సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోవిడ్ బారినపడ్డారు. ఆమెకు గురువారం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా.. కోవిడ్ నుంచి సోనియా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా జీ.. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా, నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాహుల్, జూన్ 8న సోనియా ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరవాలని ఆదేశించింది. మరోవైపు గాంధీ ఫ్యామిలీపై బీజేపీ కక్ష కట్టిందని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సోనియా కరోనా బారినపడటంతో విచారణకు హాజరయ్యే అవకాశాలు లేనట్టు సమాచారం.
చదవండి👇
మనీ ల్యాండరింగ్ కేసులో.. సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు
బీజేపీ దూకుడు.. నష్టం తప్పదన్న సీనియర్ నేత
Wishing Congress President Smt. Sonia Gandhi Ji a speedy recovery from COVID-19.
— Narendra Modi (@narendramodi) June 2, 2022
Comments
Please login to add a commentAdd a comment