మాదిరి ప్రశ్నలు
1. 17వ ఆసియా క్రీడల్లో భారతదేశానికి ఎన్ని స్వర్ణ పతకాలు లభించాయి?
1) 14 2) 15 3)11 4) 10
2. {పపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ 5 2) అక్టోబర్ 5
3) అక్టోబర్ 6 4) అక్టోబర్ 24
3. 2014 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించిన జెఫ్ బెజోస్ ఏ ప్రముఖ కంపెనీకి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)?
1) గూగుల్ 2) మైక్రోసాఫ్ట్
3) అమెజాన్ 4) ఫేస్‌బుక్
4. 2014 చాంపియన్‌స లీగ్ ట్వంటీ20 టైటిల్‌ను గెలుచుకున్న జట్టు?
1) కోల్‌కతా నైట్ రైడర్‌స
2) కింగ్‌స ఎలెవన్ పంజాబ్
3) నార్తర్‌న నైట్స్
4) చెన్నై సూపర్ కింగ్‌స
5. చైనా ఓపెన్ పురుషుల టెన్నిస్ టైటిల్‌ను 2014 అక్టోబర్‌లో ఎవరు గెలుచుకున్నారు?
1) నొవాక్ జొకోవిచ్ 2) థామస్ బెర్డిచ్
3) రోజర్ ఫెదరర్ 4) మిలోస్ రౌనిక్
6. 17వ ఆసియా క్రీడల్లో అగ్రస్థానంలో నిలిచిన చైనా మొత్తం ఎన్ని పతకాలు సాధించింది?
1) 151 2) 234
3) 200 4) 342
7. 2014 అక్టోబర్‌లో మెట్రోపొలిస్ సదస్సు ఏ నగరంలో జరిగింది?
1) ముంబై 2) బెంగుళూరు
3) న్యూఢిల్లీ 4) హైదరాబాద్
8. ‘గ్రేటర్ దన్ బ్రాడ్‌మన్’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) నిర్మల్ శేఖర్
2) రుడాల్ఫ్ ఫెర్నాండెజ్
3) శేఖర్ గుప్తా 4) సురేశ్ మీనన్
9. 61వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సాంఘిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా ఎంపికైంది?
1) జాతీశ్వర్ 2) భాగ్ మిల్కా భాగ్
3) నా బంగారు తల్లి
4) గులాబ్ గ్యాంగ్
10. భారత 22వ నౌకాదళాధిపతిగా 2014 ఏప్రిల్‌లో ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) డి.కె. జోషి 2) ఎన్.ఎ.కె. బ్రౌన్
3) రాబిన్ కె. ధోవన్ 4) వి.కె.సింగ్
11. ఆర్థిక కారణాల దృష్ట్యా 2019 ఆసియా క్రీడలు నిర్వహించొద్దని ఏ దేశం నిర్ణయించింది?
1) ఫిలిప్పీన్‌స 2) వియత్నాం
3) థాయ్‌లాండ్ 4) లావోస్
12. కిందివాటిలో గుజరాత్‌లో ఉన్న అణు విద్యుత్ కేంద్రం?
1) కైగా 2) కల్పక్కం
3) కాక్రపార్ 4) తారాపూర్
13. హంగేరి దేశ రాజధాని ఏది?
1) బ్రటిస్లావా 2) బుడాపెస్ట్
3) ప్రేగ్ 4) సోఫియా
14. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన గారెత్ హాప్కిన్‌స ఏ దేశానికి చెందిన మాజీ వికెట్ కీపర్?
1) వెస్టిండీస్ 2) న్యూజిలాండ్
3) దక్షిణాఫ్రికా 4) జింబాబ్వే
15. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన స్టెఫానీ రైస్ ఇటీవల రిటైర్‌మెంట్ ప్రకటించింది. ఆమె ఏ దేశానికి చెందిన స్విమ్మింగ్ క్రీడాకారిణి?
1) ఆస్ట్రేలియా 2) యూకే
3) యూఎస్‌ఏ 4) దక్షిణాఫ్రికా
16. సాహిత్యంలో నోబెల్ గ్రహీత గాబ్రియేల్ గార్సియా మార్‌క్వెజ్ ఇటీవల మరణించారు. ఆయన ఏ దేశానికి చెందిన రచయిత?
1) స్పెయిన్ 2) కొలంబియా
3) పెరూ 4) పోర్చుగల్
17. రిచ్‌మండ్ ఓపెన్ స్క్వాష్ టైటిల్‌ను సాధించిన భారతీయ క్రీడాకారిణి?
1) జోష్నా చినప్ప 2) దీపికా పల్లికల్
3) అనాక అలంకమొనీ
4) ఎవరూ కాదు
18. మాంటేకార్లో మాస్టర్‌స క్లేకోర్టు టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకున్న క్రీడాకారుడు?
1) రోజర్ ఫెదరర్ 2) స్టానిస్లాస్ వావ్రింకా
3) నొవాక్ జొకోవిచ్
4) రఫెల్ నాదల్
19. నరేంద్ర కొఠారి ఏ ప్రభుత్వ రంగ సంస్థకు చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమితుల య్యారు?
1) సెయిల్ 2) బీహెచ్‌ఈఎల్
3) ఎన్‌ఎండీసీ 4) ఈసీఐఎల్
20. ఏ ప్రైవేట్ బ్యాంక్ నిర్వహించిన రక్తదాన శిబిరంలో 61,902 మంది పాల్గొన్నారు (ఇది గిన్నిస్ బుక్ రికార్‌డ)?
1) ఐసీఐసీఐ బ్యాంక్
2) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
3) యాక్సిస్ బ్యాంక్ 4) ఎస్ బ్యాంక్
21. 2014 ఏప్రిల్‌లో ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఎక్కడ జరిగాయి?
1) బీజింగ్ 2) రీగా
3) సోఫియా 4) కోపెన్ హాగెన్
22. అసోచామ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం పాల ఉత్పత్తిలో ఏ రాష్ర్టం మొదటి స్థానంలో నిలిచింది?
1) ఉత్తరప్రదేశ్ 2) రాజస్థాన్
3) గుజరాత్ 4) పంజాబ్
23. ‘వన్ హండ్రెడ్ ఇయర్‌స ఆఫ్ సాలిట్యూడ్’ అనేది ఎవరి ప్రముఖ రచన?
1) మార్‌క ట్వెయిన్ 2) ఆక్టోవియా పాజ్
3) వి.ఎస్. నైపాల్
4) గాబ్రియేల్ గార్సియా మార్‌క్వెజ్
24. మక్టన్ సెబూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్‌టను అభివృద్ధి చేసి, నిర్వహించే విధంగా జీఎంఆర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎయిర్‌పోర్‌ట ఏ దేశంలో ఉంది?
1) మాల్దీవులు 2) వియత్నాం
3) ఫిలిప్పీన్‌స 4) జపాన్
25. ఇంగ్లండ్‌లో నిర్వహించిన ప్రపంచ మహిళల సీనియర్ స్నూకర్ టైటిల్‌ను ఎవరు గెలుచుకొన్నారు?
1) ఉమాదేవి నాగ్‌రాజ్
2) అస్మొలవ
3) చిత్ర మగిమైరాజ్
4) ఎవరూ కాదు
26. భారతదేశంలో జాతీయాదాయాన్ని లెక్కించేది?
1) భారతీయ రిజర్‌వ బ్యాంక్
2) ఆర్థిక మంత్రిత్వశాఖ
3) ఆర్థిక సంఘం 4) కేంద్ర గణాంక సంస్థ
27. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905లో ఎవరు స్థాపించారు?
1) బాలగంగాధర్ తిలక్
2) లాలా లజపతిరాయ్
3) మహాత్మా గాంధీ
4) గోపాలకృష్ణ గోఖలే
28. ‘ద ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్’ అని దేన్నంటారు?
1) కెనడా 2) జపాన్
3) కొరియా 4) ఫిన్లాండ్
29. {Xన్‌పార్‌క క్రికెట్ స్టేడియం ఏ నగరంలో ఉంది?
1) జంషెడ్‌పూర్ 2) నాగ్‌పూర్
3) జైపూర్ 4) కాన్పూర్
30. కార్డియాలజీ దేనికి సంబంధించిన అధ్య యన శాస్త్రం?
1) రక్తం 2) మెదడు
3) గుండె 4) కణజాలాలు
31. అటార్నీ జనరల్‌ను ఎవరు నియమిస్తారు?
1) ప్రధానమంత్రి 2) రాష్ర్టపతి
3) లోక్‌సభ స్పీకర్
4) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
32. రియాద్ ఏ దేశానికి రాజధాని?
1) ఇరాన్ 2) ఇరాక్
3) బహ్రేన్ 4) సౌదీ అరేబియా
33. బెంగాల్ విభజన 1905లో ఏ వైస్రాయ్ కాలంలో జరిగింది?
1) లార్‌డ హార్డింగ్ 2) లార్‌డ మౌంట్‌బాటెన్
3) లార్‌డ కర్జన్ 4) లార్‌డ రీడింగ్
34. డేవిస్‌కప్ ఏ క్రీడకు సంబంధించింది?
1) టేబుల్ టెన్నిస్ 2) గోల్ఫ్
3) హాకీ 4) టెన్నిస్
35. 15వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(ఐఫా) అవార్డుల కార్యక్రమం 2014 ఏప్రిల్‌లో ఏ దేశంలో జరిగింది?
1) అమెరికా 2) కెనడా
3) శ్రీలంక 4) యూఏఈ
36. 15వ ఐఫా అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది?
1) చెన్నై ఎక్స్‌ప్రెస్ 2) ఆషికి-2
3) భాగ్ మిల్కా భాగ్
4) యే జవానీ హై దివానీ
37. మొబైల్ ఫోన్ కంపెనీ నోకియాకు సీఈవోగా నియమితుడైన భారతీయుడు?
1) సత్య నాదెళ్ల 2) రాజీవ్ సూరి
3) అన్షు జైన్ 4) రాకేష్ కపూర్
38. దేశీయ క్రికెట్ జట్ల యజమానుల్లో అత్యంత సంపన్నుడు?
1) కళానిధి మారన్ 2) విజయ్ మాల్యా
3) షారూఖ్ ఖాన్ 4) ముకేశ్ అంబానీ
39. ఇటీవల మరణించిన ఎం.వి.రెడ్డి ఒక ప్రముఖ?
1) సినీ నిర్మాత 2) రచయిత
3) వ్యవసాయ శాస్త్రవేత్త
4) పారిశ్రామిక వేత్త
40. ఇటీవల మన దేశం ప్రయోగించిన ఉపరితలం నుంచి ఆకాశంలోకి లక్ష్యాలను ఛేదించే క్షిపణి?
1) అగ్ని - 1 2) అగ్ని - 2
3) పృథ్వీ 4) ఆకాశ్
సమాధానాలు
1) 3; 2) 2; 3) 3; 4) 4;
5) 1; 6) 4; 7) 4; 8) 2;
9) 4; 10) 3; 11) 2; 12) 3;
13) 2; 14) 2; 15) 1; 16) 2;
17) 1; 18) 2; 19) 3; 20) 2;
21) 3; 22) 1; 23) 4; 24) 3;
25) 3; 26) 4; 27) 4; 28) 3;
29) 4; 30) 3; 31) 2; 32) 4;
33) 3; 34) 4; 35) 1; 36) 3;
37) 2; 38) 4; 39) 3; 40) 4.
డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది?
Published Sun, Oct 12 2014 8:13 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement