న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో క్రికెటర్లంతా ఇళ్లల్లోనే లాక్ అయిపోయారు. ఈ క్రమంలోనే తమ తమ కుటుంబ సభ్యులతో తగినంత సమయాన్ని గడపడానికి వారికి వీలు దొరికింది. ఒకవైపు సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటూనే మరొకవైపు అభిమానులకు ధైర‍్యం చెబుతూనే ఉన్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ఒక మెసేజ్ ఆకట్టుకుంది. కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో కోహ్లి ఒక స్ఫూర్తిదాయకమైన మెసేజ్‌తో పాటు ఒక పాత పిక‍్చర్‌తో ముందుకొచ్చాడు. గతంలో వెస్టిండీస్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో రనౌట్‌ను తప్పించుకునే క‍్రమంలో మోకాలిని క్రీజ్‌లో ఉంచి మరొక లెగ్‌ను ముందుకు చాచి తదేకంగా చూస్తున్న ఫొటోను షేర్ చేశాడు. కోహ్లి క్రీజ్ దాటి ముందుకు వెళ్లిన క్రమంలో విండీస్ బౌలర్ హేడెన్ వాల్ష్ జూనియర్ బంతితో వికెట్లను పడేసే యత్నం చేశాడు. కాగా, కోహ్లి ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఫోటోనే ఇప్పుడు షేర్ చేశాడు కోహ్లి. దీనికి అదిరిపోయే సందేశాన్ని కూడా ఇచ్చాడు. (ఆ ఏడాది నుంచే నాలో మార్పు: కోహ్లి)
‘మనం వెనక్కి చూడాల్సిన పనిలేదు.. ముందుచూపే ఒక మార్గం(ముందకు వెళ్లడమే) అని క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. కరోనా వైరస్ కారణంగా అభిమానులకు ఇలా మెసేజ్ ఇచ్చాడు. కరోనా వైరస్‌తో భయపడాల్సిన అవసరం లేదని, ముందున్నది మంచి కాలమని చెప్పకనే చెప్పేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ పిక్చర్‌కు ఇప్పటి వరకూ 21 లక్షల మందికి పైగా లైక్ చేయగా, 11వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఇదిలా ఉంచితే, భారత ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీతో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సంభాషణలో కోహ్లి అనేక విషయాలను షేర్ చేసుకున్నాడు. తన కెరీర్‌లో ఫిట్‌నెస్ పరంగా అతిపెద్ద మార్పు రావడానికి మాజీ ట్రైనర్ శంకర్ బసూనే కారణమంటున్నాడు కోహ్లి. ఫిట్‌నెస్, ట్రైనింగ్ పరంగా తనలో పరివర్తన రావడానికి బసూనే ప్రధాన కారణమన్నాడు. కెరీర్ మరో స్థాయికి వెళ్లడంలో శంకర్ బసూ పాత్ర మరువలేనిదన్నాడు. ప్రధానంగా 2015 నుంచి తన కెరీర్ గ్రాఫ్ పెరుగుతూ రావడంలో క్రెడిట్ అంతా శంకర్ బసూదేనన్నాడు. (కశ్మీర్‌కు నేనే కెప్టెన్‌గా ఉండాలి: అఫ్రిది)
Comments
Please login to add a commentAdd a comment