సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం కొత్త రూల్ ప్రవేశపెట్టారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనకు సంబంధించి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇకపై సెల్‌ఫోన్లు అసెంబ్లీలోకి తీసుకురావొద్దని ఆదేశాలిచ్చారు. లోపల జరిగే యాక్టివిటీ టీడీపీ రికార్డ్ చేస్తోందని స్పీకర్ అన్నారు. ఇకపై ఈ రూల్ అందరికీ వర్తిస్తుందని.. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు.
చదవండి: వేసవిలో 24/7 నాణ్యమైన విద్యుత్
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
శాసన సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో ఒక రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సత్యప్రసాద్, చినరాజప్ప, రామ్మోహన్, అశోక్, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను సస్పెన్షన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment