indian cricketers
-
మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ(Deepti Sharma)కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. ‘డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(Deputy Superintendent Of Police-డీఎస్పీగా)’గా ఆమెను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు దీప్తి కృతజ్ఞతలు తెలియజేసింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తానని పేర్కొంది.కాగా భారత మహిళా క్రికెట్ జట్టు(Indian Women Cricket Team)లో దీప్తి శర్మ గత కొంతకాలంగా కీలక సభ్యురాలిగా ఉంది. రెండేళ్ల క్రితం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ రజత పతకం గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.గతేడాది అత్యుత్తమంగానిలకడైన ఆట తీరుతో ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2024 జట్టులో దీప్తి స్థానం దక్కించుకుంది. గతేడాది ఆమె బంతితో అత్యుత్తమంగా రాణించింది. 6.01 ఎకానమీతో అంతర్జాతీయ టీ20లలో ముప్పై వికెట్లు కూల్చింది.ఇక రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన 27 ఏళ్ల దీప్తి శర్మ.. ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడి 319 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు తీసింది. అదే విధంగా.. 101 వన్డేల్లో 2154 రన్స్ సాధించడంతో పాటుగా.. 130 వికెట్లు పడగొట్టింది. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లలో 124 మ్యాచ్‌లు ఆడిన దీప్తి శర్మ 1086 పరుగులు చేసింది. అదే విధంగా.. 138 వికెట్లతో సత్తా చాటింది.రూ. 3 కోట్ల క్యాష్ రివార్డుతో పాటుఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. క్రీడా రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా రూ. 3 కోట్ల క్యాష్ రివార్డుతో పాటు డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వనున్నట్లు గతేడాది ప్రకటించింది. తాజాగా విధుల్లో చేరేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.ఇందులో భాగంగా మొరదాబాద్‌లో సోమవారం అధికారికంగా ఉద్యోగంలో చేరిన దీప్తి శర్మ.. డీఎస్పీ యూనిఫామ్‌లో మెరిసింది. ఆమె తండ్రి భగవాన్ శర్మ, సోదరులు సుమిత్ శర్మ, ప్రశాంత్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆగ్రా ఆల్‌రౌండర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది.ప్రతిజ్ఞ చేస్తున్నా‘‘ఈ మైలురాయిని చేరినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. నాకు మద్దతుగా నిలిచి.. ఈస్థాయికి చేరుకునేలా ప్రోత్సహించిన నాకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నా.అలాగే.. ప్రజలకు సేవ చేసేందుకు వీలుగా ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞురాలినై ఉంటాను. ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా నా కొత్త పాత్రలో ఒదిగిపోవడంతో పాటుగా.. విధి నిర్వహణలో పూర్తి అంకితభావంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా’’ అని దీప్తి శర్మ పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మన క్రికెటర్లలో మరో డీఎస్పీఈ క్రమంలో దీప్తికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘తొలుత సిరాజ్.. ఇప్పుడు మన క్రికెటర్లలో మరో డీఎస్పీ’’ అంటూ ఓ నెటిజన్ పేర్కొనడం హైలైట్‌గా నిలిచింది. కాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇటీవలే అధికారికంగా అతడికి నియామక ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.చదవండి: 13 ఏళ్ల తర్వాత రంజీ బరిలో కోహ్లి.. పోటెత్తిన జనం.. తొక్కిసలాట.. -
India vs Bangladesh: దసరా ధమాకా
హైదరాబాద్‌లో విజయదశమి రోజున సాయంత్రం...పండగ సంబరాలను కాస్త పక్కన పెట్టి క్రికెట్ వైపు వచి్చన అభిమానులు అదృష్టవంతులు! అటు స్టేడియంలో గానీ ఇటు ఇంట్లో గానీ మ్యాచ్ చూసినవారు ఫుల్ దావత్ చేసుకున్నట్లే! అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చి భారత క్రికెటర్లు పారించిన పరుగుల ప్రవాహంతో పండగ ఆనందం రెట్టింపు అయిందంటే అతిశయోక్తి కాదు. 25 ఫోర్లు, 23 సిక్స్‌లు...ఈ 47 బౌండరీలతోనే ఏకంగా 232 పరుగులు...రెండు ఓవర్లు మినహా మిగతా 18 ఓవర్లూ పదికి పైగా పరుగులు వచి్చన పవర్‌ప్లే ఓవర్లే! 43 బంతులకే 100, 84 బంతులకే 200 వచ్చేశాయి...అలా వెళ్లిన స్కోరు 300కు కాస్త ముందు ఆగింది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు బద్దలు...సరికొత్త రికార్డులు నమోదు. అంతర్జాతీయ టి20ల్లో 28 ఇన్నింగ్స్‌ల తర్వాత కూడా 2 అర్ధసెంచరీలు, ఇరవై లోపు లోపు 20 స్కోర్లతో తన సెలక్షన్‌పై సందేహాలు రేకెత్తిస్తూ వచి్చన సంజు సామ్సన్ ఎట్టకేలకు అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సహా అతని మెరుపు సెంచరీ హైలైట్‌గా నిలిచింది. అతి భారీ లక్ష్యం ముందుండగా ముందు చేతులెత్తేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు ఆడి లాంఛనం ముగించింది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సమరాన్ని భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో ముగించింది. టెస్టు సిరీస్‌ను 2–0తో గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్‌ను కూడా 3–0తో సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లోనే 86 పరుగుల ఓటమి తర్వాత సిరీస్ కోల్పోయి కునారిల్లిన బంగ్లాకు చివరి పోరులో అంతకంటే పెద్ద దెబ్బ పడింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి టి20లో భారత్ 133 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా, కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఎప్పటిలాగే చెలరేగాడు. సామ్సన్, సూర్య రెండో వికెట్‌కు 70 బంతుల్లోనే 173 పరుగులు జోడించడం విశేషం. వీరిద్దరికి తోడు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కూడా దూకుడు కనబర్చడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులే చేయగలిగింది. తౌహీద్ హృదయ్ (42 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), లిటన్ దాస్ (25 బంతుల్లో 42; 8 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. 6, 6, 6, 6, 6... అభిషేక్ (4)ను తొందరగా అవుట్ చేయడం ఒక్కటే బంగ్లాకు దక్కిన ఆనందం. ఆ తర్వాత 69 బంతుల పాటు వారికి సామ్సన్, సూర్య చుక్కలు చూపించారు. తస్కీన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 4 ఫోర్లు కొట్టగా, తన్జీమ్ ఓవర్లో సూర్య వరుసగా 3 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్‌ప్లేలోనే జట్టు 82 పరుగులు చేసింది. 22 బంతుల్లో సామ్సన్ అర్ధసెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత బంగ్లా స్పిన్నర్ రిషాద్ బాధితుడయ్యాడు. రిషాద్ తొలి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన సామ్సన్...అతని తర్వాతి ఓవర్లో విధ్వంసం సృష్టించాడు. తొలి బంతికి పరుగు తీయని సామ్సన్ తర్వాతి ఐదు బంతుల్లో 6, 6, 6, 6, 6తో చెలరేగాడు. మరో వైపు 23 బంతుల్లో సూర్య హాఫ్ సెంచరీ పూర్తయింది. మహేదీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతికి నేరుగా ఫోర్ కొట్టడంతో సామ్సన్ 40 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఎట్టకేలకు సెంచరీ తర్వాత సామ్సన్ను ముస్తఫిజుర్ వెనక్కి పంపడంతో బంగ్లా ఊపిరి పీల్చుకుంది. తర్వాతి ఓవర్లోనే సూర్య అవుటయ్యాడు. ఆ తర్వాతా భారత్‌ను నిలువరించడం బంగ్లా వల్ల కాలేదు. పాండ్యా తన జోరును చూపిస్తూ తన్జీమ్ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 కొట్టగా...మహేదీ ఓవర్లో పరాగ్ వరుసగా 6, 4, 6 బాదాడు. వీరిద్దరు 26 బంతుల్లోనే 70 పరుగులు జత చేశారు. మూడు బంతులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచి్చన నితీశ్ కుమార్ రెడ్డి (0) తొలి బంతికే వెనుదిరగ్గా...300కు 3 పరుగుల ముందు భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహీద్, దాస్ నాలుగో వికెట్‌కు 38 బంతుల్లో 53 పరుగులు జోడించి కాస్త పోరాడటం మినహా చెప్పుకునేందుకు ఏమీ లేకపోయింది. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) మహేదీ (బి) ముస్తఫిజుర్ 111; అభిషేక్ (సి) మహేదీ (బి) తన్జీమ్ 4; సూర్యకుమార్ (సి) రిషాద్ (బి) మహ్ముదుల్లా 75; పరాగ్ (సి) దాస్ (బి) తస్కీన్ 34; పాండ్యా (సి) రిషాద్ (బి) తన్జీమ్ 47; రింకూ (నాటౌట్) 8; నితీశ్ (సి) మహేదీ (బి) తన్జీమ్ 0; సుందర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 297. వికెట్ల పతనం: 1–23, 2–196, 3–206, 4–276, 5–289, 6–289. బౌలింగ్: మహేదీ 4–0–45–0, తస్కీన్ 4–0–51–1, తన్జీమ్ 4–0–66–3, ముస్తఫిజుర్ 4–0–52–1, రిషాద్ 2–0–46–0, మహ్ముదుల్లా 2–0–26–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (సి) పరాగ్ (బి) మయాంక్ 0; తన్జీద్ (సి) వరుణ్ (బి) సుందర్ 15; నజ్ముల్ (సి) సామ్సన్ (బి) బిష్ణోయ్ 14; లిటన్‌దాస్ (సి) (సబ్) తిలక్ (బి) బిష్ణోయ్ 42; తౌహీద్ (నాటౌట్) 63; మహ్ముదుల్లా (సి) పరాగ్ (బి) మయాంక్ 8; మహేదీ (సి) పరాగ్ (బి) నితీశ్ 3; రిషాద్ (సి) అభిషేక్ (బి) బిష్ణోయ్ 0; తన్జీమ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–0, 2–35, 3–59, 4–112, 5–130, 6–138, 7–139. బౌలింగ్: మయాంక్ 4–0–32–2, పాండ్యా 3–0–32–0, సుందర్ 1–0–4–1, నితీశ్ 3–0–31–1, రవి 4–1– 30–3, వరుణ్ 4–0–23–0, అభిషేక్ 1–0–8–0. -
స్టార్టప్ పిచ్‌పై ఎక్స్ట్రా ఇన్నింగ్స్!
సాక్షి, బిజినెస్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో దుమ్మురేపి దేశాన్ని మరోసారి జగజ్జేతగా నిలిపింది ‘మెన్ ఇన్ బ్లూ’ టీమ్. ‘హిట్’మ్యాన్ రోహిత్ కెప్టెన్సీ.. కింగ్ కోహ్లీ మెరుపులకు బుమ్రా మ్యాజిక్.. పాండ్యా పంచ్.. మొత్తం టీమిండియా పోరాటపటిమ తోడవ్వడంతో కప్పు మన వశమైంది. బ్యాట్, బాల్‌తో చెలరేగిపోయే మన క్రికెట్ ధీరులు.. వ్యాపారవేత్తలుగా కూడా పవర్ఫుల్ ఇన్నింగ్స్‌తో అదరగొడుతున్నారు. ఒక పక్క క్రికెట్లో మునిగితేలుతూనే.. స్టార్టప్‌లలోనూ స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తూ పర్ఫెక్ట్ కవర్ డ్రైవ్‌లతో అలరిస్తున్నారు. స్టార్టప్ పిచ్‌పై మార్కెట్ డిమాండ్లు, నవ కల్పనల వంటి దూసుకొచ్చే బంతులను మన ఎంట్రప్రెన్యూర్ బ్యాట్స్‌మెన్ దీటుగా ఎదుర్కొంటున్నారు. క్రికెటర్లు స్టార్టప్స్‌లో ఫైనాన్షియల్ సిక్సర్ కొట్టినా.. కొత్త వెంచర్లను లాంచ్ చేసినా గ్యాలరీలో కూర్చున్న అభిమానులకు ఈ బిజినెస్ గేమ్ కూడా థ్రిల్ అందిస్తోంది. సరైన పార్ట్ట్నర్షిప్ కుదిరితే స్టార్టప్ కాస్తా ‘యూనికార్న్’గా మారి.. అద్భుతమైన విజయం సాకారం కావచ్చు! ఎంట్రప్రెన్యూర్లుగా మారి సత్తా చాటుతున్న క్రికెటర్ల సంగతేంటో చూద్దాం...కోహ్లీ.. ఇన్వెస్ట్మెంట్ ‘కింగ్’ స్పోర్ట్ కాన్వో: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రేమికులను కనెక్ట్ చేస్తోంది. కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన ఈ సంస్థ ఆన్లైన్ స్పోర్ట్స్ కమ్యూనిటీ ఏర్పాటుపై దృష్టి సారించింది. స్టెపాథ్లాన్ లైఫ్స్టయిల్స్: పిల్లల ఆరోగ్య సంరక్షణ, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన సంస్థ ఇది. నవతరానికి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చేందుకు కోహ్లి కృషి చేస్తున్నారు.పెట్టుబడుల్లోనూ ‘మిస్టర్ కూల్’.. 7ఇంక్‌బ్రూస్: గ్రౌండ్లో కూల్ కెప్టెన్‌గా, ప్రత్యర్థులకు సెగలు పుట్టించే ధోనీ.. ఈ ఆహార పానీయాల స్టార్టప్‌తో ఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మూడు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో లాభాల పరుగులు పారిస్తున్నారు. ఖాతాబుక్: చిన్న మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)కు అకౌంట్ల నిర్వహణను సులభతరం చేస్తున్న డిజిటల్ లెడ్జర్ యాప్ ఇది. దీనిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చిన్న వ్యాపారాలకు దన్నుగా నిలుస్తున్నారు. క్లియర్‌ట్రిప్: ఈ ట్రావెల్ సంస్థకు ధోనీ బ్రాండ్ అంబాసిడర్. ట్రావెల్ ఆప్షన్లను ప్రమోట్ చే స్తూ, ప్రయాణికుల్లో విశ్వాసం నింపుతున్నారు.యువరాజ్... ‘గేమ్’ఛేంజర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్ (యూవుయ్కెన్): హెల్తియాన్స్, ఎడ్యుకార్ట్.కామ్ వంటి ఆరోగ్య, విద్యా సంబంధ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేస్తోంది. నవకల్పనలను ప్రోత్స హిస్తున్న యువరాజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్నారు.గంభీర్... ఈకామర్స్ చాంపియన్ ఫైండ్ కామర్స్ ప్లాట్‌ఫామ్: డిజిటల్ రిటైల్ సొల్యూషన్లను అందించడం ద్వారా ఆన్లైన్ వ్యాపారంలోకి ప్రవేశించే వారికి దన్నుగా నిలుస్తోంది. దీంతో ఆఫ్–ఫీల్డ్‌లోనూ సాటిలేదని గౌతమ్ నిరూపించుకుంటున్నారు.హార్దిక్.. కొత్త ‘అడుగులు’ అరెటో: చిన్న పిల్లలకు వారికి తగిన సైజుల్లో ఫుట్‌వేర్‌ను అందిస్తున్న వినూత్న సంస్థ ఇది. పాండ్యా పెట్టుబడితో పరిశ్రమలో కొత్త అడుగులు పడ్డాయి. యూ ఫుడ్ల్యాబ్స్: రెడీ– టు–ఈట్ మీల్స్‌లో ప్రత్యేకతను చాటుకుంటున్న డీ2సీ (డైరెక్ట్–టు–కస్టమర్) ఫుడ్ స్టార్టప్. ఇన్వెస్టర్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ దన్నుగా నిలుస్తున్నారు.రహానే.. ఫ్యాన్స్‌తో ‘కనెక్ట్’ ఫ్యాన్‌కైండ్: స్వచ్ఛంద సేవల కోసం సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌ను కనెక్ట్ చేస్తోంది. దాతృత్వం, ప్రజలతో మమేకం అయ్యేందుకు రహానే ఇందులో పెట్టుబడి పెట్టారు.కేఎల్ రాహుల్.. ఫిట్నెస్ స్ట్రోక్ హ్యుగాలైఫ్: ఫిట్నెస్ ప్రియుల కోసం ఆన్లైన్లో అత్యుత్తమ న్యూట్రిషన్ సప్లిమెంట్ ఉత్పత్తులను అందిస్తోంది. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌తో కలిసి టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ ఈ స్టార్టప్‌ను నెలకొల్పారు. సచిన్.. ‘మాస్టర్’ ఇన్వెస్టర్ స్మాష్: స్పోర్ట్స్, వర్చువల్ రియాలిటీ (వీఆర్), గేమింగ్‌ను కలగలిపి అందిస్తున్న స్టార్టప్ ఇది. సచిన్ పెట్టుబడి ఈ సంస్థను మాస్టర్ బ్లాస్టర్గా నిలుపుతోంది. ముసాఫిర్: పర్యాటకులకు మంచి ట్రావెల్ అనుభూతిని కల్పించడమే లక్ష్యంగా ఇది ఏర్పాటైంది. ట్రావెల్ పరిశ్రమపై టెండూల్కర్ మక్కువను ఈ ఇన్వెస్ట్మెంట్ చాటిచెబుతోంది. -
T20 WC 2024: పాక్‌ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
టీ20 ప్రపంచకప్-2024లో నిన్న పెను సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ.. అన్ని విభాగాల్లో తమకంటే పటిష్టమైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది (సూపర్ ఓవర్లో). మెగా టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ తమ కంటే మెరుగైన కెనడాకు ఝలక్ ఇచ్చిన యూఎస్ఏ.. నిన్న ఓ సారి ప్రపంచ ఛాంపియన్ అయిన పాక్‌ను మట్టికరిపించి క్రికెట్ ప్రపంచం మొత్తం తమ వైపు చూసేలా చేసుకుంది.ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పాక్‌ను చిత్తు చేసిన యూఎస్ఏ జట్టులో సగం మందికి పైగా భారతీయులు, భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. నిన్నటి మ్యాచ్‌లో పాక్‌ను మట్టికరిపించడంలో ప్రధాన పాత్రధారి అయిన సౌరభ్ నేత్రావాల్కర్ (32) ముంబైకి చెందిన వాడు. నేత్కావాల్కర్ అండర్-19 స్థాయిలో భారత జట్టుకు ఆడాడు. లెఫ్ట్ ఆర్మ ఫాస్ట్ బౌలర్ అయిన నేత్రావాల్కర్ ఉద్యోగరిత్యా అమెరికాలో సెటిల్ అయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన నేత్రావాల్కర్.. సూపర్ ఓవర్లో మరింత మెరుగ్గా బౌలింగ్ చేసి పాక్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు.పాక్‌ను ఓడించడంలో మరో ప్రధాన పాత్ర అయిన మోనాంక్ పటేల్ కూడా భారతీయుడే. 31 ఏళ్ల మోనాంక్ యూఎస్ఏ జట్టుకు సారధి. నిన్నటి మ్యాచ్‌లో మోనాంక్ మెరుపు అర్ద సెంచరీ (38 బంతుల్లో 50) సాధించి పాక్ ఓటమికి బీజం వేశాడు. ఈ ప్రదర్శనకు గానూ మోనాంక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. మోనాంక్ గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతానికి చెందిన వాడు.నిన్నటి మ్యాచ్‌లో పాక్‌ను నామమాత్రపు స్కోర్‌కు పరిమితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన నోస్తుష్ కెంజిగే (4-0-30-3) కూడా భారతీయుడే. 33 ఏళ్ల కెంజిగే కర్ణాటకలోని చిక్మగళూరులో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. వీరే కాక పాక్‌ను మట్టికరిపించి అమెరికా జట్టులో మరో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. ముంబైలో పుట్టి పెరిగిన 31 ఏళ్ల హర్మీత్ సింగ్, పంజాబ్ మూలాలున్న 31 ఏళ్ల జస్దీప్ సింగ్ పాక్‌ను చిత్తు చేసిన అమెరికా జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఈ ఐదుగురే కాక మరో ఇద్దరు భారతీయులు అమెరికా జట్టులో ఉన్నారు. 33 ఏళ్ల మిలింద్ కుమార్ (ఢిల్లీ), 36 ఏళ్ల నిసర్గ్ పటేల్‌కు (అహ్మదాబాద్, గుజరాత్) తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. యూఎస్ఏ జట్టులో పాక్‌కే చెందిన ఓ ఆటగాడు ఉన్నాడు. 33 ఏళ్ల అలీ ఖాన్ పాక్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన వాడు.మోనాంక్ పటేల్ (ఆనంద్, గుజరాత్)హర్మీత్ సింగ్ (ముంబై)జస్దీప్ సింగ్ (పంజాబ్)నోష్తుశ్ కెంజిగే (చిక్‌మగళూరు, కర్ణాటక)సౌరభ్ నేత్రావాల్కర్ (ముంబై)మిలింద్ కుమార్ (ఢిల్లీ)నిసర్గ్ పటేల్ (అహ్మదాబాద్, గుజరాత్)పాక్-యూఎస్ఏ మ్యాచ్ స్కోర్ వివరాలు..పాక్ 159/7 (20)యూఎస్ఏ 159/3 (20)సూపర్ ఓవర్..యూఎస్ఏ 18/1పాక్ 13/1సూపర్ ఓవర్లో యూఎస్ఏ విజయం -
T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఇవాల్టి (జూన్ 1) నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తొలి సారి రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గతంలో ఈ టోర్నీ 12 జట్లతో సాగేది. క్రికెట్ పసికూనలకు ప్రోత్సహించడంలో భాగంగా ఐసీసీ ఈ ఎడిషన్ నుంచి 20 జట్లకు అవకాశం కల్పిస్తుంది.ఈ ఎడిషన్ ప్రపంచకప్‌లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈసారి ఏకంగా 15 మంది భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. న్యూజిలాండ్ నుంచి ఒక్కరు.. యూఎస్ఏ నుంచి ఆరుగురు.. కెనడా నుంచి నలుగురు.. సౌతాఫ్రికా, ఒమన్‌ల నుంచి ఒక్కొక్కరు.. ఉగాండ నుంచి ఇద్దరు చొప్పున ఈ ఎడిషన్‌లో పాల్గొంటున్నారు.గతంలో ఎన్నడూ ఈ సీజన్లో పాల్గొంటున్నంత మంది భారత సంతతి ఆటగాళ్లు పాల్గొనలేదు. ఈ ఎడిషన్ ప్రపంచకప్‌లో అందరి కళ్లు న్యూజిలాండ్‌కు చెందిన భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్రపై ఉన్నాయి. అలాగే సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ప్రదర్శనల కోసం కూడా భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.టీ20 ప్రపంచకప్ 2024లో పాల్గొంటున్న భారత సంతతి ఆటగాళ్లు..రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా)కశ్యప్ ప్రజాపతి (ఒమన్)అల్పేశ్ రాంజనీ (ఉగాండ)రోనక్ పటేల్ (ఉగాండ)రవీందర్ పాల్ సింగ్ (కెనడా)నిఖిల్ దత్తా (కెనడా)పర్గత్ సింగ్ (కెనడా)శ్రేయస్ మొవ్వ (కెనడా)మోనాంక్ పటేల్ (యూఎస్ఏ)హార్మీత్ సింగ్ (యూఎస్ఏ)మిలింద్ కుమార్ (యూఎస్ఏ)నిసర్గ్ పటేల్ (యూఎస్ఏ)నితీశ్ కుమార్ (యూఎస్ఏ)సౌరభ్ నేత్రావాల్కర్ (యూఎస్ఏ) -
కసరత్తులు షురూ!
న్యూయార్క్: టి20 ప్రపంచకప్ వేటలో అమెరికా గడ్డపై అడుగు పెట్టిన భారత క్రికెట్ బృందం మొదటి రోజు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. కోహ్లి ఇంకా న్యూయార్క్ చేరుకోలేదు. టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఈ ట్రయినింగ్ సెషన్‌ను పర్యవేక్షించారు. ముఖ్యంగా భారత్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన యూఎస్ వాతావరణానికి అలవాటు పడటంపై ఆటగాళ్లు దృష్టి సారించారు.ఐపీఎల్ కారణంగా మన క్రికెటర్లంతా 90 శాతంకి పైగా డే అండ్ నైట్ మ్యాచ్‌లే ఆడారు. కానీ వరల్డ్ కప్ లీగ్ దశలో అమెరికా వేదికపై జట్టు 25–27 డిగ్రీల వాతావరణంలో అన్నీ డే మ్యాచ్‌లే (ఉదయం గం. 10:30 నుంచి) ఆడబోతోంది. ట్రయినింగ్ సెషన్లో క్రికెటర్లు స్వల్ప జాగింగ్, రన్నింగ్‌తో పాటు కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడారు.‘టైమ్ జోన్‌కు అలవాటు పడటం అన్నింటికంటే ముఖ్యం. జట్టు సభ్యులంతా కూడా దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఒక్క చోటికి చేరారు. వారి ఫిట్నెస్ స్థితి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానిని బట్టి మున్ముందు రోజుల కోసం ప్రణాళికలు రూపొందిస్తాను’ అని దేశాయ్ చెప్పారు. వాతావరణం చాలా బాగుందని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడగా... న్యూయార్క్‌లో తొలిసారి ఆడనుండటం పట్ల రవీంద్ర జడేజా ఉత్సాహంగా ఉన్నాడు. నగర శివార్లలోని నాసా కౌంటీ స్టేడియంలో జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ వరకైనా కోహ్లి జట్టుతో చేరతాడా లేదా అనే విషయంలో బీసీసీఐ స్పష్టతనివ్వలేదు. జూన్ 5న అసలు పోరులో ఐర్లాండ్‌తో భారత్ ఆడుతుంది. ‘నంబర్‌వన్’ ర్యాంక్‌తో ప్రపంచకప్‌లోకి... టి20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా నంబర్‌వన్ ర్యాంకర్‌గా బరిలోకి దిగనుంది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్‌లో భారత్ 264 రేటింగ్ పాయింట్లతో తమ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.రెండుసార్లు టి20 వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను వెస్టిండీస్ 3–0తో క్లీన్‌స్వీప్ చేయడంతో ఆ జట్టు ర్యాంక్ మెరుగైంది. దక్షిణాఫ్రికా నాలుగు స్థానాలు పడిపోయి ఏడో ర్యాంక్‌లో నిలిచింది. -
Asia Cup 2023: ఫిట్‌నెస్‌పైనే దృష్టి
బెంగళూరు: ఆసియా కప్‌కు ముందు ఆరు రోజుల స్వల్పకాలిక శిక్షణా శిబిరంలో భారత క్రికెటర్లు చెమటోడుస్తున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో జరుగుతున్న ఈ శిబిరంలో ఫిట్‌నెస్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. జట్టు సభ్యులందరికీ సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కీలకమైన ‘యో–యో టెస్టు’ కూడా నిర్వహించనున్నారు. బీసీసీఐ 16.5 పాయింట్లను యో–యో టెస్టు ఉత్తీర్ణత మార్క్‌గా గుర్తించింది. గురువారం కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, హార్దిక్ పాండ్యాలు ఈ టెస్టులో పాల్గొన్నట్లు సమాచారం. వీరి ఫలితాలను అధికారికంగా ప్రకటించకపోయినా... 17.2 పాయింట్లతో తాను పాస్ అయినట్లు కోహ్లి సోషల్ మీడియాలో వెల్లడించాడు. అయితే అందరి దృష్టీ కేఎల్ రాహుల్‌పైనే నిలిచింది . గాయం నుంచి కోలుకొని ఆసియా కప్ జట్టులోకి ఎంపికైనా, అతను కొంత ‘అసౌకర్యం’తో ఉన్నట్లు సెలక్టర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన ఫిట్నెస్ను నిరూపించుకోవడం అతనికి ఎంతో ముఖ్యం. ఐర్లాండ్ పర్యటన నుంచి ఇంకా భారత్‌కు చేరుకోని బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, సామ్సన్, తిలక్ మినహా మిగతా జట్టు సభ్యులంతా ఎన్సీఏలో ఉన్నారు. -
టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు..
Team India Cricketers: భారత్‌లో క్రికెట్ మతం లాంటిది. ఇక క్రికెటర్లరంటే పడిచచ్చిపోయే అభిమానులకు కొదవే లేదు. ఇతర క్రీడాకారులెవరికీ లేని విధంగా సూపర్ క్రేజ్ మన క్రికెటర్ల సొంతం. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్ నుంచి సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి దాకా ఎంతోమంది సంచలన రికార్డులు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుల రూపంలో చెల్లిస్తున్న మొత్తం కూడా కళ్లు చెదిరే రీతిలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. మరి క్రికెట్ రంగానికి చేసిన, చేస్తున్న సేవలకు గానూ ప్రతిఫలంగా సముచిత గౌరవం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన క్రికెటర్లు ఎవరో తెలుసా?! సముచిత గౌరవం సచిన్ టెండుల్కర్ టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కెరీర్లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించి ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. మేటి బ్యాటర్‌గా ఎదిగి టీమిండియా ముఖచిత్రంగా వెలుగొందాడు. అతడి సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ఇదిలా ఉంటే.. భారత వాయుదళంలో గ్రూప్ కెప్టెన్ హోదా కూడా అందుకున్నాడు సచిన్ టెండుల్కర్. కపిల్ దేవ్ టీమిండియాకు మొట్టమొదటి ప్రపంచకప్ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో కపిల్ డెవిల్స్ వెస్టిండీస్‌ను ఓడించి టైటిల్ సాధించింది. ఇక లెజెండ్ కపిల్ దేవ్‌ను భారత ఆర్మీ 2008లో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించి సముచిత గౌరవం ఇచ్చింది. మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు ధోని. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 సాధించి లెజెండరీ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో మిస్టర్ కూల్‌కు భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకుతో గౌరవించింది. ప్రభుత్వ ఉద్యోగంలో.. హర్భజన్ సింగ్ భారత మేటి స్పిన్నర్లలో భజ్జీ కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏడు వందలకు పైగా వికెట్లు పడగొట్టిన ఈ ఆఫ్ స్పిన్నర్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో పంజాబ్ పోలీస్.. భజ్జీని డిప్యూటి సూపరిండింటెండ్గా నియమించింది. జోగీందర్ శర్మ టీ20 ప్రపంచకప్-2007 చూసిన వారికి జోగీందర్ శర్మ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాకిస్తాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో జోగీందర్ తీసిన వికెట్‌తో భారత్ రెండోసారి(వన్డే ఫార్మాట్‌తో కలిపి) విశ్వవిజేతగా అవతరించింది. ఈ క్రమంలో జోగీందర్ శర్మకు హర్యానాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా అవకాశం వచ్చింది. ఉమేశ్ యాదవ్ మహారాష్ట్ర పేసర్ ఉమేశ్ యాదవ్ చిన్ననాటి నుంచే భారత త్రివిధదళాల్లో ఏదో ఒక విభాగంలో పనిచేయాలని కల కన్నాడు. కానీ క్రికెటర్ అయ్యాడు. టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్న అతడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. నాగ్‌పూర్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా అవకాశం కల్పించింది. యజువేంద్ర చహల్ టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పి టీమిండియాకు విజయాలు అందించిన సందర్భాలెన్న! ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్లో.. అత్యధికంగా 91 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన ఏకైన టీమిండియా బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇలా భారత క్రికెట్‌కు తన వంతు సేవ చేస్తున్న చహల్‌కు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్.. టాక్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఇక వీరితో పాటు టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సైతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఉంది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం! -
ఉప్పల్‌లో వన్డే.. హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
టీమిండియా క్రికెటర్ల వరుస రిటైర్మెంట్లకు కారణం అదేనా..?
ఇటీవలి కాలంలో టీమిండియా క్రికెటర్లు వరుస పెట్టి రిటైర్మెంట్లు ప్రకటిస్తున్న అంశంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే భారత ఆటగాళ్లు రాహుల్ శర్మ, సురేశ్ రైనా, ఈశ్వర్ పాండే, తాజాగా రాబిన్ ఉతప్ప భారత క్రికెట్‌తో బంధం తెంచుకున్న విషయం విధితమే. గతంలో ఓ వెలుగు వెలిగిన ఈ క్రికెటర్లు, వయసు ఏమంత పైబడనప్పటికీ వరుసగా క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి గల కారణాలు విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది వీరందరి అభిమతంగా తెలుస్తోంది. క్రికెట్ ఆడేందుకు శరీరం సహకరిస్తున్నప్పుడే నాలుగు రూపాయలు వెనకేసుకోవాలని వీరు భావిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత క్రికెట్‌తో అనుబంధమున్న ఏ ఆటగాడూ ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో కానీ మరే ఇతర క్రికెట్ బోర్డుల ఆధ్వర్యంలో జరిగే టోర్నీల్లో కానీ పాల్గొనే వీలు లేదు. ఈ నిబంధనే వయసు, టాలెంట్ ఉన్న చాలా మంది భారత క్రికెటర్లకు ప్రాణసంకటంలా మారింది. యువ క్రికెటర్లైతే ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడే అవకాశం రాకపోదా అన్న ఆశతో భారత క్రికెట్‌తో బంధాన్ని తెంచుకునే సాహసం చేయలేకపోతుంటే.. వయసు పైబడిన ఆటగాళ్లు మాత్రం బీసీసీఐని నమ్ముకుంటే అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్న చందంగా తమ బతుకులు మారతాయని ఇష్టం లేకపోయినా భారత క్రికెట్‌తో అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. ఇలా బీసీసీఐతో బంధం తెంచుకున్న వారికి దేశవాళీ క్రికెట్లో కానీ, జాతీయ జట్టుకు కానీ, బీసీసీఐ ఆధ్వర్యంలో నడిచే ఐపీఎల్లో కానీ ఆడే అవకాశాలు రాకపోయినా భారీ ధన ప్రవాహం నడిచే ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇటీవల భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వారంతా ఈ కారణంగానే బీసీసీఐతో బంధం తెంచుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్రాంచైజీ లీగ్స్ పుట్టుకొచ్చాయి. వీటికి ప్రస్తుతం భారీ గిరాకీ ఉంది. ఐపీఎల్ అంత కాకపోయినా ఆ రేంజ్లో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కొన్ని ఫ్రాంచైజీలు పర్సులు రెడీ చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్, ఈసీబీ ఆధ్వర్యంలో నడిచే హండ్రెడ్ లీగ్, వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), బంగ్లాదేశ్ లీగ్, శ్రీలంక క్రికెట్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఇలా ప్రతి ఐసీసీ అనుబంధ దేశంలో ఓ లీగ్ జరుగుతుండగా.. వచ్చే ఏడాది నుంచి కొత్తగా మరో రెండు లీగ్‌లు (యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్) ప్రారంభంకానున్నాయి. ఆటగాళ్లు ఈ లీగ్స్‌లో ఏదో ఒక లీగ్‌లో సక్సెస్ అయితే డబ్బుతో పాటు ఏడాదంతా ఖాళీ లేకుండా క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రారంభంకాబోయే యూఏఈ, సౌతాఫ్రికా లీగ్ల్లోని ఫ్రాంచైజీలను దాదాపుగా ఐపీఎల్ యాజమాన్యాలే కొనుగోలు చేయడంతో భారత వెటరన్ క్రికెటర్ల ఫోకస్ అంతా వీటిపైనే ఉంది. -
ఐసీసీ టీట్వంటీ ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్ల జోరు
-
ఇండియన్ ప్లేయర్లను ఫారిన్ లీగ్‌ల్లో ఆడనివ్వండి..!
భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడకపోవడం అనే అంశంపై లెజెండరీ వికెట్‌కీపర్, ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్పందించాడు. ఈ విషయంలో బీసీసీఐ కాస్త పట్టువీడాలని సూచించాడు. ప్రపంచవ్యాప్తంగా భారత ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వారిని విదేశీ టీ20ల లీగ్‌ల్లో ఆడనివ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. భారత క్రికెటర్లు బిగ్‌బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫారిన్ లీగ్స్‌లో పాల్గొనడం వల్ల ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ పెరగడంతో పాటు బీసీసీఐకి విశ్వవ్యాప్త గుర్తింపు వస్తుందని అన్నాడు. భారత క్రికెటర్లు విదేశాల్లో (టీ20 లీగ్‌ల్లో) ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తే, అది క్రికెట్ వ్యాప్తికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డాడు. విదేశీ లీగ్‌ల్లో భారత క్రికెటర్లు ఆడితే అద్భుతంగా ఉంటుందని, ఐపీఎల్ ఆరు సీజన్లు ఆడిన అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని తెలిపాడు. ఐపీఎల్ ప్రపంచంలోనే టాప్ టీ20 లీగ్ అని, దాన్ని నడిపిస్తున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్నయ్య లాంటిదని ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆధిపత్యం ఎక్కువైందని సంచలన వ్యాఖ్యలు చేసిన మరునాడే గిల్లీ బీసీసీఐకి ఈ రకమైన సూచన చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: బిగ్‌బాష్ లీగ్ లో ఆడనున్న భారత ఆల్ రౌండర్..! -
కొత్త సాఫ్ట్‌వేర్‌ను కొన్న బీసీసీఐ.. ప్రధాన లక్ష్యమదే..
-
ఫారెన్ లీగ్స్‌లో భారత క్రికెటర్లు..? బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..!
-
క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..?
భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకూడదనే నిబంధన విషయంలో బీసీసీఐ పట్టువీడనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్ల్లోని మెజార్టీ ఫ్రాంచైజీలు బీసీసీఐని నడిపిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల చేతుల్లోనే ఉండటంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. త్వరలో దక్షిణాఫ్రికాలో ప్రారంభంకానున్న టీ20 లీగ్‌లో ఆరింటికి ఆరు జట్లను ఐపీఎల్ ఓనర్లే చేజిక్కించుకోవడంతో ఈ విషయమై బీసీసీఐపై ఒత్తిడి అధికమైందని భారత క్రికెట్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అంగీకరించిందని తెలుస్తోంది. ఈ విషయమై ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) స్పష్టత రానుందని బీసీసీఐకి చెందిన కీలక ప్రతినిధి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. కాగా, ప్రస్తుత నిబంధనల ప్రకారం బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఏ పురుష క్రికెటర్‌కు విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి లేదు. రిటైరైన వాళ్లు, ఇకపై టీమిండియాకు ఆడబోమని భావించినవాళ్లతో పాటు మహిళా క్రికెటర్లకు మాత్రమే ఫారెన్ లీగ్‌లలో ఆడే అవకాశముంది. చదవండి: భారత్‌కు ఆసియా కప్, ప్రపంచకప్ అందించడమే నా ప్రధాన లక్ష్యం: కోహ్లి -
భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..!
BCCI: భారత క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఓ శుభవార్త వచ్చింది. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఆటగాళ్ల మానసిక ఒత్తిడికి కారణమవుతున్న బుడగ (బయో బబుల్) నిబంధనలను ఎత్తి వేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుడగ నిబంధనల వల్ల ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలో కోవిడ్ ప్రభావం కూడా తగ్గుముఖం పడతుండడంతో బయో బబుల్ నిబంధనలకు పూర్తిగా స్వస్థి పలకాలని బీసీసీఐ యోచిస్తుంది. దీంతో ఈ నెల (ఏప్రిల్) నుంచే ఆటగాళ్లకు బుడగ నిబంధనల నుంచి విముక్తి కల్పించాలని భావిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ వెసులుబాటు దేశవాళీ క్రికెటర్లకు మాత్రమేనని తెలుస్తోంది. త్వరలో రెండు దేశవాళీ టోర్నీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 18 నుంచి అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీతో పాటు సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2022: శతక్కొట్టిన ఆర్సీబీ.. అంబరాన్నంటిన సంబురాలు -
టెస్టు ఆడలేం... ఐపీఎల్‌కు సిద్ధం!
మాంచెస్టర్/దుబాయ్: ఐపీఎల్ రెండో దశ పోటీ ల్లో పాల్గొనేందుకు భారత క్రికెటర్లు యూఏఈ చేరుకున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు తమ ఆటగాళ్లు రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య కుమార్ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా కోహ్లి, సిరాజ్ కోసం ఇదే తరహా ఏర్పాటు చేసింది. టెస్టు సిరీస్‌లో భాగంగా ఉండి ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లాల్సిన మిగిలిన భారత క్రికెటర్లతో (16 మంది)పాటు ఇంగ్లండ్ ప్లేయర్ స్యామ్ కరన్ మాంచెస్టర్ నుంచి కమర్షియల్ ఫ్లయిట్ ద్వారా యూఏఈకి వెళ్లారు. వీరి కోవిడ్ పరీక్షలన్నీ ‘నెగెటివ్’గా తేలాయి. యూఏఈ దేశపు నిబంధనల ప్రకారం క్రికెటర్లంతా ఆరు రోజుల పాటు తమ హోటల్ గదుల్లో క్వారంటైన్లో గడపాల్సి ఉం టుంది. ఆ తర్వాత తమ జట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో వీరు చేరతారు. ఏదైనా జరగవచ్చని... శుక్రవారం నుంచి ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సిన భారత్, ఇంగ్లండ్ చివరి టెస్టు అనూహ్యంగా రద్దయింది. గురువారం రాత్రి భారత క్రికెటర్లందరి కోవిడ్ రిపోర్టులు ‘నెగెటివ్’గా వచి్చనా... మ్యాచ్ మధ్యలో ఏదైనా జరగవచ్చనే భయమే టీమిండియా ఆటగాళ్లను బరిలోకి దిగకుండా చేసింది. సహజంగానే కరోనా ప్రభావం కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఆడకపోవడమే మంచిదని కోహ్లి బృందం భావించింది. మ్యాచ్ జరగాల్సిన రోజు ఉదయం సుదీర్ఘ సమయం పాటు చర్చించాక ఇరు బోర్డులు టెస్టును రద్దు చేయాలని నిర్ణ యించాయి. భారత జట్టు పూర్తి జట్టును బరిలోకి దింపే పరిస్థితిలో లేదని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించగా... ప్లేయర్ల ఆరోగ్యభద్రతే తమకు అన్నింటి కంటే ముఖ్యమని బీసీసీఐ ప్రకటించింది. విమర్శలు, ప్రతివిమర్శలు... ఐపీఎల్లో ఒక్క మ్యాచ్‌కు కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనే భారత క్రికెటర్లు టెస్టు నుంచి తప్పుకున్నారని, వారికి టెస్టులకంటే ఐపీఎల్ అంటేనే ప్రాధాన్యత అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు, మీడియా భారత జట్టుపై విరుచుకుపడ్డారు. రెండో కోవిడ్ ‘నెగెటివ్’ రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన వీరు అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్టు ఆడితే ఏమయ్యేదని వారు ప్రశి్నంచారు. టెస్టు సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ కాకుండా చివరకు ‘డబ్బు’ గెలిచిందని వారు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత అభిమానులు ‘డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు నలభై రోజులు ఖాళీగా కూర్చుంది. టెస్టు సిరీస్‌ను కాస్త ముందుగా జరపమన్నా వినలేదు. పైగా పనికిమాలిన ‘హండ్రెడ్’ కోసం రెండో, మూడో టెస్టుల మధ్య 9 రోజుల విరామం ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఐపీఎల్‌ను విమర్శించడంలో అర్థం లేదు’ అని ఘాటుగా స్పందించారు. సిరీస్ ఫలితం ఏమిటి? ఐదో టెస్టు రద్దుతో సిరీస్ ఫలితంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) నిబంధనల ప్రకారం కోవిడ్ కారణంగా మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే మ్యాచ్‌ను రద్దు చేయవచ్చు. అలా చూస్తే భారత్ 2–1తో సిరీస్ గెలుచుకున్నట్లే. అయితే ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ) దీనిని అంగీకరించడం లేదు. మధ్యే మార్గంగా ఈ టెస్టును రాబోయే రోజుల్లో మళ్లీ ఎప్పుడైనా ఆడేందుకు తాము సిద్ధమని బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్‌లో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లాల్సి ఉంది. అప్పుడు ఏమైనా ఈ టెస్టు కోసం తేదీలు సర్దుబాటు చేయవచ్చు. అయితే ఈసీబీ సీఈఓ టామ్ హారిసన్ మాత్రం దానిని ప్రస్తుత సిరీస్‌లో భాగంగా కాకుండా ‘ఏౖకైక టెస్టు’గా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
కోహ్లి సేనకు వ్యాక్సిన్ రెండో డోసు అక్కడే..
ముంబై: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు రూట్ సేనతో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న కోహ్లీ సేనకు కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసును అక్కడే ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని యూకే ఆరోగ్య శాఖ పర్యవేక్షించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వ్యాక్సిన్ తొలి డోసును భారత్‌లో తీసుకున్న కోహ్లి అండ్ కో, రెండో డోసును ఇంగ్లండ్‌లో తీసుకోనుంది. 18 ఏళ్ల దాటిన వారు కోవిడ్ టీకాను తీసుకోవచ్చని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లంతా తప్పనిసరిగా టీకా తీసుకోవాలని బీసీసీఐ ప్రకటించింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా ఇతర ఆటగాళ్లంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ వెళ్లే ఆటగాళ్లకు మూడు సార్లు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటించింది. కాగా, రెండు వారాల క్వారెంటైన్ నిమిత్తం ఇదివరకే ముంబై చేరుకున్న భారత బృందం.. ఇంగ్లండ్‌కు వెళ్లాక అక్కడ కూడా పది రోజులు క్వారెంటైన్లో ఉండాల్సి ఉంటుంది. మరోవైపు టీమిండియాకు బ్రిటన్ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించింది. జట్టు సభ్యులను కఠిన క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ స్టాండ్‌బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్ద్ క్రిష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా చదవండి: రిటైర్మెంటే ఫైనల్: ఏబీ డివిలియర్స్ -
బయో బబుల్ కష్టమే.. అయినా భారత క్రికెటర్లు తట్టుకోగలరు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఆయా జట్లు నిర్వహిస్తున్న బయో బబుల్‌లో ఉంటూ క్రికెట్ ఆడటం కష్టమే అయినప్పటికీ, భారతీయ క్రికెటర్లు మాత్రం సమర్ధవంతంగా తట్టుకోగలరని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశారు. బయో బుడగలో ఉత్పన్నమయ్యే మానసిక సమస్యలను విదేశీ క్రికటర్ల కన్నా భారతీయ క్రికెటర్లు మెరుగ్గా ఎదుర్కొనగలరని వెల్లడించారు. ఆరేడు నెలలుగా బయో బుడగల్లో విపరీతమైన క్రికెట్ జరుగుతోందని, ఇది చాలా కఠినమైన విషయమని పేర్కొన్నాడు. ఇటువంటి సందర్భాల్లో క్రికెటర్ల మానసిక వైఖరి బాగుంటేనే ఒత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కొనగలరని తెలిపాడు. మానసిక ఆరోగ్యం విషయంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ క్రికెటర్లు చాలా సున్నితంగా ఉంటారని, ఆ విషయాన్ని తాను దగ్గరగా చూశానని వెల్లడించాడు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, జోష్ హేజిల్‌వుడ్‌లు బయో బబుల్‌లో రెండు నెలలు గడపడం కష్టమంటూ లీగ్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన విషయాన్ని ఆయన ఉదహరించాడు. కాగా, కోవిడ్-19 నేపథ్యంలో ప్రస్తుతం క్రికెటర్లందరూ బుడగల్లోనే ఉంటూ మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం బాహాటంగానే వ్యతిరేకించాడు. చదవండి: ఊపిరి పీల్చుకున్న ముంబై.. ఆటగాళ్లందరికీ కరోనా నెగిటివ్ -
టీమిండియా ఆటగాళ్లకు ఆ కోరిక ఎక్కువే: మోర్గాన్
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ లీగ్‌లు జరిగినా, వాటిల్లో పాల్గొనేందుకు టీమిండియా ఆటగాళ్లు ఎక్కువగా ఇష్టపడతారని ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారథి ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌లో నిర్వహించే 'ది హండ్రెడ్' బాల్ క్రికెట్ లీగ్‌లో పాల్గొనాలని చాలా మంది భారత క్రికెటర్లు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఓ క్రీడా ఛానెల్లో నిర్వహించిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా టీమిండియా క్రికెటర్లు కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు చాలా ఇష్టపడతారని, అక్కడి సంప్రదాయాలు తెలుసుకునేందుకు వారు ఎక్కువగా ఆసక్తి చూపుతారని అన్నారు. టీమిండియా క్రికెటర్లు ఆడితే ఆయా లీగ్‌లకు అదనపు ఆకర్షణ వస్తుందని, దాంతో వ్యాపారం కూడా బాగా పెరుగుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే, కొన్ని లీగ్‌ల వల్ల్ల ఆయా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ క్రికెట్ టోర్నీల కారణంగా కొన్ని దేశాలు అత్యుత్తమ జట్లను బరిలోకి దింపలేకపోతున్నాయని పేర్కొన్నాడు. దీనిపై ఐసీసీ దృష్టిసారించాలని ఆయన కోరాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు క్రికెట్ ఫార్మాట్ల మధ్య పెద్ద తేడా లేకుండా పోయిందని, దేనికి దక్కాల్సిన ప్రాధాన్యత దానికి దక్కడం లేదని ఆయన వాపోయాడు. అయితే, టీ20 క్రికెట్ యువ క్రికెటర్లకు బాగా ఉపయోగపడుతుందని, వారి కెరీర్ బిల్డప్ చేసుకునేందుకు ఈ ఫార్మాట్ బాగా ఉపయోగపడుతుందని తెలిపాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్ల పరిస్థితి ఇందుకు భిన్నమని.. ఈ ఫార్మాట్లలో ఆడటాన్ని ప్రధాన క్రికెటర్లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా, వంద బంతుల క్రికెట్ లీగ్‌ను(ది హండ్రెడ్ లీగ్) ఇంగ్లాండ్ గతేడాదే నిర్వహించాలని భావించింది. కరోనా కారణంగా అది సాధ్యపడకపోవడంతో ఈ ఏడాది నిర్వహించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) భావిస్తోంది. చదవండి: వైరల్ వీడియో: నేటి ధోని, నాటి ధోనితో ఏమన్నాడంటే.. -
క్రికెటర్లకు ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్
ఆస్ట్రేలియాలో అదరగొట్టిన క్రికెటర్లకు కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా క్రికెటర్లకు ఊహించని బహుమతి లభించనుంది. ప్రతిభ గల వారిని ఎప్పుడూ ప్రోత్సహించే వారిలో మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ముందుంటారు. టెస్ట్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చి అద్భుత ప్రదర్శన చేసిన ఆరు మంద్రి క్రికెటర్లకు మహేంద్ర ఎస్యూవీ వాహనాలు అందిస్తానని ప్రకటించారు. అది కూడా తన వ్యక్తిగత ఖాతా నుంచి అందిస్తానని ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియా టెస్ట్ (బోర్డర్ గావస్కర్ సిరీస్)తో అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్, హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, నటరాజన్‌లకు తమ కంపెనీకి చెందిన థార్ ఎస్యూవీ కార్లను బహుమతిగా ఇస్తానని శనివారం ఆనంద్ మహేంద్ర ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ ఆరుగురు తమ జీవితాల్లో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేలా భారతీయులకు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్ర ప్రశంసించారు. Six young men made their debuts in the recent historic series #INDvAUS (Shardul’s 1 earlier appearance was short-lived due to injury)They’ve made it possible for future generations of youth in India to dream & Explore the Impossible (1/3) pic.twitter.com/XHV7sg5ebr — anand mahindra (@anandmahindra) January 23, 2021 -
భారత క్రికెటర్లు ఇక 2 కిలోమీటర్లు పరుగెత్తాల్సిందే!
ముంబై: భారత క్రికెటర్ల ఫిట్నెస్ స్థాయిని పరీక్షించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న యో–యో టెస్టుతో పాటు మరో కొత్త తరహా పరీక్షను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. పరుగులో వేగాన్ని బట్టి ఆటగాళ్ల ఫిట్నెస్ను కొలవనున్నారు. పేస్ బౌలర్లయితే 2 కిలోమీటర్ల పరుగును 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. స్పిన్నర్లు, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌కు మరో 15 సెకన్లు అదనపు అవకాశం కల్పిస్తూ 8 నిమిషాల 30 సెకన్ల గరిష్ట సమయాన్ని నిర్దేశించారు. కాంట్రాక్ట్ ప్లేయర్లతో పాటు జట్టులోకి వచ్చే అవకాశం ఉన్న అందరికీ ఇది వర్తిస్తుంది. ఏడాదిలో మూడుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇంగ్లండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పాల్గొనే ఆటగాళ్లు ముందుగా ఈ పరీక్షను ఎదుర్కోనున్నారు. అయితే అత్యున్నత స్థాయిలో ఆడే అథ్లెట్లు సాధారణంగా 6 నిమిషాల్లోనే 2 కిలోమీటర్లు పూర్తి చేస్తుంటారు కాబట్టి కొత్త పరీక్ష వల్ల క్రికెటర్లు పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. (చదవండి: ‘ఫైండ్ ఆఫ్ ది టూర్’ అతడే: రవిశాస్త్రి) -
పాండ్యా సోదరులకు పితృ వియోగం
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు పితృవియోగం కలిగింది. వారిద్దరి తండ్రి, 71 ఏళ్ల హిమాన్షు పాండ్యా గుండెపోటుతో శనివారం వడోదరలో కన్నుమూశారు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో బరోడా జట్టుకు సారథ్యం వహిస్తూ నగరంలోనే ఉన్న కృనాల్ ఇంటికి బయల్దేరగా... ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ముంబైలో సన్నద్ధమవుతోన్న హార్దిక్ వెంటనే వడోదర చేరుకున్నాడు. హిమాన్షు పాండ్యా మృతి పట్ల భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ సంతాపం తెలియజేశారు. -
ధోని నుంచి కోహ్లి వరకు.. సేమ్ టు సేమ్
ఇటీవల తమకు మహాలక్ష్మీ వంటి పాప పుట్టడంతో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. తొలి బిడ్డ పుట్టిన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. స్టార్ కపూల్ కాడవంతో పాపకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. విరుష్క జంట ఎక్కడికి పోయినా వారి వెంట ఓ కన్నేసి పెడుతున్నారు. ఈ క్రమంలో తమ కూతురు ప్రైవసికి భంగం కలిగించొద్దని, పాప ఫోటోలు తీయవద్దని అనుష్క, విరాట్ ఫోటోగ్రాఫర్లకు విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో తమ పాప ఫొటోలను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కాగా జనవరి 11న తమకు పాప పుట్టిందని కోహ్లి సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. (చదవండి: కోహ్లి కూతురిపై అమితాబ్ ట్వీట్ వైరల్) ఇక కోహ్లి కూతురుపై బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ ట్వీట్ చేయడంతో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మన క్రికెట్ టీమ్ అంతా కలిసి భవిష్యత్తులో మహిళల క్రికెట్ టీమ్‌ను తయారు చేస్తోందంటూ బిగ్ బీ ఫన్నీ ట్వీట్ చేశాడు. ఇందులో క్రికెటర్లందరికీ కూతుళ్లే పుట్టారంటూ వరుసగా ఒక్కొక్కరి పేరు రాసుకుంటూ వెళ్లాడు. ధోనీ కూతురు ఈ టీమ్‌కు కెప్టెన్‌గా ఉంటుందేమో అని కామెంట్ చేశాడు. ఆ లిస్ట్‌లో వరుసగా రైనా, గంభీర్, రోహిత్, షమి, రహానే, జడేజా, పుజారా, సాహా, భజ్జీ, నటరాజన్, ఉమేష్ యాదవ్‌ల పేర్లు ప్రస్తావించాడు. తాజాగా కోహ్లికి కూడా కూతురే పుట్టిందంటూ.. వీళ్లంతా భవిష్యత్తు మహిళల క్రికెట్ టీమ్‌ను తయారు చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఒక్క హర్ధిక్ పాండ్యాకు తప్ప మిగతా టీమిండియా క్రికెటర్లందరికి ఈ మధ్య కాలంలో దాదాపు ఆడపిల్లలే జన్మించారు. హర్ధిక్ పాండ్యా, నటాషాకు గతేడాది జూలై 30న కొడుకు పుట్టాడు. అంతేగాని రైనా నుంచి ఉమేష్ యాదవ్ వరకు అందరి ఇంట్లోకి మహాలక్ష్మీలే అడుగుపెట్టారు. 1. మహేంద్ర సింగ్ ధోని 2010లో సాక్షిని వివాహం చేసుకోగా వీరికి 2015లో కూతురు జీవా జన్మించింది. 2.సురేష్ రైనా, ప్రియాంక చైధురీలకు మొదటి సంతానం కూతురే. ఆమె పేరు గ్రేసియా.. ప్రస్తుతం తనకు నాలుగేళ్లు. 3. గౌతమ్ గంభీర్: గంభీర్,నటాషా జైన్లకు ఇద్దరు కూతుళ్లే.. మొదటి కూతురు పేరు అజీన్ గంభీర్ కాగా రెండో కూతురు అనైజా గంభీర్ 4. రోహిత్ శర్మ 2015 లో రితికా సజ్దాలను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2018 డిసెంబర్లో సమైరా అనే కూతురు జన్మించింది. 5. మహ్మద్ షమీ, హసీన్ జహాన్లకు 2015లో ఐరా షమీ అనే కూతురు జన్మించింది. 6. రవిచంద్రన్ అశ్విన్.. ప్రీతీ నారాయణన్ జంటకు చూడచక్కని ఇద్దరు కూతుళ్లు ఆద్యా, అకీరాలు. 7. అజింక్యా రహానే.. రాధిక జంటకు కూతురు ఉంది. తన పేరు ఆర్యా రహానే. 8.రవీంద్ర జడేజా తొలి ముద్దుల తనయ పేరు నిద్యానా. 9. ఛేతేశ్వర్ పుజారాకి మొదటి సంతానం అమ్మాయి. తన ముద్దుల తనయ పేరు అదితి. 10. వృద్ధిమాన్ సాహాకు భార్య రోమి సాహా.. అందమైన కుమార్తె అన్వి సాహా ఉంది. 11. హర్భజన్‌సింగ్- గీతా బస్రాల కూతురు హినాయా సింగ్. 12. ఉమేశ్ యాదవ్ భార్య తాన్య వాద్వా జనవరి 1న ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ జంటకు ఇది తొలి సంతానం. 13. విరాట్ కోహ్లి, అనుష్క శర్మకు జనవరి 11న కూతురు జన్మించింది. -
హమ్మయ్య! అందరికీ నెగెటివ్
మెల్బోర్న్: హమ్మయ్య! భారత క్రికెటర్లకే కాదు... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కే ఇది పెద్ద ఊరట. ఆటగాళ్లంతా కోవిడ్–19 పరీక్షల నుంచి నెగెటివ్‌గా బయటపడ్డారు. దీంతో ఈనెల 7 నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు వచ్చిన ముప్పేమీ లేదిపుడు. ‘ఆటగాళ్లతో పాటు జట్టు సహాయ సిబ్బందిలో ఎవరికీ కరోనా సోకలేదు. ఆదివారం వీరందరికీ ‘ఆర్టీ–పీసీఆర్’ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా... సోమవారం ఫలితాలన్నీ నెగెటివ్‌గానే వచ్చాయి’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలు కరోనా నిబంధనల్ని ఉల్లంఘించారని, బయో బబుల్ దాటి బయటకొచ్చి రెస్టారెంట్ రుచులు చూశారని గగ్గోలు పెట్టిన ఆసీస్ ప్రభుత్వ వర్గాలు ఇక తమ నోటికి తాళం వేసుకుంటాయేమో! ఎందుకంటే ఇప్పటికే ఈ ఉదంతంపై బీసీసీఐతో కలిసి సీఏ ఉమ్మడి దర్యాప్తు చేపడుతుందంటూ చేసిన ప్రకటనలకు ఇక కాలం చెల్లినట్లే! రెస్టారెంట్లో భోంచేసిన ఆ ఐదుగురు ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉంచినప్పటికీ సోమవారం జట్టుతో పాటే సిడ్నీకి చేరుకున్నారు. తాజాగా రిపోర్టులు కూడా నెగెటివ్‌గా రావడంతో ఇప్పుడు అంతా కలిసే ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటారు. 25 శాతం మంది వీక్షకులకే ప్రవేశం సిడ్నీలో నమోదవుతున్న కరోనా కేసుల దృష్ట్యా మూడో టెస్టుకు వచ్చే వీక్షకుల సంఖ్యను 25 శాతానికి కుదించారు. ఈ మైదానం మొత్తం సామర్థ్యం 38 వేల సీట్లు. దీంతో పదివేల లోపే ప్రేక్షకుల్ని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో టెస్టు కోసం ఇది వరకే జారీ చేసిన టికెట్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేసి అంతా కొత్తగా అంటే సీటుకు, సీటుకు మధ్య భౌతిక దూరం వుండేలా తిరిగి జారీ చేస్తారు. దీనిపై సీఏ తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లీ మాట్లాడుతూ ‘న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలోని ప్రజారోగ్యం దృష్ట్యా మేం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. మూడో టెస్టు సజావుగా, సురక్షితంగా జరిగేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. ప్రేక్షకుల సంఖ్యను కుదిస్తాం’ అని అన్నారు. ఎలా‘గబ్బా’! భారత ఆటగాళ్ల రెస్టారెంట్ వ్యవహారం సద్దుమణిగినప్పటికీ బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఈనెల 15 నుంచి జరగాల్సిన నాలుగో టెస్టుపైనే సందిగ్ధత పూర్తిగా తొలగలేదు. కాస్త అయోమయం ఉన్నప్పటికీ బీసీసీఐ సోమవారం చేసిన ప్రకటన సీఏకు ఊరటనిచ్చింది. ‘షెడ్యూల్ ప్రకారమే నాలుగో టెస్టు జరుగుతుంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. అయితే నిబంధనలు పాటిస్తేనే బ్రిస్బేన్‌కు రావాలని లేదంటే అక్కర్లేదని ఘాటుగా వ్యాఖ్యానించిన క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు రాస్ బేట్స్ వ్యాఖ్యలపై బీసీసీఐ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
అలా అయితే నాల్గో టెస్టు వాకౌట్ చేస్తాం
అంతా సాఫీగా, ఆత్మీయంగా సాగిపోతే... ఏదో ఒక రచ్చ లేకపోతే అది భారత్–ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ఎలా అవుతుంది? ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేకుండా సాగుతున్న పర్యటనలో అనూహ్యంగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హోటల్లో భోజనం కారణంగా ‘ఐసోలేషన్’తో మొదలైన చర్చ తర్వాతి రోజు భారత జట్టు నాలుగో టెస్టును బాయ్‌కాట్ చేయడం వరకు చేరింది! కరోనా నేపథ్యంలో బ్రిస్బేన్‌లో మళ్లీ కఠిన ఆంక్షల మధ్య ఆడాల్సి వస్తుండటం టీమిండియా అసంతృప్తికి కారణం. మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెటర్లు సుమారు రెండు నెలల పాటు బయో బబుల్‌లోనే ఐపీఎల్ ఆడారు. ఇక్కడికి చేరుకోగానే రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండి ఆ తర్వాతే మైదానంలోకి అడుగు పెట్టారు. 3 వన్డేలు, 3 టి20లు, 2 టెస్టులు కూడా జరిగిపోయాయి. జనవరి 7 నుంచి జరిగే మూడో టెస్టుకు క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. ఆపై మరో మ్యాచ్ ఆడితే స్వదేశం తిరిగి వెళ్లిపోవచ్చు. కానీ ఈ ఒక్క మ్యాచ్ కోసమే మళ్లీ కఠిన కరోనా ఆంక్షలు పాటించాల్సి వస్తే..! ఇదే ఇప్పుడు జట్టు ఆటగాళ్లను అసహనానికి గురి చేస్తోంది. అవసరమైతే చివరి టెస్టు ఆడకుండానే వెళ్లిపోతామని కూడా వారు చెబుతున్నారు. హోటల్ గది... గ్రౌండ్... హోటల్... షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ నగరం ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రం కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. మూడో టెస్టు వేదిక అయిన సిడ్నీలో కూడా కేసులు ఎక్కువగా ఉండటంతో క్వీన్స్లాండ్ రాష్ట్రం ఇప్పటికే సిడ్నీకి వెళ్లే సరిహద్దులు మూసేసి రాకపోకలపై నిషేధం విధించింది. అయితే సిరీస్ ఆరంభానికి ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఇచ్చిన మాట ప్రకారం ఆటగాళ్లు తమ నగరానికి వచ్చి టెస్టు ఆడేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే సిడ్నీ నుంచి వచ్చేవారి విషయంలో ఎలాంటి కరోనా ఆంక్షలు విధిస్తారో అనే విషయంపై స్పష్టత లేదు. ఇంకా చెప్పాలంటే బ్రిస్బేన్‌లో అడుగు పెట్టాలంటే సిడ్నీ నుంచి ఆంక్షలు పాటిస్తూ రావాల్సి రావచ్చు. ఇక్కడే మన ఆటగాళ్లు భయపడుతున్నారు. అయితే మరోసారి పూర్తిగా హోటల్ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని వారు స్పష్టంగా చెప్పేశారు. ‘ప్రస్తుత పరిస్థితులపై మాకు అవగాహన ఉంది. ఈ పర్యటన విషయంలో సీఏ, బీసీసీఐ కలిసి బాగా పని చేశాయి. మేం కూడా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఆస్ట్రేలియా పర్యటించేందుకు సిద్ధమయ్యాం. అయితే మేం ఒకసారి ఇక్కడికి రాగానే క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత మమ్మల్ని కూడా సాధారణ ఆ స్ట్రేలియా పౌరుల్లాగానే చూడాలి. ఐపీఎల్ నుంచి మేం బబుల్‌లోనే ఉంటున్నాం. ఇప్పుడు మళ్లీ కొత్తగా బ్రిస్బేన్‌లో మరో బబుల్ అంటే మా వల్ల కాదు. అవకాశం ఉంటే చివరి టెస్టు కూడా సిడ్నీలోనే నిర్వహించాలి. లేదంటే మేం చివరి టెస్టు నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడం’ అని భారత క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే చివరి టెస్టుకు మరికొంత సమయం ఉన్నందున ప్రస్తుతానికి టీమ్ మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉంది. మేం బ్రిస్బేన్‌లోనే ఆడతాం... ఒకే వేదికపై వరుసగా రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధంగా లేము. సిరీస్ ఆరంభానికి ముందు నిర్ణయించిన షెడ్యూల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కట్టుబడి ఉంది. మా వైపు నుంచి మాత్రం ఎలాంటి ఫిర్యాదు లేదు. మేం బ్రిస్బేన్‌లో ఆడేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. అక్కడ కఠినమైన ఆంక్షలు, బయో బబుల్ ఉండవచ్చు కూడా. అయితే అన్నింటినీ మేం పాటిస్తాం. హోటల్ నుంచి మైదానానికి మాత్రమే వెళ్లి వచ్చే అనుమతి ఉంటే తప్పేముంది. అలాగే చేద్దాం. –మాథ్యూ వేడ్ భారత క్రికెటర్లు నిబంధనల ప్రకారం ఆడలేమని, క్వారంటైన్ కట్టుబాట్లను పాటించలేమని భావిస్తే ఇక్కడికి రావద్దు. ఆంక్షలు అందరికీ వర్తిస్తాయి. –రాస్ బేట్స్, క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు (షాడో మినిస్టర్) అంతా కలిసి సిడ్నీకి... మూడో టెస్టు కోసం భారత జట్టు మొత్తం నేడు ప్రత్యేక విమానంలో సిడ్నీకి వెళుతుంది. బయో సెక్యూరిటీ బబుల్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ‘ఐసోలేషన్’లోకి వెళ్లిన ఐదుగురు ఆటగాళ్లు రోహిత్, పంత్, పృథ్వీ, గిల్, సైనీ కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా జట్టుతో పాటే ప్రయాణిస్తారు. హోటల్ ఘటనపై సీఏ విచారణ కొనసాగిస్తున్నా... సహచరులతో వెళ్లే విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ‘నాకు తెలిసి ఆటగాళ్లపై ఎలాంటి చర్యా ఉండదు. ఆ అభిమాని తనను పంత్ హత్తుకున్నాడని అబద్ధం చెప్పి ఉండకపోతే పరిస్థితి అసలు ఇంత దూరం వచ్చేదే కాదు. ఏదో బయట వర్షం పడుతుంటే క్రికెటర్లంతా లోపలికి వెళ్లారు. ఆటగాళ్ల అనుమతి లేకుండా అతను వీడియో తీశాడు. పైగా ఎవరూ అడగకపోయినా బిల్లు చెల్లించి ప్రచారం కోసం సోషల్ మీడియాలో పెట్టాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సదరు ఘటన విషయంలో టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీశ్ డోంగ్రీ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. తాము ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆటగాళ్లు ఒక జాబితా పట్టుకొని తిరగరు. ఇవన్నీ చూసుకోవాల్సింది మేనేజర్ మాత్రమే. ఈ విషయంలో అతను తప్పు చేసినట్లు అనిపిస్తోంది’ అని బోర్డు అధికారి వ్యాఖ్యానించారు. -
కుటుంబ సభ్యులకు అనుమతి
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో క్రికెటర్ల వెంట వారి కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం తెలిపింది. రెండున్నర నెలల పాటు సాగనున్న ఈ పర్యటనలో కుటుం బ సభ్యుల్ని కూడా అనుమతించాలని సీనియర్ క్రికెటర్లు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. కఠిన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో తొలుత బీసీసీఐ ఈ అంశాన్ని వ్యతిరేకించింది. ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న భారత క్రికెటర్లు ఫైనల్ ముగియగానే నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఇప్పటికే నెలకు పైగా కుటుంబాలకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా లాంటి కొందరు సీనియర్ క్రికెటర్లు... ఆసీస్ పర్యటన ముగించుకొని తిరిగి భారత్ వచ్చేసరికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనుంది. దీంతో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. నవంబర్ 27 నుంచి జనవరి 19 వరకు ఆస్ట్రేలియాతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు ఆడనుంది. -
మహిళా క్రికెటర్లకు పిలుపు!
న్యూఢిల్లీ: మహిళల టి20 చాలెంజ్ సిరీస్ కోసం భారత మహిళా క్రికెటర్లను ఈనెల 13న ముంబైకి రావాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. మొత్తం 30 మంది క్రికెటర్లకు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ‘క్రికెటర్లకు సమాచారమిచ్చాం. వాట్సప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం. అండర్–19 ప్లేయర్లు కొందర్ని ఎంపిక చేశాం’ అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి చేరుకున్న ప్లేయర్లు వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. పలుమార్లు కోవిడ్–19 పరీక్షల అనంతరం అక్టోబర్ 22న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బయల్దేరి వెళ్లనున్నారు. మరో వారం రోజుల క్వారంటైన్ అనంతరం బయో బబుల్‌లో అడుగుపెడతారు. ఈ తతంగం అంతా ముగిసేసరికి ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్ లేకుండానే టోర్నీ బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ అంశంపైనే ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెటరన్ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం మూడు జట్లతో జరిగే నాలుగు మ్యాచ్‌ల ‘మహిళల టి20 చాలెంజర్ టోర్నీ’ షార్జా వేదికగా నవంబర్ 4 నుంచి 9 వరకు జరుగనుంది. -
ఐపీఎల్ క్వారంటైన్: బాల్కనీలో బాతాఖానీ!
దుబాయ్: గతంలో క్రికెట్ ఆడేందుకు ఎక్కడికెళ్లినా... ఓ పూట విశ్రాంతి తీసుకొని కాసేపు కసరత్తు చేసి ఎంచక్కా ఈతకొలనులో సేద తీరేవారు. అంతా కలిసి ఇష్టమైన రుచుల్ని ఆస్వాదించేవారు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేవారు. కానీ కరోనా కాలం కదా... అవన్నీ మారిపోయాయి. కలిసి తిరిగే పరిస్థితి కాదు కదా... కాలు బయటపెట్టే పరిస్థితి కూడా లేదాయే! ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్ వెళ్లిన క్రికెటర్లు అక్కడ హోటల్లో రాజస్తాన్, పంజాబ్ జట్లు ఆటగాళ్లు క్వారంటైన్ అయ్యారు. అవకాశం దొరికితే బయటకు వెళ్లే భారత ఆటగాళ్లకు ఇది పూర్తిగా కొత్త కావడంతో కొంత ఇబ్బందిగానే అనిపిస్తోంది. హోటల్ గదులకే పరిమితమైన ఆటగాళ్లు... అప్పుడప్పుడు మాత్రం బాల్కనీల్లో మాత్రమే ఒకరితో ఒకరు ముచ్చటించుకున్నారు. ఇక ఫిట్నెస్ ట్రెయినర్ చెప్పినట్లుగా గదుల్లో చేయదగిన చిన్నపాటి వర్కవుట్లు చేశారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం అబుదాబీలోని హోటల్లో బసచేసింది. (ఐపీఎల్ సందడి సందడి షురూ...) -
‘ఎక్కడ ఉన్నారో ఎందుకు చెప్పలేదు’
ముంబై: క్రికెటర్లు తమ డోపింగ్ పరీక్షల పరిధిలోకి వచ్చిన తర్వాత తొలిసారి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తమదైన శైలిలో కొరడా ఝళిపించింది. ఐదుగురు బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్లు నిబంధనల ప్రకారం తమ వివరాలు వెల్లడించడంలో విఫలమయ్యారని నోటీసులు జారీ చేసింది. టెస్టు స్పెషలిస్ట్ పుజారా, రవీంద్ర జడేజా, లోకేశ్ రాహుల్‌తో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, దీప్తి శర్మలకు నోటీసులు పంపించినట్లు ‘నాడా’ పేర్కొంది. దీనికి సాఫ్ట్వేర్ సమస్యలే కారణమంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇచ్చిన వివరణతో ‘నాడా’ సంతృప్తి చెందినట్లుగా కనిపించడం లేదు. పూర్తి వివరాలు ఇవ్వకుండా... సుదీర్ఘ కాలంగా ‘నాడా’ పరిధిలోకి రాకుండా తప్పించుకుంటూ వచ్చిన బీసీసీఐ కూడా కొన్నాళ్ల క్రితమే ప్రభుత్వ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో డోపింగ్ వ్యవస్థలో భాగమైంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేషనల్ రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఎన్‌ఆర్‌టీపీ)లో క్రికెటర్లతో సహా మొత్తం 110 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఏడాదిలో కనీసం ఎప్పుడైనా ‘నాడా’ కోరినప్పుడు ఆటగాళ్లు తమ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ‘ఏ సమయంలో ఎక్కడ ఉన్నారు’ అనేది కీలకమైంది. ఫలానా సమయంలో తాము ఫలానా చోట ఉన్నామంటూ ఆటగాళ్లు స్వయంగా యాంటీ డోపింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్స్ సిస్టమ్స్ (ఏడీఏఎంఎస్) ఫామ్‌లో వివరాలు భర్తీ చేయాలి. నిజానికి ఈ ‘ఎప్పుడు ఎక్కడ’ నిబంధనను తొలగించాలంటూనే సుదీర్ఘ కాలం బీసీసీఐ పోరాడింది. ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా చేయవచ్చు. అయితే పెద్దగా చదువుకోని ఆటగాళ్లు ఎవరైనా కొందరు ఉంటే ఇబ్బంది పడవచ్చు కాబట్టి వారి తరఫున ఆయా క్రీడా సమాఖ్యలు కూడా భర్తీ చేసే వెసులుబాటు ఉంది. ఈ బాధ్యతను సమాఖ్యలు తీసుకున్నాయి కూడా. అయితే ఈ ఐదుగురు ఆటగాళ్ల వివరాలు మాత్రం ‘నాడా’కు అందలేదు. ఇదేం వివరణ... సమాచారం అప్లోడ్ చేయకపోవడంపై బీసీసీఐ తమ వైపు నుంచి వివరణ పంపించింది. ఏడీఏఎంఎస్కు సంబంధించి పాస్వర్డ్ విషయంలో కొంత సమస్య రావడం వల్లే తాము వివరాలు వెల్లడించలేకపోయామని బోర్డు పేర్కొంది. అయితే ‘నాడా’ డీజీ నవీన్ అగర్వాల్ దీనిపై సంతృప్తి చెందలేదు. ఈవెంట్లు జరిగే సమయంలో సమస్య ఉండకపోవచ్చు కానీ లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా ఎలాంటి ఆటలు లేవు కాబట్టి ఈ సమస్యలో ‘ఎప్పుడు ఎక్కడ’ నిబంధన ఎంతో కీలకమని ఆయన అన్నారు. ‘బీసీసీఐ దీనికి కారణం ఏమిటో చెప్పింది. అయితే దీనిపై మేం చర్చిస్తాం. నిజంగా పొరపాటు జరిగిందా లేదంటే దీనిని తొలి వైఫల్యం కింద లెక్క కట్టాలా అనేది తర్వాత నిర్ణయిస్తాం’ అని ఆయన అన్నారు. మూడుసార్లు ఇదే తరహాలో వివరాలు ఇవ్వడంలో విఫలమైతే దానిని డోపింగ్గా భావించి రెండేళ్ల నిషేధం విధించేందుకు ‘నాడా’కు అధికారం ఉంది. ఆ మాత్రం చేయలేరా? తాజా అంశంపై పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి స్పందిస్తూ... చిన్న పాస్వర్డ్ సమస్యను పరిష్కరించునేందుకు ఇంత సమయం పడుతుందా అని ప్రశ్నించారు. ‘క్రికెటర్లంతా ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పైగా ఇన్స్టాగ్రామ్ చాట్లలో కూడా కనిపిస్తున్నారు. తమ వివరాలు ఇవ్వాలని ఈ ఐదుగురికి బీసీసీఐ చెబితే సరిపోయేది కదా. పైగా అందరికీ సొంత మేనేజర్లు కూడా ఉన్నారు. వారు చేయలేరా? ఈ సారికి క్షమిస్తే సరి. ‘నాడా’ అధికారికంగా హెచ్చరిక జారీ చేస్తే ఎవరు బాధ్యులు’ అని ఆయన ప్రశ్నించారు. -
మన క్రికెటర్లు అవగాహనాపరులు
న్యూఢిల్లీ: బెట్టింగ్ ముఠాల కార్యకలాపాలు, బుకీల సంప్రదింపులపై భారత క్రికెటర్లు జాగరూకతతో వ్యవహరిస్తారని బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ (ఏసీయూ) చీఫ్ అజిత్ సింగ్ అన్నారు. ఈ అంశంపై వారికి తగినంత అవగాహన ఉందని పేర్కొన్నారు. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే తమకు రిపోర్ట్ చేస్తారని చెప్పారు. ‘సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ ద్వారా బుకీలు ఎలా సంప్రదింపులు జరుపుతారనే అంశంపై మన క్రికెటర్లకు పూర్తిగా అవగాహన కల్పించాం. వారికి నేరం జరిగే తీరుపై అవగాహన ఉంది. ఎవరైనా తమను సంప్రదించినప్పుడు వారు వెంటనే మా దృష్టికి తీసుకువస్తారు. మా ఏసీయూ టీమ్ ఎప్పటికప్పుడు ఆటగాళ్ల సోషల్ మీడి యా అకౌంట్లపై, ఆన్లైన్ కాంటాక్ట్‌లపై కన్నేసి ఉంచుతుంది. ఫేక్ ఐడీలతో అభిమానులుగా చెలామణి అయ్యేవారి నిజస్వరూపం ఏదో ఒక సమయంలో బయటపడుతుంది’ అని అజిత్ వివరించారు. -
మ...మ... మాస్క్... టీమిండియా ఫోర్స్!
ఇప్పుడు కరోనా చైన్‌ను తెంచే పనిలో మాస్క్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. భారత్‌లోనూ వేలల్లో వైరస్ బారిన పడుతున్న తరుణంలో బీసీసీఐ భారత క్రికెటర్ల ద్వారా మాస్క్‌లు ధరించేలా ప్రోత్సహిస్తోంది. స్టార్ క్రికెటర్లు కోహ్లి, సచిన్, స్మృతి మంధాన, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదితరులతో రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. బయటికి వెళ్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే స్పృహ కల్పించేలా ‘టీమ్ మాస్క్ ఫోర్స్’ పేరిట ఈ వీడియో సందేశం ఉంది. ‘మాతో చేతులు కలపండి. కరోనాపై పోరాడండి. ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. సురక్షితంగా ఉండండి’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. -
కౌంటీలకు భారత క్రికెటర్లు
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ఏడుగురు టెస్టు క్రికెటర్లు ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడనున్నారు. చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, పృథ్వీ షా, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మలు విండీస్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సిరీస్‌కు ముందు కౌంటీ క్రికెట్ ఆడతారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. వీరిలో పుజారాకు ఇప్పటికే యార్క్‌షైర్‌తో మూడేళ్ల ఒప్పందం ఉంది. దీంతో అతను ఆ జట్టుతో కొనసాగుతాడు. త్వరలో బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) నుంచి ఆమోదం రాగానే రహానే హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయి. ప్రపంచకప్ ముగిశాక జూలై, ఆగస్టులో టెస్టు చాంపియన్‌షిప్ సిరీస్ జరుగుతుంది. అందుకోసం భారత ఆటగాళ్లకు విదేశీ గడ్డపై మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించాలని బోర్డు భావించింది. దీంతో లెస్టర్‌షైర్, ఎస్సెక్స్, నాటింగ్‌హమ్‌షైర్‌లతో బీసీసీఐ సంప్రదింపులు జరిపింది. మూడు, నాలుగు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిస్తే టెస్టు క్రికెటర్లకు మేలు జరుగుతుందని బోర్డు భావించిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గతేడాది ఇంగ్లండ్‌లో భారత పర్యటనకు ముందే అక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లీ సర్రేతో కౌంటీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ గాయం కారణంగా కోహ్లి కౌంటీలు ఆడలేకపోయాడు. -
ఆ ముగ్గురి చలవే..!
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లకు ఇప్పుడు లభిస్తున్న డబ్బు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2001–02లో పరిస్థితి ఇలా లేదని, ముగ్గురు దిగ్గజ క్రికెటర్ల పోరాటం వల్లే అది సాధ్యమైందని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అప్పట్లో అధికారికంగా ప్లేయర్స్ అసోసియేషన్ లేకపోయినా... సచిన్, ద్రవిడ్, కుంబ్లే బోర్డు ఆదాయంలో ఆటగాళ్లకు వాటా ఉండాలంటూ పోరాడారని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ‘దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఆదాయంనుంచి మా వాటా తీసుకునేందుకు బీసీసీఐతో పోరాడాల్సి వచ్చింది. నాడు సచిన్, ద్రవిడ్, కుంబ్లే మా హక్కుల కోసం నిలదీయకుండా ఉంటే ఈ రోజు పరిస్థితి భిన్నంగా ఉండేదేమో.ఇంత చేసినా అప్పట్లో ఆటగాళ్ల మధ్య విభేదాలు గానీ తిరుగుబాటు గానీ రాలేదనే విషయం కూడా మరచిపోవద్దు’ అని వీరూ గుర్తు చేసుకున్నాడు. -
మమ్మల్ని మన్నించండి!
న్యూఢిల్లీ: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తమకు కొత్తగా జారీ చేసిన రెండో షోకాజ్ నోటీసులకు బదులిస్తూ తమను మన్నించాలని వీరిద్దరు విజ్ఞప్తి చేశారు. అయితే సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ ఆదేశాలను అనుసరించి బోర్డు నిబంధన 41 (సి) ప్రకారం వీరిద్దరిపై సీఈఓ రాహుల్ జోహ్రి విచారణ కొనసాగిస్తారు. అయితే ఇటీవలే అమ్మాయిలను వేధించిన ఆరోపణలు ఎదుర్కొన్న జోహ్రితోనే విచారణ జరిపించడంపై సీఓఏ మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే విచారణ ‘కంటితుడుపు’గానే భావించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. దీనిపై వినోద్ రాయ్ వివరణ ఇస్తూ...ఎడుల్జీకి లేఖ రాశారు. ‘పాండ్యా, రాహుల్‌ను సరిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి కెరీర్‌ను నాశనం చేయాలనుకోవడం లేదు. బోర్డు నియమావళి ప్రకారమే సీఈఓ విచారణ చేస్తున్నారు తప్ప అది కంటితుడుపు కాదు’ అని రాయ్ స్పష్టం చేశారు. -
పాండ్యా, రాహుల్‌లపై చర్యలు!
న్యూఢిల్లీ: టీవీ షోలో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కె.ఎల్.రాహుల్‌లపై రెండు వన్డేల నిషేధం విధించే అవకాశాలున్నాయి. వీరిద్దరి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిపాలక కమిటీ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ 2 మ్యాచ్‌ల నిషేధం విధించాలని బీసీసీఐకి సిఫారసు చేశారు. అయితే మరో సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం వివాదాన్ని బీసీసీఐ లీగల్ సెల్ పరిశీలించాలని సూచించారు. ‘వారి మాటలు ఆమోదయోగ్యం కాదు. క్షమాపణలు కోరుతూ పాండ్యా ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి చెందడం లేదు. దీనిపై శిక్ష తీసుకోవాలని నేను, ఎడుల్జీ గట్టిగా భావిస్తున్నాం. వారిద్దరిపై చర్యలు తీసుకునే విషయంలో ఆమె ఇప్పటికే బోర్డు లీగల్ సెల్‌ను సంప్రదించింది’ అని రాయ్ పేర్కొన్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో పాండ్యా, రాహుల్ ఇద్దరు అశ్లీల రీతిలో మహిళల్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు పెను విమర్శలకు దారితీశాయి. ఇదిలావుండగా... ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్ ఈ శనివారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హార్ధిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్ బరిలోకి దిగే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఫిక్సింగ్‌కు దారి తీయవచ్చు! పాండ్యా తరహాలో నోరు అదుపులో పెట్టుకోకుండా ప్రవర్తించేవారిని మ్యాచ్ ఫిక్సర్లు సునాయాసంగా తమ వలలో వేసుకోగలరని బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌదరి అభిప్రాయ పడ్డారు. అమ్మాయిలను ఎరగా చూపించే ‘హనీ ట్రాప్’లో ఇరుక్కుపోతారని ఆయన అన్నారు. పాండ్యా, రాహుల్‌లపై వెంటనే నిషేధం విధించాలని కోరిన అనిరుధ్ అసలు వారిని టీవీ కార్యక్రమానికి ఎవరు అనుమతించారని ప్రశ్నించారు. ‘బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న ఈ ఆటగాళ్లు టీవీ షోకు హాజరయ్యేందుకు అనుమతి తీసుకోనవసరం లేదా. వారు తీసుకుంటే ఎవరు అనుమతి ఇచ్చారు. అనేక సందర్భాల్లో క్రీడా పాత్రికేయులకే ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఆటగాళ్లను దూరం పెడుతుంటారు. అలాంటిది ఒక ఎంటర్టైన్మెంట్ షోకు ఎలా వెళ్లనిచ్చారు’ అని చౌదరి ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు నలుగురు సభ్యుల బీసీసీఐ అంతర్గత ఫిర్యాదుల కమిటీ హెడ్‌గా రాజలక్ష్మి అరోరాను నియమించారు. లైంగిక వేధింపులకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై ఈ కమిటీ విచారిస్తుంది. -
చెట్టాపట్టాలిక చాలు!
ముంబై: భారత క్రికెటర్లలో కొందరు తమ సతీమణులతో, ఇంకొందరు ప్రియసఖులతో ఇంగ్లండ్ వీధుల్లో విహరిస్తున్నారు. అయితే దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావించింది. మూడో టెస్టు దాకా తమ ‘బెటర్‌హాఫ్’లకు సెలవియ్యాలని క్రికెటర్లకు టీమ్ మేనేజ్మెంట్తో చెప్పించింది. ప్రస్తుత ఇంగ్లిష్ టూర్లో టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయింది. టెస్టు సిరీస్ కూడా కోల్పోతే విమర్శలు వెల్లువెత్తుతాయని భావించిన బీసీసీఐ గత అనుభవాల దృష్ట్యా తాజా ప్రణయ విహారాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. విదేశీ పర్యటనల్లో సిరీస్‌లు ఓడిపోతే అభిమానులు, విమర్శకులు ముందుగా దుమ్మెత్తిపోసేది వారి భాగస్వాములపైనే! గత వన్డే ప్రపంచకప్ సమయంలో కోహ్లి విఫలమవగానే అనుష్కే లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. సామాజిక సైట్లలో కొందరైతే ‘అనుష్క... మా కోహ్లిని విడిచిపెట్టు... అపుడే అతను పాత కోహ్లిలా ఆడతాడు’ అని తీవ్ర స్థాయిలో పోస్ట్‌లు పెట్టారు. ఈసారి బోర్డు ముందు జాగ్రత్తగా కనీసం మూడో టెస్ట్ వరకైనా ఆటగాళ్లు తమ భార్య, ఇష్టసఖులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అభిషేక్ స్థానంలో అక్షయ్... దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ఇండియా ‘రెడ్’ జట్టు సభ్యుడు అభిషేక్ గుప్తాపై 8 నెలల నిషేధం కొనసాగుతుండటంతో... అతని స్థానంలో అక్షయ్ వాడ్కర్‌ను తీసుకున్నారు. దులీప్ ట్రోఫీ కోసం సోమ వారం జట్లను ప్రకటించిన సెలక్టర్లు డోపింగ్‌లో పట్టుబడి నిషేధం ఎదుర్కొంటున్న అభిషేక్‌ను ఇండియా ‘రెడ్’ జట్టుకు ఎంపిక చేశారు. ఈ అంశంపై విమర్శలు రావడంతో తప్పు సరిచేసుకున్నారు. -
భారత క్రికెటర్ల జీతాలు భారీగా పెంపు!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా క్రికెటర్ల పంట పండనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే ఆటగాళ్లకు శుభవార్త తెలపనుంది. బీసీసీఐ బోర్డు పరిధిలో ఆడుతున్న వారందరి జీతాలు భారీగా పెరగనున్నాయి. భారత పురుషుల, మహిళల జట్టుతో పాటు దేశవాళి, అండర్-19 క్రికెటర్ల జీతాలు పెరగనున్నాయని బీసీసీఐ అధికారి ఒకరు ఓ జాతీయ చానెల్‌కు తెలిపారు. దీనికి సంబందించిన ప్రక్రియ దాదాపు పూర్తైందని.. సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆ అధికారి వెల్లడించారు. ఇక భారత పురుషుల జట్టు శ్రీలంక పర్యటనకు ముందే సుమారు 25 మంది క్రికెటర్లను ఏ,బీ, సీ మూడు కేటగిరీలుగా విభజించి వార్షిక కాంట్రాక్టులు అమలు చేయనున్నారు. జీతాల పెంపునకు ఆర్థిక కమిటీ ఆమోదం తెలుపడమే తరువాయి ఐపీఎల్ కన్నా ముందే ఆటగాళ్లకు కాంట్రాక్టులను ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఏడాదికి గ్రేడ్-ఏ క్రికెటర్లకు దాదాపుగా రూ.12కోట్లు, బి-గ్రేడ్ రూ.8 కోట్లు, సీ-గ్రేడ్ నాలుగు కోట్లు ఇవ్వనున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆటగాళ్లకు ఏ స్థాయి గ్రేడ్ ఇవ్వాలనేదాన్ని నిర్ణయిస్తుంది. ఆటగాళ్ల జీతాలు పెంచాలని గతంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, కోచ్ రవిశాస్త్రిలు బీసీసీఐ,పాలకుల కమిటీతో చర్చించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రేడ్ ఏ ఆటగాళ్లు రూ.2 కోట్లు, గ్రేడ్ బీ రూ.1 కోటి, గ్రేడ్ సీ ఆటగాళ్లకు రూ.50 లక్షల వార్షిక వేతనం పొందుతున్నారు. -
మహేంద్రుడి ప్రస్థానానికి 13 ఏళ్లు..!
టీ20 ప్రపంచకప్.. వన్డేప్రపంచకప్.. చాంపియన్స్ ట్రోఫి..అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.. టెస్టులు.. వన్డేలు..టీ20ల్లో కలిపి అత్యధికంగా 331 మ్యాచ్‌ల్లో జట్టుకు నేతృత్వం వహించిన ఏకైక నాయకుడు. అర్జునుడి రథానికి కృష్ణుడిలా.. అతిరథ మహారథుల బృందానికి నాయకుడిగా విజయాలందించిన మహేంద్రుడి ప్రస్థానానికి నేటికి సరిగ్గా 13 ఏళ్లు.. ఈ సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.! మారుమూల చిన్న పట్టణం.. దిగువ మధ్యతరగతి కుటుంబం.. కావల్సినంత ప్రతిభ.. అవకాశాలు పరిమితం.. కష్టాలు.. అపరిమితం.. కుటుంబ బాధ్యతలు.. తండ్రి పడుతున్న కష్టాలు.. క్రికెట్ కెరీర్ కొనసాగించాలా.. ఉద్యోగంలో కొనసాగాలా.. ఇలాంటి పరిస్థితి నుంచి భారతీయ క్రికెట్లో తారజువ్వలా దూసుకొచ్చాడు.. రాంచీ ఆటగాడు..! 13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు (డిసెంబర్ 23, 2004) బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. చిట్టగాంగ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో.. మైదానంలోకి దిగాడు ధోని.. ఎదుర్కొన్న తొలి బంతికే అవతల ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌తో సమన్వయ లోపం వల్ల రనౌట్‌గా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. తరువాతి మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 23 పరుగులే చేశాడు. అనంతరం తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని వైజాగ్‌లో పాకిస్థాన్‌పై తొలి సెంచరీ సాధించాడు. ఆనాటి నుంచి నేటి వరకు ధోనికి తిరుగులేదు. ఎన్ని విమర్శలొచ్చిన నోటితో కాకుండా బ్యాట్‌తోనే బదులిచ్చాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. యువ ఆటగాళ్లకు అండగా ఉంటూ.. పెదన్నలా వ్యవహిరిస్తున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ కోహ్లి.. వైస్ కెప్టెన్ రోహిత్ అయినా.. క్లిష్ట పరిస్థితిల్లో కెప్టెన్సీ వహించేది ధోనినే అని అందరికి తెలిసిన విషయమే. ♦ కెప్టెన్‌గా ధోని.. తొలి టీ20 ప్రపంచకప్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆరంభించిన ధోని.. సారథిగా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని సారథ్యంలో భారత్ 2007లో టీ20 ప్రపంచకప్, 2010 ఆసియా కప్, 2011 వన్డే ప్రపంచకప్.. 2013 ఛాంపియన్స్ ట్రోఫి.. 2016 ఆసియా కప్‌లు గెలుచుకుంది. టీమిండియాకు ఎన్నో ఘనతలు అందించడం సారథిగా ఎన్నో రికార్డులు నెలకొల్పడంలో ధోనిది భిన్నమైన శైలి. చివరికి విడ్కోలు పలకడంలోనూ అతని దారే వేరు. 2014లో ఊహించని విధంగా టెస్టులకు వీడ్కోలు చెప్పిన ధోని.. ఈ ఏడాది చడీచప్పుడు కాకుండా వన్డే, టీ20 జట్టు సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన తొలి భారతీయ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని. అత్యధిక వన్డేలకు కెప్టెన్సీ చేసిన వారిలో ఆస్ట్రేలియా ఆటగాడు పాంటింగ్(230), న్యూజిలాండ్ ఫేమింగ్ (218)ల తర్వాతి స్థానం ధోని(199)దే. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా ధోని(331)నిలిచాడు. కెప్టెన్‌గా అత్యధిక టీ20(72)లు ఆడిన .. అత్యధిక టీ20లు (41) గెలిచిన ఆటగాడు కూడా ధోనినే. 2009లో ధోని నాయకత్వంలో తొలిసారిగా భారత్ టెస్టుల్లో నెం.1 గా నిలిచింది. ♦ వికెట్ కీపర్‌గా .. మహేంద్ర సింగ్ ధోని కీపర్‌గా ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. అతను వికెట్ల వెనుక ఉంటే ఏ బ్యాట్స్‌మెన్ క్రీజు దాటాలన్నా ఓసారి ఆలోచించాల్సిందే. 90 టెస్టులాడిన ధోని కీపర్‌గా 256 అవుట్లలో పాలుపంచుకొని ఈ ఫార్మట్‌లో ఐదో కీపర్‌గా గుర్తింపు పొందాడు. ఇందులో 256 క్యాచ్‌లు ఉండగా 38 స్టంప్ అవుట్లున్నాయి. ఇక వన్డేల్లోనైతే ఏకంగా 294 అవుట్లలో 105 స్టంపింగ్స్ ఉండటం విశేషం. దీంతో అత్యధిక స్టంప్ అవుట్లు చేసిన తొలి కీపర్‌గా రికార్డుకెక్కాడు. ఇక టీ20 ల్లో 47 అవుట్లలో 29 స్టంపింగ్లున్నాయి. ♦ ధోని పరుగులు.. 90 టెస్టుల్లో 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలతో 4,876 పరుగులు చేశాడు. 312 వన్డేల్లో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలతో 9,898 పరుగులు చేసి 10 వేల క్లబ్లో చేరడానికి 102 పరుగుల దూరంలో ఉన్నాడు. 85 టీ20ల్లో 1 హాఫ్ సెంచరీతో 1,348 పరుగులు చేశాడు. రనౌట్‌తో ధోని అరంగ్రేటం! -
సరదా... సరదాగా...
ఆంటిగ్వా: విండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లు మూడో వన్డే కోసం సిద్ధమవుతున్నారు. ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టిన ఆటగాళ్లు బుధవారం కాసేపు జిమ్‌లో కసరత్తులు చేస్తూ సరదాగా గడిపారు. ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, యువరాజ్, భువనేశ్వర్, కేదార్ జాదవ్ జిమ్ సెషన్లో పాల్గొన్నారు. వీరంతా కలిసి కసరత్తులు చేస్తున్న వీడియోను శిఖర్ ధావన్ ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పంచుకున్నాడు. ట్రైనింగ్ ఎల్లప్పుడూ ఉల్లాసంగా సరదాగా సాగుతుంది అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ఈ వీడియోలో ధావన్ డంబెల్స్‌తో సాధన చేస్తుండగా... కోహ్లి ఫిట్నెస్ ట్రైనర్ శంకర్ బసు దగ్గర సలహాలు తీసుకుంటూ కనిపించాడు. పాండ్యా కూడా ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. శుక్రవారం భారత్, విండీస్ జట్ల మధ్య మూడో వన్డే జరుగనుంది. -
యువీ చిందేశాడు.. క్రికెటర్ల సంబరాలు
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు, మాజీలు హోలీ పండుగ సందర్భంగా సందడి చేశారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. హోలీ రోజున జంతువులపై రంగులు పూయవద్దని అభిమానులను కోరాడు. వెటరన్ హర్భజన్ సింగ్.. తన భార్య గీతా బస్రాతో కలసి హోలీ చేసుకున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇక యువరాజ్ సింగ్ హోలీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను అప్లోడ్ చేశాడు. హోలీ రంగులు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, సంపద, శాంతి కలిగించాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాంక్షించాడు. అజింక్యా రహానె ఇతర ఆటగాళ్లు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. -
ఐపీఎల్ వేలంలో 'భారత్' వెలవెల..!
-
వేలంలో 'భారత్' వెలవెల..!
ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంపాటలో భారత క్రికెటర్లకు చేదు అనుభవమే ఎదురైంది. సోమవారం ఇప్పటివరకు జరిగిన వేలంపాటలో విదేశీ ఆటగాళ్లకు రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోగా.. భారత క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు మొగ్గు చూపలేదు. భారత్ స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మను సైతం కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు. అతని కనీస ధర రూ. 2 కోట్లు కావడంతో కొనుగోలుకు ఫ్రాంచైజీలు వెనుకడుగువేశాయి. ఇక మరో భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. అతని కనీస ధర రూ.50 లక్షలైనా ఫ్రాంచైజీలు ముందుకురాకపోవడం గమనార్హం. అదేవిధంగా భారత క్రికెటర్లు అయిన ప్రజ్ఞాన్ ఓజా, ఉన్ముక్త్ చంద్, పృథ్వీషా తదితరులకు కూడా చేదు అనుభవమే మిగిలింది. ఆయా క్రికెటర్లను కొనేందుకు ఇప్పటివరకు ఫ్రాంచేజీ యాజమాన్యాలు నిరాకరించాయి. ఇక పలువురు విదేశీ స్టార్ క్రికెటర్లకు కూడా ఈసారి వేలంలో నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ క్రికెటర్లు రాస్ టేలర్, మార్టిన్ గఫ్తిల్, ఇంగ్లండ్ ఆటగాళ్లు జాసన్ రాయ్ కు ఆశాభంగం తప్పలేదు. బ్రాడ్ హాగ్ (ఆస్ట్రేలియా), ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), ఆండ్రూ ఫ్లెచర్ (వెస్టిండీస్)లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచేజీలు ఆసక్తి చూపలేదు. -
అమ్మకు ప్రేమతో...
తల్లి పేరుతో బరిలోకి దిగిన భారత క్రికెటర్లు భారత క్రికెటర్లు అమ్మలకు అభిషేకం చేశారు. తమ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో నాన్నతో పాటు అమ్మకు కూడా అంతే భాగం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. టీమ్ స్పాన్సర్ స్టార్ ప్లస్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘నయీ సోంచ్’ అనే కార్యక్రమం కోసం శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో వారి పేర్లను ప్రదర్శించి తమ ప్రేమను, గౌరవాన్ని చాటారు. మన ఆటగాళ్లం తా తల్లి పేరు రాసి ఉన్న జెర్సీలను ధరించి బరిలోకి దిగారు. ధోనికి బదులుగా దేవకి, కోహ్లికి బదులుగా సరోజ్, రోహిత్ జెర్సీపై పూర్ణిమ, బుమ్రా చొక్కాపై దల్జీత్... ఇలా పేర్లు కనిపించారుు. ఇలా క్రికెటర్లు తమ పేరు కాకుండా మరో పేరుతో మైదానంలో ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం. స్టార్ ప్లస్, బీసీసీఐ కలిసి ఈ ‘కొత్త ఆలోచన’ను అమల్లోకి తీసుకు వచ్చారుు. కొన్నాళ్లుగా దీని గురించి టీవీలో ప్రముఖంగా ప్రచారం చేయగా, ఇప్పు డు మ్యాచ్‌ను కూడా అదే డ్రెస్‌తో ఆడారు. -
నష్టాల దెబ్బకు.. నైక్ విలవిల
దేశంలో 30% స్టోర్ల మూసివేత * భాగస్వాముల సంఖ్య కూడా కుదింపు * బ్యాట్స్ స్పాన్సర్‌షిప్‌పై పునరాలోచన ప్రపంచ దిగ్గజ స్పోర్ట్స్వియర్ తయారీ కంపెనీ ‘నైక్’ తాజాగా భారత్‌లో దాదాపు 35 శాతం స్టోర్లను మూసివేసింది. నష్ట నివారణలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనికి దేశంలో 200 స్టోర్లు ఉన్నాయి. ఈ అంశాల గురించి నైక్ ఇండియా ప్రతినిధిని సంప్రదిస్తే.. అయన ఎలాంటి సమాధానమివ్వలేదు. నైక్ కంపెనీ దేశంలో తన భాగస్వాముల సంఖ్యను కూడా తగ్గించుకుంటునట్లు తెలుస్తోంది. తన కార్యకలాపాలను 3-4 భాగస్వాముల ద్వారా నిర్వహించే అవకాశముంది. కాగా కంపెనీకి ఇది వరకు 20 వరకూ భాగస్వాములు ఉన్నారు. నైక్‌కు ఎస్‌ఎస్‌ఐపీఎల్ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. దీని తర్వాతి స్థానంలో ఆర్జే కార్ప్ ఉంది. ఈ మధ్యకాలంలో చాలా నైక్ స్టోర్లు మల్టీబ్రాండెడ్ ఔట్లెట్స్గా మారాయి. రూ.541 కోట్ల నష్టాలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ గణాంకాల ప్రకారం.. 2014-15లో నైక్ మొత్తం నష్టాలు రూ.541 కోట్లుగా నమోదయ్యాయి. కాగా నైక్ ప్రత్యర్థులైన అడిడస్ నష్టాలు రూ.68 కోట్లుగా, రీబాక్ నష్టాలు రూ.2,198 కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్ 2015తో ముగిసిన ఏడాదిలో ప్యూమ లాభాలు రూ.47 కోట్లుగా నమోదయ్యాయి. బ్యాట్స్ స్పాన్సర్షిప్ ఉంటుందా? ఇండియన్ క్రికెటర్లకి బ్యాట్స్ని స్పాన్సర్షిప్ చేసే వ్యూహాన్ని నైక్ పునఃసమీక్షించుకుంటోంది. నైక్ సంస్థ అజింక్య రహానే, అశ్విన్, రవీంద్ర జడేజా, పార్థివ్ పటేల్ వంటి పలు క్రికెటర్లకు కిట్స్, బ్యాట్స్‌ను అందించడానికి ఏడాదికి రూ.60 కోట్ల వరకూ వెచ్చిస్తోంది. ఒక కంపెనీ ఎక్కడైనా క్రికెటర్‌కు బ్యాట్‌ను స్పాన్సర్ చేయాలంటే రూ.25 లక్షల నుంచి రూ.8 కోట్ల వరకూ ఖర్చవుతుంది. కోహ్లి.. బ్యాట్ స్పాన్సర్షిప్ రూ.8 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. సరైన మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవడం వల్ల నైక్‌కు నష్టాలు పెరిగాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే కంపెనీ రిటై ల్ మార్కెట్ విస్తరణ ప్రణాళికలు కూడా సరిగ్గా లేవని పేర్కొన్నారు. దీంతో చాలా స్టోర్లు మూతపడ్డాయని తెలిపారు. -
ఇక్కడ వీరబాదుడు.. అక్కడ నీరసం!
ఐపీఎల్ అంటే చాలు.. మన క్రికెటర్లకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఎలా ఆడినా, ఐపీఎల్లో మాత్రం విజృంభించేస్తారు. ఈ విషయం పదే పదే చాలాసార్లు రుజువు అవుతూనే ఉంది. నిన్న కాక మొన్న జరిగిన ఆసియా కప్ టి20 మ్యాచ్‌లలో ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఎంత అందంగా ఆడారో అందరికీ తెలుసు. ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే తనకు అచ్చొచ్చిన మైదానాల్లో కూడా ఏమాత్రం మంచి ప్రదర్శనలు చూపించలేదు. కానీ బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మాత్రం మెరుపులు మెరిపించాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో ఏకంగా 84 పరుగులు చేశాడు. మరి టి20 ప్రపంచకప్‌లో మాత్రం అతడు చేసిన మొత్తం పరుగులు కేవలం 88. అది కూడా చిట్టచివరి మ్యాచ్, సెమీఫైనల్లో 43 పరుగులు చేయడం వల్ల ఆ మాత్రం కనిపించింది. అంతకుముందు లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో వరుసగా అతడి స్కోర్లు చూస్తే నీరసం రాక తప్పదు. మొట్టమొట న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5, తర్వాత పాకిస్థాన్ మీద 10, కీలకమైన బంగ్లా మ్యాచ్‌లో 18, ఆ తర్వాత ఆస్ట్రేలియా మీద కేవలం 12 పరుగులు.. ఇవీ రోహిత్ స్కోర్లు. ఆ సీజన్ ముగిసి కూడా ఎన్నాళ్లో కాలేదు. కానీ ఐపీఎల్ రాగానే ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం వచ్చిందో ఏమో గానీ.. ఏకంగా 84 పరుగులు సాధించాడు! ఐపీఎల్లో సరిగా ఆడకపోతే తర్వాతి సీజన్‌కు తమకు వేలంలో తగినంతగా డబ్బులు రావన్న భయమో.. కెప్టెన్‌గా ఉండి కూడా ఆడకపోతే తర్వాత జట్టులోనే స్థానం కోల్పోవాల్సి వస్తుందనో ఆడి ఉండొచ్చని క్రికెట్ అభిమానులు అంటున్నారు. నిజానికి ఎవరైనా దేశానికి ప్రాతినిధ్యం వహించేటపుడు మరింత ఉత్సాహంగా ముందుకెళ్తారు. కానీ టీమిండియా క్రికెటర్లలో కొంతమంది మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అదే వెస్టిండీస్‌లో అంతగా పేరులేని బ్రెత్‌వైట్ లాంటి బ్యాట్స్‌మన్ కూడా చివరి ఓవర్లో నాలుగు బంతులకు నాలుగు సిక్సర్లు బాది ఫలితాన్ని తలకిందులు చేస్తున్నారు. ఇప్పటికైనా మనవాళ్లు డబ్బులే కాక.. దేశం గురించి కాస్తంత పట్టించుకుంటే అభిమానులు కూడా సంతోషిస్తారు. -
అసలైన 'టెస్టు'
యువ క్రికెటర్లతో కూడిన భారత జట్టు 22 ఏళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై సిరీస్ గెలిచి సంచలనం సృష్టించింది. దిగ్గజాలెందరికో సాధ్యం కాని ఘనతను ఈ యువ జట్టు అందుకుంది. అయితే ఆ విజయం కేవలం ‘వాపు’మాత్రమే. ఎందుకంటే ఆ సిరీస్‌లో ఆడిన శ్రీలంక జట్టు గత రెండు దశాబ్దాల్లోనే అత్యంత బలహీనంగా ఉన్న జట్టు. దక్షిణాఫ్రికాతో సిరీస్ శ్రీలంక తరహాలో సులభం కాదు. ఆడేది సొంతగడ్డ మీదే అయినా పటిష్టమైన జట్టుతో భారత్‌కు టెస్టు సిరీస్ అసలైన పరీక్ష. * కోహ్లి సేన ముందు కఠిన పరీక్ష * విదేశాల్లో నిలకడగా ఆడే దక్షిణాఫ్రికా * ఈసారి కూడా బలంగానే ప్రత్యర్థి సాక్షి క్రీడావిభాగం: సొంతగడ్డపై భారత్ ఎప్పుడూ బలమైన జట్టే. ప్రత్యర్థి ఎవరైనా... జట్టులో ఎవరున్నా... తరాలు మారినా... స్వదేశంలో భారత్‌ను ఓడించాలంటే ప్రత్యర్థులెవరికైనా కష్టమే. అయితే దక్షిణాఫ్రికా జట్టు మాత్రం 2000లోనే భారత్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో స్వీప్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటికి ఆ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసి ఎనిమిదేళ్లే అయింది. అయినా స్పిన్నర్లకు సహకరించే పిచ్‌లపై కూడా గెలవగలిగింది. సంప్రదాయబద్ధంగా భారత క్రికెటర్లు స్పిన్ బాగా ఆడతారు. సాధారణంగా ఇక్కడి పిచ్‌లు నెమ్మదిగా ఉంటాయి కాబట్టి... ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగి ప్రత్యర్థిని కట్టడి చేయాలనే వ్యూహంతోనే ప్రతిసారీ బరిలోకి దిగుతారు. గతంలో దక్షిణాఫ్రికా జట్టుకు ఒక బలహీనత ఉండేది. ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లలోకి స్పిన్ ఆడటంలో బాగా బలహీనం సఫారీలే. అందుకే ఆ జట్టు కోసం ప్రతిసారీ స్పిన్ పిచ్‌లు తయారు చేసేవారు. ఈసారి కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉండొచ్చు. పేస్, బౌన్స్‌తో కళకళలాడే మొహాలీ పిచ్ కూడా ఇప్పుడు స్పిన్నర్లకు అనుకూలించేలా ఉందనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈసారి కూడా భారత్ ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతోనే బరిలోకి దిగే అవకాశముంది. ఇప్పుడు మెరుగు కేవలం స్పిన్ అస్త్రంతో దక్షిణాఫ్రికాను భారత్ నియంత్రించగలదా అనేది కూడా సందేహమే. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు దక్షిణాఫ్రికా క్రికెటర్లు స్పిన్ ఆడటంలో బాగా మెరుగుపడ్డారు. కెప్టెన్ ఆమ్లాతో పాటు డు ప్లెసిస్, డికాక్, డుమిని స్పిన్ బౌలింగ్‌ను చీల్చిచెండాడగల సమర్థులు. వీరిని నియంత్రించాలంటే అత్యంత భయంకరమైన స్పిన్ ట్రాక్ వేయాలి. అయితే ఇలా చేసినా ప్రమాదం పొంచి ఉంది. ఒక గొప్ప స్పిన్నింగ్ ట్రాక్ ఎదురైతే... దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను ఎదుర్కోగల సత్తా భారత యువ క్రికెటర్లలో ఉందా అనేది అనుమానమే. ఇటీవల శ్రీలంకలోని గాలెలో జరిగిన టెస్టులో భారత్ 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 112 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. రంగన హెరాత్ బంతులకు భారత బ్యాట్స్‌మెన్ దగ్గర సమాధానం లేకపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైతే కష్టం. కాబట్టి భారత్ ఈ సిరీస్‌కు బాగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. మరోవైపు తుది జట్టులో స్పిన్నర్లు ఎవరనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం భారత్‌కు అత్యుత్తమ స్పిన్నర్ అశ్విన్. కానీ అతను గాయంతో ఉన్నాడు. తొలి టెస్టు సమయానికి కోలుకుంటే ఫర్వాలేదు. లేకపోతే అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా మిగిలిన ఇద్దరు స్పిన్నర్లు. ఈసారి జట్టు ఎంపిక సమయంలో కేవలం ముగ్గురు స్పిన్నర్లనే తీసుకున్నారు. అశ్విన్‌కు గాయం ఉందని తెలిసినా ఇలాగే ఎంపిక చేశారు. ఒకవేళ అశ్విన్‌కు గాయం తగ్గకపోతే ముగ్గురు స్పిన్నర్లతో ఆడాల్సిన పరిస్థితిలో ప్రత్యామ్నాయం ఏమిటనే ప్రశ్నకు సమాధానం లేదు. నిలకడే ఆయుధం దక్షిణాఫ్రికా జట్టులో ప్రస్తుతం ఉన్న క్రికెటర్లంతా నిలకడకు మారు పేరు. ఆమ్లా, డు ప్లెసిస్, డివిలియర్స్‌లతో పాటు బావుమా కూడా స్పిన్ బాగా ఆడతాడు. ఫ్లాట్ వికెట్ ఎదురైతే వీళ్లని ఆపడం మరింత కష్టం. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల మ్యాచ్‌లో సెంచరీతో డివిలియర్స్ ఫామ్‌ను కోల్పోలేదని అర్థమైంది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో అతను ఆడిన స్వీప్‌లు, రివర్స్ స్వీప్‌లు చూస్తే భారత స్పిన్నర్లకు రాబోయే నెల రోజులు కష్టకాలంలాగే కనిపిస్తోంది. ఇక బౌలింగ్‌లో కూడా పేస్‌నే నమ్ముకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టెయిన్ టెస్టుల్లో మరింత ప్రమాదకారి. భారత పిచ్‌లపై రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు. పేసర్లు స్టెయిన్, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్‌లతో పాటు తాహిర్ తుది జట్టులో ఉంటాడు. ఈసారి పర్యటనకు సఫారీలు కూడా భారీగానే స్పిన్నర్లను తీసుకొచ్చారు. డుమిని గాయం నుంచి కోలుకుంటే వారికి మంచి స్పిన్ ప్రత్యామ్నాయం ఉన్నట్లే. ఒకవేళ డుమిని కోలుకోకపోతే లెఫ్టార్మ్ స్పిన్ వేయగల ఆల్‌రౌండర్ ఎల్గర్ ఉన్నాడు. హార్మెర్, పిడెట్ల రూపంలో ఇద్దరు ఆఫ్‌స్పిన్నర్లు కూడా జట్టుతో పాటు ఉన్నారు. కాబట్టి దక్షిణాఫ్రికా అన్ని రంగాల్లోనూ పటిష్టంగానే కనిపిస్తోంది. ఈ జట్టుపై గెలవాలంటే కోహ్లి సేన అసాధారణంగా ఆడాలి. మన పరిస్థితి ఏమిటి? టెస్టు కెప్టెన్ కోహ్లి, డెరైక్టర్ రవిశాస్త్రి ఐదుగురు బౌలర్ల మంత్రాన్ని పఠిస్తున్నారు. ముగ్గురు స్పిన్నర్లు తుది జట్టులో ఉంటే ఇద్దరు పేసర్లు ఆడాలి. ఇషాంత్‌పై ఒక టెస్టు నిషేధం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఉమేశ్, ఆరోన్ ఇద్దరినీ తీసుకుంటారా? లేక ఆల్‌రౌండర్ అనే కారణం వల్ల స్టువర్ట్ బిన్నీని తెస్తారో చూడాలి. జడేజా తుది జట్టులో ఉండే అవకాశం ఉన్నందున... బిన్నీని ఆపి, ఇద్దరు సిసలైన పేసర్లను తీసుకునే అవకాశమే ఉంది. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ లైనప్‌ను భారత బ్యాట్స్‌మెన్ ఏ మేరకు ఒత్తిడిలో నెట్టగలరనేది కూడా ప్రశ్నార్థకమే. విజయ్, ధావన్ ఫిట్నెస్తోనే ఉన్నందున లోకేశ్ రాహుల్‌కు అవకాశం రాకపోవచ్చు. కోహ్లి, రహానే, రోహిత్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తుది జట్టులో ఉండటం ఖాయం. ఈ లెక్క ప్రకారం పుజారా మరోసారి బెంచ్‌కు పరిమితం కావాలి. ఇలా జట్టు కూర్పుపై స్పష్టత లేకపోవడం భారత్‌కు ప్రధాన సమస్య. ఏమైనా కచ్చితమైన ప్రణాళిక, సన్నద్ధత లేకపోతే మరోసారి దక్షిణాఫ్రికా చేతిలో పరాభవం తప్పదు. 11 ఇప్పటివరకూ భారత్, దక్షిణాఫ్రికాల మధ్య 11 టెస్టు సిరీస్‌లు జరిగాయి. ఇందులో ఆరు దక్షిణాఫ్రికా గెలిస్తే... భారత్ రెండు మాత్రమే నెగ్గింది. మిగిలిన మూడు సిరీస్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 5 ఈ రెండు దేశాల మధ్య భారత్‌లో ఐదు సిరీస్‌లు జరిగితే రెండింట భారత్, ఒక సిరీస్‌లో దక్షిణాఫ్రికా నెగ్గాయి. రెండు సిరీస్‌లు ‘డ్రా’గా ముగిశాయి. -
మన విజయాలపై పరాజయాలదే పైచేయి?
అవలోకనం: మనం ఏ విషయంలోనూ ప్రపంచస్థాయి నేతలం కాము. కాబట్టే క్రికెట్లో కూడా మనం ప్రపంచానికి నాయకత్వం వహించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. మనం ఎందుకింత చెత్తగా ఆడుతుంటాం అనే విషయాన్ని ఏమాత్రం ఆలోచించకుండానే కోట్లాది భారతీయులం క్రికెట్‌ను చూస్తూ ఆ క్రీడకు వందల కోట్ల రూపాయలను అప్పనంగా అందిస్తూ ఉంటాం. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రదర్శితమయ్యే భారతీయుల తీవ్ర జాతీయవాదం, ఉత్సాహం మన జట్టు వాస్తవ ఆటతీరులో ప్రతిఫలించకపోవడమే అసలైన విషాదం. మనకాలపు అతి గొప్ప రహస్యాలలో ఇదీ ఒకటి అయి ఉండాలి: భారతీయులు క్రికెట్లో ఎందుకు ఆధిపత్యం చలాయించడంలేదు? అంటే నా ఉద్దేశం అడపాదడపా విజయాలు సాధించలేదని కాదు. మనం అలాంటి విజయాలు పొందుతున్నాం. కాని ఒకప్పుడు వెస్టిండీస్.. తర్వాత ఆస్ట్రేలియా ఆధిపత్యం చలాయించినట్లుగా మనం ఎందుకు క్రికెట్‌పై శాశ్వతంగా ఆధిపత్యం చలాయించలేకపోతున్నాం అన్నదే ప్రశ్న. ఇంతవరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన క్రికెట్ బోర్డు భారత్‌దే. కాబట్టి మనకు తగిన వనరులు లేవన్నది ప్రశ్నే కాదు. క్రికెట్ లోని ప్రతి ఆర్థిక అంశంపైనా మనం ఎంతగా ఆధిపత్యం చలాయిస్తున్నామంటే, ఇతర దేశాల క్రికెట్ బోర్డులన్నీ ఇండియాకు వంత పాడే స్థాయికి దిగిపోయాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత లాభదాయకమైన ఈవెంట్‌గా మారింది. కానీ భారత పలుకుబడి దాని సరిహద్దులకే పరిమితం కాలేదు. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా మోటార్ సైకిళ్లనుంచి పాన్ మసాలా వరకు అమ్మకాలు సాగిస్తూ భారతీయ కంపెనీల ప్రకటనలే కనిపిస్తుం టాయి. అలాంటప్పుడు వాస్తవ క్రీడలో మనం ఎందుకు ఆధిపత్యం చలాయించ లేకపోతున్నాం? మనం గెలిచిన మ్యాచ్‌ల (124) కంటే మనం ఓడిపోయిన మ్యాచ్‌ల (157) సంఖ్యే ఎక్కువ. ఇది ఆశ్చర్యం గొలిపించదు. ఎందుకంటే మనం సొంత గడ్డపైనే బాగా ఆడతాం. మన స్లో వికెట్ పిచ్‌లపై రెండు సార్లు మనల్ని ఔట్ చే యడం ఇతర జట్లకు సాధ్యం కాదు. మరోవైపున మనం ఫాస్ట్ వికెట్ పిచ్‌లపై త్వరత్వరగా అవుట్ అయిపోతుంటాం. కాబట్టి అలాంటి చోట్ల గెలవడం కంటే ఓడిపోవడమే చాలా సులభంగా ఉంటుంది. అయితే ప్రపంచంలో క్రికెట్ ఆడే అన్ని దేశాలతోనూ మనకు పరాజయ రికార్డే ఎందుకుంది? ఆస్ట్రేలియాపై మనం 24 టెస్టుల్లో గెలుపొందగా, 40 సార్లు ఓడిపోయాం. ఇంగ్లండ్‌పై 21 సార్లు గెలిస్తే, 43 సార్లు ఓడిపోయాం. వెస్టిండీస్‌పై 16 సార్లు గెలిస్తే 30 సార్లు ఓడిపోయాం. చివరకు పాకిస్తాన్‌పై కూడా మనం 9 సార్లు గెలిస్తే, 12 సార్లు ఓడిపోయాం. (పాకిస్తాన్‌తో మనం ఎక్కువ మ్యాచ్‌లు ఆడనందుకు మనల్ని మనం అభినందించుకోవాలి. ఎందుకంటే బలమైన ఉద్వేగాలతో కూడిన ప్రస్తుత వాతావరణంలో పరాజయాన్ని మనం అసలు సహించలేం). గత రెండు దశాబ్దాలకు పైబడి మాత్రమే క్రికెట్ ఆడుతూ వస్తున్న దక్షిణాఫ్రికాపై కూడా మనం 7 విజయాలను నమోదు చేయగా 13 సార్లు ఓటమిపాలయ్యాం. మొత్తంమీద మనం విజయాల రికార్డును అధికంగా నమోదు చేసిన టీమ్‌లు రెండే రెండు. ఒకటి శ్రీలంక (మనకు 16 విజయాలు, 7 ఓటములు) రెండు న్యూజిలాండ్ (మనకు 18 విజయాలు, 10 ఓటములు). ఇక వన్డే ఇంటర్నేషనల్ పోటీల్లో కూడా విషయాలు ఇంతకంటే ఏమంత భిన్నంగా లేవు. ఈ రంగంలో మరిన్ని గణాంకాలను మీ ముందుంచి విసిగించను, నిస్పృహకు గురిచేయను. నిష్పక్షపాతంగా మనం ఈ సంఖ్యల కేసి చూసినట్లయితే అవి ఒక వింత విషయాన్ని మనకు తెలియబరుస్తాయి. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రదర్శితమయ్యే భారతీయుల తీవ్ర జాతీయవాదం, శ్రద్ధ, ఉత్సాహాలు మన జట్టు వాస్తవ ఆటతీరులో ప్రతిఫలించవు. బాలీవుడ్ భాషలో చెప్పాలంటే మనం షారుక్ ఖాన్ గురించి ఆలోచిస్తూ షాహిద్ కపూర్ క్రికెట్‌ను ఆస్వాదిస్తూంటాం. ఇక్కడ ప్రశ్న ఏదంటే, భారతీయులు నిజంగా ఆసక్తి ప్రదర్శిస్తున్న ఏకైక ఆటలో మనం ఎందుకు ఆధిపత్యం చలాయించలేకపోతున్నాం? మన జనాభా 120 కోట్లు. మనలో చాలామంది ఏ ఇతర క్రీడనూ తిలకించరు, ఆడరు. ఆస్ట్రేలియా జనాభా రెండున్నర కోట్లకంటే తక్కువ. కాని వారు క్రికెట్‌ను తమ ఏకైక క్రీడగా ఎన్నడూ భావించరు. క్రికెట్ ప్రపంచాన్ని మొత్తంగా కలిపినా భారత జనాభాలో సగానికంటే మించదు. కాబట్టి తగినంత టాలెంట్ లేకపోవడం అనేది ప్రశ్నే కాదు. ఐపీఎల్ విస్తరణలో ఉన్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి ఏమిటంటే టీమ్‌లను భ ర్తీ చేయడానికి స్థానిక టాలెంట్ తగినంతగా లేకపోవడమే. అందుకే కొంతమంది గుర్తింపు పొందిన స్థానిక ప్లేయర్లు అంత భారీ వేతనాలు తీసుకుంటున్నారు. ఇది అధిక డిమాండ్ కంటే సరఫరా కొరతనే సూచి స్తుంటుంది. కాని మనకున్న జనాభా సంఖ్యను చూసినట్లయితే, ఆస్ట్రేలియా జట్టు తరహా నాణ్యత కలిగిన 60 జట్లు మనకు ఉండాలి. కాని మనకు ఒక్కటంటే ఒక్క సరైన జట్టు లేదు. మన చరిత్రలోనే ఆస్ట్రేలియా జట్టు లాంటి ఒక్క జట్టును మనం చూడలేం. ఎందుకు? ఇది స్లో, ఫాస్ట్ పిచ్‌కు సంబంధించిన విషయం కాదు. అసలు విషయం అదే అయితే మనం ఫాస్ట్వికెట్లపై శిక్షణ ఎందుకు తీసుకోం? మన జట్లకు సరైన విధంగా శిక్షణ ఇవ్వడానికి మన వద్ద కోరినంత డబ్బు ఉంది కూడా. అయినా మనం అలాంటి శిక్షణ ఎందుకు ఇప్పించడం లేదు? బహుశా శిక్షణ లేకపోవడం, సామగ్రి, సౌకర్యాలు లేకపోవడం నిజమైన సమస్య కాకపోవచ్చు. మీలో చాలామంది ఆలోచిస్తున్నట్లే, దీనికి జవాబు మరోచోట ఉంటుందని నేననుకుంటున్నాను. బహుశా ప్రగాఢవాంఛ, నైపుణ్యంపై ఇది ఆధారపడి ఉండవచ్చు. మనం ఏ విషయంలోనూ ప్రపంచస్థాయి నేతలం కాము. కాబట్టే క్రికెట్లో కూడా మనం ప్రపంచానికి నాయకత్వం వహించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. వ్యక్తులుగా నైపుణ్యంపై మనం పెడుతున్న మదుపు చాలా తక్కువ. మైదానంలో ఉన్న మన క్రికెటర్లను... ఆస్ట్రేలియాతో, వెస్టిండీస్‌తో, ప్రత్యేకించి ప్రస్తుతం భారత్‌లో సందర్శిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లతో పోల్చి చూసినట్లయితే ఏదో తప్పు జరుగుతోందని, చాలా తేడాగా ఉందని మనకు తెలిసిపోతుంటుంది. ఒక పక్షం ఏమో (మన పక్షం కాదు) అథ్లెటిక్స్లాగా పని చేస్తుంటారు. భారత క్రికెటర్లు కాస్త ఉబ్బినట్లుగా, ఫిట్ కానట్లుగా కనిపిస్తుంటారు. కానీ వారు జాతీయ జట్టులోకి ప్రవేశిస్తుంటారు. అత్యంత నైపుణ్యం కంటే ‘ఫర్వాలేదు’ అనేదే మనకు చాలా ముఖ్యమైన లక్షణంగా కనబడుతుంటుంది. క్రికెట్లో మనం ఆధిపత్యం చలాయించలేకపోవడం అనేది మన కాలపు అతి పెద్ద మిస్టరీల్లో ఒకటై ఉండాలని నేను ఈ వ్యాసం మొదట్లోనే రాశాను. అయితే అది మాత్రమే కాదు. మనం ఎందుకింత చెత్తగా ఆడుతుంటాం అనే విషయాన్ని ఏమాత్రం ఆలోచించకుండానే కోట్లాది భారతీయులం క్రి కెట్‌ను చూస్తూ ఆ క్రీడకు వందల కోట్ల రూపాయలను అప్పనంగా అందిస్తూ ఉంటాం. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com) -
అంతా బుద్ధిగా ఉన్నారు!
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా భారత క్రికెటర్ల ప్రవర్తన అన్ని రకాలుగా బాగుందని, అసలు మేనేజ్మెంట్ వైపునుంచి కనీస హెచ్చరిక చేయాల్సిన అవసరం కూడా రాలేదని అర్షద్ అయూబ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అయూబ్ ఈ సిరీస్‌లో భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించారు. స్వస్థలం తిరిగొచ్చిన అనంతరం పర్యటన అనుభవాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. విశేషాలు అయూబ్ మాటల్లోనే... ఆట చాలా బాగుంది: ఏ టూర్లో అయినా ఫలితాలు అనుకూలంగా ఉంటేనే అంతా బాగున్నట్లు అనిపిస్తుంది. అలా చూస్తే మన జట్టు బాగా ఆడింది కాబట్టి మేనేజర్‌గా నాకు చాలా సంతృప్తి దక్కింది. కొన్ని సార్లు మనకే విజయావకాశాలు వచ్చాయి కూడా. ముఖ్యంగా ఆటగాళ్లు డ్రా కోసం కాకుండా దూకుడుగా, గెలవాలనే పట్టుదలతో ఆడటం గతంలో ఎన్నడూ చూడని పరిణామం. దీంతో పాటు మననుంచి మాటల ద్వారా ఇలాంటి ప్రతిఘటనను మాత్రం ఆసీస్ అస్సలు ఊహించలేదని మాకు అర్థమైంది. మరోవైపు ధోని ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించాక, మాతో ఉన్నా కూడా అసలెప్పుడు దానిపై ఏ రకంగానూ అతను మాట్లాడలేదు. ఆటగాళ్ల ప్రవర్తన: నేను మరో మూడు రోజుల్లో బీసీసీఐకి నా నివేదిక ఇస్తాను. అసలు మన క్రికెటర్లంతా సిరీస్ ఆసాంతం చాలా బుద్ధిగా ఉన్నారు. ఆటపై నిబద్ధతతో, అంకితభావంతో వారు వ్యవహరించారు. సరిగ్గా చెప్పాలంటే క్రమశిక్షణ పరంగా నాకు ఎలాంటి పని కల్పించలేదు. గత ఆసీస్ సిరీస్‌ల తరహాలో ఎలాంటి వివాదాలు కూడా చెలరేగలేదు. కాబట్టి నా నివేదికలో కూడా ఎలాంటి సంచలనాలు ఉండవు. కోహ్లి, ధావన్ గొడవ కూడా పచ్చి అబద్ధం. ఇక రెండు వారాల పాటు ఫ్యామిలీలను బోర్డు అనుమతించింది కాబట్టి కోహ్లి, అనుష్క వ్యవహారంపై కూడా చర్చ అనవసరం. హ్యూస్ మరణం: మేం ఆసీస్‌కు వెళ్లగానే జరిగిన ఆ ఘటనతో షాక్‌కు గురయ్యాం. అందరం కోలుకునేందుకు సమయం పట్టింది. అంత్యక్రియలకు నేనూ హాజరయ్యాను. హ్యూస్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం క్రికెట్‌ను అభిమానించేవారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలనుంచి రావడం చాలా ఆశ్చర్య పరిచింది. ఒక క్రికెటర్ అంత్యక్రియల్లో అంత పెద్ద సంఖ్యలో జనాన్ని ఎప్పుడూ చూడలేదు. మైదానం బయట..: ఆసీస్ ప్రధాని ఇచ్చిన విందు చాలా బాగా జరిగింది. మాతో ఆయన ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఆ సమయంలో క్రికెటేతర అంశాల గురించి కోహ్లి చేసిన ప్రసంగం ది బెస్ట్‌గా చెప్పవచ్చు. సిడ్నీ ఒపెరా హౌస్ సమీపంలోని ఒక హోటల్‌కు వెళ్లి జట్టు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంది. సహజంగానే ఆటగాళ్లంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయినా ఎక్కడా గీత దాటలేదు. అనేక మంది దిగ్గజాలతో కూడిన జట్టుకు నాలుగేళ్ల క్రితం నేను బంగ్లాదేశ్‌లో మేనేజర్‌గా వ్యవహరించాను. దాంతో పోలిస్తే వీరిలో చాలా మంది కొత్త కుర్రాళ్లే. నాకు ఇదో కొత్త అనుభవం. -
మసాల పుడ్‌కు మన క్రికెటర్స్ దూరం!
-
పఠాన్ బ్రదర్స్ క్రికెట్ అకాడమీ
వచ్చే నెల చివర్లో బరోడాలో అందుబాటులోకి... ముంబై: భారత క్రికెటర్లు యూసుఫ్, ఇర్ఫాన్ పఠాన్లు బరోడాలో క్రికెట్ అకాడమీని నెలకొల్పారు. తమకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఆటకు కొంతైనా సేవ చేసేందుకు దీన్ని ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెల చివరి నుంచి ఈ అకాడమీ అందుబాటులోకి రానుంది. ‘చాలా కాలంగా అకాడమీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ అకాడమీలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. మొదట 8-9 వారాల కోర్సు పూర్తి చేసిన తర్వాత రెండో దశకు వెళ్తారు. ఆటకు సంబంధించిన మౌలిక వసతులున్న పాఠశాలకు వెళ్లి అక్కడ కూడా కోచింగ్ ఇస్తాం. ఏడాది మొత్తం ఇది అందుబాటులో ఉంటుంది’ అని పఠాన్ బ్రదర్స్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో అకాడమీని మరో మూడు నగరాలకు విస్తరించనున్నామని చెప్పిన బ్రదర్స్... 2015 చివరికి 50 అకాడమీలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అకాడమీలోని కోచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్, కామె రూన్ ట్రెడ్వెల్లతో తాము ఒప్పందం చేసుకున్నామన్నారు. అకాడమీల సంగతిని పక్కనబెడితే తమలో 5 నుంచి 7 ఏళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని వెల్లడించారు. -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
-
ఫార్మాట్ మారింది... పూనకమొచ్చింది!
వీళ్లేనా... మొన్నటిదాకా పరుగులు చేయడానికి వణికిన బ్యాట్స్‌మెన్..! వీళ్లేనా... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఆపడానికి ఆపసోపాలు పడ్డ బౌలర్లు..! వీళ్లేనా... ఘోరమైన ఆటతో ఇంటా బయటా తిట్లు తిన్న క్రికెటర్లు..! టెస్టుల్లో ఘోర ఓటమితో కసి పెరిగిందో... లేక ప్రపంచకప్ ఆడాలంటే నిలబడాలని గుర్తొచ్చిందో... కారణం ఏదైనా... ఫార్మాట్ మారగానే భారత క్రికెటర్లు పూనకం వచ్చినట్లు చెలరేగిపోయారు. అటు బ్యాట్స్‌మెన్ కసిదీరా ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడితే... ఇటు బౌలర్లు ప్రత్యర్థిని చుట్టిపారేశారు. ఫలితంగా రెండో వన్డేలో భారత్ 133 పరుగులతో ఘన విజయం సాధించింది. ►ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్ ►133 పరుగులతో నెగ్గిన ధోనిసేన ►రైనా సూపర్ సెంచరీ ►రాణించిన ధోని, రోహిత్ ►ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం ►మూడో వన్డే శనివారం కార్డిఫ్: ఇంగ్లండ్ గడ్డపై గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా ఐదు విజయాలతో భారత్ సత్తా చాటింది. నాటి రికార్డును ఇప్పుడు కొనసాగిస్తూ భారత్ మరోసారి అదే తరహా స్ఫూర్తిదాయక ఆటతీరును కనబర్చింది. అప్పటిలాగే జట్టు సమష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. బుధవారం ఇక్కడ సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ 133 పరుగుల భారీ తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. సురేశ్ రైనా (75 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత సెంచరీ సాధించగా... కెప్టెన్ ధోని (51 బంతుల్లో 52; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (87 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రైనా, ధోని ఐదో వికెట్‌కు 16.5 ఓవర్లలోనే 144 పరుగులు జోడించడం విశేషం. అనంతరం వర్షం కారణంగా ఇంగ్లండ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయీస్ ప్రకారం 47 ఓవర్లలో 295 పరుగులుగా నిర్ణయించారు. అయితే ఆ జట్టు 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. అలెక్స్ హేల్స్ (63 బంతుల్లో 40; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జడేజా 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా ఫలితంతో వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే శనివారం నాటింగ్‌హామ్‌లో జరుగుతుంది. ఆదుకున్న రోహిత్ ఆరంభంలో ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తన మూడో ఓవర్ తొలి బంతికి ధావన్ (11)ను అవుట్ చేసిన వోక్స్, మరో రెండు బంతులకే కోహ్లి (0)ని డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఎదుర్కొన్న మూడో బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించిన విరాట్, తన టెస్టు సిరీస్ వైఫల్యాన్ని కొనసాగించడంతో స్కోరు 19/2 వద్ద నిలిచింది. అయితే రోహిత్ శర్మ, రహానే (47 బంతుల్లో 41; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 91 పరుగులు జత చేశారు. రోహిత్ 82 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరు ట్రెడ్‌వెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. భారీ భాగస్వామ్యం ఈ దశలో రైనా, ధోనిల భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరు అందించింది. మొదట్లో నెమ్మదిగానే ఆడిన రైనా, ఆ తర్వాత చెలరేగిపోయాడు. 49 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. తర్వాత జోరు మరింత పెంచి 74 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో వైపు కెప్టెన్ కూడా తనదైన శైలిలో షాట్లు ఆడి 49 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరి జోరుతో భారత్ రెండో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసింది. తొలి 37 ఓవర్లలో నాలుగు వికెట్లకు 171 పరుగులు చేస్తే... చివరి 13 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేయడం విశేషం. బౌలర్ల జోరు భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ వేగంగా ఆడలేదు. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన హేల్స్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ కుక్ (19), బెల్ (1)లను ఒకే ఓవర్లో అవుట్ చేసి షమీ ప్రత్యర్థి జట్టును నియంత్రించాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో రూట్ (4), హేల్స్, బట్లర్ (2) వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం నమోదు కాకపోవడంతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వోక్స్ (బి) ట్రెడ్‌వెల్ 52; ధావన్ (సి) బట్లర్ (బి) వోక్స్ 11; కోహ్లి (సి) కుక్ (బి) వోక్స్ 0; రహానే (స్టం) బట్లర్ (బి) ట్రెడ్‌వెల్ 41; రైనా (సి) అండర్సన్ (బి) వోక్స్ 100; ధోని (బి) వోక్స్ 52; జడేజా నాటౌట్ 9; అశ్విన్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 304. వికెట్ల పతనం: 1-19; 2-19; 3-110; 4-132; 5-276; 6-288. బౌలింగ్: అండర్సన్ 10-1-57-0; వోక్స్ 10-1-52-4; జోర్డాన్ 10-0-73-0; స్టోక్స్ 7-0-54-0; రూట్ 3-0-14-0; ట్రెడ్‌వెల్ 10-1-42-2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: కుక్ (ఎల్బీ) (బి) షమీ 19; హేల్స్ (సి) అశ్విన్ (బి) జడేజా 40; బెల్ (బి) షమీ 1; రూట్ (బి) భువనేశ్వర్ 4; మోర్గాన్ (సి) షమీ (బి) అశ్విన్ 28; బట్లర్ (సి) కోహ్లి (బి) జడేజా 2; స్టోక్స్ (సి) రహానే (బి) జడేజా 23; వోక్స్ (స్టం) ధోని (బి) జడేజా 20; జోర్డాన్ (ఎల్బీ) (బి) రైనా 0; ట్రెడ్‌వెల్ (సి) జడేజా (బి) అశ్విన్ 10; అండర్సన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (38.1 ఓవర్లలో ఆలౌట్) 161. వికెట్ల పతనం: 1-54; 2-56; 3-63; 4-81; 5-85; 6-119; 7-126; 8-128; 9-143; 10-161 బౌలింగ్: భువనేశ్వర్ 7-0-30-1; మోహిత్ శర్మ 6-1-18-0; షమీ 6-0-32-2; అశ్విన్ 9.1-0-38-2; జడేజా 7-0-28-4; రైనా 3-0-12-1. అదే వేదిక... అవే పరుగులు మూడేళ్ల క్రితం...ఇదే వేదికపై భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే...ఇరు జట్ల కెప్టెన్లు ధోని, కుక్... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్‌కు ముందు ఇంగ్లండ్ లక్ష్యాన్ని 47 ఓవర్లలో 295 పరుగులుగా నిర్ణయించారు. ఆ తర్వాత మళ్లీ లక్ష్యం మారి డక్‌వర్త్ లూయీస్ ప్రకారం ఇంగ్లండ్ గెలిచింది. ఇప్పుడూ అదే మైదానం...నాయకులూ వారే. భారత్ సరిగ్గా అదే స్కోరు చేసింది. నాడు కోహ్లి సెంచరీ చేస్తే నేడు రైనా శతకం బాదాడు. ఇంగ్లండ్ లక్ష్యం కూడా సరిగ్గా అదే. ఈ సారి మాత్రం ఫలితం మారింది. 11 బంతుల ఓవర్... ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 39వ ఓవర్ ఇంగ్లండ్ కెప్టెన్‌కు అసహనాన్ని మిగల్చగా, భారత్‌కు 13 పరుగులు అందించింది. ఏ మాత్రం నియంత్రణ లేకుండా సాగిన బౌలింగ్‌తో జోర్డాన్ ఆ ఓవర్లో ఏకంగా ఐదు వైడ్లు వేశాడు. ధోని ఒక ఫోర్ కొట్టగా, మరో నాలుగు సింగిల్స్ వచ్చాయి. మ్యాచ్‌లో మొత్తంగా జోర్డాన్ ఒక్కడే 12 వైడ్లు విసరగా, ఇంగ్లండ్ ఎక్స్‌ట్రాల రూపంలోనే 29 పరుగులు ఇచ్చింది. 1 ఉపఖండం వెలుపల రైనాకు ఇదే తొలి సెంచరీ 4 రైనా కెరీర్లో ఇది నాలుగో సెంచరీ. 2010 జనవరిలో తన మూడో సెంచరీ నమోదు చేసిన రైనా... 95 ఇన్నింగ్స్‌ల తర్వాత మరో సెంచరీ సాధించాడు. 1 వన్డేల చరిత్రలో ఐదో వికెట్‌కు 2000కు పైగా పరుగులు జోడించిన తొలి జోడి ధోని, రైనా. -
కుదురుకుంటారా!
నేడు మిడిలెసెక్స్‌తో భారత్ ప్రాక్టీస్ వన్డే లండన్: ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ఘోరంగా ఓడిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో నేడు మిడిలెసెక్స్‌తో ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. వన్డే సిరీస్‌కు ముందు ఒకే ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో భారత్ దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. దాదాపుగా వన్డేల్లో ఆడే తుది జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. టెస్టుల్లో ఆడిన పది మందికి తోడుగా ఏడుగురు కొత్త ఆటగాళ్లు జట్టుతో చేరారు. రైనా, రాయుడు, మోహిత్, ధావల్, శామ్సన్, కరణ్ శర్మ, ఉమేశ్‌లు ఇందులో ఉన్నారు. అయితే వీళ్లలో ఎంత మందికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టెస్టుల్లో ఓటమితో జట్టులో ఆత్మ విశ్వాసం పూర్తిగా కొరవడింది. ఓపెనర్ ధావన్‌తో పాటు కోహ్లిల ఫామ్ కలవరపెడుతోంది. రోహిత్ కూడా ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. అయితే ఈ త్రయం కుదురుకునే అంశంపైనే ఇంగ్లండ్‌లో భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. బౌలింగ్ కూడా గాడిలో పడాల్సి ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోని ఆడే అవకాశాలు కనబడటం లేదు. అయితే తొలి వన్డేల్లో మాత్రం సీనియర్లను బరిలోకి దించాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రాక్టీస్‌కు ఏడుగురు డుమ్మా కీలకమైన వన్డే సిరీస్‌కు ముందు భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టారు. గురువారం లార్డ్స్ నర్సరీ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రాక్టీస్‌కు ధోని, ధావన్, రోహిత్, కోహ్లి, అశ్విన్, జడేజా, షమీలు గైర్హాజరయ్యారు. రహానే, భువనేశ్వర్, స్టువర్ట్ బిన్నీలతో పాటు యువ ఆటగాళ్లు మాత్రం నెట్స్‌లో చెమటోడ్చారు. బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు జో డేవిస్, ట్రెవర్ పెన్నీల ఆధ్వర్యంలో స్లిప్ క్యాచ్‌లు, త్రో డౌన్స్ సాధన చేశారు. తర్వాత బ్యాటింగ్, బౌలింగ్‌కు పదును పెట్టారు. సంజూ శామ్సన్ వికెట్ కీపింగ్‌తో పాటు స్లిప్‌లో రైనా, రహానేతో కలిసి క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశాడు. -
క్యాన్సర్ రోగుల కోసం...
లండన్: క్యాన్సర్ రోగుల సహాయార్థం నిధుల సేకరణకు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ నడుం బిగించాడు. క్యాన్సర్ బారిన పడి కోలుకున్న యువరాజ్ తన చారిటీ ‘యు వియ్ కెన్’ ఆధ్వర్యంలో ఈ నెల 14న లండన్‌లోని హిల్టన్ హోటల్లో క్రికెట్ జ్ఞాపికలను వేలానికి ఉంచనున్నాడు. 200వ టెస్టులో సచిన్ వేసుకున్న టీ షర్ట్, 2011 ప్రపంచకప్‌లో యువీ అందుకున్న పతకంతో పాటు పలు జ్ఞాపికలు వేలం వేస్తారు. వీటిని దక్కించుకున్న వారు యువరాజ్‌తో ప్రాక్టీస్‌లో పాల్గొనడమే కాకుండా విందు చేసే అవకాశం దక్కుతుంది. ఈ వేలానికి క్రికెట్ దిగ్గజం సచిన్, గంగూలీ, ద్రవిడ్, కెవిన్ పీటర్సన్‌తో పాటు భారత క్రికెటర్ విరాట్ కోహ్లి హాజరుకానున్నారు. -
రాజపుత్రుడి అశ్విక దళం!
గుర్రాలపై రవీంద్ర జడేజా మోజు క్రికెటర్లలో భిన్నమైన సరదా రాజ్‌కోట్: పిచ్చి పలు రకాలు...ఇక సెలబ్రిటీల విషయంలో ఇది కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ఆటపరంగా ఎంతో ప్రొఫెషనలిజం కనబరిచే క్రికెటర్లు సొంత ఇంటికి వచ్చే సరికి మాత్రం భిన్నంగా మారిపోతారు. సరదాలు తీర్చుకుంటూ తమదైన ప్రపంచంలో ఎంజాయ్ చేస్తారు. భారత క్రికెటర్లలో రవీంద్ర సింహ్ జడేజాది కూడా ఇదే శైలి. రాజ్యాలు పోయినా...రాజులు పోయినా రాజపుత్ర వంశం అనే తోక మాత్రం జడేజాకు మిగిలిపోయింది. అప్పటి ప్రభావం అతనిపై ఇంకా మిగిలే ఉన్నట్లుంది...అందుకే జడేజాకు గుర్రాలంటే అమిత ఇష్టం. ఎప్పుడు విరామం దొరికినా తన స్వస్థలం జామ్‌నగర్‌కు వెళ్లిపోయి గుర్రాలపై స్వారీ చేస్తాడు. వాటితో ఆడుకోవడమే అతనికి పెద్ద సరదా. లక్కీ నంబర్ 8 ప్రస్తుతం జడేజా వద్ద నాలుగు మేలు జాతి అశ్వాలు ఉన్నాయి. ధన్‌రాజ్, గంగ, కేసర్, జానకి అని వాటికి అతను పేర్లు పెట్టాడు. మూడేళ్ల క్రితం అతను జామ్‌నగర్ శివార్లలో ఎనిమిది ఎకరాల స్థలం కొని అక్కడ ఫామ్‌హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే తన గుర్రపు శాల కూడా సిద్ధం చేశాడు. వాటిని పోషించేందుకు ప్రత్యేక ట్రైనర్‌ను నియమించిన జడేజా...మ్యాచ్‌లు లేని సమయంలో ఆ గుర్రాలతోనే టైమ్‌పాస్ చేస్తాడు. వాటిపై స్వారీ చేస్తూ సమీప ప్రాంతాలన్నీ అతను చుట్టి వస్తుంటాడు. అదే ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలోనే గుర్రాలకు కావాల్సిన ఆహారపు పెంపకం కూడా జరుగుతుంది. ‘ఇప్పుడు నా వద్ద నాలుగు గుర్రాలు ఉన్నాయి. కానీ నా అదృష్ట సంఖ్య ఎనిమిది. కాబట్టి కనీసం మరో 4 గుర్రాలు కొనాల్సి ఉంది’ అని జడేజా అన్నాడు. క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆరంభంలో అతను పెద్ద సంఖ్యలో పావురాళ్లు, కుందేళ్లు, కుక్కలు, విభిన్న రకాల చేపలు ఇంటికి తెచ్చేవాడు. చిన్నప్పటినుంచే పక్షులు, జంతువులను పెంచుకునేవారా అని అడిగితే...‘అప్పుడు మా తిండికే దిక్కు లేదు. ఇక వీటిని ఎక్కడ పోషిస్తాను’ అని తన పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటాడు ఈ ఆల్‌రౌండర్. చెబితే వింటేగా... ‘గుర్రాలకంటే బైక్‌లు ఎంతో మెరుగని ఎన్నో సార్లు అతనికి చెప్పాను. బైక్‌లను ఒక్కసారిగా గ్యారేజీలో పడేసి అవసరమున్నప్పుడు పెట్రోల్ పోసి బైటికి తీయవచ్చు. అదే గుర్రాలైతే రోజూ మేపాలి. నాలుగు గుర్రాలకు జడేజా పెట్టిన డబ్బుతో నేను నాలుగు బైక్‌లు కొంటాను. కానీ ఎంత చెప్పినా అతను అర్థం చేసుకోడు’ - ఎంఎస్ ధోని, భారత కెప్టెన్ ప్రియ నేస్తాలు... ఎప్పుడు అవకాశం దొరికినా గుర్రాలపై తన ప్రేమను ప్రదర్శించేందుకు జడేజా వెనుకాడడు. ‘గుర్రాలు దగ్గరగా ఉంటే దెయ్యాలులాంటివి కూడా దరి చేరవని నేను చదివాను. వాటి లక్షణాలను బట్టి నేను అవి ఏ జాతివో గుర్తించగలను. అన్నట్లు...కేసర్ చతేశ్వర్ పుజారాలాంటిది. చాలా పని చేస్తుంది కానీ సెలైంట్‌గా ఉంటుంది’ అని జడేజా నవ్వేస్తాడు. -
మ్యాచ్‌పైనే మా దృష్టి!
భారత్‌లో ఏం జరుగుతోందో మాకు అనవసరం స్పష్టం చేసిన భారత క్రికెటర్లు నేడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ( ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఓ వైపు స్వదేశంలో బోర్డుకు గట్టి షాక్... మరోవైపు ఐపీఎల్లో తమ భవితవ్యం ఏమిటో తెలియని అయోమయంలో సగం మంది క్రికెటర్లు... అయితే పైకి మాత్రం అందరూ ధీమాగానే ఉన్నారు. భారత్‌లో ఏం జరుగుతోందో తమకు అనవసరమని, జట్టు దృష్టంతా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పైనే ఉందని ధోనిసేన స్పష్టం చేసింది. మరేదైనా బలమైన జట్టుతో ప్రస్తుత పరిస్థితుల్లో ఆడటం కాస్త ఇబ్బందేమో గానీ... బంగ్లాతో మ్యాచ్ కాబట్టి భారత్ హ్యాట్రిక్ విజయాన్ని ఆశించవచ్చు. శుక్రవారం జరిగే సూపర్-10 గ్రూప్-2 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిస్తే భారత్ జట్టు దాదాపుగా సెమీస్‌కు చేరువైనట్లే. ఆ తర్వాతి మ్యాచ్‌లలో ఏవైనా అనూహ్య సమీకరణాలు ఏర్పడితే తప్ప మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ నాకౌట్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. మార్పులు లేకుండానే... భారత జట్టు ఈసారి కూడా మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. యువరాజ్ ఒక్కడి ఫామ్ మినహా అందరూ బాగానే ఆడుతున్నారు. గురువారం రోజు ప్రాక్టీస్‌కు అందరూ వచ్చారు. ఎప్పటిలాగే ఫుట్‌బాల్ ఆడి నెట్స్‌కు వెళ్లారు. ధావన్, యువరాజ్ మరోసారి ఎక్కువగా నెట్స్‌లో గడిపారు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీషాట్లు ప్రాక్టీస్ చేశారు. బంగ్లా జట్టులో షకీబ్‌ను ఆడాలనే ఉద్దేశంతోనో ఏమో.. ప్రాక్టీస్‌లో భారత ప్రధాన ఆటగాళ్లంతా జడేజాతో బౌలింగ్ చేయించుకుని ఆడారు. 25 వేల మందితో హోరు... ప్రస్తుత ఫామ్, జట్టు బలం దృష్ట్యా భారత్‌కు బంగ్లాదేశ్ పోటీ ఇచ్చినా గొప్పే అనుకోవాలి. అయితే శుక్రవారం ఇక్కడ సెలవు కావడంతో.... స్టేడియం సామర్థ్యం 25 వేలు పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్ బ్లాక్‌లో 10వేల టాకాలకు (రూ.8500) అమ్ముతున్నారంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. భారత బ్యాట్స్‌మన్ అవుట్ కోసం బంగ్లా బౌలర్ ఎవరైనా అప్పీల్ చేస్తే... 25 వేల గొంతులు జతకలుస్తాయి. బౌలింగ్‌లో షకీబ్, మొర్తజా, అమిన్, బ్యాటింగ్‌లో తమీమ్ ఇక్బాల్, కెప్టెన్ ముష్ఫికర్ కీలకం. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, యువరాజ్, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ. మిశ్రా. బంగ్లాదేశ్: ముష్ఫికర్ (కెప్టెన్), తమీమ్, అనాముల్, మోమినుల్, షకీబ్, షబ్బీర్, మహ్మదుల్లా, జియావుర్, సోహాబ్, మొర్తజా, అమిన్. -
బంగ్లాదేశ్‌లో మాత్రం అలా కుదరడం లేదు
ఢాకా: సాధారణంగా భారత క్రికెటర్లు విదేశాలకు వెళితే కావలసినంత ఎంజాయ్ చేస్తారు. ప్రపంచకప్ సమయంలో మ్యాచ్‌ల మధ్య విరామం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాగా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక... ఇలా ఎక్కడ ప్రపంచకప్ జరిగినా.... పబ్‌లు, నైట్‌క్లబ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడం ధోని సేనకు బాగా ఇష్టమైన వ్యాపకం. కానీ ఈసారి బంగ్లాదేశ్‌లో మాత్రం అలా కుదరడం లేదు. ఢాకాలో నైట్‌క్లబ్‌లు, పబ్‌లు ఉండవు. దీనికి తోడు ఈసారి భద్రత బాగా ఎక్కువ చేశారు. దీంతో మొత్తం ఆటగాళ్లంతా గ్రౌండ్‌కు, హోటల్‌కు పరిమితమవుతున్నారు. ప్రాక్టీస్, మ్యాచ్ లేకపోతే గదుల్లోంచి బయటకు కూడా రావడం లేదు. వీడియో గేమ్స్, చాటింగ్‌లతో కాలక్షేపం చేస్తూ ‘గూట్లో పక్షులు’గా మారారు. పాపం..! -
ధనార్జనలోనూ ధోనీ ధనా ధన్!
టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోని ఆటతోనే కాదు ఆదాయంతోనూ సంచలనాలు రేపుతున్నాడు. ధనార్జనలోనూ ధనా ధన్ ధోనీ దమ్ము చూపాడు. అతి సామాన్యంగా జట్టులోకి ప్రవేశించి అసామాన్యుడిగా మారిన ఈ జార్ఖండ్ ఆటగాడు అత్యంత ధనిక క్రీడాకారుడిగా అవతరించాడు. సంపాదనలో సచిన్ టెండూల్కర్‌ను మించిపోయాడు. మైదానం వెలుపల కూడా సంచనాలు సృష్టించగలనని నిరూపించాడు కూల్ కెప్టెన్. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనిక ఆటగాళ్ల జాబితాలో టాప్-20లో నిలిచి భారత ఆటగాళ్లలో అందరికంటే ముందున్నాడు. జూన్ 2012 నుంచి జూన్ 2013 మధ్య ఏడాది కాలంలో ధోనీ వార్షికాదాయం 31.5 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ. 179 కోట్లు)గా ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్’ లెక్కగట్టింది. ఇందులో ఆట ద్వారా 3.5 మిలియన్ డాలర్లు(రూ. 20 కోట్లు) సంపాదించాడు. వాణిజ్య ప్రకటనలు, ఇతరత్రా వాటి ద్వారా 28 మిలియన్ డాలర్లు(రూ. 150 కోట్లు) ఆదాయం సమకూరింది. 2013లో మిగతా ఆరునెల కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ధోనీ సంపాదన ఇంకా ఎక్కువ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ధోనీ తర్వాత స్థానంలో సచిన్ నిలిచాడు. 22 మిలియన్ డాలర్ల (రూ. 125 కోట్లు) వార్షికాదాయంతో సచిన్ 51వ స్థానం దక్కించుకున్నాడు. అయితే సంపద విషయంలో సచిన్ తర్వాతే ధోని ఉన్నాడు. సచిన్ మొత్తం ఆస్తి ధోని సంపద కంటే మూడు రెట్లు ఎక్కువని వెల్త్ ఎక్స్ అనే సంస్థ ప్రకటించింది. యువరాజ్ సింగ్ కంటే ఐదు రెట్లు, రాహుల్ ద్రావిడ్ కంటే 8 రెట్లు, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే 10 రెట్లు ఎక్కువ అని వెల్లడించింది. సచిన్ యావదాస్తిని 160 మిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. ధోని 50 మిలియన్లతో 2వ స్థానం, యువరాజ్ 30 మిలియన్లతో 3వ స్థానం, రాహుల్ ద్రావిడ్ 20 మిలియన్లతో 4వ స్థానం, కోహ్లి 15 మిలియన్లతో 5వ స్థానంలో ఉన్నారు. ‘ఫోర్బ్స్’ జాబితాలో గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ (అమెరికా) 78.1 మిలియన్ డాలర్ల ఆదాయంతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. రష్యా టెన్నిస్ భామ మరియా షరపోవా వరుసగా తొమ్మిదోసారి 'టాప్'లో నిలిచి రికార్డు సృష్టించింది. 26 ఏళ్ల షరపోవా 29 మిలియన్ డాలర్ల (రూ.176 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. మహిళా అథ్లెట్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ 20.5 మిలియన్ డాలర్లతో రెండో స్థానం, నా లీ (చైనా-18.2 మిలియన్ డాలర్లు), విక్టోరియా అజరెంకా (బెలారస్-15.7 మిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో దక్కించుకున్నారు. -
బోల్ట్ కంటే ధోని ‘రిచ్’
న్యూఢిల్లీ: దిగ్గజ అథ్లెట్ బోల్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండొచ్చు... కానీ సంపాదనలో మాత్రం భారత క్రికెటర్లతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నాడు. ‘ఫోర్బ్స్’ తాజాగా విడుదల చేసిన క్రీడాకారుల ఆదాయ జాబితాలో బోల్ట్ 40వ స్థానంలో ఉంటే... భారత క్రికెట్ కెప్టెన్ ధోని 16వ ర్యాంకులో, సచిన్ 31వ స్థానంలో ఉన్నారు. ఈ పత్రిక అంచనా ప్రకారం ఏడాదికి ధోని ఆదాయం 31.5 మిలియన్ డాలర్లు (రూ.195.3 కోట్లు). సచిన్ టెండూల్కర్ ఆదాయం 22 మిలియన్ డాలర్లు (రూ. 136.4 కోట్లు). బోల్ట్ ఆదాయం 20.3 మిలియన్ డాలర్లు (రూ. 126 కోట్లు). అత్యధిక ఆదాయం ఆర్జించే క్రీడాకారుల జాబితాలో విఖ్యాత గోల్ఫర్ టైగర్ వుడ్స్ 78.1 మిలియన్ డాలర్లు (రూ. 484.2 కోట్లు )తో అగ్రస్థానంలో ఉండగా... టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ 71.5 మిలియన్ డాలర్లు (రూ. 443.3 కోట్లు )తో రెండో స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో రష్యన్ టెన్నిస్ స్టార్ షరపోవా 29 మిలియన్ డాలర్లు (రూ. 180 కోట్లు) ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది.