Thammineni seetharam
-
రాష్ట్రంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు: తమ్మినేని
-
కూటమి ప్రభుత్వంపై మాజీ స్పీకర్ తమ్మినేని ఆగ్రహం
-
AP: ఫెయిర్ రాజకీయం ఇలాగే ఉంటుంది మరి!
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను అభినందించాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన తీరు అభినందనీయం. ఎక్కడా ఆయన పక్షపాతానికో, పార్టీ అభిమానానికో అవకాశం ఇవ్వలేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా మెచ్చుకోవాలి. ఫిరాయింపు వ్యవహారాలపై స్పీకర్ విధులలో జోక్యం చేసుకుని ఎలాంటి ఒత్తిడికి ఆయన అవకాశం ఇవ్వలేదు. ప్రతిపక్ష తెలుగుదేశంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు, అధికార వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. సాధారణంగా ఇలాంటి కేసులలో సభ్యులకు ఎక్కువ అవకాశం ఇస్తుంటారు. అది కరెక్టా? కాదా? అన్నది పక్కనబెడితే చట్టం ప్రకారం అనుసరించవలసిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది. అయినా ఏదో సాకు చూపుతూ ఫిరాయింపు సభ్యులు స్పీకర్‌కు వివరణలు ఇస్తూ పోతారు. స్పీకర్ కూడా వారు ఎలాగైనా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కనుక చూసి, చూడనట్లు వ్యవహరిస్తుంటారు. అయితే ముఖ్యమంత్రి ఒత్తిడి ఉంటే మాత్రం చకచకా అనర్హత వేటు వేస్తుంటారు. అలాగే లోక్ సభ,లేదా రాజ్యసభలలో అధికారపక్షానికి తలనొప్పి కలిగిస్తున్నారంటే మాత్రం వెంటనే అనర్హత వేటు వేస్తుంటారు. వెంకయ్యనాయుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్యసభలో శరథ్ యాదవ్ పదవిపై వేటు వేసిన తీరు విమర్శలకు గురి చేసింది. ఒక చోట వేరే పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా ఆయనపై వేటు వేశారు. అదే టీడీపీ సభ్యులు నలుగురు బీజేపీలో చేరితే మాత్రం దానిని విలీనంగా గుర్తించి, రాజ్యాంగ స్పూర్తిని వెంకయ్య నాయుడు నీరుకార్చారు. అయినా ఆయన ఏపీ, తెలంగాణలలో పర్యటిస్తూ ఫిరాయింపులకు వ్యతిరేకంగా, నైతిక విలువలపైన ప్రసంగాలు చేస్తుంటారు. ఇక లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సంగతి చూద్దాం. నరసాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజును అనర్హుడిని చేయండని వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసినా, పలుమార్లు గుర్తు చేసినా ఆయన ఎలాంటి చర్య తీసుకోకుండా కథ నడిపేశారు. కనీసం పార్లమెంటు గడువు ముగుస్తున్న చివరి రోజులలో సైతం ఆయనను అనర్హుడిని చేయలేదు. నైతిక విలువల గురించి సుద్దులు చెప్పే భారతీయ జనతా పార్టీ తీరు ఇలా ఉందని అనుకోవాలి. సుమారు నాలుగేళ్లుగా రఘురామకృష్ణంరాజు వైఎస్సార్సీపీ వ్యతిరేక కార్యకలాపాలలో ఉంటున్నారు. పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నిజానికి ఆయన ఏ మాత్రం పద్దతిగల వ్యక్తి అయినా, తానే రాజీనామా చేసి ఉండాల్సింది. స్పీకర్ ఓం బిర్లా కూడా ఆయనపై చర్య తీసుకోలేదు. ఆ స్థాయిలో రఘురామకృష్ణంరాజు మేనేజ్ చేసుకోగలిగారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేయడమే అని చెప్పాలి. ఓం బిర్లా లోక్ సభ స్పీకర్ అయినా, ఆయన కంటే ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ బెటర్‌గా వ్యవహరించారని చెప్పవచ్చు. ఇందులో కూడా వివక్షకు తావు లేకుండా చేశారు. అధికార వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలతో పాటు, టీడీపీలో గెలిచి వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాల గిరిలపై కూడా అనర్హత వేటు వేశారు. చివరి సెషన్ తర్వాత వేసినా, దీనిని ఒక సింబాలిక్ గా తీసుకోవాలి. ఫిరాయింపులు చేస్తే ఎప్పటికైనా అనర్హత వేటు పడుతుందన్న సంకేతం వెళ్లాలి. ఇందులో ఆలస్యం చేయడం సరైనదేనా అని అడిగితే కాదని చెప్పకతప్పదు. కానీ అసలు చేయనిదానికంటే ఇది మెరుగు కదా అని సరిపెట్టుకోవాలి. టీడీపీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని రాజ్యసభ ఎన్నికలలో కుట్ర కథ నడపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రయత్నించకపోలేదు. ఆయనకు అండగా ఉండే ఈనాడు రామోజీరావు కొద్దిరోజుల క్రితం ఏమి రాశారో గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యసభ ఎన్నికలలో అధికారపార్టీ నిలబెట్టే అభ్యర్దులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారేమోనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వణికిపోతున్నారని రాశారు. అంతే తప్ప, ఫిరాయింపులను చంద్రబాబు లేదా మరెవరైనా ప్రోత్సహించడం తప్పని రాయలేదు. ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంజాయిషీ నోటీసులు ఇవ్వగానే, దానిని వ్యతిరేకిస్తూ, రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే భయపడి ఈ నోటీసులు ఇచ్చారని టీడీపీ, ఈనాడు ప్రచారం చేశాయి. అంటే రాజ్యసభ ఎన్నికల కోసం గతంలో ఎమ్మెల్యేలను కొన్నట్లు మళ్లీ కొనుగోలు చేయాలని టీడీపీ ప్రయత్నం చేసిందన్నమాటే కదా! వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దీనిపై కోర్టుకు కూడా వెళ్లినా ఫలితం దక్కలేదు. తదుపరి బలం లేకపోయినా, రాజ్యసభకు పోటీచేయాలనుకున్న టీడీపీ తోక ముడవడం ఈనాడుకు పెద్ద షాక్ అయింది. తాము అనుకున్నట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి వణకలేదే అని తెగ బాధపడింది. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదాల తర్వాత తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. అధికార పార్టీకి మద్దతు ఇచ్చిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటు పడడం వైఎస్సార్సీపీకి కాస్త ఇబ్బందే. అయినా విలువలకు కట్టుబడి వారిని అనర్హులను చేశారు. దీంతో టీడీపీ ఎలాంటి విమర్శలను చేయలేకపోయింది. గత టరమ్‌లో కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఉన్నప్పుడు తెలుగుదేశంకు అమ్ముడుపోయిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై చర్య తసుకోవాలని ఆ పార్టీ గట్టిగా కోరినా ఆయన వారిపై అనర్హత వేటు వేయలేకపోయారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు ఫిరాయింపు దారులకు మద్దతుగా నిలవడమేకాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం కూడా అని చెప్పాలి. విలువల గురించి కథలు చెప్పే చంద్రబాబు ఇంత అనైతికంగా వ్యవహరించినా, శాసనసభలో సభ్యుల ప్రవర్తన గురించి సంపాదకీయాలు రాసి, నీతులు చెప్పే రామోజీరావు టీడీపీ హయాంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఒక్క విమర్శ చేయలేదు. అది ఆయన చిత్తశుద్ది. పైగా ఆ రోజులలో చంద్రబాబు చేస్తున్న అభివృద్దిని చూసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎగబడి వస్తున్నట్లుగా పిక్చర్ ఇచ్చేవారు. 1995లో టీడీపీ వ్యవస్థాపకుడు, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి రామారావును పదవినుంచి లాగిపడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ఫిరాయింపు చట్టాన్ని ఆసరాగా చేసుకుని, ఎన్.టి ఆర్ పక్షాన ఉన్న కొందరుఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడానికి యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు టీడీపీకి మెజార్టీ వచ్చేసినందున, ఎన్.టి.ఆర్ గ్రూపులో ఉండేవారిపై అనర్హత వేటు పడుతుందన్న భయాన్ని కల్పించేవారు. తద్వారా అందరూ తనవైపు వచ్చేలా చేసుకున్నారని అంటారు. టెక్కలి ఉప ఎన్నికలో గెలిచిన అప్పయ్యదొర చాలారోజులు చంద్రబాబు గ్రూపునకు వ్యతిరేకంగా ఉండేవారు. ఆ టైమ్‌లో ఆయనకు ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆనాటి స్పీకర్ యనమల నోటీసు ఇచ్చినట్లు గుర్తు. కొంతకాలం విచారణ కూడా చేశారు. తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు టీఆర్ఎస్కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వారిని నేరుగా పార్టీలోకి వైఎస్ తీసుకోలేదు. అయినా వారు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంగా అనర్హత వేటుకు గురయ్యారు. దానిపైన సుదీర్ఘకాలం వాదోపవాదాలు సాగాయి. చివరికి ఆనాటి స్పీకర్ సురేష్ రెడ్డి అనర్హత వేటు వేశారు. వేటు పడడానికి ఒకరోజు ముందు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటువేసిన వారిపై వెంటనే వేటు వేయడానికి అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ జంకారు. ఉప ఎన్నికలు జరగడానికి అవకాశం లేదనుకునే సమయం వరకు వేచి చూసి ఆ తర్వాత చర్య తీసుకున్నారు. దానికి కారణం అప్పట్లో సొంత పార్టీ పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికు మద్దతుగా రాజీనామా చేసిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం రెండు మాత్రమే గెలుచుకోవడం. దాంతో అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన సుమారు ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోకుండా కాలయాపన చేసి, కొత్త రాజకీయం చేశారు. కానీ వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ముఖ్యమంత్రి అయ్యాక అలాంటి అన్ ఫెయిర్ రాజకీయాలకు తావివ్వడం లేదు. ప్రతిపక్ష టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నా వారిని ఆకర్షించడానికి, కొనుగోలు చేయడానికి ఎక్కడా ప్రయత్నించలేదు. నలుగురు మాత్రం తమంతట తాము వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారిని కూడా అధికారికంగా పార్టీలో చేర్చుకోలేదు. వైఎస్సార్సీపీలో అసమ్మతి ఎమ్మెల్యేలుగా మారిన నలుగురిపై కూడా స్పీకర్ ప్రత్యేకంగా చర్య తీసుకోలేదు. మొత్తం ఎనిమిది మందిపై కలిపి ఓకేసారి స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. కాగా మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సుమారు రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దానిని ఆయన ఉపసంహరించుకోలేదు. స్పీకర్ ఫార్మాట్లో చేసిన రాజీనామాను అమోదించాలని కోరుతున్నట్లు ఆయన ప్రకటనలు కూడా చేశారు. దాంతో కొద్దికాలం క్రితం స్పీకర్ తమ్మినేని ఆమోదించడంపై మాత్రం గగ్గోలు పెట్టారు. రాజ్యసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీకి లబ్ధి కోసమే ఇలా ఆమోదించారని ఆరోపించారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా ఉత్తుత్తిగానే రాజీనామా చేశారని అనుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఒకేసారి చర్య తీసుకుని కొత్త ప్రమాణం నెలకొల్పారని చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుల -
నేడు విచారణకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్
-
తిరుపతిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
-
బిల్లులు పాస్..
-
స్కిల్ స్కామ్ చాలా పెద్ద స్కామ్
-
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం : తమ్మినేని సీతారాం
-
పవన్.. పిచ్చి మాటలు, వెకిలి చేష్టలు మానుకోవాలి: స్పీకర్ తమ్మినేని ఫైర్
సాక్షి, శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలపై తమ్మినేని సీరియస్ అయ్యారు. కాగా, స్పీకర్ తమ్మినేని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లు సేవలు చేస్తుంటే ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారనడం ఏంటి?. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా అలా మాట్లాడుతాడా.. నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా. ఇలాంటి మాటలు రెండు కాళ్ల జంతువులు, బుర్రలేని పనికిమాలిన వ్యక్తులు మాత్రమే మాట్లాడతారు. పవన్ పిచ్చి మాటలు, వెకిలిచేష్టలు మానుకోవాలి. అరుపులు, తొడ గొట్టడం ఏంటి.. గుండు కొట్టిస్తాను అనడం ఏమిటి?. పవన్ కల్యాణ్ పరిణితి చెందని రాజకీయ నాయకుడు. ఇలా అరుపులు, తొడ గొట్టడం సినిమాల్లో చెల్లుతాయి.. రాజకీయాల్లో చెల్లవు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అవినీతి కేసు పీకల్లోతులో చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ఈశ్వరన్ -
ఆంధ్రప్రదేశ్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
తొడ కొట్టి చెప్తున్నా..నీకు దమ్ముంటే రద్దు చేయి...
-
రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం చంద్రబాబు
-
బీసీలకు పదవులిచ్చి ప్రోత్సహించింది సీఎం జగన్ : తమ్మినేని
-
వెంటిలేటర్లు తీస్తే అంతిమ యాత్రే: స్పీకర్ తమ్మినేని
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారం కోసం ఎంతకయినా దిగజారుతారని స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. చంద్రబాబుకు ఇప్పటికే నిరాశ నిస్పృహలు ఆవహించాయన్నారు. ఎన్నికల సమయానికి ఎన్నో కుయుక్తులు పన్నుతారని చెప్పారు. చంద్రబాబును దగ్గరనుంచి చూసిన వ్యక్తిగా ఆయనకు ఎంత అధికార దాహమో తనకు తెలుసన్నారు. తనకంటే చిన్నకుర్రాడైన జగన్ గురించి తక్కువగా భావించి ఇప్పడు తట్టుకోలేక పోతున్నారని అన్నారు. 'వైఎస్ జగన్ ఆలోచన విచక్షణ ముందు నిలబడలేకపోతున్నానని చంద్రబాబు కృశించిపోతున్నారు. ప్రధాని ఎదుట కూడా సీఎం జగన్ రాజకీయాలకంటే రాష్ట్రం ముఖ్యమని చెప్పారు. వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ ప్రజలు చంద్రబాబుని ఛీ కొట్టారు. దత్తపుత్రుడు పవన్ చెప్పు చూపిస్తే.. చంద్రబాబు కూడా చూపిస్తా అన్నారు. చరిత్రపుటల్లో ఇలాంటి ఎంతో మంది కొట్టుకుపోయారు. అధికారమనే మానసిక రోగంతో చంద్రబాబు పతనమైపోతున్నారు. జగన్‌కు లక్ష్యంపై క్లారిటీ ఉంది. చంద్రబాబు కర్నూలు పర్యటనలో అంతు చూస్తా అన్నారు. ఆయన ఎవరి అంతు చూస్తారని' ప్రశ్నించారు. చంద్రబాబు మీ పార్టీ అంపశయ్యపై ఉంది. వెంటిలేటర్లు తీస్తే అంతిమ యాత్రే. ఇది అసమర్ధుని అంతిమ యాత్ర. మీ పార్టీకి ఇది ఆఖరు రోజులు. 600 వాగ్ధానాలు చేశారు. ప్రశ్నిస్తే వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో తీసేశారు అని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. చదవండి: (చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసనలు) -
ఉత్తరాంధ్ర గర్జన ముందు బాబు గర్జన బలాదూర్: స్పీకర్ తమ్మినేని
-
ఆరోజు ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఏమన్నారు: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
-
వాళ్ల కన్నా మాకే ఎక్కువ గౌరవం: గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
అసెంబ్లీ అంటే టీడీపీకి గౌరవమే లేదు: స్పీకర్ తమ్మినేని
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో సభ్యుల హక్కులను టీడీపీ హరిస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు గురువారం కూడా టీడీపీ సభ్యుల తీరు మారలేదు. సభను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ‘టీడీపీ సభ్యుల తీరును ప్రజలు గమనించాలి. అసెంబ్లీ అంటే టీడీపీకి గౌరవం లేదు. ఎప్పుడూ ఇదే విధంగా వ్యవహరిస్తోంది. తోటి సభ్యుల హక్కులను కాలరాస్తోందని స్పీకర్ మండిపడ్డారు. ఈ మేరకు టీడీపీ సభ్యులను సభ నుంచి ఒక్కరోజుపాటు సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రెండో రోజు సమావేశాల్లో సభ జరుగుతుండగా.. నినాదాలతో మంత్రులు, స్పీకర్ ప్రసంగాలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు టీడీపీ సభ్యులు. సజావుగా సాగాలనే విజ్ఞప్తులను వాళ్లు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే.. నిన్న అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన తొలిరోజు కూడా టీడీపీ సభ్యుల తీరు ఇలాగే ఉంది. దీంతో నిన్న కూడా వాళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇదీ చదవండి: డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల -
ఏపీ అసెంబ్లీ సమావేశాలపై మండలి ఛైర్మన్, స్పీకర్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఈ నెల 15వ తేదీ నుంచి జరుగనున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు, శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు. గత సమావేశాల్లో ప్రస్తుతం సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సకాలంలో అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను వారు కోరారు. చదవండి: దమ్ముంటే అసెంబ్లీకి రా.. చంద్రబాబుకు పార్థసారథి సవాల్ సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం.. ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ హాల్లో పలు శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో వారిరువురూ పాల్గొని సభ్యుల ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేయడం, పోలీస్ బందో బస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్బంగా కొయ్యే మోషేను రాజు మాట్లాడుతూ శాసన మండలి సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సి బాధ్యత అధికారులపై ఉందన్నారు. అటువంటి సత్సంప్రదాయం కొనసాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆయన కోరారు. శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ ప్రజల యావత్ దృష్టి ఈ నెల 15 నుండి జరుగబోవు శాసన సభా సమావేశాలపై ఉంటుందని, వాటికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలన్నారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు, చీఫ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, డీజీపీ కే. రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనసభ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యులు, శాసన మండలి ఓఎస్డీ కే.సత్యనారాయణరావు తదితరులతో పాటు పలు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
బాబూ..ఆ డబ్బులు ఏమయ్యాయి?
శ్రీకాకుళం పాతబస్టాండ్: చంద్రబాబు పాలనలో 2014 – 19 మధ్య కాలంలో రూ.1.62 లక్షల కోట్ల నిధుల్లో పెద్ద భాగం పక్కదోవ పట్టాయని, దీనిపై దేశ అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. టీడీపీ చేసిన నిధుల దుర్వినియోగంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. రూ. 1.62 లక్షల కోట్లకు కాగ్ వివరణ అడిగితే కేవలం రూ.51,667 కోట్లకే బాబు ప్రభుత్వం వివరణ ఇచ్చిందన్నారు. మిగతా డబ్బు సంగతి తేలలేదని, కేంద్రం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లించారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో గణాంకాలతో సహా వెల్లడించారని స్పీకర్ గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును టీడీపీ నేతలు తప్పుడు లెక్కలతో పక్కదారి పట్టించారని ఆరోపించారు. టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన వివరణలో నాటి ప్రభుత్వం డొల్లతనం బయటపడిందని తెలిపారు. బాబు ప్రభుత్వం చేసిన ఈ నిర్వాకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చుట్టేందుకు టీడీపీ నేతలు ఎంపీ కనకమేడల ద్వారా ప్రయత్నించారని, వాస్తవాలు కేంద్రంతో పాటు జనాలకు కూడా తెలుసని చెప్పారు. అధికార పక్షాన్ని ఇరుకున పెడదామని ప్రయత్నించి టీడీపీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్నారు. లక్ష కోట్లకు పైగా డబ్బుకు లెక్క చెప్పలేని తెలుగుదేశం నేతలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో రూ.1.80 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాలోకే జమ చేసిందని గుర్తు చేశారు. సచివాలయాల ద్వారా మధ్యవర్తుల అవసరం లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చిందని తెలిపారు. జనం ఎప్పుడూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే ఉన్నారని అన్నారు. -
గడపగడపలో జగన్నినాదం
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో ప్రతి గడపలోనూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరే వినిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ తిరిగి విజయం సాధించడం.. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం తథ్యమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోరే జగన్ ప్రభుత్వం ఉందని, అది గాంధీ కోరిన స్థానిక స్వపరిపాలన అందిస్తోందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు అందులో భాగమేనన్నారు. సీఎం జగన్ సంస్కరణలు ఓ తరానికి ఆదర్శమని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండో రోజు శనివారం అశేష జనవాహిని హోరుతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘పరిపాలన వికేంద్రీకరణ–పారదర్శకత’ తీర్మానం మీద చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా స్పీకర్‌తోపాటు ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, మాజీమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడారు. తమ్మినేని ఇంకా ఏమన్నారంటే.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ విషాదాన్ని దిగమింగి అనేక అవమానాలను ఎదుర్కొని తన కుమారుడిని గొప్ప ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దడం దేశ చరిత్రలో మరువలేనిది. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రజల కోసం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి ఎల్లో మీడియా ఎందుకు రాయడంలేదు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. విద్యా, వైద్యానికి, సేద్యానికి పేదరికం అడ్డంకి కాకూడదని, పల్లెలకు కూడా అభివృద్ధి చేరాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటే అవి ఎల్లో మీడియాకు కనిపించడంలేదా? అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో వీటికి తెలియదు. గడప గడపకూ తిరుగుతున్న మాకు ప్రజల మనస్సు తెలుసు, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం.. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం, టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం. ధర్మాన్ని కాపాడుతున్న సీఎం జగన్‌ను ఆ ధర్మమే కాపాడుతుంది. ఆయన లేకపోతే ఈ రాష్ట్రంలో సంస్కరణలు, వికేంద్రీకరణ ఆగిపోతాయి. అసమానత్వం తొలగాలి.. పేదరికం పోవాలి.. ఇది జరగాలంటే జగన్ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాలించాలి. అంబేడ్కర్ ఆలోచనలను అమలుచేస్తున్న జగన్ అధికారం అంటే తాను మాత్రమే ఎదగడం, తన వర్గం వారు మాత్రమే బాగుపడడం అనుకునే స్వార్థపరుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా మోసాలు, అబద్ధాలతోనే కాలం గడిపారు. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిందేలేదు. కానీ, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆలోచనలను అమలుచేస్తున్న నాయకుడు జగన్. – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు ఈ విజయం సీఎం జగన్, కార్యకర్తలదే – పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నా.. సమైక్య పోరాటంతో అధికారంలోకి వచ్చిన గొప్ప చరిత్ర వైఎస్సార్సీపీది. మనం 13 ఏళ్లలో సాధించిన ఘనత మరే పార్టీకి లేదు. ఈ విజయానికి కారణం ఒకరు సీఎం వైఎస్ జగన్ అయితే.. మరొకరు పార్టీ కార్యకర్తలు. ఈ ప్లీనరీ జగన్ సైనికులకు పెద్ద పండగలాంటిది. దేశంలో సంక్షేమ ప్రభుత్వం ఎలా ఉండాలో 2004, 2009లో వైఎస్సార్ పరిచయం చేశారు. పారదర్శకత కోసం కృషిచేసిన గొప్ప నాయకుడు ఆయన. వైఎస్సార్ సంకల్పాన్ని, ఆశయాలను సీఎం జగన్ నిజంచేసి చూపిస్తున్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలే నిదర్శనం. అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి – నందిగం సురేష్, ఎంపీ, బాపట్ల రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా చంద్రబాబుకు అనవసరం. ఆయన, ఆయన వర్గం బాగుపడితే చాలనుకునే స్వార్థపరుడు. రాజధాని పేరుతో రైతుల పంటలను తగులబెట్టించి దుర్మార్గానికి పాల్పడ్డాడు. అధికారంలోకి రాగానే నూజివీడులో రాజధాని అని చెప్పి గుట్టుచప్పుడు కాకుండా కారుచౌకగా తుళ్లూరులో తన వర్గీయులతో భూములు కొనిపించి తర్వాత పేదల భూములను బలవంతంగా లాక్కొన్నాడు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు ఇవ్వలేమని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే చంద్రబాబు కుట్రలతో పంటలు తగలబెట్టించాడు. అభివృద్ధి అనేది ఒకేచోట కేంద్రీకృతం కారాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం మరోసారి జరగకూడదంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలి. -
ఏ గడపకు వెళ్లినా సీఎం జగన్ నామస్మరణే వినిపిస్తోంది: తమ్మినేని
-
ఆర్ యూ డెఫ్ ఇయర్.. ఆర్ యూ బ్లైండ్?.. ఎల్లో మీడియాపై తమ్మినేని ఫైర్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లినా సీఎం జగన్ నామస్మరణే వినిపిస్తోందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండవరోజు పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకతపై మొదటగా తమ్మినేని ప్రసంగించారు. తమ్మినేని మాటల్లో.. 'మూడేళ్ల ప్రగతిపై సమీక్షే ఈ ప్లీనరీ. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్లీనరీకి విప్లవంలా తరలివచ్చారు. రాబోయే ఎన్నికల్లో మనం విజయం సాధించడమే మన ముందున్న లక్ష్యం అని అన్నారు. 'ఈ రోజు ఎల్లో పత్రికలు స్పీకర్ పదవిలో ఉండి ప్లీనరీకి ఎలా హాజరవుతారంటూ నాపై కథనాలు రాశాయి. రామోజీరావు, ఏబీఎన్‌లకు సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. గతంలో టీడీపీ మహానాడులో ఆనాటి స్పీకర్ శివప్రసాద్ పాల్గొనలేదా?. ఆ రోజు ఆయన మాట్లాడింది మీరు వినలేదా? (ఆర్ యూ డెఫ్ ఇయర్).. మీరు కనలేదా? (ఆర్ యూ బ్లైండ్). ఆయన ప్లీనరీకి హాజరవగా లేనిది.. నేను ప్లీనరీలో పాల్గొంటే తప్పా?. నేను వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యుడిని.. తర్వాతే ఎమ్మెల్యేను..ఆ తర్వాతే స్పీకర్‌ను. ప్లీనరీ పండగ జరుగుతుంటే.. నేను ఇంటోల కూర్చోవాలా..?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చదవండి: (చంద్రబాబు చిత్తూరు టూర్ అట్టర్ ప్లాప్.. అడుగడుగునా అసహనం!) పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. 16 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. వీటి గురించి ఎందుకు రాయదు ఎల్లో మీడియా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌తో ప్రయాణించేందుకు మేం అందరం సిద్ధంగా ఉన్నాం. సంక్షేమ రథాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి. అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 175 స్థానాలు గెలిచి తీరుతుంది అని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. -
జిల్లాలకు మహనీయుల పేర్లు పెడితే తప్పేంటి?: తమ్మినేని
-
ఒక్కరోజు సభా నిర్వహణకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?.. స్పీకర్ ఫైర్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి సస్పెన్షన్ గురయ్యారు. రెండు రోజుల పాటు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు వాయిస్తూ సభా కార్యకలాపాలకు పదేపదే ఆటంకం కలిగించడంతో స్పీకర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేల తీరును స్పీకర్ తప్పుపట్టారు. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీరియస్ అయ్యారు. ఒక రోజు శాసనసభ నిర్వహణకు రూ.53.28లక్షలు ఖర్చవుతుంది. ఒక నిమిషం సభ నిర్వహణకు రూ. 88,802 ప్రజాధనం ఖర్చవుతుంది. ప్రభుత్వం ప్రజా సమస్యల్ని చర్చిండానికి ఇంత ఖర్చుపెడుతుంటే టీడీపీ సభ్యులు సభా సమయాన్ని ఇలా నిరుపయోగం చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
AP Assembly: టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ రూలింగ్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం కొత్త రూల్ ప్రవేశపెట్టారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనకు సంబంధించి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇకపై సెల్ఫోన్లు అసెంబ్లీలోకి తీసుకురావొద్దని ఆదేశాలిచ్చారు. లోపల జరిగే యాక్టివిటీ టీడీపీ రికార్డ్ చేస్తోందని స్పీకర్ అన్నారు. ఇకపై ఈ రూల్ అందరికీ వర్తిస్తుందని.. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. చదవండి: వేసవిలో 24/7 నాణ్యమైన విద్యుత్ ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ శాసన సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో ఒక రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సత్యప్రసాద్, చినరాజప్ప, రామ్మోహన్, అశోక్, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను సస్పెన్షన్ చేశారు. -
నన్ను బెదిరించారు.. అన్నీ ఆన్ రికార్డ్ : స్పీకర్ తమ్మినేని
-
గత వందేళ్లలో ఎవరు చేయనిది చేస్తున్నాడు:స్పీకర్ తమ్మినేని సీతారాం
-
చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని తీవ్ర స్థాయిలో ధ్వజం
-
అర్హులందరికీ పింఛన్ అందిస్తామన్న తమ్మినేని సీతారాం
-
కబడ్డీ కబడ్డీ.. అంటూ బరిలోకి స్పీకర్ తమ్మినేని సీతారాం
సరుబుజ్జిలి/పాతపట్నం: సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడిపే ప్రజాప్రతినిధులు కాస్త విరామం తీసుకున్నారు. ప్రత్యర్థులు, రాజకీయాలంటూ ఎప్పుడూ హాట్‌హాట్‌గా కనిపించే నేతలు రాజకీయాలకు కాసేపు విరామం పలికి.. కూల్‌గా ఆటలాడారు. ఇందుకు ‘సీఎం కప్’ పోటీలు వేదికగా నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం క్రీడా పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ.. కబడ్డీ.. అంటూ బరిలోకి దిగారు. స్వయంగా తన కుమారుడు చిరంజీవి నాగ్‌తో తలపడి స్పీకర్ తమ్మినేని కబడ్డీ ఆడటం అందరినీ అలరించింది. అలాగే, పాతపట్నం మండలం కొరసవాడ పాఠశాల మైదానంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్వయంగా బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. చదవండి: (సీతమ్మ పెద్ద మనసమ్మ.. రూ.3 కోట్ల విలువైన..) -
నవరత్నాలతో అన్ని రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి చెందుతుంది : తమ్మినేని
-
స్పీకర్ సతీమణికి సీఎం జగన్ కితాబు
సాక్షి, ఆమదాలవలస: అక్షయపాత్ర పనితీరుపై స్పందించడం బాగుందని, మీరు ‘‘స్టీల్ లేడీ ’’అని స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణీసీతారాంను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసించారు. తొగరాం సర్పంచ్‌గా గెలుపొందిన ఆమె స్పీకర్‌తో సీఎంను బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాణమ్మకు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జగనన్న గోరుముద్ద పథకానికి సన్నబియ్యం అందించాలని వాణమ్మ కోరగా, వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బలసలరేవు బ్రిడ్జి, రింగ్ రోడ్ల నిర్మాణాలు, విద్యా సంస్థల ఏర్పాటు, నారాయణపురం, ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టులు, రెల్లిగెడ్డ పునః ప్రారంభంపై సుదీర్ఘంగా చర్చించారు. మడ్డువలస పనులు సకాలంలో పూర్తయ్యేందుకు నిధులు సమకూర్చాలని స్పీకర్ కోరగా సానుకూలంగా స్పందించారు. ఆమదాలవలసలో స్టేడియం నిర్మాణానికి నిధులు సమకూర్చాలని కోరారు. జిల్లాలో అత్యంత ప్రధానమైన ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్య, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు, వంశధార, నాగావళి నదుల అనుసంధానం మొదలైన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపైన, ప్రజల స్పందన, ప్రజల అభిప్రాయాలు చర్చించినట్లు పేర్కొన్నారు. -
ప్రతి సీటు శానిటైజ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో శాసనసభ, శాసనమండలిలో అడుగడుగునా శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా శాసనసభ ప్రాంగణం, లాబీల్లో రద్దీని బాగా తగ్గించాలని నిర్ణయించారు. కోవిడ్ నేపథ్యంలో అసెంబ్లీ, మండలిలో ప్రతి సీటును శానిటైజేషన్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు. సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇతరులు ఎవరినీ అనుమతించరాదని నిర్ణయించినట్లు చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. శాసన మండలి ఛైర్మన్ ఎం.ఏ.షరీఫ్, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌లు కొరుముట్ల శ్రీనివాసులు, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉభయ సభల నిర్వహణ, భద్రత, సభ్యుల ఆరోగ్యం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో శానిటైజ్ చేస్తున్న సిబ్బంది తక్కువ రోజులే మేలు: బుగ్గన ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభా సమావేశాలను వీలైనంత తక్కువ రోజులు నిర్వహించడమే శ్రేయస్కరమని భావిస్తున్నట్లు శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. శాసనసభ వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సమావేశాలను రెండు రోజులకు కుదించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్నామని ఇలా జరగడం ఇదే తొలిసారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని చానెళ్లకు లైవ్ ఫీడ్... ► శాసనసభా సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని మీడియా, పత్రికా ప్రతినిధులు తిలకించేందుకు వీలుగా సచివాలయంలోని మీడియా సెల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ► అన్ని చానెళ్లకు లైవ్ ఫీడ్ కూడా ఇవ్వనున్నారు. పత్రికా విలేకరుల గ్యాలరీలోకి 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. ► మంత్రులు, క్యాబినెట్ హోదా ఉన్న వారికి ఇద్ద రు సహాయక సిబ్బందిని అనుమతిస్తున్నారు. ► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహాయకులు, గన్మెన్లకు బయట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ► బడ్జెట్, పద్దుల వివరాలను పంపిణీ చేసే ఆర్థిక శాఖ సిబ్బంది కూడా త్వరగా పని ముగించుకుని వెళ్లి పోయే విధంగా ఏర్పాట్లు చేసి రద్దీని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు లెజిస్లేచర్ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమీప ప్రాంతాల్లోనూ పోలీస్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. అసెంబ్లీ బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ సోమవారం సమీక్షించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ► బందోబస్తు కోసం.. గుంటూరుతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిగోదావరి జిల్లాల నుంచి మొత్తం 3,080 మంది పోలీసులు, 105 మంది మార్షల్స్ అసెంబ్లీ ప్రాంతానికి చేరుకున్నారు. గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్ ఎస్పీల పర్యవేక్షణలో 17 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, 78 మంది ఎస్సైలు, పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ► అసెంబ్లీ ఆవరణలోను, అసెంబ్లీకి వెళ్లే మార్గంలోను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమతి ఉన్న వాహనాలకే దారి ఇవ్వనున్నారు. ► అసెంబ్లీ ప్రాంతంలోను, సమీప ప్రాంతాల్లోను సెక్షన్ 144 అమలులోకి తెచ్చారు. -
లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలి
-
సారీ.. తీవ్ర మనస్తాపానికి గురవుతున్నా: స్పీకర్
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరుతో శాసన సభాపతి తమ్మినేని సీతారాం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ సభ్యుల వైఖరికి విసిగిపోయి.. సభను నడపలేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం సైతం ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుతగిలారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేయడంతో పాటు.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారు. దీంతో వారికి సర్దిచెప్పేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో టీడీపీ సభ్యుల తీరుతో విసిగెత్తిపోయిన తమ్మినేని సీతారాం.. ‘‘ప్లీజ్... ఐ యామ్ సారీ.. ఐ యామ్ ప్రొటెస్టింగ్ ది ఆటిట్యూట్ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్యేస్.. నిజంగా మనస్తాపానికి గురవుతున్నా’’అంటూ సభ నుంచి వెళ్లిపోయారు. ‘రాజకీయాలకు చంద్రబాబు అనర్హుడు’ సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? -
అమరావతి ఉద్యమమనేది టీడీపీ సృష్టే
-
ఫిరాయింపుల నిరోధక చట్టం పదునెక్కాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యం పరిహాసం కాకుండా ఉండాలంటే ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఈనెల 18న డెహ్రడూన్‌లో జరిగిన చట్టసభల సభాపతుల సదస్సుకు హాజరైన ఆయన ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘సభాపతుల సదస్సులో నేను, పలు రాష్ట్రాల సభాపతులు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందనే విషయాన్ని ప్రస్తావించాం. ఈ చట్టంలో ఉన్న అస్పష్టతలు, లోపాల కారణంగా ఇప్పటికీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. గత శాసనసభ కాలంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించినా అప్పటి సభాపతి దానిపై ఐదేళ్లూ నిర్ణయం తీసుకోలేదు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితిని తెచ్చింది. శాసనసభ గడువు తీరేలోపు కూడా సంబంధిత పిటిషన్లను పరిష్కరించకపోవడంతో వాటికి కాలం చెల్లిన పరిస్థితి దాపురించింది. ఈ విషయాలన్నీ సదస్సులో వివరించాను. ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరాలనుకునే చట్టసభ సభ్యుడు కచ్చితంగా పదవికి రాజీనామా చేసే పార్టీ మారాల్సిన పరిస్థితి రావాలన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ సంకల్పాన్ని కూడా వివరించాను. రాజకీయాల్లో ఇదొక గొప్ప ముందడుగంటూ పలువురు సభాపతులు దీనిని స్వాగతించారు’ అని వివరించారు. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య భేదాభిప్రాయం ‘సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలన్న నిబంధనలో కూడా స్పష్టత లేకపోవడం వల్ల శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య భేదాభిప్రాయం తలెత్తుతోంది. ఫిరాయింపుల చట్టంలో ఉన్న విలీన నిబంధనను ఉపయోగించి పార్టీ మారుతున్నారు. దీనిపైనా సదస్సులో చర్చ జరిగింది. ఫిరాయింపులపై వివిధ రాష్ట్రాల్లో ఎదురైన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు లోక్‌సభ స్పీకర్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తుంది. దీని ఆధారంగా కేంద్రానికి సిఫారసులు చేస్తారు’ అని స్పీకర్ చెప్పారు. -
‘దిశ’ ప్రతులను పంపాలని ఒడిశా ప్రభుత్వం కోరింది
సాక్షి, అమరావతి :అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్య ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. చట్టం ప్రతులను పంపాలని ఒడిశా ప్రభుత్వం తమను కోరిందని.. చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తామని ఆ ప్రభుత్వం చెప్పినట్టు సభలో వెల్లడించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ చట్టంపై తమను సంప్రదించిందని, ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించినట్టు స్పీకర్ చెప్పారు. దిశ చట్టాన్ని ఆమోదించడం అసెంబ్లీకి గర్వకారణమని, ఈ చట్టంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందన్నారు. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చరిత్రాత్మక చట్టాలు చేశాం.. దిశ చట్టంపై అసెంబ్లీలో విపక్ష సభ్యుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టడంతో స్పీకర్ జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వాలు మంచి చట్టాలను ప్రజల కోసం తయారు చేస్తాయన్నారు. జరుగుతున్న సంఘటనలన్నీ చట్టాలు లేకుండా జరుగుతున్నాయా అని స్పీకర్ నిలదీశారు. నిన్నగాక మొన్న ‘దిశ’ చట్టం వచ్చిందని.. ఎందుకు గాభరా పడుతున్నారంటూ విపక్ష సభ్యులను ప్రశ్నించారు. సభ ప్రారంభం కాగానే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సమావేశాల్లోనే చరిత్రాత్మక చట్టాలు చేశామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు జోక్యం చేసుకుని.. చట్టం వచ్చాక గుంటూరులో చిన్నారిపై లైంగిక వేధింపులు జరిగాయని, ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదన్నారు. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ సోమవారమే వెళ్లి పరామర్శించామని, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినట్టు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించినట్టు వివరించారు. -
బాస్టర్డ్ అంటారా?
సాక్షి, అమరావతి: శాసనసభా ప్రాంగణంలో గురువారం అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్‌పై దౌర్జన్యం ఘటనకు సంబంధించి టీడీపీ సభ్యులు, ఇతరులపై చర్యలు తీసుకునే అధికారాన్ని సభాపతి తమ్మినేని సీతారాంకు అప్పగిస్తూ సభ శుక్రవారం తీర్మానం చేసింది. సభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని వైఎస్సార్ సీపీ సభ్యులు జక్కంపూడి రాజా, గొల్ల బాబూరావు, అంబటి రాంబాబు, అప్పలరాజు, వరప్రసాద్ బలపరిచారు. ఈ అంశంపై దాదాపు రెండున్నర గంటలకుపైగా తీవ్ర భావోద్వేగాల మధ్య సభలో చర్చ జరిగింది. మార్షల్స్‌ను విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ సభ్యులు దుర్భాషలాడిన వీడియోలను సభలో పలుమార్లు ప్రదర్శించారు. వాస్తవాలు సభ ముందుంచిన తర్వాతైనా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టగా మంత్రి పేర్ని నాని ఈ అంశాన్ని ప్రస్తావించారు. విపక్ష ఎమ్మెల్యేలు, సభ్యులు కాని వారు మూకుమ్మడిగా పెద్ద ఎత్తున శాసనసభకు ప్రదర్శనగా వచ్చారని, భద్రతా కారణాల దృష్ట్యా మార్షల్స్ ఒక్కొక్క ఎమ్మెల్యేను గుర్తించి పంపే ప్రయత్నం చేయగా అడ్డుకుని దాడికి దిగారని, పిడిగుద్దులు గుద్దారని, అనుచితంగా మాట్లాడారని నాని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సభలో చూపించారు. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల మాదిరిగా వ్యవహరించడంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దశలో టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుంటూ అవన్నీ నిజం కాదన్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన ఆరోపణలు చేయడం మరింత వివాదాస్పదమైంది. వీటిని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. మార్షల్‌గా ఉన్నా.. వారి బాధలు తెలుసు: ఆర్థర్ విపక్షం తీరు పట్ల వైఎస్సార్ సీపీ సభ్యులు కొరుముట్ల శ్రీనివాస్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆర్థర్, కొడాలి నాని, కన్నబాబు తదితరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తానూ గతంలో మార్షల్‌గా ఉన్నానని, వారి బాధలేంటో తెలుసని, బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తే ఎలా? అని ఆర్థర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బయట జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పేర్కొనటంపై స్పీకర్ స్పందిస్తూ ఇది సభా ప్రాంగణంలోనే జరిగిందని స్పష్టం చేశారు. మంత్రి కన్నబాబు అసెంబ్లీ నిబంధనావళిని చదివి వినిపిస్తూ ప్రదర్శనగా రావడం సరికాదన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, అసెంబ్లీలోకి వచ్చే ప్రయత్నం చేసిన సభ్యులు కానివారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. సభలో వీడియోల ప్రదర్శన మార్షల్స్ తమనే అవమానపరిచారని టీడీపీ సభ్యులు పేర్కొనడంతో గురువారం అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటనల వీడియోలను సభలో ప్రదర్శించారు. అందులో చీఫ్ మార్షల్‌ను చంద్రబాబు, లోకేష్, టీడీపీ సభ్యులు ‘రాస్కెల్, యూజ్లెస్ ఫెలో, బా...ర్డ్’ అంటూ దూషిస్తున్నట్లుగా ఉంది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ మార్షల్స్ పట్ల టీడీపీ తీరును ఖండించారు. టీడీపీ సభ్యులు తాము ఆ మాట అనలేదని అనడంతో సభలో పలుమార్లు ఈ వీడియోలను ప్రదర్శించారు. అసెంబ్లీ గేట్లు కారాగారం మాదిరిగా ఉన్నాయన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన స్పందిస్తూ ‘ఆ గేట్లు ఏర్పాటు చేసింది మీరే కదా’ అని వ్యాఖ్యానించారు. అంతా చూశారు: స్పీకర్ తమ్మినేని అసెంబ్లీ గేటు వద్ద చోటు చేసుకున్న దృశ్యాలను సభలో అంతా చూశారని, ప్రతిపక్ష నేత చంద్రబాబు వాడిన మాటల్లో అన్ పార్లమెంటరీ పదాలు ఉన్నాయని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని హితవు పలికారు. హుందాగా వ్యవహరించాలని, ఆవేశంలో మాట్లాడితే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. సభ్యులు కానివారు అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించామన్నారు. సభలో పలువురు టీడీపీ సభ్యులు మాట్లాడిన అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. అనంతరం మార్షల్స్‌పై విపక్ష సభ్యులు దౌర్జన్యానికి దిగటంపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కి అప్పగిస్తూ సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. -
‘అలాంటి నాయకుడు సీఎం జగన్ ఒక్కరే’
సాక్షి, శ్రీకాకుళం : చెప్పిన మాట ప్రకారం చేస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం జగన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. శుక్రవారం సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాసలో పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అప్పలరాజు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం యువకులను నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించారు. పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ ఆసుపత్రికి శంకుస్థాపనతో ప్రజల కోరిక నెరవేరిందన్నారు. రూ. 600కోట్లతో ఇంటింటికి పరిశుభ్రమైన తాగునీటి సరఫరా పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయటం హర్హణీయమన్నారు. ఉద్దానం పునర్నిర్మాణానికి సీఎం జగన్ కృషి అభినందనీయమన్నారు. 100 రోజుల పాలనలో 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు: ధర్మాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 100రోజుల పాలనలో 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాసలో పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ చేసిన చట్టాలు చారిత్రాత్మకమైనవి: తమ్మినేని ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన చట్టాలు చారిత్రాత్మకమైనవని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నేత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని అన్నారు. శుక్రవారం సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాసలో పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ 100 రోజుల పాలనలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. -
ఆడియో, వీడియో సాక్ష్యాలున్నాయి: తమ్మినేని
సాక్షి, శ్రీకాకుళం: ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కూన రవికుమార్ కేసులో తన, తన కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేవిధంగా కూన రవికుమార్ ప్రవర్తించడం.. ఇందుకు సంబంధించి ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా ఆధారాలు దొరికాయన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు ఆయనపై కేసు పెట్టారని..ప్రస్తుతం చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ రాజకీయం తగదని సూచించారు. అధికార్లను బెదిరించిన చరిత్ర ఆ పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌కు ఉందని విమర్శించారు. అటువంటి వాళ్లు ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాగా టీడీపీ నాయకుడు కూన రవికుమార్ ఎంపీడీఓ కార్యాలయంలోకి జొరబడి ప్రభుత్వ అధికారులపై దుర్భాషలాడినందుకు గానూ ఆయనతోతో పాటు 11 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అఙ్ఞాతంలో ఉన్న కూన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషిన్ పెట్టినట్లు సమాచారం. ముందస్తు బెయిల్ మంజూరు అయితేనే ఆయన బయటకు వస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆయన గృహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పలువురు అగ్రనేతలు పరామర్శలకు వచ్చి వెళ్తున్నారు. కూన రవికుమార్‌తోపాటు మరో ముద్దాయి అంబళ్ల రాంబాబు కూడా పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
వైఎస్ జగన్ గొప్ప మానవతావాది
సాక్షిప్రతినిధి, శ్రీకాకుళం : ‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్ప మానవతావాది. ప్రజల కోసం ఎందాకైనా వెళ్తారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవ్వరూ తీసుకోని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం పరితపించే ముఖ్యమంత్రి ఆయన. 19 బిల్లులు ప్రవేశపెట్టడం, 14 చట్టాలు చేయడమంటే ఆషామాషీ కాదు. మానవతా దృక్పథంతో కూడిన బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఉద్వేగానికి లోనయ్యా ను. ఒకానొక సందర్భంలో కళ్లంట నీరు వచ్చేసింది. నా చిన్నతనం నుంచి అలాంటి బిల్లులు రావాలని చెప్పుకోవడం తప్ప అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాఖలాల్లేవు. ఎంతో విశిష్టత గల బి ల్లులు ఆమోదం పొందిన సభకు నేను సభాపతిని కావడం ఎంతో ఆనందం కలిగింది.’ అని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తన మనసులో మాటలను వ్యక్తపరి చారు. కొత్త ప్రభుత్వం పనితీరుపై తన మనోగతాన్ని ‘సాక్షి’ వద్ద ఆవిష్కరించారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... నా హయాంలో 19 బిల్లులు ప్రవేశ పెట్టడం అదృష్టం.. నేను స్పీకర్‌గా ఉన్న సమయంలో శాసన సభలో 19 బిల్లులు ప్రవేశపెట్టడం 14 బిల్లులు ఆమోదించడం అదృష్టంగా భావిస్తున్నాను. చరిత్రాత్మక బిల్లుగా 50 శాతం మహిళల రిజర్వేషన్ నిలిచిపోతుంది. నేను నిక్కర్లు వేసినప్పటి నుంచి మహిళా రిజర్వేషన బిల్లు తప్పనిసరిగా అమలుచేయాలని ప్రతిపాదనలు తప్ప ఏ ప్రభుత్వం అమలు చేయలేదు. నేను స్పీకర్‌గా ఉన్న సమయంలో ఇంతటి ఘన చరి త్ర ఉన్న బిల్లు ప్రవేశపెట్టడంతో చాలా సం తోషించాను. దీని వల్ల సామాజిక స్థితిగతులు మారుతాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడమే కాదు చేసి చూపిం చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మైనార్టీల్లో ఒక్కొక్కరిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా, మంత్రులుగా ఎంపిక చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మానవతావాది జగన్మోహన్రెడ్డి. బీసీ ల్లో సభాపతిగా నన్ను ఎంపిక చేసి రాజ్యాంగ వ్యవస్థకు పరిచయం చేసి గౌరవ ప్రదమైన స్థానంలో ఉంచారు. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు.. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత కోసం జ్యుడిషియల్ కమిషన్ వేసి పనుల్లో అవినీతి జరగకుండా చేయడం గొప్ప నిర్ణయం. కౌలుదార్ల చట్టం, భూ యజ మానులకు భరోసా ఇచ్చే చట్టం భూసర్వేకు సమగ్రంగా జరిగేందుకు నిర్ణయాలు తీసుకోవ డం అభినందనీయం. సామాజిక న్యాయం కోసం మాటలు విన్నా.. కానీ చట్టం చేసిన వ్యక్తి జగన్ మాత్రమే. బీసీలు, ఎస్సీ, ఎస్టీల కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలు నాకెంతో ఆనందం కల్గించాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు గొప్ప నిర్ణయం. దీని వల్ల నిరుద్యోగం తగ్గుతుంది. మహిళల రిజర్వేషన్ కోసం చాలా మంది తమ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. కానీ సీఎం జగన్మోహన్రెడ్డి ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా ప్రవేశపెట్టారు. ఎలాంటి గొప్పలకు పోలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి చీఫ్ మినిస్టర్ కంటే ముందు గొప్ప మానవతావాది అని చెప్పకతప్పదు. చక్కగా మాట్లాడారు.. జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. చక్కగా మాట్లాడారు. నేను కూడా అందుకు తగ్గ అవకాశాన్ని కల్పించాను. ఈ శాసన సభలో సుమారు 70మందికి పైగా కొత్త ఎమ్మెల్యేలున్నా రు. ముందుగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకే మాట్లాడే అవకాశం కల్పించి వారిని ముందుకు తీసుకెళ్లేలా సీఎం కూడా ప్రోత్సహించారు. చా లా మంది ఉన్నత చదువులు చదువుకున్న వారే. ప్రత్యేకంగా విషయాన్ని తర్ఫీదు చేసుకోవాల్సిన అవసరం వారికి రాలేదు. అందరూ తమ వాణి వినిపించారు. రాష్ట్రంలో సుగర్ ఫ్యాక్టరీలు తెరి పించేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. వాటికి మంచి రోజులొస్తాయి. అందులో ఎలాం టి సందేహం లేదు. స్పీకర్ కాక ముందు వరకు ప్రస్థానమిలా.. నేను కలలను నమ్మను. వాస్తవిక దృక్పథంతో రాజకీయాల్లో కొనసాగాలన్నదే నా లక్ష్యం. మూ డు సార్లు వరుసగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో ఉండకూడదు. కానీ ప్రజా జీవితంలో కొన్ని లక్ష్యాలు, ఆశయాల కోసం పనిచేయాలే తప్ప గెలుపోటములకు భయపడకూడదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే లక్ష్యం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడటమే నా స్టైల్. జనాలకు సేవ చేసేందుకే నాడు జగన్మోహన్రెడ్డి విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాను. రాజశేఖర్‌రెడ్డి బతికున్న సమయంలోనే పలు మార్లు పార్టీలో చేరాలని కోరితే సమయం వచ్చినప్పుడు చేరుతాం సార్ అని అన్నాను. నేనొక్కడినే కాదు సార్ నా వెంట ఉన్న కేడర్, బంధువులు, బలగం అంతా నిర్ణయం తీసుకోవాలి కదా అని చెప్పాను. సీతారాం చేరాడం టే ఓ స్థాయిలో ఉండాలన్నదే నా ధ్యేయం అని చెప్పా. అయితే ఆయన సరదాగా ఓ మాట అన్నారు. ‘రచ్చబండకి వచ్చేటప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తా అప్పుడు చేరాలి.... ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తా’నని జోక్ చేశారు. దురదృష్టవశాత్తు ఆయన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగానే చనిపోయారు. ఆ మహానుభావుడు అడిగారు వెళ్లలేకపోయానని బాధపడేవాడిని. ఆయన బాటలోనే నడుస్తూ, ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటున్న వ్యక్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి అని నమ్మి పనిచేశాను. పార్టీలో చేరినప్పటి నుంచి జగన్ చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా చేశాను. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్రెడ్డి నన్ను పిలిచి శాసనసభాపతిగా ఉండాలని కోరితే సరేనని అంగీకరించాను. -
చరిత్రలో ఇదే తొలిసారి : స్పీకర్
సాక్షి, అమరావతి : బడ్జెట్ సమావేశాలను అర్థవంతంగా నిర్వహిస్తామని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు అనుభవఙ్ఞులైన వారితో సమానంగా సభలో అవకాశాలు ఇస్తానని పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... శాసన సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఇప్పటికే సభ వ్యవహారాలపై క్లాసులు నిర్వహించామని తెలిపారు. అర్థవంతమైన బిల్లులను సభలో ప్రవేశపెడుతున్నారని... సభ నిర్వహణపై సభాపతికి పూర్తి స్థాయిలో సీఎం అధికారం ఇవ్వడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని వ్యాఖ్యానించారు. అదే విధంగా సభలో ప్రతిపక్ష పార్టీ సలహాలు, సూచనలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడం ప్రజాస్వామ్యం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శమన్నారు. సభలో అధికార, ప్రతిపక్ష సంఖ్యా బలాన్ని బట్టి మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ తమ్మినేని వెల్లడించారు. గతంలో మాదిరి కాకుండా సభలో సభ్యులు వేసే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు వచ్చేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. -
శాసనసభ స్పీకర్ హోదాలో తొలిసారి విశాఖకు తమ్మినేని
సాక్షి, ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ)/మద్దిలపాలెం(విశాఖ తూర్పు): శాసన సభలో ప్రజల సమస్యలు వినిపించేందుకే తొలి ప్రాధాన్యమిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యులందరినీ సమన్వయపరుస్తూ ప్రాధాన్యతను అనుసరించి అవకాశం కల్పిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం తొలిసారిగా విశాఖ వచ్చిన ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో రావడంతో ఎయిర్పోర్ట్ జనసంద్రంగా మారింది. ఆయన్ను గజమాలలు, పుష్పగుచ్ఛాలు, శాలువతో సత్కరించారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఉత్తరాంధ్ర బొబ్బిలి అంటూ నినాదాలు చేశారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అనుచరులు గజమాలతో సత్కరించి, వెండి కిరీటం బహూకరించారు. తననకు కలిసేందుకు వచ్చిన వారికి స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్, సీపాన రాము, కూటికుప్పల సూర్యారావు, కేకే రాజు, సనపల చంద్రమౌళి, పేడాడ కృష్ణారావు, భగాతి విజయ్, సింగుపురం మోహనరావు, సనపల చిన్నబాబు, తిప్పల నాగిరెడ్డి అనురులు దొడ్డి రమణ, తుంపాల తాతారావు, అప్పల రెడ్డి, మంత్రి మంజుల, శాంతి తదితరులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. షిర్డీసాయి మందిరంలో స్పీకర్ దంపతుల పూజలు ఈస్ట్‌పాయింట్ కాలనీలోని షిర్డీ సాయి మందిరంలో స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, షిర్డీసాయి మందిరం ప్రతినిధులు అబ్బు, మణిలతోపాటు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. వంశీకృష్ణ స్పీకర్‌కు శాలువకప్పి సత్కరించారు. స్పీకర్ దంపతులకు మందిరం ప్రతిని«ధి అబ్బు షిర్డీసాయి ప్రతిమను బహూకరించారు. అనంతరం మందిరంలోనే స్పీకర్ దంపతులు ప్రసాదం స్వీకరించారు. ఈస్ట్ పాయింట్ షిర్డీ సాయిమందిరంలో స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతుల పూజలు వినతులు తమ సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగులు స్పీకర్‌కు వినతిపత్రం అందజేశారు. బాలల హక్కులను కాపాడేలా చట్టాలను పక్కాగా అమలు చేయాలని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాషŠట్ర అధ్యక్షుడు గొండు సీతారాం కోరారు. కృతజ్ఞతలు చాలీచాలని తమ వేతనాన్ని 18వేలకు పెంచి, సీఎం జగన్మోహన్రెడ్డి తమ బతుకుల్లో వెలుగులు నింపారని పారిశుద్ధ్య కార్మికులు స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని స్పీకర్ వారికి సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం, సనపల చంద్రమౌళి, సత్తి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు జి.రవిరెడ్డి, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు వెంపడి శ్రీనివాస్‌రెడ్డి, బయిన సునీల్, సనపల త్రినా«థ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్లు దోపిడీ చేశారు
ఆమదాలవలస: ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో అన్నింటా దోపిడీ చేసిన ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధి 13వ వార్డు తవిటినాయుడు క్వార్టర్స్, విద్యానగర్, కిల్లివారి క్వార్టర్స్, కాలేజీ వీధి, చంద్రయ్యపేట, కొత్తకోటవారివీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను అందించి ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న పాలన రావాలంటే జగనన్న సీఎం కావా లని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జె.జె.మోహన్‌రావు, కిల్లి లక్ష్మణరావు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎ. ఉమామహేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, మాజీ చైర్పర్సన్ బొడ్డేపల్లి రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు బొడ్డేపల్లి అజంతాకుమారి, పొన్నాడ కృష్ణవేణి, దుంపల శ్యామలరా వు, డి.చిరంజీవిరావు, మరాఠి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి పొందూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి జగనన్నను సీఎం చేయాలని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ కోరారు. పొందూరు గ్రామంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కోరుకొండ సాయికుమార్, గాడు నాగరాజు, అనకాపల్లి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. బూర్జ: మండలంలోని సింగన్నపాలెం, లచ్చయ్యపేట గ్రామాల్లో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, యువజన విభాగం అధ్యక్షుడు గుమ్మడి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బెజ్జిపురం రామారావు ఎన్నికల ప్రచారాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాంను, శ్రీకాకుళం ఎంపీగా దువ్వాడ శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేపారి లక్ష్మీనారాయణ, జల్లు అప్పలస్వామినాయుడు, బగాది నారాయణమూర్తి, ఎంపీటీసీలు బూరి శ్రీరామమూర్తి, గేదెల ముఖలింగం, జడ్డు మహేష్, నాయకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ప్రజా మేనిఫెస్టోకు శ్రీకారం
సాక్షి, శ్రీకాకుళం రూరల్: పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని కులాలు, వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ మేనిఫెస్టో రూపొందించనున్నామని శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం చెప్పారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం మేనిఫెస్టో రూపకల్ప నకు జిల్లాలోని పది నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతా రాం మాట్లాడుతూ జిల్లాలో వివిధ కులాలు ఉన్నాయని.. వారి సమస్యలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. ఈనెల 5వ తేదీలోగా ప్రణాళిక తయారుచేసి మేనిఫెస్టో కమిటీకి అందిస్తామన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 70 శాతం మంది వ్యవసాయ ఆధారిత పంటలపై ఆధారపడి జీవిస్తున్నారని, రైతులను ఆదుకోవాలని ఆయన ప్రతిపాదిం చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఏడు వేల కుటుంబాలు వంశధార నిర్వాసితులుగా మిగిలిపోయిన విషయం గుర్తించి, పార్టీ అధికారంలోకి వస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. 2013 ఆర్ఆర్ చట్టం ప్రకారం నిర్వాసితులను ఆదుకోవడంలో టీడీపీ విఫలమైందన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని.. వారికి మంచినీటి సమస్య, రహదారి సమస్య తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకూర్మం, శ్రీముఖలింగం పురాతన దేవాలయాలు అయినప్పటికీ అభివృద్ధిలో బాగా వెనుకబడి ఉన్నాయని, అక్కడ ప్రగతి పనుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. వంశధార కుడి కాలువ, ఎడమ కాలువ అభివృద్ది చెందినప్పటికీ నేరేడి బ్రిడ్జి సమస్య తీవ్రంగా ఉందని, ఇది అంతర రాష్ట్ర సమస్యగా తీవ్రరూపం దాల్చిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను నెలకొల్పాలని ఆయన కోరారు. ఉద్దానం పరిసర ప్రాంతాల్లో వారు పండించే పంటలు జీడిమామిడి, కొబ్బరి, ములక్కాడలు కాకుండా కొత్త పంటలు పండించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. జీడి పరిశ్రమకు ప్రత్యేకమైన బోర్డును రూపొందించాలని ఆయన మేనిఫెస్టోలో ప్రతిపాదించారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్ మాట్లాడుతూ గ్రామస, నియోజకవర్గ, జిల్లాస్థాయి మేనిఫెస్టోలు రూపొందించాక రాష్ట్రస్థాయిలో మేనిఫెస్టోలు ఇచ్చే ప్రక్రియను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారని, ఆ విధంగానే రిమ్స్, అంబేద్కర్ యూనివర్సిటీలు వచ్చాయని గుర్తుచేసారు. పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదరి అప్పలరాజు మాట్లాడుతూ నవరత్నాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం కల్పించాలన్నారు. గార, శ్రీకాకుళం మండల పార్టీ నాయకులు పీస శ్రీహరి, మూకళ్ళ తాతబాబు, బీసీ సెల్ అధ్యక్షుడు సురంగి మోహన్‌రావు, లీగల్ సెల్ నాయకుడు రఘుపాత్రుని, మాజీ ఎంపీపీ మంజుల, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పొన్నాడ రుసి, పార్టీ నాయకులు జేజే మోహన్‌రావు, పి.శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు క్రిష్ణమూర్తి, యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్, గిరిజన నాయకుడు ఎండయ్య తదితరులు తమ సూచనలు అందజేశారు. -
పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు
-
‘ఖాకీలు పచ్చ చొక్కాలు వేసుకోవాలి’
సాక్షి, శ్రీకాకుళం : ప్రజలను రక్షించాల్సిన పోలీసులు.. టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అసలు జిల్లాలో పోలీసు డిపార్ట్మెంట్ ఉందా అని ప్రశ్నించారు. టీపీపీ నాయకుల తొత్తులుగా పోలీసులు మారారని విమర్శించారు. పోలీసులు ఖాకీ చొక్కాలు తీసేసి.. పచ్చ చొక్కాలు వేసుకోవాలన్నారు. టీడీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కోటబొమ్మాళి మండల వైఎస్సార్ సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతోనే కోటబొమ్మాళిలో తమ కార్యకర్తలపై దాడి జరిగిందని ఆరోపించారు. మంచి పాలన చేయమని ఎన్నుకుంటే.. టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘టీడీపీ నేతలకు అహం పెరిగింది. ప్రజలను ఫోన్లో బెదిరిస్తున్నారు. అధికారులను పిలిపించుకొని వార్నింగ్ ఇస్తున్నారు. దందాలు, మైన్స్, వైన్స్, సెటిల్మెంట్లు చేస్తూ రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. అమాయకులైన మా పార్టీ కుర్నాళ్లపై ఇనుప రాడ్లతో దాడులు చేస్తారా? కోటబొమ్మాళిలో మా పార్టీ కార్యాలయాన్ని తొలగించడానికి అచ్చెన్నాయుడు ఎవరు? రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదా? మంచిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి కానీ బెదిరించి అధికారంలోకి రావాలనుకోవద్దు. పెన్షన్లు ఇచ్చాం, లోన్లు ఇచ్చామని బెదిరిస్తూ ఓట్లు వేయించుకోవాలని చూస్తారా? ప్రజల గమనిస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతల అరాచకాలు ఆపాలి లేకపోతే ప్రజలే తిరగబడతారు’ అని తమ్మినేని అన్నారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని అందుకే ప్రజలపై బెదిరింపులను దిగుతున్నారని విమర్శించారు. సర్వేల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. -
‘చంద్రబాబు అసమర్థత వల్లే వలసలు’
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థత వలనే ఉత్తరాంధ్రలో వలసలు పెరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని సీతారాం విమర్శించారు. గురువారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారం, ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాస్, రాజన్న దొర, కంబాల జోగులు, పుష్ప శ్రీవాణి, కళావతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించటంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే పేదలకు న్యాయం జరుగుతుందని నొక్కిఒక్కానించారు. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు : భూమన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓట్లను తొలగిస్తున్నారన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే గెలవలేమని చంద్రబాబు భయపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారులను తన స్వార్థం కోసం పావులుగా వాడుకుంటున్నారని తెలిపారు. అధికారులు చంద్రబాబు ఉచ్చులో పడొద్దని సూచించారు. ఎన్నికల అధికారులు దొంగ ఓట్లు అన్నింటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘చంద్రబాబు దళితులను అవమానించారు’ ‘దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా?’ అంటూ మాట్లాడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దళితులను అవమానించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, పుష్పశ్రీ వాణి, కళావతి అన్నారు. వారు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో దళితులు, గిరిజనులు వివక్షకు గురవుతున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో వారిపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దళితుల భూములను టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే దళితులకు, గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే దళితుల, గిరిజనుల అభివృద్ధి జరిగిందన్నారు. అందుకు వ్యతిరేకమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు : రాజన్నదొర బాక్సైట్ తవ్వకాలకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకమని చింతపల్లి సభలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజన్నదొర తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. లేటరైట్ పేరుతో మంత్రులు బాక్సైట్‌ను దోచుకుంటున్నారని ఆరోపించారు. 2014కు ముందు విశాఖలో ఎలాంటి అనుమతులు లేవని, బాక్సైట్, లేటరైట్ తవ్వకాలకు నాటి ప్రభుత్వాలు అనుమతివ్వలేదని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, వారి కుమారులు ముఠాగా మారి తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపించారు. వీటిని గనుల శాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారని చెప్పారు. -
కేంద్రమంత్రిని చేయడం వల్లే వేల కోట్ల అవినీతి
శ్రీకాకుళం: టీడీపీ ఎంపీ, ఆర్ధిక నేరగాడు సుజనా చౌదరీ మీద ఇప్పటికే చర్యలు తీసుకుని ఉండాల్సిందని, కేంద్ర మంత్రిని చేసి కాపాడటం వల్లనే వేల కోట్ల రూపాయల అవినీతికి ఎగబాకాడని వైఎస్సార్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం వ్యాక్యానించారు. శ్రీకాకుళంలో తమ్మినేని విలేకరులతో మాట్లాడుతూ..సుజానా చౌదరీ ఆర్ధిక నేరాలు చేసి ఆ డబ్బును చంద్రబాబుకు అందజేశారని ఆరోపించారు. ఆ డబ్బుతోనే గత ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుపెట్టి ఓట్లు కొన్నారని చెప్పారు. ఆర్ధిక నేరగాళ్ల మీద ఐటీ దాడులు జరుగుతుంటే ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ ఆర్ధిక నేరాల్లో అసలు సిసలైన గజదొంగ చంద్రబాబేనని, అందుకే చంద్రబాబు తుళ్లిపడుతున్నారని అన్నారు. ఆర్ధిక నేరాల మూలాలన్నీ చంద్రబాబు వద్దకే చేరతాయని ఆరోపించారు. ఆర్ధిక నేరాలు బయటపడతాయనే కారణంతోనే ముందస్తుగా జాతీయ పార్టీ అండ కోసం కాంగ్రెస్ పంచన చేరారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ పేరిట పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. పసిపిల్లలకు కూడా ఉగ్గుపాలతో అవినీతి నేర్పుతున్నారని చంద్రబాబు నుద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు. రెండు వేల రూపాయల నోట్లు కూడా రద్దు చేస్తే, వచ్చే ఎన్నికల్లో అవినీతి సొమ్ము కట్టడి అవుతుందని వ్యాఖ్యానించారు. -
సీఎం పాలన చేస్తున్నారా! లేదా!
సరుబుజ్జిలి: వంశధార నదిలో పోటెత్తిన వరద వల్ల ముంపునకుగురైన ఇళ్లు, పంటలను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు నిస్సహాయులుగా రోడ్డునపడినా ఆదరించేవారు లేరని వాపోయారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నారా లేదా అర్థంకావడంలేదని విమర్శించారు. వంశధార వరదల్లో చిక్కుకున్న పాలవలస, పెద్ద వెంకటాపురం, రావివలస, వీరమల్లిపేట, తురకపేట, కేజేపేట, బుడ్డివలస తదితర గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను కలుసుకొని ఓదార్చారు. అనంతరం తమ్మినేని విలేకరులతో మాట్లాడుతూ తుఫాన్ బాధిత గ్రామాల్లో విద్యుత్, తాగునీరు, నిత్యావసరవస్తులు అందించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయిందన్నారు. తుఫాన్ ప్రభావానికి తీర ప్రాంతాల్లో దాదాపు 16 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని ఆకలితో అలమటించి ఆర్తనాదాలు చేస్తున్నా అధికారులు ఆవైపు కన్నెత్తిచూడడంలేదని ఆగ్రహించారు. పెద్దవెంకటాపురం గ్రామంలో పంపిణీ చేయాల్సిన కొవ్వొత్తులను అధికారులు బాధితులకు అందించకపోవడంతో గాఢా«ంధకారంలో ప్రజలు మగ్గుతున్నారన్నారు. వేలాది ఎకరాల్లో వరి, చెరుకు పంటలు నష్టపోయినా అధికార యంత్రాంగాలు ఇంతవరకు పర్యటించకపోవడమేమిటని ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రజలు తాగునీరు లేక, అంటువ్యాధులతో ఇబ్బందులు పడుతుంటే ఎంపీడీఓ అడ్రస్ లేకుండా పోయారని ఆరోపించారు. అధికార యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి చుట్టూ భజనలు చేయడంతో వరద ప్రాంతాల్లోని బా«ధితుల సమస్యలు పట్టించుకొనేవారే కరువయ్యారని చెప్పారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే తుఫాన్ నష్టం ఏర్పడినా సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం కావడం సిగ్గుచేటని అన్నారు. ఈ పర్యటనలో ఎంపీపీ కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ, జెడ్పీటీసీ ప్రతినిధి సురవరపు నాగేశ్వరరావు, బూత్‌కమిటీల మండల ఇన్చార్జి మూడడ్ల రమణ, జి.వి.శివానందమూర్తి, పున్నపురెడ్డి తవిటినాయుడు, కొవిలాపు చంద్రశేఖర్, గుంట విజయ్, బెండి అప్పలనాయుడు, లావేటి విశ్వేశ్వరరావు, కరణం అసిరినాయుడు, గదిలి రమణ, వండాన కృష్ణ, పుచ్చ రాజారావు, పొన్నాడ కొండలరావు, సనపల తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీవి దెయ్యాల దీక్షలు
శ్రీకాకుళం సిటీ : ప్రత్యేక హోదా విషయంలో రా్రష్రట ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టుపెట్టిన ముఖ్యమంత్రి, టీడీపీ నాయకులు ఇప్పుడు దీక్షలు చేయడం దెయ్యాలు వేదా లు వల్లించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో దీక్ష చేస్తున్నారా లేక టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా దీక్ష చేపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఢిల్లీలో కాకుం డా ఇక్కడ దీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుది 420 దీక్షగా అభివర్ణించారు. ధర్మపోరా ట దీక్షకు రూ.20 కోట్ల ప్రభుత్వ, ప్రజాధనాన్ని దుర్విని యోగం చేశారని దుయ్యబట్టారు. మహిళా సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులను బలవంతంగా దీక్షలకు తరలించారని ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదాకు మద్దతుగా పోరాడితే విద్యార్థులపై కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని చెప్పి ఇప్పుడు దీక్షల్లో వారినే భాగస్వామ్యం చేస్తున్న మీకు అండమాన్, తీహార్లలో ఏ జైలు కు పంపించాలో మీరే చెప్పాలని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో దళిత, గిరిజన భూములు ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పారు. హామీలు అమలు చేయకపోవడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, రెవెన్యూ, పంచాయతీరాజ్ వంటి శాఖలను ముక్కలు చేíసి ఆరోగ్యశ్రీని చెట్టెక్కించడంతో పాటు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఏ త్యాగానికైనా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సెక్షన్ 30 ఇప్పుడేమైంది? శ్రీకాకుళం సబ్ డివిజన్లో సెక్షన్ 30ను అందరికి సమానంగా వర్తింపజేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి వద్ద మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు దీక్షలో కూర్చొంటే సెక్షన్ 30 ఎక్కడికెళ్లిందని పోలీసులను ప్రశ్నించారు. తాము దీక్షలు చేపట్టిన సందర్భాల్లో గృహ నిర్బంధాలు, దీక్షలు భగ్నం చేయడం, అరెస్టులు వంటివి చేశారని గుర్తు చేశారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్ పాల్గొన్నారు. -
కోడెల ఓ కళంకిత స్పీకర్!
శ్రీకాకుళం అర్బన్: ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయకుండా ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్న కోడెల శివప్రసాదరావు శాసనసభ చరిత్రలో ఓ కళంకిత స్పీకర్‌గా నిలిచిపోతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడమే గాకుండా వారికి చం ద్రబాబు తన కేబినెట్లోనూ చేర్చుకొని ప్రజాస్వామ్య విలువలను మంటగలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెడధోరణులను నిరసిస్తూ, ఆ మం త్రులను బర్తరఫ్ చేసేవరకూ శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని తమ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. శ్రీకాకుళంలో ని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మీడి యా సమావేశంలో మాట్లాడారు. కేవలం అధికార పార్టీ నేతల ప్రలోభాలకు లొంగిపోయి స్వార్థప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా ఆ పనికి ‘అభివృద్ధి’ ముసుగేయడం దారుణమన్నారు. ప్రజాభిప్రాయానికి గండికొట్టి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కోడెలకు ఎన్నోమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడం తగదని తమ్మినేని వ్యాఖ్యానించారు. ఇంత జరిగినా ఇప్పుడు శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 66 మంది అని ప్రకటించడం గమనార్హమన్నారు. కోడెల కన్నా ముందు ఎంతోమంది స్పీకర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడారని, స్పీకరు కుర్చీకే వన్నె తెచ్చారని వ్యాఖ్యానించారు. వారికి భిన్నంగా కోడెల దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అందుకే శాసనసభ చరిత్రలో కళంకిత స్పీకర్‌గా కోడెల నిలిచిపోతారని విమర్శించారు. ఇలాంటి పెడధోరణులకు ముగింపు పలకాలనే తప్పని పరిస్థితుల్లో శాసనసభ సమావేశాల బహిష్కరణ నిర్ణయాన్ని తమ పార్టీ అధిష్టానం తీసుకుందని తమ్మినేని చెప్పారు. చంద్రబాబుకు దమ్మూధైర్యం ఉంటే ఫిరాయింపు చట్టంపై మీడియా ముందు చర్చకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బాధలు తెలుసుకునేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ‘ప్రజా సంకల్పం’ పేరుతో పాదయాత్ర చేయనున్నారని ఆ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. నవంబరు 6 నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 3 వేల కిలోమీటర్ల మేర కొనసాగుతుందని చెప్పారు. సమావేశంలో పార్టీ సీ ఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, పార్టీ నేత సీపాన రామారావు తదితరులు పాల్గొన్నారు. -
'టీడీపీకి అంత సీన్ లేదు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడే శక్తి అధికార తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దాటికి తట్టుకోలేకనే ప్రత్యేక హోదాపై దీక్షను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్సీపీ వెనుకడుగు వేయదని తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రజల హక్కు అని ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం నినదించారు. -
'చంద్రబాబుకు జగన్‌ను విమర్శించే హక్కులేదు'
శ్రీకాకుళం: ఐఎంజీ భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని విమర్శించే హక్కులేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. కేసులు ఉన్న వారిని మంత్రి వర్గం నుంచి వెంటనే తొలగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీతారాం చంద్రబాబును డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రిని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టనిచ్చే ప్రసక్తే లేదన్నారు.