కరోనాపై పోరు: ఐపీఎల్‌ కిట్‌ల వేలం | De Villiers, Kohli to Auction Their Kits From 2016 IPL Match | Sakshi
Sakshi News home page

కోహ్లి, డివిలియర్స్‌ కిట్‌ల వేలం

Published Fri, Apr 24 2020 8:12 PM | Last Updated on Fri, Apr 24 2020 8:15 PM

De Villiers, Kohli to Auction Their Kits From 2016 IPL Match - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి సాయం అందించేందుకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ ముందుకు వచ్చారు. ఇందుకోసం తమ ఐపీఎల్‌ కిట్లను వేలం వేయాలని నిర్ణయించారు. కోహ్లితో కలిసి నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో డివిలియర్స్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. 2016లో గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన గ్రీన్‌ డే మ్యాచ్‌ కిట్లను వేలం వేయాలని వీరిద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఈ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు పచ్చని రంగు దుస్తులతో బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో చెలరేగిన ఆడిన కోహ్లి, డివిలియర్స్‌ సెంచరీలు సాధించారు.

‘2016 ఐపీఎల్‌లో గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మేమిద్దరం శతకాలు బాదాం. మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. ఆ రోజు ఆటను బాగా ఆస్వాదించాం. నేను 120 పరుగులు చేశాను. నువ్వు సెంచరీ సాధించావు. పర్యావరణ పరిక్షణ పట్ల చైతన్యం కలిగించడానికి గ్రీన్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో మనం ఆడిన కిట్‌లను వేలం వేద్దాం. దీని ద్వారా వచ్చిన నగదును కోవిడ్‌-19 ఫండ్‌కు ఇద్దాం. అభిమానులూ.. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి. వేలంలో ఎంత ఎక్కువ డబ్బు వస్తే అంత ఎక్కువ మందికి మేలు జరుగుతుంద’ని డివిలియర్స్‌ చెప్పుకొచ్చాడు. 

కరోనా: ఢిల్లీలో పులి మృతి కలకలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement