
కుమారుడు చిరంజీవినాగ్‌తో కలిసి కబడ్డీ ఆడుతున్న తమ్మినేని సీతారాం
కబడ్డీ.. కబడ్డీ.. అంటూ బరిలోకి దిగారు. స్వయంగా తన కుమారుడు చిరంజీవి నాగ్‌తో తలపడి స్పీకర్ తమ్మినేని కబడ్డీ ఆడటం అందరినీ...
సరుబుజ్జిలి/పాతపట్నం: సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడిపే ప్రజాప్రతినిధులు కాస్త విరామం తీసుకున్నారు. ప్రత్యర్థులు, రాజకీయాలంటూ ఎప్పుడూ హాట్‌హాట్‌గా కనిపించే నేతలు రాజకీయాలకు కాసేపు విరామం పలికి.. కూల్‌గా ఆటలాడారు.
ఇందుకు ‘సీఎం కప్’ పోటీలు వేదికగా నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం క్రీడా పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ.. కబడ్డీ.. అంటూ బరిలోకి దిగారు. స్వయంగా తన కుమారుడు చిరంజీవి నాగ్‌తో తలపడి స్పీకర్ తమ్మినేని కబడ్డీ ఆడటం అందరినీ అలరించింది. అలాగే, పాతపట్నం మండలం కొరసవాడ పాఠశాల మైదానంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్వయంగా బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు.