యువీ చిందేశాడు.. క్రికెటర్ల సంబరాలు
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు, మాజీలు హోలీ పండుగ సందర్భంగా సందడి చేశారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్‌లోడ్ చేశాడు. హోలీ రోజున జంతువులపై రంగులు పూయవద్దని అభిమానులను కోరాడు. వెటరన్ హర్భజన్ సింగ్.. తన భార్య గీతా బస్రాతో కలసి హోలీ చేసుకున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇక యువరాజ్ సింగ్ హోలీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను అప్‌లోడ్ చేశాడు. హోలీ రంగులు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, సంపద, శాంతి కలిగించాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాంక్షించాడు. అజింక్యా రహానె ఇతర ఆటగాళ్లు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు.