![Speaker Thammineni Seetharam Serious About Pawan Kalyan Comments - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/12/Speaker-Thammineni-Seetharam.jpg.webp?itok=Bnv8HNxN)
సాక్షి, శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలపై తమ్మినేని సీరియస్ అయ్యారు.
కాగా, స్పీకర్ తమ్మినేని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లు సేవలు చేస్తుంటే ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారనడం ఏంటి?. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా అలా మాట్లాడుతాడా.. నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా. ఇలాంటి మాటలు రెండు కాళ్ల జంతువులు, బుర్రలేని పనికిమాలిన వ్యక్తులు మాత్రమే మాట్లాడతారు. పవన్ పిచ్చి మాటలు, వెకిలిచేష్టలు మానుకోవాలి. అరుపులు, తొడ గొట్టడం ఏంటి.. గుండు కొట్టిస్తాను అనడం ఏమిటి?. పవన్ కల్యాణ్ పరిణితి చెందని రాజకీయ నాయకుడు. ఇలా అరుపులు, తొడ గొట్టడం సినిమాల్లో చెల్లుతాయి.. రాజకీయాల్లో చెల్లవు అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: అవినీతి కేసు పీకల్లోతులో చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ఈశ్వరన్
Comments
Please login to add a commentAdd a comment