సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దానిని నివారించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగాల ప్రముఖులతో సమాలోచనలు జరుపుతున్నారు. దీనిలో భాగంగానే బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీతో ప్రధాని మోదీ వీడియా కన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గంగూలీతో పాటు టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్, పీవీ సింధు, దేశ వ్యాప్తంగా వివిధ క్రీడలకు సంబంధించిన 40 మంది ప్రముఖులతో ప్రధాని చర్చించారు. వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమంలో క్రీడాకారులను కూడా భాగస్వామ్యులను చేయాలని కేంద్ర భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రజలను చైతన్య పరచాలని ప్రధాని వారిని కోరారు. (మరోసారి ‘జనతా’ స్ఫూర్తి కావాలి: ప్రధాని మోదీ)
కాగా బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీతో సమావేశం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితం కావడంతో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక కరోనాపై పోరుకు పెద్ద ఎత్తున విరాళాలు అందించిన క్రీడా, సినీ ప్రముఖులను మోదీ ఇదివరకే అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment