
దుంగార్‌పూర్: రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో హోలీవేడుకలను రంగులతో కాకుండా రాళ్లతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత 20 ఏళ్లుగా దుంగార్‌పూర్‌లోని భిలుడా గ్రామస్తులు రాళ్లతో హోలీని జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో 42 మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రెండు వర్గాలుగా విడిపోయిన స్థానికులు.. రాళ్లతో హోలీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురికి గాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
గిరిజనులు ఎక్కువగా నివసించే భిలుడా గ్రామంలో రాళ్ల దాడిలో నేలపై పడే రక్తం ఏడాది పొడవునా గ్రామంలో జరిగే అవాంఛనీయ సంఘటనల నుంచి రక్షిస్తుందనే నమ్మకంతో దశాబ్దాలుగా ఇక్కడ హోలీ జరుపుకుంటున్నారు. హోలీని జరుపుకోవడానికి గ్రామంలోని రఘునాథ్‌జీ ఆలయం దగ్గర ప్రజలు హాజరై.. డ్రమ్స్ వాయిద్యాలతో నృత్యం చేశారు అనంతరం రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.
Believe me, this is not a clash; it is a Holi celebration!
In Bhiluda village in Rajasthan, Holi is celebrated by pelting stones. Every year on Holi, in the evening, instead of colors and gulal, stones are pelted between two groups#Holi#Holi2025 #HoliCelebration pic.twitter.com/MVOQZll6TF— Pirzada Shakir (@pzshakir6) March 14, 2025
Comments
Please login to add a commentAdd a comment