిన జెఫ్ బెజోస్ ఏ ప్రముఖ కంపెనీకి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)? 1) గూగుల్ 2) మైక్రోసాఫ్ట్ 3) అమెజాన్ 4) ఫేస్బుక్ 4. 2014 చాంపియన్స లీగ్ ట్వంటీ20 టైటిల్‌ను గెలుచుకున్న జట్టు? 1) కోల్‌కతా నైట్ రైడర్స 2) కింగ్స ఎలెవన్ పంజాబ్ 3) నార్తర్న నైట్స్ 4) చెన్నై సూపర్ కింగ్స 5. చైనా ఓపెన్ పురుషుల టెన్నిస్ టైటిల్‌ను 2014 అక్టోబర్‌లో ఎవరు గెలుచుకున్నారు? 1) నొవాక్ జొకోవిచ్ 2) థామస్ బెర్డిచ్ 3) రోజర్ ఫెదరర్ 4) మిలోస్ రౌనిక్ 6. 17వ ఆసియా క్రీడల్లో అగ్రస్థానంలో నిలిచిన చైనా మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? 1) 151 2) 234 3) 200 4) 342 7. 2014 అక్టోబర్‌లో మెట్రోపొలిస్ సదస్సు ఏ నగరంలో జరిగింది? 1) ముంబై 2) బెంగుళూరు 3) న్యూఢిల్లీ 4) హైదరాబాద్ 8. ‘గ్రేటర్ దన్ బ్రాడ్‌మన్’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 1) నిర్మల్ శేఖర్ 2) రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ 3) శేఖర్ గుప్తా 4) సురేశ్ మీనన్ 9. 61వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సాంఘిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా ఎంపికైంది? 1) జాతీశ్వర్ 2) భాగ్ మిల్కా భాగ్ 3) నా బంగారు తల్లి 4) గులాబ్ గ్యాంగ్ 10. భారత 22వ నౌకాదళాధిపతిగా 2014 ఏప్రిల్‌లో ఎవరు బాధ్యతలు స్వీకరించారు? 1) డి.కె. జోషి 2) ఎన్.ఎ.కె. బ్రౌన్ 3) రాబిన్ కె. ధోవన్ 4) వి.కె.సింగ్ 11. ఆర్థిక కారణాల దృష్ట్యా 2019 ఆసియా క్రీడలు నిర్వహించొద్దని ఏ దేశం నిర్ణయించింది? 1) ఫిలిప్పీన్‌స 2) వియత్నాం 3) థాయ్‌లాండ్ 4) లావోస్ 12. కిందివాటిలో గుజరాత్లో ఉన్న అణు విద్యుత్ కేంద్రం? 1) కైగా 2) కల్పక్కం 3) కాక్రపార్ 4) తారాపూర్ 13. హంగేరి దేశ రాజధాని ఏది? 1) బ్రటిస్లావా 2) బుడాపెస్ట్ 3) ప్రేగ్ 4) సోఫియా 14. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన గారెత్ హాప్కిన్స ఏ దేశానికి చెందిన మాజీ వికెట్ కీపర్? 1) వెస్టిండీస్ 2) న్యూజిలాండ్ 3) దక్షిణాఫ్రికా 4) జింబాబ్వే 15. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన స్టెఫానీ రైస్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె ఏ దేశానికి చెందిన స్విమ్మింగ్ క్రీడాకారిణి? 1) ఆస్ట్రేలియా 2) యూకే 3) యూఎస్ఏ 4) దక్షిణాఫ్రికా 16. సాహిత్యంలో నోబెల్ గ్రహీత గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ ఇటీవల మరణించారు. ఆయన ఏ దేశానికి చెందిన రచయిత? 1) స్పెయిన్ 2) కొలంబియా 3) పెరూ 4) పోర్చుగల్ 17. రిచ్మండ్ ఓపెన్ స్క్వాష్ టైటిల్‌ను సాధించిన భారతీయ క్రీడాకారిణి? 1) జోష్నా చినప్ప 2) దీపికా పల్లికల్ 3) అనాక అలంకమొనీ 4) ఎవరూ కాదు 18. మాంటేకార్లో మాస్టర్స క్లేకోర్టు టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకున్న క్రీడాకారుడు? 1) రోజర్ ఫెదరర్ 2) స్టానిస్లాస్ వావ్రింకా 3) నొవాక్ జొకోవిచ్ 4) రఫెల్ నాదల్ 19. నరేంద్ర కొఠారి ఏ ప్రభుత్వ రంగ సంస్థకు చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమితుల య్యారు? 1) సెయిల్ 2) బీహెచ్ఈఎల్ 3) ఎన్ఎండీసీ 4) ఈసీఐఎల్ 20. ఏ ప్రైవేట్ బ్యాంక్ నిర్వహించిన రక్తదాన శిబిరంలో 61,902 మంది పాల్గొన్నారు (ఇది గిన్నిస్ బుక్ రికార్డ)? 1) ఐసీఐసీఐ బ్యాంక్ 2) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3) యాక్సిస్ బ్యాంక్ 4) ఎస్ బ్యాంక్ 21. 2014 ఏప్రిల్‌లో ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఎక్కడ జరిగాయి? 1) బీజింగ్ 2) రీగా 3) సోఫియా 4) కోపెన్ హాగెన్ 22. అసోచామ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం పాల ఉత్పత్తిలో ఏ రాష్ర్టం మొదటి స్థానంలో నిలిచింది? 1) ఉత్తరప్రదేశ్ 2) రాజస్థాన్ 3) గుజరాత్ 4) పంజాబ్ 23. ‘వన్ హండ్రెడ్ ఇయర్స ఆఫ్ సాలిట్యూడ్’ అనేది ఎవరి ప్రముఖ రచన? 1) మార్క ట్వెయిన్ 2) ఆక్టోవియా పాజ్ 3) వి.ఎస్. నైపాల్ 4) గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ 24. మక్టన్ సెబూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టను అభివృద్ధి చేసి, నిర్వహించే విధంగా జీఎంఆర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎయిర్పోర్ట ఏ దేశంలో ఉంది? 1) మాల్దీవులు 2) వియత్నాం 3) ఫిలిప్పీన్‌స 4) జపాన్ 25. ఇంగ్లండ్‌లో నిర్వహించిన ప్రపంచ మహిళల సీనియర్ స్నూకర్ టైటిల్‌ను ఎవరు గెలుచుకొన్నారు? 1) ఉమాదేవి నాగ్‌రాజ్ 2) అస్మొలవ 3) చిత్ర మగిమైరాజ్ 4) ఎవరూ కాదు 26. భారతదేశంలో జాతీయాదాయాన్ని లెక్కించేది? 1) భారతీయ రిజర్వ బ్యాంక్ 2) ఆర్థిక మంత్రిత్వశాఖ 3) ఆర్థిక సంఘం 4) కేంద్ర గణాంక సంస్థ 27. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905లో ఎవరు స్థాపించారు? 1) బాలగంగాధర్ తిలక్ 2) లాలా లజపతిరాయ్ 3) మహాత్మా గాంధీ 4) గోపాలకృష్ణ గోఖలే 28. ‘ద ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్’ అని దేన్నంటారు? 1) కెనడా 2) జపాన్ 3) కొరియా 4) ఫిన్లాండ్ 29. {Xన్పార్క క్రికెట్ స్టేడియం ఏ నగరంలో ఉంది? 1) జంషెడ్పూర్ 2) నాగ్‌పూర్ 3) జైపూర్ 4) కాన్పూర్ 30. కార్డియాలజీ దేనికి సంబంధించిన అధ్య యన శాస్త్రం? 1) రక్తం 2) మెదడు 3) గుండె 4) కణజాలాలు 31. అటార్నీ జనరల్‌ను ఎవరు నియమిస్తారు? 1) ప్రధానమంత్రి 2) రాష్ర్టపతి 3) లోక్‌సభ స్పీకర్ 4) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 32. రియాద్ ఏ దేశానికి రాజధాని? 1) ఇరాన్ 2) ఇరాక్ 3) బహ్రేన్ 4) సౌదీ అరేబియా 33. బెంగాల్ విభజన 1905లో ఏ వైస్రాయ్ కాలంలో జరిగింది? 1) లార్డ హార్డింగ్ 2) లార్డ మౌంట్‌బాటెన్ 3) లార్డ కర్జన్ 4) లార్డ రీడింగ్ 34. డేవిస్‌కప్ ఏ క్రీడకు సంబంధించింది? 1) టేబుల్ టెన్నిస్ 2) గోల్ఫ్ 3) హాకీ 4) టెన్నిస్ 35. 15వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(ఐఫా) అవార్డుల కార్యక్రమం 2014 ఏప్రిల్‌లో ఏ దేశంలో జరిగింది? 1) అమెరికా 2) కెనడా 3) శ్రీలంక 4) యూఏఈ 36. 15వ ఐఫా అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది? 1) చెన్నై ఎక్స్‌ప్రెస్ 2) ఆషికి-2 3) భాగ్ మిల్కా భాగ్ 4) యే జవానీ హై దివానీ 37. మొబైల్ ఫోన్ కంపెనీ నోకియాకు సీఈవోగా నియమితుడైన భారతీయుడు? 1) సత్య నాదెళ్ల 2) రాజీవ్ సూరి 3) అన్షు జైన్ 4) రాకేష్ కపూర్ 38. దేశీయ క్రికెట్ జట్ల యజమానుల్లో అత్యంత సంపన్నుడు? 1) కళానిధి మారన్ 2) విజయ్ మాల్యా 3) షారూఖ్ ఖాన్ 4) ముకేశ్ అంబానీ 39. ఇటీవల మరణించిన ఎం.వి.రెడ్డి ఒక ప్రముఖ? 1) సినీ నిర్మాత 2) రచయిత 3) వ్యవసాయ శాస్త్రవేత్త 4) పారిశ్రామిక వేత్త 40. ఇటీవల మన దేశం ప్రయోగించిన ఉపరితలం నుంచి ఆకాశంలోకి లక్ష్యాలను ఛేదించే క్షిపణి? 1) అగ్ని - 1 2) అగ్ని - 2 3) పృథ్వీ 4) ఆకాశ్ సమాధానాలు 1) 3; 2) 2; 3) 3; 4) 4; 5) 1; 6) 4; 7) 4; 8) 2; 9) 4; 10) 3; 11) 2; 12) 3; 13) 2; 14) 2; 15) 1; 16) 2; 17) 1; 18) 2; 19) 3; 20) 2; 21) 3; 22) 1; 23) 4; 24) 3; 25) 3; 26) 4; 27) 4; 28) 3; 29) 4; 30) 3; 31) 2; 32) 4; 33) 3; 34) 4; 35) 1; 36) 3; 37) 2; 38) 4; 39) 3; 40) 4. -
చక్ దే ఇండియా...
ప్రత్యర్థిగా దాయాది దేశం... ముఖాముఖి రికార్డూ అంతగా బాగాలేదు... లీగ్ దశలోనూ ఓటమి... ఎలాగైనా, ఈసారైనా గెలవాలనే ఒత్తిడి... ఈ నేపథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు నరాలు తెగే ఉత్కంఠతను తట్టుకుంది. కొడితే కుంభస్థలం మీద కొట్టాలి అనే విధంగా అంతిమ సమరంలో అద్భుతం చేసింది. కీలక క్షణాల్లో సంయమనం కోల్పోకుండా ఆడింది. 48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ‘షూటౌట్’లో బోల్తా కొట్టించి టీమిండియా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 16 ఏళ్ల తర్వాత ఏషియాడ్‌లో మళ్లీ పసిడి నెగ్గిన భారత్ 2016లో రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత సాధించింది. ఫైనల్లో పాక్‌పై విజయం ►16 ఏళ్ల తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం ►2016 ఒలింపిక్స్‌కూ అర్హత ఇంచియాన్: ఆధిక్యంలో ఉండటం... ఆ తర్వాత వెనుకబడిపోవడం... ఇటీవల కాలంలో భారత హాకీ జట్టుకు అలవాటుగా మారింది. కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో మాత్రం భారత ఆటగాళ్లు శక్తివంచన లేకుండా పోరాడారు. తొలుత 0-1తో వెనుకబడినా... ఆ తర్వాత బెదరకుండా, నమ్మకం కోల్పోకుండా స్కోరును సమం చేశారు. నిర్ణీత సమయం పూర్తయ్యాక విజేతను నిర్ణయించే ‘షూటౌట్’లోనూ సంయమనం కోల్పోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఫలితంగా 16 ఏళ్ల విరామం తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో మళ్లీ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా 2016 ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత్ ‘షూటౌట్’లో 4-2తో పాకిస్థాన్‌ను ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లాక్రా, ధరమ్వీర్ సింగ్ సఫలమయ్యారు. మన్‌ప్రీత్ సింగ్ విఫలమయ్యాడు. పాకిస్థాన్ తరఫున మహ్మద్ వకాస్, రసూల్ సఫలంకాగా... హసీమ్ ఖాన్, ఉమర్ విఫలమయ్యారు. ‘షూటౌట్’లో భారత గోల్‌కీపర్, వైస్ కెప్టెన్ శ్రీజేష్ చాకచక్యంగా వ్యవహరించి పాక్ ఆటగాళ్ల రెండు షాట్లను నిలువరించి ‘హీరో’గా అవతరించాడు. అంతకుముందు ఆట మూడో నిమిషంలో మహ్మద్ రిజ్వాన్ గోల్‌తో పాకిస్థాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆట 27వ నిమిషంలో కొత్తాజిత్ సింగ్ గోల్‌తో భారత్ స్కోరును 1-1తో సమం చేసింది. లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత ఆటగాళ్లు ఫైనల్లో బరిలోకి దిగారు. కానీ మూడో నిమిషంలోనే పాక్ గోల్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చింది. అయితే భారత ఆటగాళ్లు వెంటనే ఈ పరిణామం నుంచి తేరుకున్నారు. సమన్వయంతో కదులుతూ పాక్‌పై ఒత్తిడిని పెంచారు. రెండో అర్ధభాగంలో భారత కృషి ఫలించింది. కొత్తాజిత్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. ఆ తర్వాతి రెండు అర్ధ భాగాల్లో రెండు జట్లు మరో గోల్ చేయడంలో సఫలంకాలేదు. ►ఓవరాల్‌గా ఆసియా క్రీడల హాకీలో భారత్‌కిది మూడో స్వర్ణం. గతంలో టీమిండియా రెండుసార్లు (1966లో, 1998లో) బ్యాంకాక్‌లోనే జరిగిన క్రీడల్లో పసిడి పతకాలు గెలిచింది. ►ఆసియా క్రీడల ఫైనల్లో పాక్‌ను ఓడించడం భారత్‌కిది రెండోసారి మాత్రమే. చివరిసారి 1966 క్రీడల ఫైనల్లో భారత్ 1-0తో పాక్‌పై గెలిచింది. ‘‘ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గడం నా కెరీర్లోనే గొప్ప విజయంగా భావిస్తున్నాను. పసిడి సాధించి రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందాలనే ఏకైక లక్ష్యంతో ఇంచియాన్‌కు వచ్చాం. తుదకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాం. ఈ విజయంలో కోచ్ టెర్రీ వాల్ష్, సహాయక సిబ్బంది పాత్రను మరువలేం.’’ - సర్దార్ సింగ్, భారత కెప్టెన్ -
సంతోషం డబుల్
అనుభవం తక్కువే అయినా... మైదానంలో మెరిసిన యువ క్రీడాకారులు ఆసియా క్రీడల్లో భారత సంతోషాన్ని ‘డబుల్' చేశారు. టెన్నిస్‌లో సానియా మీర్జా-సాకేత్‌ల ద్వయం, డిస్కస్‌త్రోలో సీమా పూనియా స్వర్ణ కాంతులు నింపారు. సాకేత్-సనమ్ జోడి టెన్నిస్‌లో... రెజ్లింగ్‌లో భజరంగ్ రజతాలతో తళుక్కుమన్నారు. అథ్లెటిక్స్‌లో మరో రెండు, రెజ్లింగ్‌లో ఇంకో కాంస్యంతో... ఓవరాల్‌గా పదో రోజు భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. ప్రత్యర్థులు తమకంటే బలంగా ఉన్నా... వర్షం కారణంగా మ్యాచ్‌లు ఆలస్యంగా సాగినా... భారత ‘ఎస్’ త్రయం (సానియా, సాకేత్, సీమా) అనుకున్నది సాధించి ‘త్రివర్ణాన్ని’ రెపరెపలాడించారు. ఇంచియాన్: ఆసియా క్రీడల్లో సోమవారం తెలుగు వెలుగులు విరజిమ్మాయి. హైదరాబాద్ ద్వయం సానియా మీర్జా, సాకేత్ మైనేని టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఫైనల్లో రెండోసీడ్ సానియా-సాకేత్ ద్వయం 6-4, 6-3తో టాప్‌సీడ్ హో చింగ్ చెన్-సియాన్ యిన్ పెంగ్ (చైనీస్‌తైపీ)పై విజయం సాధించింది. 69 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలిసారి ఆసియా గేమ్స్‌లో ఆడుతున్న సాకేత్ భారీ సర్వీస్‌లతో పాటు నెట్ వద్ద ఆకట్టుకున్నాడు. బలమైన వ్యాలీలు సంధించాడు. తైపీ మహిళా ప్లేయర్ హోను లక్ష్యంగా చేసుకుని కొట్టిన షాట్లు కొన్నిసార్లు ఆమె శరీరాన్ని తాకాయి. తొలి సెట్ ఏడో గేమ్‌లో హో సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జంట స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. అయితే సాకేత్ సర్వీస్‌లో పెంగ్ కొట్టిన బ్యాక్‌హాండ్ షాట్ బయటకు వెళ్లడంతో సెట్ భారత్ సొంతమైంది. అద్భుతమైన షాట్లతో రెండో సెట్‌ను ప్రారంభించిన సానియా జోడి తొలి గేమ్‌లోనే పెంగ్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అయితే నాలుగో గేమ్‌లో సానియా సర్వీస్‌ను కోల్పోయింది. కానీ పుంజుకున్న భారత ద్యయం ప్రత్యర్థి సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసింది. ఆ తర్వాత భారత జోడి వెనుదిరిగి చూడలేదు. తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొన్న సాకేత్ రెండు పతకాలు సాధిస్తే... సానియాకు ఇది కెరీర్లో 8వ ఆసియా గేమ్స్ పతకం కావడం విశేషం. పురుషుల డబుల్స్ ఫైనల్లో ఐదోసీడ్ సాకేత్-సనమ్ ద్వయం 5-7, 6-7 (2/7)తో 8వ సీడ్ యాంగ్‌కు లిమ్-హెయాన్ చుంగ్ (కొరియా) చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచింది. దీంతో రజతం కైవసం చేసుకుంది. గంటా 29 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కొరియన్లు అద్భుతమైన షాట్లతో అలరించారు. తొలి సెట్లో ఓడిన తర్వాత రెండోసెట్లో భారత జోడి తీవ్రంగా పోరాడింది. దీంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో కొరియన్లు దూకుడును పెంచడంతో భారత జంట 1-4, 2-6తో వెనుకబడింది. ఈ దశలో సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో పాటు నాలుగు మ్యాచ్ పాయింట్లు గెలిచి కొరియన్లు స్వర్ణం చేజిక్కించుకున్నారు. భవిష్యత్‌కు భరోసా... లియాండర్ పేస్, మహేశ్ భూపతి, రోహన్ బోపన్న... ఈ ముగ్గురూ కొన్నేళ్లుగా భారత టెన్నిస్‌కు పర్యాయపదంగా ఉన్నారు. పేస్, భూపతి వయస్సు నాలుగు పదులు దాటగా... బోపన్న వయస్సు 34 ఏళ్లు. మరి వీరి తర్వాత ఎవరు? డబుల్స్‌లో మన సంగతేంటి? ఇలాంటి సందేహాలకు తెరదించుతూ... భారత టెన్నిస్ భవిష్యత్‌కు భరోసా కల్పిస్తూ... రాకెట్ వేగంతో దూసుకొచ్చిన యువతేజమే సాకేత్ మైనేని. 1987లో అక్టోబరు 19న వైజాగ్‌లో జన్మించిన సాకేత్... 11 ఏళ్ల వయస్సులో టెన్నిస్ రాకెట్ పట్టాడు. ఆ తర్వాత మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌కు మకాం మార్చాడు. 2005లో జాతీయ జూనియర్ చాంపియన్‌గా అవతరించాడు. 2006లో విద్యాభ్యాసం కోసం అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో చేరాడు. ఐదేళ్లపాటు అమెరికాలో ఉన్న సాకేత్ ఒకవైపు చదువుతూనే మరోవైపు తన టెన్నిస్ మెళకువలకు పదునుపెట్టి అలబామా యూనివర్సిటీ టాప్ ప్లేయర్ స్థాయికి ఎదిగాడు. 2011లో భారత్‌కు వచ్చిన వెంటనే ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీలో పాల్గొని సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఇప్పటివరకు కెరీర్లో తొమ్మిది సింగిల్స్ టైటిల్స్, 14 డబుల్స్ టైటిల్స్ సాధించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువు ఉన్న సాకేత్ భారీ సర్వీస్‌లకు పెట్టింది పేరు. చైనీస్ తైపీతో జనవరిలో జరిగిన డేవిస్ కప్ పోరులో సాకేత్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కొరియాతో పోరులోనూ ఆడాడు. తాజాగా ఆసియా క్రీడల్లో పతకాలతో భారత పురుషుల టెన్నిస్‌కు ఆశాకిరణమయ్యాడు. - సాక్షి క్రీడావిభాగం ఆనవాయితీ కొనసాగింది... ఆసియా క్రీడల్లో కచ్చితంగా భారత్‌కు పతకం అందిస్తోన్న క్రీడాంశాల్లో మహిళల డిస్కస్ త్రో ఒకటి. చివరి మూడు ఆసియా క్రీడల్లో (బుసాన్ 2002, దోహా 2006, గ్వాంగ్జౌ 2010) మనకు ఈ అంశంలో పతకాలు వచ్చాయి. నాలుగోసారీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ సీమా పూనియా (అంటిల్) భారత్ ఖాతాలో స్వర్ణాన్ని జమ చేసింది. 31 ఏళ్ల ఈ హర్యానా అమ్మాయి వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించగా... ఇన్నాళ్లు లోటుగా ఉన్న ఆసియా క్రీడల్లోనూ తన సత్తా చాటుకుంది. బరిలోకి దిగిన తొలిసారే పసిడి కాంతులు విరజిమ్మింది. 2006 మెల్బోర్న్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన సీమా... అదే ఏడాది దోహా ఆసియా క్రీడలకు ముందు డోపింగ్‌లో పట్టుబడి ఈ క్రీడలకు దూరమైంది. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 75 కేజీల బరువున్న సీమా 2010 ఆసియా క్రీడల్లో బరిలోకి దిగలేదు. డిస్కస్ త్రో కోచ్ అంకుష్ పూనియాను 2011లో వివాహం చేసుకున్న సీమా లండన్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచింది. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన సీమా అదే జోరును కొనసాగించి ఇప్పుడు స్వర్ణం గెలిచింది. - సాక్షి క్రీడావిభాగం అంచనాలకు మించి రాణించిన భారత అథ్లెట్ సీమా పూనియా అంటిల్ అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణాన్ని అందించింది. మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో డిస్క్‌ను 61.03 మీటర్ల దూరం విసిరిన ఆమె అగ్రస్థానంలో నిలిచింది. సీమా నాలుగో ప్రయత్నంలో ఈ దూరాన్ని అందుకుంది. వెటరన్ ప్లేయర్ కృష్ణ పూనియా 55.57 మీటర్ల దూరంతో నాలుగో స్థానంతో సంతృప్తిపడింది. మహిళల 1500 మీటర్ల రేసులో ఓపీ జైషా కాంస్యం సంపాదించింది. ఫైనల్ రేసులో 4:13.46 సెకన్లలో లక్ష్యాన్ని ముగించి మూడో స్థానంలో నిలిచింది. అజిత్ మర్కోస్ సిని 4:17.12 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో నవీన్ కుమార్ కాంస్యంతో మెరిశాడు. ఫైనల్లో నవీన్ 8:40.39 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానం సాధించాడు. ఇది అతని వ్యక్తిగత బెస్ట్. ఆగమేఘాల మీద చైనాకు... ఆసియా క్రీడల మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం గెలిచిన సానియా మీర్జా... సోమవారం తన కెరీర్లోనే అత్యంత బిజీగా రోజును గడిపింది. షెడ్యూల్ ప్రకారం ఆసియా క్రీడల్లో ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు మొదలవ్వాలి. కానీ వర్షం కారణంగా వాయిదాపడి, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ముగిసింది. అయితే సానియా మీర్జా చైనా ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో కారాబ్లాక్‌తో కలిసి బరిలోకి దిగాల్సి ఉంది. అదృష్టవశాత్తు సానియా జోడికి తొలి రౌండ్లో బై లభించింది. దీంతో సోమవారం రాత్రి బయల్దేరితే మంగళవారం చైనాలో రెండో రౌండ్ ఆడే అవకాశం ఉంటుంది. దీంతో మొత్తం లగేజ్ అంతా సర్దేసుకుని స్టేడియానికి వచ్చి మ్యాచ్ అయిపోయాక నేరుగా ఎయిర్‌పోర్ట్‌కు ఆగమేఘాల మీద వెళ్లింది. నిజానికి తొలుత సానియా ఆసియా క్రీడలకు దూరమవ్వాలని భావించినా... మనసు మార్చుకుని చైనా ఓపెన్ వదిలేయాలని అనుకుంది. అయితే ఆ టోర్నీలో తొలి రౌండ్ బై దొరకడం వల్ల ఇప్పుడు చైనా ఓపెన్‌లో కూడా ఆడనుంది. - సాక్షి, హైదరాబాద్ -
స్ప్రింట్‌లో ఆసియా రికార్డు
100 మీటర్లలో ఫెమీ ఒగునోడ్ ఘనత ఇంచియాన్: డోపింగ్‌లో పట్టుబడి గత జనవరిలో రెండేళ్ల నిషేధం పూర్తిచేసుకొని బరిలోకి దిగిన ఖతార్ అథ్లెట్ ఫెమీ ఒగునోడ్ ఆసియా క్రీడల్లో రెండు రికార్డులను సవరించాడు. ఆదివారం జరిగిన పురుషుల 100 మీటర్ల (స్ప్రింట్) రేసులో ఫెమీ 9.93 సెకన్లలో గమ్యానికి చేరుకొని కొత్త ఆసియా రికార్డుతోపాటు ఆసియా క్రీడల రికార్డును సృష్టించాడు. దాంతో 9.99 సెకన్లతో శామ్యూల్ ఫ్రాన్సిస్ (ఖతార్-2007లో) పేరిట ఉన్న ఈ రికార్డు తెరమరుగైంది. నైజీరియాలో జన్మించిన ఫెమీ 2009లో ఖతార్ పౌరసత్వాన్ని తీసుకొని ఆ దేశం తరఫున పాల్గొంటున్నాడు. మహిళల 100 మీటర్ల స్వర్ణాన్ని యోంగ్లీ వీ (చైనా-11.48 సెకన్లు) సాధించింది. -
పతకాల పంట
ఎనిమిదో రోజు భారత్ ఖాతాలో 11 పతకాలు వారం రోజుల నిరీక్షణ ఫలించింది. తొలి రోజు ఏకైక స్వర్ణం తర్వాత ఆరు రోజుల పాటు కంచు మోతలో వినిపించకుండా పోయిన ‘కనకం'... ఎట్టకేలకు ఘనంగా మోగింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత అథ్లెట్లు ఆసియా క్రీడల్లో శనివారం పసిడి వెలుగులు నింపారు. పురుషుల కాంపౌండ్ ఆర్చరీ, స్క్వాష్ జట్లు స్వర్ణాలు సాధించి భారత శిబిరంలో ఉత్సాహాన్ని పెంచాయి. క్రీడాకారుల నిలకడకు ఈ రెండు ఈవెంట్లలో రెండు రజతాలు కూడా తోడయ్యాయి. అథ్లెటిక్స్ తొలి రోజు భారత్ ఖాతాలో ఓ రజతం ఓ కాంస్యం చేరాయి. వీటితో పాటు అన్ని క్రీడల్లో కలిపి మరో ఐదు కాంస్యాలు సాధించడంతో... ఇంచియాన్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్క్వాష్ గతంతో ఎన్నడూ లేనన్ని పతకాలు సాధించి భారత ఆటగాళ్లు కొత్త చరిత్ర సృష్టించారు. పురుషుల టీమ్ స్వర్ణం గెలుచుకోగా, మహిళల జట్టు రజతం సాధించి ఔరా అనిపించింది. అంతకుముందు వ్యక్తిగత విభాగంలో సౌరవ్ ఘోషాల్ రజతం, దీపికా పల్లికల్ కాంస్యం సాధించారు. ఓవరాల్‌గా భారత స్క్వాష్ చరిత్రలో నాలుగు పతకాలు (1 స్వర్ణం+2 రజతాలు+1 కాంస్యం) లభించడం ఇదే మొదటిసారి. పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 2-0తో మలేసియాపై గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో హరీందర్ పాల్ సంధూ 3-1తో మహ్మద్ ఇస్కందర్పై; రెండో సింగిల్స్‌లో సౌరవ్ ఘోషాల్ 3-2తో ఆంగ్ బెంగ్ హీపై నెగ్గారు. వరుసగా రెండు సింగిల్స్ గెలవడంతో మహేశ్ మంగోన్కర్కు మూడో సింగిల్స్ ఆడాల్సిన అవసరం లేదు. మహిళల ఫైనల్లో భారత్ 0-2తో మలేసియా చేతిలో ఓడి రెండో స్థానంతో సంతృప్తిపడింది. తొలి సింగిల్స్‌లో అనక అలంకమోని 0-3తో ఆర్నాల్డ్ డెలియా చేతిలో; రెండో సింగిల్స్‌లో దీపికా పల్లికల్ 0-3తో నికోల్ డేవిడ్ చేతిలో ఓడారు. దీంతో రెండు మ్యాచ్‌ల ఫలితాలు మలేసియాకు అనుకూలంగా రావడంతో జోష్న చిన్నప్ప మూడో సింగిల్స్ ఆడలేదు. షూటింగ్ రోజురోజుకూ షూటర్ల బుల్లెట్ పదును పెరుగుతోంది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో చైన్ సింగ్ 441.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. క్వాలిఫయింగ్‌లో సంజీవ్ రాజ్‌పుత్ (1159), గగన్ నారంగ్ (1157) వరుసగా 12, 15వ స్థానాల్లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ టీమ్ విభాగంలో భారత్‌కు ఒక్క పాయింట్ తేడాతో కాంస్యం చేజారింది. భారత్ 3480 పాయింట్లు చేయగా, కాంస్యం నెగ్గిన జపాన్ 3481 పాయింట్లు స్కోరు చేసింది. ఆర్చరీ భారత విలుకాండ్ల గురి అదిరింది. ఒక్క రోజే ఓ స్వర్ణంతో కలిపి మూడు పతకాలు గెలిచి సత్తా చాటారు. పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, సందీప్ కుమార్ల త్రయం 227-225తో కొరియాపై నెగ్గి ‘పసిడి’ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టిన తొలిసారే భారత్ స్వర్ణం గెలవడం విశేషం. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ రజతంతో సంతృప్తిపడ్డాడు. ఫైనల్లో అభిషేక్ 141-145తో ఇస్మాయిల్ బాది (ఇరాన్) చేతిలో ఓడాడు. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో త్రిషా దేబ్, పూర్వాషా షిండే, జ్యోతి సురేఖల బృందం 224-217తో ఇరాన్‌పై నెగ్గి కాంస్యం కైవసం చేసుకుంది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో త్రిషా దేబ్ 138-134తో హుయాంగ్ జో (దక్షిణ కొరియా)పై నెగ్గి కాంస్యాన్ని గెలుచుకుంది. చివరి బాణం వరకు భారత ఆర్చర్ వెనుకబడి ఉన్నా.. ఐదో, ఫైనల్ రౌండ్లో హుయాంగ్ నిరాశపర్చడం త్రిషకు కలిసొచ్చింది. అథ్లెటిక్స్ తొలి రోజు భారత అథ్లెట్లు జోరు కనబర్చారు. ఓ రజతం, కాంస్యంతో మహిళలు మెరిశారు. మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో లలిత శివాజీ బబర్ 9:35.37 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది. సుధా సింగ్ 9:35.64 సెకన్లతో మూడో స్థానంతో కాంస్యం చేజిక్కించుకుంది. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఈ పోటీలో మొదట లలితకు కాంస్యం లభించగా, సుధా సింగ్ నాలుగో స్థానంతో సంతృప్తిపడింది. అయితే స్వర్ణం సాధించిన రూత్ జిబెట్ (బహ్రెయిన్) ఆఖరి ల్యాప్‌లో పొరపాటుగా ట్రాక్ లోపల స్టెప్ వేసింది. దీనిపై భారత్ ఫిర్యాదు చేయగా ఆమెపై అనర్హత వేటు పడింది. పతకం అందుకోవడానికి సమాయత్తం అవుతున్న సమయంలో రూత్‌పై వేటు వేసిన సంగతిని స్టేడియంలోని పబ్లిక్ సిస్టమ్‌లో ప్రకటించారు. దీంతో లలిత రెండు, సుధా మూడో స్థానంలో నిలిచి పతకాలు అందుకున్నారు. మహిళల 10 వేల మీటర్ల ఫైనల్లో గత ఏడాది స్వర్ణం సాధించిన ప్రీజా శ్రీధరన్ ఈసారి ఏడో స్థానంలో నిలిచి నిరాశపర్చింది. రెజ్లింగ్ భారత మహిళా రెజ్లర్ల పట్టు అదిరింది. ఫ్రీస్టయిల్ 48 కేజీల విభాగం కాంస్య పతక పోరులో వినేష్ 4-0 తేడాతో నరంగెరెల్ ఎర్డెనెసుఖ్ (మంగోలియా)పై గెలిచింది. అంతకుముందు సెమీఫైనల్లో వినేష్ 1-3 తేడాతో ఎరి టొసాకా (జపాన్) చేతిలో ఓడింది. {ఫీస్టయిల్ 63 కేజీల విభాగం కాంస్య పోరులో గీతిక జఖార్ 5-0తో తీ హియాన్ లీ (వియత్నాం)పై నెగ్గింది. సెమీఫైనల్లో గీతిక 0-5తో జువోమా జిలూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. బాక్సింగ్ మహిళల ఫ్లయ్ వెయిట్ (48-51 కేజీ) విభాగంలో మేరీ కోమ్ క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో తను 3-0 తేడాతో యేజి కిమ్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. లైట్ వెయిట్ (57-60 కేజీ) ప్రిక్వార్టర్స్‌లో సరితా దేవి 3-0తో చుంగ్సన్ రి (ఉ.కొరియా)ని ఓడించి క్వార్టర్స్‌కు చేరింది. మిడిల్ వెయిట్ (69-75 కేజీ) ప్రిక్వార్టర్స్‌లో పూజా రాణి 3-0తో ఉండ్రామ్ ఎర్డెనెసోయోల్ (మంగోలియా)ను ఓడించింది. పురుషుల ఫ్లయ్ వెయిట్ (52 కేజీ)లో గౌరవ్ బిధురి 3-0తో ప్రేమ్ చౌధరి (నేపాల్)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు. పురుషుల వెల్టర్ వెయిట్ (69 కేజీ) మన్దీప్ జాంగ్రా 2-1 తేడాతో వీ లియూ (చైనా)పై నెగ్గి క్వార్టర్స్ చేరాడు. -
‘రాకెట్’ వేగం.. ‘బాణం’ పదును
* స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం * ఆర్చరీలో కనీసం రజతం వచ్చినట్లే ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్ క్రీడాకారులు రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంటే... ఆర్చరీలో బాణం పదును పెరిగింది. టీమ్ విభాగంలో సెమీస్‌కు చేరిన స్క్వాష్ బృందం కనీసం రెండు కాంస్యాలను ఖాయం చేసుకోగా... కాంపౌండ్ విభాగంలో ఫైనల్‌కు చేరిన విలుకాండ్లకు కనీసం రజతం దక్కనుంది. మహిళల స్క్వాష్ పూల్-బి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-0తో చైనాపై నెగ్గింది. దీంతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సెమీస్‌లో భారత్ మహిళల జట్టు... దక్షిణ కొరియాతో అమీతుమీ తేల్చుకుంటుంది. పురుషుల గ్రూప్-బిలో భారత్ 1-2తో మలేసియా చేతిలో ఓడటంతో గ్రూప్‌లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0తో జపాన్‌పై నెగ్గింది. సెమీస్‌లో భారత్... కువైట్‌తో తలపడుతుంది. అదిరిన గురి పురుషుల ఆర్చరీ టీమ్ కాంపౌండ్‌లో అభిషేక్ వర్మ, రజత్ చౌహన్, సందీప్ కుమార్ల త్రయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో భారత బృందం 231-227తో ఇరాన్‌పై గెలిచింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో 234-229తో మలేసియాపై.. ప్రిక్వార్టర్స్‌లో భారత్ 233-218తో ఖతార్‌పై నెగ్గింది. వ్యక్తిగత విభాగం క్వార్టర్ఫైనల్లో అభిషేక్ వర్మ 147-142తో చోయ్ యంగ్‌హీ (కొరియా)పై గెలిచి సెమీస్‌కు చేరాడు. సందీప్ 135-141తో డెలా క్రూయిజ్ (ఫిలిప్పిన్స్) చేతిలో ఓడాడు. మహిళల టీమ్ కాంపౌండ్ సెమీస్‌లో త్రిష, పూర్వాషా షిండే, జ్యోతి సురేఖ బృందం 224-226తో చైనీస్‌తైపీ చేతిలో ఓడింది. వ్యక్తిగత విభాగం క్వార్టర్స్‌లో త్రిష 142-131తో షబ్నమ్ (ఇరాన్)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించగా, పూర్వాషా 140-143తో సీకో జిహుయాన్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. -
భళా... బింద్రా
ఒలింపిక్స్... ప్రపంచ చాంపియన్‌షిప్... ప్రపంచకప్... కామన్వెల్త్ గేమ్స్... ఆసియా చాంపియన్‌షిప్... ఇలా అన్ని గొప్ప వేదికలపై వ్యక్తిగత స్వర్ణ పతకాలను నెగ్గిన భారత షూటర్ అభినవ్ బింద్రా కెరీర్లో ఇన్నాళ్లూ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత పతకం లోటుగా ఉండేది. అయితే మంగళవారం బింద్రా తన స్థిరమైన ప్రదర్శనతో ఇంతకాలం అందని ద్రాక్షగా ఉన్న ఆసియా క్రీడల వ్యక్తిగత పతకాన్ని అందుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అతను వ్యక్తిగత విభాగంతోపాటు టీమ్ అంశంలోనూ కాంస్య పతకాలను సాధించాడు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో వరుసగా నాలుగో రోజు భారత షూటర్ల పతకాల వేటను కొనసాగేలా చూశాడు. ఇంచియాన్: తన కెరీర్లో చివరిసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా అంచనాలకు అనుగుణంగా రాణించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కాంస్య పతకాలను గెల్చుకున్నాడు. బింద్రా ప్రదర్శనతో ఆసియా క్రీడల్లో వరుసగా నాలుగో రోజూ షూటర్లు పతకాలను అందించారు. వ్యక్తిగత ఫైనల్లో అభినవ్ బింద్రా 187.1 పాయింట్లు సాధించి కాంస్యం దక్కించుకున్నాడు. ఆసియా క్రీడల్లో బింద్రాకిదే తొలి వ్యక్తిగత పతకం కావడం విశేషం. క్వాలిఫయింగ్‌లో పెద్దగా రాణించని బింద్రా ఫైనల్స్‌లో మాత్రం నిలకడను చూపెట్టాడు. 6, 12 షాట్లకు 9.9, 9.6 పాయింట్లు గెలిచి ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత పేలవ షాట్స్‌తో ఐదో స్థానానికి పడిపోయాడు. కానీ కాంస్య పతకం నిర్ధారించే చివరి రెండు షాట్లకు 10.6, 10.7 పాయింట్లు నెగ్గి ప్రత్యర్థిని వెనకకు నెట్టాడు. టీమ్‌లోనూ హవా: అభినవ్ బింద్రా, రవి కుమార్, సంజీవ్ రాజ్‌పుత్‌ల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలోనూ సత్తా చాటింది. ఓవరాల్‌గా 1863 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. బింద్రా 625.4 పాయింట్లు, రవి 618.9 పాయింట్లు, రాజ్‌పుత్ 618.7 పాయింట్లు నెగ్గారు. క్వాలిఫయింగ్ రౌండ్లో ఐదో బెస్ట్ స్కోరు నమోదు చేసిన బింద్రా జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మహిళల ట్రాప్ విభాగంలో శ్రేయాసి సింగ్ (66 పాయింట్లు), సీమా తోమర్ (63 పాయింట్లు), షగున్ చౌదురీ (59 పాయింట్లు)ల బృందం ఓవరాల్‌గా 188 పాయింట్లు నెగ్గి ఎనిమిదో స్థానంతో సంతృప్తిపడింది. వ్యక్తిగత విభాగంలో ఈ త్రయం నిరాశపర్చింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్-1లో హర్‌ప్రీత్ సింగ్ (290) పాయింట్లు నెగ్గి ఏడో స్థానంలో నిలవగా, గురుప్రీత్ సింగ్ (284), పెంబా తమాంగ్ (277)లు వరుసగా 14, 18వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. 20 ఏళ్లుగా ప్రొఫెషనల్ షూటర్‌గా కొనసాగా. అదే నా జీవితంగా బ్రతికా. అంకితభావంతో ప్రాక్టీస్ చేశా. కానీ ఇక నుంచి నేను హాబీ షూటర్‌ను. సీరియస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాను. వారానికి రెండుసార్లు మాత్రమే ప్రాక్టీస్ చేస్తా. అయితే నేను అకస్మాత్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇప్పుడు హాబీ షూటర్‌గా ఎలా కొనసాగాలనే దానిపై ఆలోచిస్తున్నా. దేశవాళీ టోర్నీలో బరిలోకి దిగుతా. జట్టుకు ఎంపికైతే వరల్డ్‌కప్‌లో ఆడతా. అయితే అది ఒక దశ వరకు మాత్రమే. నా వల్ల కాకపోతే మరొకరికి అవకాశం ఇస్తా. ఆసియా క్రీడల్లో నా ప్రదర్శన బాగుంది. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తా. కానీ దాన్నే లక్ష్యంగా మాత్రం చేసుకోను. -బింద్రా -
జిమ్నాస్ట్‌పై లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లే కొద్ది గంటల ముందు కోచ్ మనోజ్ రాణా, చందన్ పాఠక్‌లు కలిసి ఓ జిమ్నాస్ట్‌ను అశ్లీల వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నెల 2న ఢిల్లీలో ప్రాక్టీస్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన లోదుస్తుల గురించి మనోజ్, చందన్ అసభ్యకరంగా మాట్లాడినట్టు ఆసియా గేమ్స్ జట్టులో చోటు దొరకని 20 ఏళ్ల జిమ్నాస్ట్ పేర్కొంది. ప్రస్తుతం మనోజ్, చందన్ జట్టుతో పాటు ఇంచియాన్‌కు బయలుదేరి వెళ్లారు. అయితే వీళ్లపై కేసు నమోదు చేశామని, అక్టోబర్ తొలి వారంలో ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. లైంగిక వేధింపులపై కోచ్, ఆటగాడు దోషిగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సమాఖ్య పేర్కొంది. ఇరాన్ అధికారిపై వేటు: దక్షిణ కొరియూ వుహిళా వాలంటీర్‌ను లైంగికంగా వేధించిన వ్యవహారంలో ఇరాన్ ఫుట్‌బాల్ ఎక్విప్మెంట్ మేనేజర్ అమెరెహ్ అహ్మద్‌పై వేటు పడింది. ఈ మేరకు ఆసియూ ఒలింపిక్ వుండలి (ఓసీఏ) అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయుం తీసుకుంది.