పోరాడి ఓడిన కశ్యప్ | Kashyap fought and defeated | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన కశ్యప్

Published Sun, Oct 19 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

పోరాడి ఓడిన కశ్యప్

పోరాడి ఓడిన కశ్యప్

ఒడెన్స్: ఆసియా క్రీడల తర్వాత పాల్గొన్న తొలి సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో అంచనాలకు మించి రాణించిన పారుపల్లి కశ్యప్ సెమీఫైనల్లో నిష్ర్కమించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో కశ్యప్ 16-21, 15-21తో ప్రపంచ రెండో ర్యాంకర్, ప్రపంచ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.

అంతకుముందు కశ్యప్ క్వార్టర్ ఫైనల్లో పెను సంచలనం సృష్టించాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 21-19, 21-15తో ప్రపంచ మూడో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను బోల్తా కొట్టించాడు. సెమీస్‌లో ఓడిన కశ్యప్‌కు 8,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 34 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement