![Speaker Thammineni Seetharam Fires on Chandrababu Naidu - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/19/1.jpg.webp?itok=g2MZGjGk)
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారం కోసం ఎంతకయినా దిగజారుతారని స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. చంద్రబాబుకు ఇప్పటికే నిరాశ నిస్పృహలు ఆవహించాయన్నారు. ఎన్నికల సమయానికి ఎన్నో కుయుక్తులు పన్నుతారని చెప్పారు. చంద్రబాబును దగ్గరనుంచి చూసిన వ్యక్తిగా ఆయనకు ఎంత అధికార దాహమో తనకు తెలుసన్నారు. తనకంటే చిన్నకుర్రాడైన జగన్ గురించి తక్కువగా భావించి ఇప్పడు తట్టుకోలేక పోతున్నారని అన్నారు.
'వైఎస్ జగన్ ఆలోచన విచక్షణ ముందు నిలబడలేకపోతున్నానని చంద్రబాబు కృశించిపోతున్నారు. ప్రధాని ఎదుట కూడా సీఎం జగన్ రాజకీయాలకంటే రాష్ట్రం ముఖ్యమని చెప్పారు. వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ ప్రజలు చంద్రబాబుని ఛీ కొట్టారు. దత్తపుత్రుడు పవన్ చెప్పు చూపిస్తే.. చంద్రబాబు కూడా చూపిస్తా అన్నారు. చరిత్రపుటల్లో ఇలాంటి ఎంతో మంది కొట్టుకుపోయారు. అధికారమనే మానసిక రోగంతో చంద్రబాబు పతనమైపోతున్నారు. జగన్‌కు లక్ష్యంపై క్లారిటీ ఉంది. చంద్రబాబు కర్నూలు పర్యటనలో అంతు చూస్తా అన్నారు. ఆయన ఎవరి అంతు చూస్తారని' ప్రశ్నించారు.
చంద్రబాబు మీ పార్టీ అంపశయ్యపై ఉంది. వెంటిలేటర్లు తీస్తే అంతిమ యాత్రే. ఇది అసమర్ధుని అంతిమ యాత్ర. మీ పార్టీకి ఇది ఆఖరు రోజులు. 600 వాగ్ధానాలు చేశారు. ప్రశ్నిస్తే వెబ్‌సైట్ నుంచి మేనిఫెస్టో తీసేశారు అని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.
చదవండి: (చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసనలు)
Comments
Please login to add a commentAdd a comment