వాట్సన్‌ గిటార్‌.. కోహ్లి, గేల్‌ తీన్మార్‌!! | Virat Kohli Rocks the Dance Floor With Chris Gayle, Shane Watson Plays Guitar | Sakshi
Sakshi News home page

వాట్సన్‌ గిటార్‌.. కోహ్లి, గేల్‌ తీన్మార్‌!!

Published Thu, Apr 28 2016 5:41 PM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

వాట్సన్‌ గిటార్‌.. కోహ్లి, గేల్‌ తీన్మార్‌!!

వాట్సన్‌ గిటార్‌.. కోహ్లి, గేల్‌ తీన్మార్‌!!

జల్సా చేయడంలో, నైట్‌ అంతా పార్టీలో చిందులు వేయడంలో, తీన్మార్ డ్యాన్స్ చేయడంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లకు మరెవరు సాటిరారనే చెప్పాలి. ఇరగదీసే స్టెప్పులు వేయడంలో విరాట్ కోహ్లి ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇక కోహ్లికి సుడిగాలి లాంటి క్రిస్ గేల్‌ జతకలిస్తే.. షేన్‌ వాట్సన్‌ తన గిటారుతో దుమ్ములేపే ట్యూన్‌ ఇస్తే.. ఇక చెప్పాల్సిన పని లేదు. టాప్‌ లేచిపోద్ది. అలాంటి టాప్ లేచిపోయే డ్యాన్సులతో సుడి'గేల్‌', 'వీర' విరాట్ దుమ్ములేపారు.

నిజానికి తాజా ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు ఏమంతగా విజయాలు సాధించడం లేదు. అయినా ఆ జట్టు ఆటగాళ్ల జల్సాలకు, పార్టీ లైఫ్‌ అడ్డులేనట్టు కనిపిస్తోంది. ఇటీవల బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు, ఆస్ట్రేలియా క్రికెటర్‌ షేన్ వాట్సన్‌ తన గిటారు నైపుణ్యాన్ని చూపించాడు. అదరగొట్టేలా వాట్సన్‌ గిటారు వాయిస్తుంటే.. ఆ మ్యూజిక్‌కు తగ్గట్టు విరాట్ కోహ్లి స్టెప్పులు వేశాడు. ఇటీవల కూతురు పుట్టడంతో ఫుల్‌ హ్యాపీగా ఉన్న గేల్‌ కూడా కోహ్లితో జతకలిసి తన డ్యాన్సింగ్ రిథమ్‌ ను చూపెట్టాడు. క్రికెటర్లు ఫుల్ జోష్‌తో హంగామా చేసిన ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement