హత్యకు గురైన దళిత టీనేజర్ నీరజ్ జాటవ్
సాక్షి, జైపూర్: హోలీ వేడుకలు ఓ దళిత కుటుంబంలో పెను విషాదం నింపాయి. హోలీ అడుతుండగా ఆయుధాలతో దాడిచేయడంతో దళిత టీనేజర్ మృతిచెందడం కలకలం రేపింది. ఈ ఘటన రాజస్థాన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... నీరజ్ జాటవ్(16) అనే టీనేజర్ అల్వార్ జిల్లా భివాడి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో హోలీ సందర్భంగా బయటకు వెళ్లాడు నీరజ్. అయితే ఇతర సామాజిక వర్గానికి చెందిన మిత్రులు, స్థానికులతో హోలీ రంగులు రుద్దుకుంటూ హోలీ ఆడుతున్నాడు. అంతలోనే గొడవ మొదలైంది. దళిత బాలుడు నీరజ్‌పై కొందరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.
విషయం తెలుసుకున్న దళిత టీనేజర్ కుటుంబసభ్యులు నీరజ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తీవ్ర గాయాలతో రక్తస్రావమైన నీరజ్ ఆస్పత్రికి తీసుకెళ్లగానే మృతిచెందాడని ఏఎస్పీ పుష్పేంద్ర సోలంకి తెలిపారు. హోలీ ఆడుతున్న నీరజ్‌ను ముగ్గురు వ్యక్తులు కలిసి హత్యచేశారని, ఆ టీనేజర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment