గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘జనతా కర్ఫ్యూ’ కు సంఘీభావం తెలిపారు. కాగా అమెరికాలో తన భర్త నిక్ జోనస్‌తో కలిసి క్వారంటైన్‌లో ఉన్న ప్రియాంక... ‘జనత కర్ఫ్యూ’లో భాగంగా ఇంటి బాల్కానీలో నిల్చుని చప్పట్లు కొడుతున్న వీడియోను సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘భారత ప్రజలంతా ప్రధాని మోదీ పిలుపు మేరకు కోవిడ్-19 బాధితులకు సేవలందిస్తున్న డాక్టర్లను, నర్సులను చప్పట్లతో అభినందించారు. అయితే ఈ కర్ఫ్యూలో భాగమవ్వడానికి నేను ఈ రోజు(ఆదివారం) భౌతికంగా అక్కడ లేకపోవచ్చు కానీ.. నా ఆత్మతో అక్కడ ఉన్నాను’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (జనతా కర్ఫ్యూ.. ప్రభుత్వ సెలవు కాదు: సల్మాన్ ఖాన్)
కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మోదీ ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ పాల్గొనాలని దేశ ప్రజలకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ కర్ఫ్యూలో భాగంగా మహమ్మారి కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ దేశ రక్షణలో భాగమైన డాక్టర్లను, నర్సులను సాయంత్ర 5 గంటల ప్రాంతంలో చప్పట్లతో అభినందించాలని సూచించారు. ఇక మోదీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ప్రముఖులు చప్పట్లు కొట్టి కర్ఫ్యూకు మద్దతు నిచ్చారు. అంతేగాక చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఈ కర్ఫ్యూలో భాగమయ్యారు. ఇక బాలీవుడ్ ప్రముఖ హీరో అనిల్ కపూర్, రణ్‌వీర్ సింగ్, కార్తిక్ ఆర్యన్‌లతో పాటు హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, అనన్య పాండే, ‘జనతా కర్ఫ్యూ’కు మద్దతుగా చప్పట్లు కొడుతున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment