వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందని.. | Girl allegedly burnt alive by her family members in Dungarpur (Rajasthan) | Sakshi
Sakshi News home page

వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందని..

Published Sun, Mar 6 2016 6:11 PM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందని..

వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందని..

దంగార్పూర్: రాజస్థాన్ లోని దంగార్పూర్ లో పరువు హత్య సంచలనం సృష్టించింది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో సొంత కుటుంబ సభ్యులే ఓ మహిళను దారుణంగా చంపారు. గ్రామస్తులు అందరూ చూస్తుండగానే సజీవ దహనం చేశారు.

మృతురాలు తన కుటుంబ సభ్యులను కాదని ప్రేమించిన వ్యక్తితో కొన్నేళ్ల క్రితం సొంతూరు విడిచి వెళ్లిపోయింది. ప్రియుడిని పెళ్లి చేసుకుని 8 ఏళ్ల తర్వాత ఇటీవల దంగార్పూర్ కు వచ్చింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఈ నెల 4న కిరాతకంగా హతమార్చారు.

ఈ కేసులో మృతురాలి తండ్రితో పాటు 35 మంది కేసులు నమోదు చేశామని, ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు సాగ్వారా డీఎస్పీ బ్రిజ్ రాజ్ సింగ్ చరణ్ తెలిపారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు సాగిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement