గేల్ ప్రవర్తన ఊహించిందే: వాట్సన్ | Chris Gayle's behaviour fairly expected, says Shane Watson | Sakshi
Sakshi News home page

గేల్ ప్రవర్తన ఊహించిందే: వాట్సన్

Published Sat, Jan 9 2016 12:58 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

గేల్ ప్రవర్తన ఊహించిందే: వాట్సన్

గేల్ ప్రవర్తన ఊహించిందే: వాట్సన్

మెల్‌బోర్న్: విండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ అనుచిత ప్రవర్తన ఊహించిందేనని ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్‌లో మహిళా జర్నలిస్టుతో అసభ్యకరంగా మాట్లాడిన గేల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ‘గేల్ గురించి తెలిసిన వారికెవరికైనా ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే వారందరికీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలుసు.

గేల్ ఆటను చూసేందుకు చాలా మంది స్టేడియాలకు వచ్చే మాట వాస్తవం. అయితే క్రికెట్‌కు అవతల కూడా ఓ ప్రపంచం ఉంటుందనే విషయం అతడు తెలుసుకోవాలి. క్రీజులో ఎంత బాగా ఆడామన్నదే కాకుండా బయట ఎలా ఉంటున్నామన్నది కూడా ముఖ్యం. అభిమానులు క్రికెట్‌లో వినోదంతో పాటు మైదానం ఆవల సరైన ప్రవర్తననే గౌరవిస్తారు’ అని వాట్సన్ స్పష్టం చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement