
ఆమదాలవలస: ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్న తమ్మినేని
ఆమదాలవలస: ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో అన్నింటా దోపిడీ చేసిన ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధి 13వ వార్డు తవిటినాయుడు క్వార్టర్స్, విద్యానగర్, కిల్లివారి క్వార్టర్స్, కాలేజీ వీధి, చంద్రయ్యపేట, కొత్తకోటవారివీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను అందించి ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న పాలన రావాలంటే జగనన్న సీఎం కావా లని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జె.జె.మోహన్‌రావు, కిల్లి లక్ష్మణరావు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎ. ఉమామహేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, మాజీ చైర్‌పర్సన్ బొడ్డేపల్లి రమేష్, మున్సిపల్ కౌన్సిలర్‌లు బొడ్డేపల్లి అజంతాకుమారి, పొన్నాడ కృష్ణవేణి, దుంపల శ్యామలరా వు, డి.చిరంజీవిరావు, మరాఠి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి
పొందూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి జగనన్నను సీఎం చేయాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ కోరారు. పొందూరు గ్రామంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కోరుకొండ సాయికుమార్, గాడు నాగరాజు, అనకాపల్లి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
బూర్జ: మండలంలోని సింగన్నపాలెం, లచ్చయ్యపేట గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, యువజన విభాగం అధ్యక్షుడు గుమ్మడి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బెజ్జిపురం రామారావు ఎన్నికల ప్రచారాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాంను, శ్రీకాకుళం ఎంపీగా దువ్వాడ శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేపారి లక్ష్మీనారాయణ, జల్లు అప్పలస్వామినాయుడు, బగాది నారాయణమూర్తి, ఎంపీటీసీలు బూరి శ్రీరామమూర్తి, గేదెల ముఖలింగం, జడ్డు మహేష్, నాయకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment