
ఇప్పుడు కరోనా చైన్‌ను తెంచే పనిలో మాస్క్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. భారత్‌లోనూ వేలల్లో వైరస్ బారిన పడుతున్న తరుణంలో బీసీసీఐ భారత క్రికెటర్ల ద్వారా మాస్క్‌లు ధరించేలా ప్రోత్సహిస్తోంది. స్టార్ క్రికెటర్లు కోహ్లి, సచిన్, స్మృతి మంధాన, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదితరులతో రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. బయటికి వెళ్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే స్పృహ కల్పించేలా ‘టీమ్ మాస్క్ ఫోర్స్’ పేరిట ఈ వీడియో సందేశం ఉంది. ‘మాతో చేతులు కలపండి. కరోనాపై పోరాడండి. ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. సురక్షితంగా ఉండండి’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment