న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ గురించి గురువారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధిని అరికట్టేందుకు ఆదివారం ఒకరోజు ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని, జనతా కర్ఫ్యూను పాటించాలని సూచించారు. మార్చి 22వ తేదీ ఉదయం గం.7.00 నుంచి రాత్రి గం.9.00ల వరకూ ఎవరూ బయటకు వెళ్లకుండా జనతా కర్ఫ్యూలో భాగం కావాలన్నారు. (22న జనతా కర్ఫ్యూ)
అయితే ప్రధాని మోదీ సూచించిన నివారణ చర్యలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మద్ధతుగా నిలిచాడు. కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. బాధ్యాతయుతమైన పౌరులుగా మనమందరం ఉండాల్సిన అవసరముందని ట్వీట్ చేశాడు. మోదీని ఫాలో అవుదాం అంటూ కోహ్లి పేర్కొన్నాడు.ఇక కరోనా వైరస్ నిరోధం కోసం కృషి చేస్తున్న వైద్య నిపుణులను కోహ్లి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వారికి మనమంతా అండగా నిలిచి మద్దతుగా నిలవాలన్నాడు. ఇక్కడ ఎవరికి వారే స్వచ్ఛందంగా మెడికల్ ప్రొఫెషనల్స్‌కు సహకరించాలన్నాడు.
Be alert, attentive and aware to combat the threat posed by the Covid 19. We, as responsible citizens, need to adhere to the norms put in place for our safety as announced by our Honourable Prime Minister Shri @NarendraModi ji. #IndiaFightsCorona
— Virat Kohli (@imVkohli) March 19, 2020
Comments
Please login to add a commentAdd a comment