IPL 2016
-
IPL 2023: వరుసగా రెండు ఓటములు.. ఈసారి ట్రోఫీ సన్‌రైజర్స్‌దే.. అదెలా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. 2016 ఐపీఎల్లో సన్‌రైజర్స్ ఇలాగే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఆతర్వాత ఏకంగా టైటిల్ కైవసం చేసుకోవడంతో ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ఆ జట్టు అభిమానులు అంచనా వేస్తున్నారు. 2016లో సన్‌రైజర్స్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో (45 పరుగుల తేడాతో), రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో (8 వికెట్ల తేడాతో) ఓటమిపాలు కాగా.. ప్రస్తుత ఎడిషన్‌లో ఆ జట్టు తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో (72 పరుగుల తేడాతో), రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో (5 వికెట్ల తేడాతో) పరాజయంపాలైంది. కాగా, తొలి రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఘోర పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ఊరట పొందుతున్నారు. కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ వచ్చాక అయినా సన్ 'రైజ్' అవుతుందని భావిస్తే.. అతను కూడా ఏమీ చేయలేకపోవడంతో (గోల్డెన్ డక్) కొందరు ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. తదుపరి ఏప్రిల్ 9న పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్ నుంచి తమ విజయయాత్ర కొనసాగుతుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆరంభమే, ఇంకా బహుదూర ప్రయాణం సాగించాల్సి ఉంది, ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు, ఈసారి జట్టు కూడా పటిష్టంగా ఉందనుకుంటూ కొందరు హార్డ్‌కోర్ అభిమానులు తమను తాము తృప్తి పరుచుకుంటున్నారు. ఇదిలా ఉంటే, లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగుల అతి సాధారణ స్కోర్ చేసింది. కెప్టెన్ మార్క్రమ్ గోల్డన్ డకౌట్ కాగా.. 13.25 కోట్ల ఆటగాడు హ్యారీ బ్రూక్ (3) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమై దారుణంగా నిరాశపరిచాడు. రాహుల్ త్రిపాఠి (41 బంతుల్లో 35), వాషింగ్టన్ సుందర్ (28 బంతుల్లో 16) టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్‌లు ఆడారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎల్ఎస్జే.. ఆడుతూ పాడుతూ విజయతీరాలకు (16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127) చేరింది. తొలుత బౌలింగ్‌లో (4-0-18-3) అదరగొట్టిన కృనాల్ పాండ్యా, ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోయి ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. -
కరోనాపై పోరు: ఐపీఎల్ కిట్ల వేలం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి సాయం అందించేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ ముందుకు వచ్చారు. ఇందుకోసం తమ ఐపీఎల్ కిట్లను వేలం వేయాలని నిర్ణయించారు. కోహ్లితో కలిసి నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో డివిలియర్స్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 2016లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన గ్రీన్ డే మ్యాచ్ కిట్లను వేలం వేయాలని వీరిద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు పచ్చని రంగు దుస్తులతో బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో చెలరేగిన ఆడిన కోహ్లి, డివిలియర్స్ సెంచరీలు సాధించారు. ‘2016 ఐపీఎల్లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మేమిద్దరం శతకాలు బాదాం. మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. ఆ రోజు ఆటను బాగా ఆస్వాదించాం. నేను 120 పరుగులు చేశాను. నువ్వు సెంచరీ సాధించావు. పర్యావరణ పరిక్షణ పట్ల చైతన్యం కలిగించడానికి గ్రీన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో మనం ఆడిన కిట్లను వేలం వేద్దాం. దీని ద్వారా వచ్చిన నగదును కోవిడ్-19 ఫండ్‌కు ఇద్దాం. అభిమానులూ.. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి. వేలంలో ఎంత ఎక్కువ డబ్బు వస్తే అంత ఎక్కువ మందికి మేలు జరుగుతుంద’ని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. కరోనా: ఢిల్లీలో పులి మృతి కలకలం -
ఆ విజయం అతి మధురం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్‌గా లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వార్నర్‌ది (4,706) నాలుగో స్థానం కాగా, విదేశీ ఆటగాళ్లలో అతనే నంబర్‌వన్. సారథిగా కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుండి నడిపించిన వార్నర్ 2016లో హైదరాబాద్ టీమ్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అందుకే అతనికి ఇదో మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఐపీఎల్ విజేతగా నిలవడం తన కెరీర్లో అత్యుత్తమ క్షణాల్లో ఒకటని సన్‌రైజర్స్ కెప్టెన్ వ్యాఖ్యానించాడు. నాటి ఫైనల్ మ్యాచ్‌ను ఈ సందర్భంగా అతను గుర్తు చేసుకున్నాడు. 2016 సీజన్లో వార్నర్ 848 పరుగులు చేసి విరాట్ కోహ్లి (973) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ‘ఐపీఎల్లో 2016 టైటిల్ గెలిచిన క్షణమే నాకు అతి మధురం. ఆ ఏడాది అన్ని మ్యాచ్‌లు బాగా ఆడాం. హోరాహోరీ సమరాల్లో నెగ్గడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. అద్భుతంగా సాగిన నాటి టోర్నీని నా జీవితకాలం గుర్తుంచుకుంటాను. ఫైనల్లో బెంగళూరును వారి సొంతగడ్డపై ఓడించడం మరచిపోలేను. నాడు కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉండగా...గేల్, డివిలియర్స్ అతడికి తోడుగా నిలిచారు. అయితే మా సామర్థ్యాన్ని మేం నమ్మాం. అందుకే టాస్ గెలిచినా బ్యాటింగ్ తీసుకున్నాం. 209 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఆర్సీబీ 10 ఓవర్లలో ఒక వికెట్‌కే 145 పరుగులు చేయడంతో గుండె ఆగినంత పనైంది. అయితే రెండు కీలక వికెట్లు పడగొట్టి మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చేశాం’ అని వార్నర్ గుర్తు చేసుకున్నాడు. నాటి ఫైనల్లో చివరకు హైదరాబాద్ 8 పరుగులతో విజయం సాధించింది. -
డోపీగా తేలడంపై పెదవి విప్పిన మెకల్లమ్..
వెల్లింగ్టన్: 2016 ఐపీఎల్ సందర్భంగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ డోపింగ్ పరీక్షల్లో విఫలమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మెకల్లమ్ స్వయంగా వెల్లడించాడు. అయితే అతను తాను వాడిన ఉత్ప్రేరకం విషయంలో మినహాయింపు ఉన్నట్లుగా ధ్రువపత్రం సమర్పించడం ద్వారా నిషేధం తప్పించుకున్నట్లు స్పష్టం చేశాడు. 2016లో భారత్‌లో ఒక ప్రముఖ ఆటగాడు డోప్ పరీక్షలో విఫలమైనట్లుగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) పేర్కొంది. అయితే అతను ఎవరన్నది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అప్పట్లో దాచి పెట్టింది. దీనిపై ఇప్పుడు మెక్కలమే స్వయంగా తాను డోపీగా దొరికిన విషయాన్ని పేర్కొన్నాడు. ‘ఆ సమయంలో ఇన్హేలర్ అతిగా వాడాను. బీసీసీఐ నాకు సహకరించింది’ అని మెక్‌కలమ్ తెలిపాడు. రెండేళ్ల క్రితం గుజరాత్ లయన్స్ తరపున ఆడినప్పుడు ఆస్తమా బాధితుడైన మెకల్లమ్ ఢిల్లీలో కాలుష్యం వల్ల బాగా ఇబ్బంది పడటంతో ఎప్పుడూ వాడే ఇన్హేలర్ మందు ఎక్కువ స్థాయిలో తీసుకున్నాడట. దీని ఫలితంగా డోప్ పరీక్షల్లో అతను పట్టుబడ్డాడట. దీనిపై బీసీసీఐ అతడిని వివరణ కోరగా.. స్వీడన్‌కు చెందిన వైద్య నిపుణుల నుంచి ధ్రువపత్రం సమర్పించడం ద్వారా నిషేధం నుంచి బయటపడినట్లు వెల్లడైంది. -
ఐపీఎల్ చాంపియన్స్ వీరే!
గత పదేళ్లలో ఎంతో మంది అనామక క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. యువ ఆటగాళ్ల సత్తాకు ఓ వేదికగా మారింది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక లీగ్‌ల్లో తొలిస్థానంలో నిలిచిన ఐపీఎల్.. పది వసంతాలు పూర్తి చేసుకుని పదకొండో సీజన్లోకి అడుగెట్టింది. గడిచిన పదేళ్లలో కొన్ని జట్లు మాత్రం పలుమార్లు ఈ క్యాష్ రిచ్ లీగ్ టోఫ్రిని ముద్దాడగా.. మరికొన్ని జట్లకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇప్పటివరకూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఐపీఎల్ సొంతం చేసుకుంది. దీనిలో భాగంగా గత విజేతలపై ఓ లుక్కేద్దాం. ♦ ఐపీఎల్-2017 ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ మూడో సారి టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఫైనల్లో రైజింగ్ పుణెతో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్ (316 పరుగులు, 12 వికెట్లు) ప్రదర్శన కనబర్చిన రైజింగ్ పుణె ఆటగాడు బెన్‌స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ దిటోర్నీగా నిలిచాడు. సన్ రైజర్స్ ఆటగాళ్లు డెవిడ్ వార్నర్ (641) ఆరెంజ్ క్యాప్ అందుకోగా.. భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లతో వరుసగా రెండో సారి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ♦ ఐపీఎల్-2016 ఫిక్సింగ్ వివాదంతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై రెండేళ్ల నిషేదం పడటంతో ఈ రెండు జట్లు ఈ సీజన్‌కు దూరమయ్యాయి. వాటి స్థానంలో కొత్తగా గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె జెయింట్స్‌లు వచ్చాయి. ఈ సీజన్ చాంపియన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఫైనల్లో విరాట్ కోహ్లి సారథ్యంలోని పటిష్ట రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 8 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ టోర్నీ ఆసాంతం అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఫ్లేయర్ఆఫ్ ది టోర్నీతో పాటు ఆరెంజ్ క్యాప్ సొంతమైంది. ఈ సీజన్లో కోహ్లి ఏకంగా 973 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు. బౌలింగ్‌తో సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ♦ ఐపీఎల్-2015 ఈ సీజన్ చాంఫియన్‌గా ముంబై ఇండియన్స్ నిలించింది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రెండో సారి టైటిల్ నెగ్గింది. కోల్‌కతా ఆటగాడు ఆండ్రూ రస్సెల్ బ్యాటింగ్ 326 పరుగులు, బౌలింగ్14 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవగా.. సన్‌రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 562 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. బౌలింగ్‌లో 26 వికెట్లతో చెన్నై ఆటగాడు డ్వాన్ బ్రావో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికే పరిమితమైంది. ♦ ఐపీఎల్-2014 పుణెవారియర్స్ ఫ్రాంచైజీ తప్పుకోవడంతో 8 జట్లతో కొనసాగిన ఈ సీజన్ టైటిల్‌ను గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండో సారి కైవసం చేసుకుంది. ఫైనల్లో బెయిలీ సారథ్యంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై కోల్‌కతా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో పంజాబ్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ 552 పరుగులతో మ్యాన్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. కోల్‌కతా ఆటగాడు రాబిన్ ఉతప్ప 660 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకోగా చెన్నై ఆటగాడు మోహిత్ శర్మ 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానంతో సరిపెట్టుకుంది. ♦ ఐపీఎల్-2013 ఈ సీజన్లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ యాజమాన్యం మారడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా బరిలోకి దిగింది. ఐపీఎల్ ఐదో సీజన్ చాంపియన్‌గా రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ నిలిచింది. వరుసగా నాలుగో సారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్‌కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు షేన్ వాట్సన్ బ్యాటింగ్‌లో 543 పరుగులతో, బౌలింగ్‌లో 13 వికెట్లతో రాణించడంతో మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. చెన్నై ఆటగాడు మైక్‌హస్సీ 733 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకోగా.. చెన్నైకే చెందిన మరో ఆటగాడు డ్వాన్ బ్రావో 32 వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. పేరు మార్చుకొని బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి క్వాలిఫైయర్స్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడింది. ♦ ఐపీఎల్-2012 గత సీజన్లో వచ్చి చేరిన రెండు కొత్త జట్లలో కేరళ కొచ్చి టస్కర్ ఫ్రాంచైజీ ఆర్థిక కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకుంది. దీంతో 9 జట్లతో కొనసాగిన ఈ సీజన్ టైటిల్‌ను గౌతమ్ గంభీర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. వరుసగా మూడో సారి ఫైనల్‌కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్‌ను కోల్‌కతా 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఇక ఈ సీజన్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్ 24 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ సీజన్లో సైతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ తన పరుగుల వరదను కొనసాగించాడు. గేల్ 733 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను సొంత చేసుకోగా 25 వికెట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు మోర్నీ మోర్కెల్ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్ పాయింట్ల పట్టికలో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ 8వ స్థానంలో నిలిచింది. ♦ ఐపీఎల్-2011 ఐపీఎల్‌కు ఆదరణ పెరగడంతో ఈసీజన్లో మరో రెండు కొత్త జట్లు పుణె వారియర్స్, కేరళ కొచ్చి టస్కర్స్లు వచ్చాయి. ఈ సీజన్ టైటిల్‌ను సైతం చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. ఫైనల్లో డానియల్ వెటోరి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పై ధోని సేన 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఆటగాడు క్రిస్‌గేల్ పరుగుల సునామీ సృష్టించాడు. ఏకంగా 608 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌తో పాటు బౌలింగ్‌లో 8 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు లసిత్ మలింగా 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానంతో సరిపెట్టుకుంది. ♦ ఐపీఎల్-2010 మూడో సీజన్ టైటిల్‌ను మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకోగా.. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్లో ముంబై కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 618 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది టోర్నీతో పాటు ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇక పర్పుల్ క్యాప్‌ను 21 వికెట్లతో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా అందుకున్నాడు. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు సెమీస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడి 38 పరుగుల తేడాతో ఓడింది. ♦ ఐపీఎల్ -2009 రెండో సీజన్ చాంపియన్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ సారథ్యంలోని డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ నిలవగా.. అనిల్ కుంబ్లే కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరుపై 6 పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్ జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. ఈ సీజన్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న హైదరాబాద్ కెప్టెన్ గిల్‌క్రిస్ట్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. బ్యాటింగ్‌లో 495 పరుగులు, కీపర్‌గా 18 డిసిమిసల్స్ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాథ్యూ హెడెన్ 572 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకోగా.. డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ బౌలర్ ఆర్పీ సింగ్ 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ♦ ఐపీఎల్ -2008 ఐపీఎల్ తొలి సీజన్ టైటిల్‌ను షేన్‌వార్న్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలవగా ధోని కెప్టెన్సీలోని చెన్నైసూపర్ కింగ్స్ రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్లో రాజస్థాన్ ప్లేయర్ షేన్ వాట్సన్ బ్యాటింగ్‌లో 472 పరుగులతో బౌలింగ్‌లో 17 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇక కింగ్స్ఎలెవన్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ 616 పరుగులతో ఆరేంజ్ క్యాప్ అందుకోగా.. రాజస్థాన్ ప్లేయర్ సోహైల్ తన్వీర్ 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్లో వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలోని హైదరాబాదీ జట్టు డెక్కన్ చార్జర్స్14 మ్యాచ్‌లకు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. - శివప్రసాద్ ఉప్పల -
నెహ్రా వుయ్ మిస్ యూ! ఈ విజయం నీకే అంకితం!!
8 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను హైదరాబాద్ సన్ రైజర్స్ ఓడించడంతో సంబరాలు మిన్నంటాయి. తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆనందంలో హైదరాబాద్ జట్టంతా ఓలలాడుతుండగా.. ఒక్క క్రికెటర్ మాత్రం ఈ సంబరాలకు దూరంగా ఉండిపోయాడు. అతనే ఆశిష్ నెహ్రా. ఈ నెల 15న పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడటంతో నెహ్రా మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. అయినా నెహ్రాను హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు మరువలేదు. ఐపీఎల్ టైటిల్‌ను గెలువగానే సన్‌రైజర్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఈ బౌలింగ్ లెజండ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో కృతజ్ఞతలు తెలిపాడు. 'నెహ్రా వుయ్ మిస్ యూ. ఈ విజయం నీ కోసమే. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు శుభాకాంక్షలు. అద్భుతంగా ఆడారు' అంటూ యూవీ పేర్కొన్నాడు. తమ విజయానందంలోని ఫొటోను షేర్ చేశాడు. -
కోల్‌కతా ఓటమికి వారే కారణం!
బాట్స్మన్లను నిందించిన గంభీర్.. యూవీలా ఒక్కరూ కూడా ఆడలేదని ఆవేదన ఎన్నో అంచనాలతో, ఒకింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ షాకిచ్చింది. లీగ్‌లో రెండుసార్లు హైదరాబాద్‌ను ఓడించిన గంభీర్ సేన.. కీలకమైన ఎలిమినేటర్ లో మాత్రం భారీ తేడాతో చిత్తయింది. 2012, 2014లో ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు తాజాగా హైదరాబాద్ విసిరిన 163 పరుగులు లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ హైదరాబాద్ జట్టు కోల్‌కతాకు ఇంటిదారిని చూపెట్టింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ గౌతం గంభీర్ విలేకరులతో మాట్లాడుతూ తమ జట్టు ఓటమికి బాట్స్మన్ వైఫల్యమే కారణమని చెప్పాడు. లక్ష్యఛేదనలో బలమైన భాగస్వామ్యాలను నెలకొల్పడంలో కోల్‌కతా బ్యాట్స్‌మన్ విఫలయ్యారని చెప్పుకొచ్చాడు. 'మేం భారీ భాగస్వామ్యాలను ఏర్పాటుచేయలేకపోయాం. యువరాజ్ తరహాలో ఒక్కరూ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. యూపీ అర్ధ సెంచరీ చేయకున్నా అతడి అసాధారణ ఇన్నింగ్స్ మ్యాచ్ గతిని మార్చేసింది' అని గంభీర్ విశ్లేషించాడు. తమ బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరైనా 60 లేదా 70 పరుగులు చేసి ఉంటే తాము గెలిచేవాళ్లమని చెప్పాడు. ఇప్పటివరకు కోల్‌కతా జట్టు బ్యాటింగ్ లైనఫ్పైనే ఆధారపడి విజయాలు సాధిస్తూ వచ్చిందని, కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాత్రం అంచనాలు నిలబెట్టడంలో బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిరోజ్ షా పిచ్‌పై 160 పరుగుల లక్ష్యం పెద్దదేమీ కాదని, బ్యాట్స్‌మన్ నిలబడితే దీనిని ఛేదించవచ్చునని, అయితే, హైదరాబాద్ జట్టు తమను సమర్థంగా నిరోధించిందని అన్నాడు. ఆల్ రౌండర్ అండ్రూ రస్సెల్ జట్టులో లేకపోవడం కూడా తమను దెబ్బతీసిందని గంభీర్ అన్నాడు. -
సెక్స్ వ్యాఖ్యలు: ఐపీఎల్‌లోనూ గేల్‌కు కష్టాలు!
గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు బొత్తిగా తెలిసినట్టు లేదు. గతంలో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) సందర్భంగా టీవీ యాంకర్‌ను డేటింగ్‌కు వస్తావా అని ప్రత్యక్ష ప్రసారంలో అడిగి ఇబ్బందులు కొనితెచ్చుకున్న గేల్.. తాజాగా బ్రిటన్ మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆస్ట్రేలియా యాంకర్ మెల్ మెక్‌లాలిన్ తో అసభ్యంగా ప్రవర్తించినందుకు బీబీఎల్ లో మెల్బోర్న్ జట్టు తరఫున అతని కాంట్రాక్టును పునరుద్ధరించేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. తమ జర్నలిస్టుతో అభ్యంతరకరంగా మాట్లాడినందుకు ఇంగ్లండ్ కూడా అతని చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ క్రిస్ గేల్‌కు చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. నిత్యం అసభ్యకర వ్యాఖ్యలతో వివాదాస్పదుడిగా మారిన గేల్‌పై ఐపీఎల్‌లోనూ చర్యలు తీసుకునే అవకాశముందని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సంకేతాలు ఇచ్చారు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున ఆడుతున్న గేల్ విషయంలో ఆంక్షలు కొరడా ఝళిపించే అవకాశముందని శుక్లా చెప్పారు. 'ఆటగాళ్లు సభ్యతతో ప్రవర్తించాల్సిన అవసరముంది. టోర్నమెంటు జరుగుతున్నప్పుడు ఆటగాళ్లు ప్రవర్తనా నియామళికి లోబడి సభ్యంగా నడుచుకుంటారని మేం భావిస్తాం. లీగ్ ప్రతిష్టను ఆటగాళ్లు కాపాడాల్సిన అవసరముంది. బహిరంగంగా అతను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తి అవాంఛనీయం. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళుతాం' అని శుక్లా ఓ ఆంగ్ల దినపత్రికకు తెలిపారు. మరోవైపు ఇది ఇద్దరు విదేశీయుల మధ్య జరిగిన అంశమే అయినా.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే స్పష్టం చేశారు. గేల్ ఇటీవల బ్రిటిష్ మహిళా జర్నలిస్టు చార్లెట్ ఎడ్వర్డ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్, మహిళలు, సమానత్వం గురించి వికృత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల వివాదాన్ని గేల్ తోసిపుచ్చాడు. ఇవి సరదాగా చేసిన వ్యాఖ్యలు మాత్రమేనని, ఇందులో ఎలాంటి దురభిప్రాయాలకు తావు లేదని చెప్పుకొచ్చాడు. -
సిక్స్ లు: 580, వికెట్లు: 606
క్రికెట్ అభిమానులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొమ్మిదో సీజన్ లీగ్ మ్యాచ్ లు ఆదివారంతో ముగిశాయి. ఈ నెల 24 నుంచి తుది పోటీలకు తెర లేస్తుంది. మంగళవారం నుంచి మొదలయ్యే ప్లే ఆఫ్స్ కు గుజరాత్ లయన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు అర్హత సాధించాయి. ఈ మ్యాచ్ లు అన్ని రాత్రి 8 గంటలకే ప్రారంభం అవుతాయి. ఎప్పటిలానే ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. ఈ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి అత్యధిక పరుగులు సాధించి టాప్ బ్యాట్స్ మన్ గా కొనసాగుతున్నాడు. 919 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడి తర్వాతి స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ 658 పరుగులు చేశాడు. డివిలియర్స్(603 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. బెంగళూరు టీమ్ కే చెందిన యజువేంద్ర చాహల్ 19 వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్ గా నిలిచాడు. ఫస్ట్ బ్యాటింగ్ లో ఆర్సీబీ 144 పరుగులతో గుజరాత్ పై బిగ్గెస్ట్ విన్ సాధించింది. సెకండ్ బ్యాటింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గుజరాత్ ను ఓడించి అతిపెద్ద విజయం నమోదు చేసింది. ఇలాంటి విశేషాలు ఐపీఎల్-9 లీగ్ మ్యాచుల్లో చాలానే ఉన్నాయి. మొత్తం పరుగులు: 17,510 బౌండరీలతో వచ్చిన పరుగులు: 9552 అర్థసెంచరీలు: 103 వికెట్లు: 606 సిక్స్ లు: 580 అత్యధిక సిక్సర్లు: 36(కోహ్లి) లాంగెస్ట్ సిక్స్: 111 హయ్యస్ట్ టీమ్ స్కోరు: 248/3(బెంగళూరు) అత్యధిక వ్యక్తిగత స్కోరు: 129(డివిలియర్స్) బెస్ట్ బౌలింగ్: 6/19(ఆడమ్ జంపా) ఫాస్టెస్ట్ బాల్: 150. 02 హ్యాట్రిక్: ఒకటి (అక్షర్ పటేల్-పంజాబ్) బెస్ట్ ఎకానమీ: 5.00(మిచెల్ మార్ష్) లీగ్ మ్యాచుల్లో సూపర్ ఓవర్లు నమోదు కాలేదు -
'సెక్స్' వ్యాఖ్యలతో మళ్లీ గేల్ దుమారం!
లండన్: వెస్టిండీస్ సూపర్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు వివాదాలు కొత్త కాదు. గతంలో ప్రత్యక్ష ప్రసారంలో నాతో డేటింగ్‌కు వస్తావా.. కలిసి తాగుదామంటూ మహిళా స్పోర్ట్స్ యాంకర్‌తో అసభ్యంగా వ్యవహరించిన గేల్ తాజాగా సెక్సీస్ట్ వ్యాఖ్యలతో దుమారం రేపాడు. ప్రస్తుతం ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు తరఫున ఆడుతున్న గేల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్, మహిళలు, సమానత్వం గురించి వికృత వ్యాఖ్యలు చేశాడు. బ్రిటిష్ దినపత్రిక 'ద టైమ్స్' మహిళా జర్నలిస్టు చార్లెట్ ఎడ్వర్డ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నువ్వు థ్రిసమ్‌కు (ముగ్గురు కలిసి శృంగారానికి) పాల్పడ్డవా? అని వెకిలిగా అడిగాడు. గేల్ ఇంటర్వ్యూ ఇటు క్రికెట్ ప్రపంచంలోనూ, అటు అంతర్జాతీయంగాను దుమారం రేపుతోంది. మహిళలు సమానత్వం కన్నా ఎక్కువగానే ఎంజాయ్ చేస్తున్నారని, తమ దేశంలో సెక్స్ అనేది రిలాక్స్ కోసమనే భావముందని చెప్పాడు. మహిళలు తానంటే పడిచస్తారని, తాను చాలా అందంగా కనిపిస్తానని గేల్ చెప్పుకొచ్చాడు. 'మహిళలకు ఎక్కువ సమానత్వం ఉంది. వారు ఏం కావాలనుకుంటే అది చేయగలరు. జమైకా మహిళలు చాలా దృఢంగా ఉంటారు. తమకు ఎప్పుడు కావాలో వాళ్లే మీకు తెలుపుతారు' అని చెప్పాడు. మహిళలు తమ పురుషులను సంతోషపెట్టాలని, ఉద్యోగం చేస్తున్న మగువలైనా ఇంటికి ముందేవచ్చి భోజనం సిద్ధం చేయాలని అన్నాడు. ప్రియురాలు నటాషా బెరిడ్జ్తో పదేళ్లుగా డేటింగ్ చేస్తున్న గేల్‌కు చిన్నారి కూతురు ఉంది. తాను ఇంటికి వెళితే.. బిడ్డ న్యాపీని మారుస్తాను గానీ, ఇల్లు ఊడ్వడం, వంట చేయడం లాంటివి ఎప్పుడూ చేయబోనని పేర్కొన్నాడు. మహిళా జర్నలిస్టుతో వికృత వ్యాఖ్యలు జర్నలిస్టు చార్లెట్‌తో గేల్ వికృత వ్యాఖ్యలు చేశాడు. 'ఎంతమంది నల్లజాతి పురుషులతో గడిపావని గేల్ నన్ను అడిగాడు. ఆ ప్రశ్నను నేను పట్టించుకోకున్నా గుచ్చిగుచ్చి అడుగుతూ.. నువ్వెప్పుడైనా 'థ్రిసమ్‌కు పాల్పడ్డవా? నువ్ చేసి ఉంటావు' అంటు వెకిలి వ్యాఖ్యలు చేశాడు' అని చార్లెట్ పేర్కొంది. -
కోల్ కతా పై గుజరాత్ లయన్స్ విజయం
-
ఐపీఎల్ మన దగ్గరే జరగాలి: సూపర్ స్టార్
తీవ్ర కరువు పరిస్థితులు వల్ల ఈసారి భారత్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు పలు అడ్డంకులు ఎదురయ్యాయి. నీటి కటకట వల్ల మహారాష్ట్రలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌లను వేరే రాష్ట్రాలకు తరలించాలని బొంబాయి హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ భారత్‌లోనే నిర్వహించాలా? లేక విదేశాలకు తరలించాలా? అన్న చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్‌రైడర్ షారుఖ్ ఖాన్ స్పందించాడు. ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించడానికి తాను వ్యతిరేకమని ఆయన తేల్చిచెప్పాడు. 'వ్యాపారపరంగా, వీక్షకుల పరంగా భారత్‌లోనే క్రికెట్‌కు ఎక్కువ ఆదరణ ఉంది. కాబట్టి ఐపీఎల్‌ను ఇక్కడే నిర్వహించాలి. ఈ టీ-20 టోర్నమెంటును భారత్‌లో మొదలైంది. భారత్‌లోనే కొనసాగాలి' అని ఆయన అన్నాడు. కరువు, ఎన్నికలు, నీటి కటకట వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని, అందరికీ సౌకర్యకరంగా ఉండేలా దేశంలోనే ఎక్కడోచోట ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించవచ్చునని ఆయన చెప్పాడు. -
మా పని అయిపోలేదు.. బంతిలా పైకిలేస్తాం: క్రికెటర్
ప్రస్తుత ఐపీఎల్ సిరీస్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) జట్టు అట్టడుగున మగ్గుతోంది. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న ఆ జట్టుకు సెమిస్ అవకాశాలు దాదాపు లేనట్టే. కానీ ఆర్సీబీలోకి తాజాగా చేరిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్ మాత్రం ఇంకా తమకు పూర్తిగా ద్వారాలు మూసుకుపోలేదని, ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ ను తాము కచ్చితంగా గెలువాల్సి ఉందని చెప్తున్నాడు. 'ఇప్పటినుంచి మేం ప్రతి మ్యాచ్ ను కచ్చితంగా గెలువాలి. ఎక్కువగా ఆలోచించడం లేదు. శనివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచ్ పైనే మేం ప్రధానంగా ఫోకస్ పెట్టాం' అని జోర్డన్ చెప్పాడు. ఆర్సీబీ ప్రదర్శన ఇప్పటివరకు అనుకున్నరీతిలో లేనప్పటికీ, ఇప్పటికీ ఐపీఎల్ లో తమ జట్టు పుంజుకునే అవకాశముందని, నేలకు కొట్టిన బంతిలా పైకిలేవడంపైనే తాము ఫోకస్ పెట్టామని జోర్డన్ తెలిపాడు. 'మేం గతాన్ని వదిలేసి.. తదుపరి మ్యాచ్ లో మంచి జరుగుతుందనే ఆలోచనతో ఉన్నాం. పుణెను మేం తప్పకుండా ఓడిస్తాం. ఈ విజయాన్ని కనుక సాధిస్తే.. ఆ స్ఫూర్తితో మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది' అని అన్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ ల్లో ఆర్సీబీ ఐదింటిలో ఓడిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ తమ జట్టు చాలా దృఢంగా ఉందని, జట్టులో ఎంతోమంది అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఉన్నారని, వారితో కలిసి ఆడేందుకు తాను ఎదురుచూస్తున్నానని జోర్డన్ చెప్పుకొచ్చాడు. -
వాట్సన్ గిటార్.. కోహ్లి, గేల్ తీన్మార్!!
జల్సా చేయడంలో, నైట్ అంతా పార్టీలో చిందులు వేయడంలో, తీన్మార్ డ్యాన్స్ చేయడంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లకు మరెవరు సాటిరారనే చెప్పాలి. ఇరగదీసే స్టెప్పులు వేయడంలో విరాట్ కోహ్లి ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇక కోహ్లికి సుడిగాలి లాంటి క్రిస్ గేల్ జతకలిస్తే.. షేన్ వాట్సన్ తన గిటారుతో దుమ్ములేపే ట్యూన్ ఇస్తే.. ఇక చెప్పాల్సిన పని లేదు. టాప్ లేచిపోద్ది. అలాంటి టాప్ లేచిపోయే డ్యాన్సులతో సుడి'గేల్', 'వీర' విరాట్ దుమ్ములేపారు. నిజానికి తాజా ఐపీఎల్లో బెంగళూరు జట్టు ఏమంతగా విజయాలు సాధించడం లేదు. అయినా ఆ జట్టు ఆటగాళ్ల జల్సాలకు, పార్టీ లైఫ్ అడ్డులేనట్టు కనిపిస్తోంది. ఇటీవల బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు, ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ తన గిటారు నైపుణ్యాన్ని చూపించాడు. అదరగొట్టేలా వాట్సన్ గిటారు వాయిస్తుంటే.. ఆ మ్యూజిక్కు తగ్గట్టు విరాట్ కోహ్లి స్టెప్పులు వేశాడు. ఇటీవల కూతురు పుట్టడంతో ఫుల్ హ్యాపీగా ఉన్న గేల్ కూడా కోహ్లితో జతకలిసి తన డ్యాన్సింగ్ రిథమ్ ను చూపెట్టాడు. క్రికెటర్లు ఫుల్ జోష్‌తో హంగామా చేసిన ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. -
ధోనీ షాకిచ్చాడు...!
ఆకస్మికంగా టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ అభిమానులకు దిమ్మతిరిగేలా చేశాడు. ఇంత సడెన్‌గా ధోనీ ప్రకటించిన ఈ నిర్ణయం ఇటు అభిమానులనే కాదు.. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రిని కూడా కలవర పరిచింది. తాజాగా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రవిశాస్త్రి.. టెస్టుల నుంచి ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం ఆశ్చర్యపరచడమే కాదు షాక్‌కు గురిచేసిందని చెప్పాడు. 'నేను షాక్ తిన్నాను. మూడు ఫార్మెట్లలోనూ కొనసాగే సత్తా ధోనీలో ఉంది' అని శాస్త్రి చెప్పాడు. మాజీ టీమిండియా ఆల్‌రౌండర్ అయిన రవిశాస్త్రి ప్రస్తుతం భారత జట్టుకు డైరెక్టర్‌గా విశేషమైన సేవలందించారు. ఇటీవలికాలంలో ధోనీ సేన మళ్లీ విజయాల బాటపట్టడంలో రవిశాస్త్రి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ను వచ్చే ఏడాది విదేశాల్లో నిర్వహించనున్నారన్న కథనాలపై స్పందిస్తూ.. 'ఐపీఎల్ గ్లోబల్ ప్రాడక్ట్. దానిని ఎక్కడైనా నిర్వహించవచ్చు. విదేశాల్లో నిర్వహించకూడదనానికి ఎలాంటి కారణాలే లేవు' అని పేర్కొన్నాడు. ఐపీఎల్ ఇండస్ట్రీ లాంటిదని, దీనివల్ల హోటళ్లు, విమాన సంస్థలు నడుస్తాయని, వేలసంఖ్యలో ఉద్యోగులు వస్తాయని ఆయన చెప్పారు. -
ఆ మెరుపుల వెనుక కోహ్లి సలహా!
ముంబై: ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున మెరుపులు మెరిపిస్తున్న యువ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ తాను బ్యాటింగ్‌లో మెరుగుపడటానికి కెప్టెన్ విరాట్ కోహ్లి సలహాలే కారణమని తెలిపాడు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాల్సిందిగా బెంగళూరు కెప్టెన్ కోహ్లి తనకు సూచించాడని చెప్పాడు. హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి సర్ఫరాజ్ శెభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. గురువారం ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సర్ఫరాజ్ బుధవారం మీడియాతో మాట్లాడాడు. 'గడిచిన ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మా జట్టు (బెంగళూరు)లోకి కొత్తగా షేన్ వాట్సన్ లాంటి అనుభవజ్ఞుడు రావడం ఎంతో నాకు మేలు చేసింది. అనుభవపరంగానూ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను' అని తెలిపాడు. 'గత ఏడాది ఐపీఎల్లో కొన్ని తప్పులు చేశాను. గత ఏడాది చేసిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా చూసుకుంటున్నాను. జట్టు సభ్యులు నాలో ఆత్మవిశ్వాసాన్ని పోద్రి చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ తొలి మ్యాచ్ అని భావించి ఆడామని, జట్టు అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ చేయమని నన్ను ప్రోత్సహిస్తున్నారు' అని సర్ఫరాజ్ చెప్పాడు. ముంబైతో మ్యాచ్‌లో తాను రాణించేందుకు ప్రయత్నిస్తానని, అయితే, తమ జట్టు టాప్ ఆర్డర్ అయిన విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ ఫామ్‌లో ఉండటంతో బ్యాటింగ్ తనవరకు వచ్చే అవకాశాలు తక్కువని చెప్పాడు. -
ఐపీఎల్ -9లో మరో వివాదం
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు, రెండు దిగ్గజ జట్లపై వేటు, లలిత్ గేట్.. ఇలా అనేక అవరోధాలను దాటుకుంటూ ప్రారంభమైన ఐపీఎల్ 9వ సీజన్ లో మరో వివాదం చెలరేగింది. ఇప్పటికే మహారాష్ట్రలో మ్యాచ్ లు నిర్వహించే అంశం కోర్టుదాకా వెళ్లింది. తాజాగా ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేపై బీసీసీఐ అనూహ్యరీతిలో వేటువేసింది. హర్షా భోగ్లే కామెంటేటింగ్ కాంట్రాక్టును బోర్డు ఉన్నపళంగా రద్దుచేసింది. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా కామెంటేటర్లపై.. ప్రధానంగా హర్షా భోగ్లేను ఉద్దేశిస్తూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కామెంట్లుకూడా వేటుకు బలమైన కారణమని తెలుస్తున్నది. సోషల్ మీడియా ద్వారా కామెంటేటర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనాలను సేకరిస్తోన్న బీసీసీఐ.. అదే సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న కారణంగా హర్షా భోగ్లేపై వేటు వేసినట్లు ఓ అధికారి చెప్పారు. కామెంట్రీపై ఆటగాళ్ల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని, అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 9వ సీజన్ ప్రారంభమైన రోజే హర్షాను కామెంటేటర్ల ప్యానెల్ నుంచి తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. హర్షా కూడా తాను ఇకపై ఐపీఎల్ కు అందుబాటులో ఉండబోనంటూ ట్వీట్ చేశారు. వరల్డ్ కప్ లో ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇండియన్ కామెంటేటర్లు ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మాట్లాడటంపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లు తాను చేసినవే కావడంతో మ్యాచ్ అనంతరం హర్షా భోగ్లే తనను తాను సమర్థించుకున్నారు. ఇదేకాకుండా న్యూజిలాండ్ తో నాగపూర్ లో జరిగిన ప్రారంభమ్యాచ్ లోనూ విదర్భ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో గొడవపడ్డారట హర్షా భోగ్లే. రెండు భాషల్లో (ఇంగ్లీష్, హిందీల్లో) కామెంట్రీ చెప్పేందుకు అస్తమానం అటూఇటూ తిరుగుతోన్న హర్షాను 'ఇది వీఐపీ లాంజ్ మీరు నిమిషానికోసారి అలా తిరిగితే కుదరదు'అని చెప్పారట. దీనికి హర్షా సదరు అధికారులపై చిందులేశారట. అన్ని కారణాలను బేరిజు వేసుకున్న తర్వాత హర్షాకు షాక్ ఇవ్వాల్సిందేనని ఫిక్సైన బీసీసీఐ ఆయనపై వేటు వేసింది. ఐపీఎల్ ప్రసార హక్కులు సోని-ఈఎస్ పీఎన్ చానెల్ వి కాబట్టి వారు పట్టుబట్టి హర్షాభోగ్లేను కొనసాగిస్తారా, లేక బీసీసీఐ నిర్ణయానికి సరేనంటారా చూడాలి. శని, ఆదివారాలనాటి మ్యాచ్ లకైతే భోగ్లే అందుబాటులోలేరు. 90వ దశకం నుంచి క్రికెట్ కామెంటేటర్ గా కొనసాగుతున్న హర్షా భోగ్లే ఐపీఎల్ ప్రారంభం(2008) నుంచి ఆ టోర్నీకి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.