Dungarpur
-
మా అభ్యర్థికి ఓటేయకండి: కాంగ్రెస్ ప్రచారం
జైపూర్: రాజస్థాన్‌లోని గిరిజనులు అధికంగా ఉండే బన్స్వారా-దుంగార్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో విచిత్రంగా సాగుతోంది . ఇక్కడ కాంగ్రెస్ తన సొంత అభ్యర్థికి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్థిస్తోంది. అలాగని అక్కడి అభ్యర్థి రెబల్ అనుకుంటే పొరపాటే. వివరాల్లోకి వెళ్తే.. ఎస్టీ రిజర్వ్డ్ అయిన బన్స్వారా-దుంగార్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అరవింద్ దామోర్‌ను తన సొంత అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీకి ఒక రోజు ముందు భారత్ ఆదివాసీ పార్టీ (BAP) అభ్యర్థి రాజ్‌కుమార్ రోట్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది.బీఏపీకి మద్దతివ్వాలని పార్టీ చేసిన ప్రకటనకు అనుగుణంగా దామర్ తన నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి ఉంది. కానీ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ముగిసే వరకు ఆయన ఎక్కడా కనిపించలేదు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన దామర్.. జరిగిన పరిణామాలేవీ తనకు తెలియనట్లు నటించి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.దీంతో బీజేపీ, కాంగ్రెస్-బీఏపీ కూటమి మధ్య ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోరుగా మారింది. దామర్ పోటీ కాంగ్రెస్ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఇది బీజేపీ అభ్యర్థి మహేంద్రజిత్ సింగ్ మాల్వియాకు ప్రయోజనం కలిగించనుంది. బన్స్వారా-దుంగార్పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి రెండవ దశలో శుక్రవారం పోలింగ్ జరగనుంది.కాంగ్రెస్ స్థానిక నాయకత్వం తమ సొంత అభ్యర్థికి బదులు రోట్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయగా, బీఏపీతో పొత్తుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ నాయకులలోని ఒక వర్గం తనకు మద్దతు ఇస్తున్నట్లు దామోర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి నాయకుడు వికాస్ బమ్నియా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్జున్ బమ్నియా కుమారుడు రోట్‌కు పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దక్షిణ రాజస్థాన్‌లో స్థాపించిన బీఏపీకి రోట్తో సహా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. -
ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ ఉద్యోగం
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రభుత్వ డాక్టర్ దీపక్ ఘోగ్రా(43)కు రాష్ట్ర హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన మళ్లీ ఉద్యోగంలో చేరడానినికి అంగీకరించింది. దీపక్ భారతీయ ట్రైబల్ పార్టీ టికెట్‌పై దుంగార్పూర్ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. పరాజయం పాలైతే ఉద్యోగంలో చేర్చుకోవాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సానుకూలంగా స్పందించింది. ఎన్నికల్లో దీపక్ ఓడిపోతే మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. -
పోలీసు అవబోయి ఎమ్మెల్యేగా!!
జైపూర్: రాజ్‌కుమార్ రోట్.. నిన్నటివరకు సాధారణ మధ్యతరగతి యువకుడు. పోలీసు రిక్రూట్మెంట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగి. మూడు నెలల క్రితం ఎన్నికల్లో పోటీ చేయమని ఓ పార్టీ అడిగితే సరే అన్నారు. అనూహ్య రీతిలో విజయం సాధించారు. పోలీసు కాబోయి ఎమ్మెల్యే అయ్యారు. త్వరలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాజ్‌కుమార్.. రాజస్తాన్ అసెంబ్లీలో గిరిజనుల ప్రతినిధిగా అడుగుపెట్టనున్నారు. దుంగార్పూర్లోని ఖూనియా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దీంతో ఛోరసీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) రాజ్‌కుమార్‌ను కోరింది. సరేనన్నారు. బీజేపీ అభ్యర్థి సుశీల్ కటారాపై 12,934 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
వారెవ్వా.. టాయిలెట్ కోసం ఎంతపని చేశారు
ఉదయ్‌పూర్: ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆలస్యంగానైనా నలుగురిలో మంచి మార్పునే తీసుకొస్తుంది. పట్టణాలు గ్రామాలే కాకుండా గిరిజన ప్రాంతాల్లో సైతం ఈ పథకం గట్టి మార్పును తీసుకొస్తుంది. రాజస్థాన్‌లో ఓ గిరిజన దంపతులు తమ ఇంట్లో మరుగు దొడ్డి నిర్మించుకునేందుకు ఇంట్లో మేకలు అమ్ముకోవడంతోపాటు గృహిణి కాలి వెండి కడియాన్ని తాకట్టుపెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరుగుదొడ్డి ఆవశ్యకతను కొంతమంది సామాజిక కార్యకర్తలు రాజస్థాన్‌లోని దంగార్ పూర్ గ్రామంలో ప్రచారం చేశారు. వారి ప్రచారం నుంచి స్ఫూర్తిపొందిన గీతా, సునీల్ పిళ్లై అనే గిరిజన దంపతులు వారు చేసుకునేది రోజువారి కూలిపనే అయినా.. గడ్డు పరిస్థితుల మధ్య ఉంటూనే రూ.9000తో టాయిలెట్ నిర్మించుకునేందుకు మేకలు అమ్మి, కాలి వెండి కడియం తాకట్టు పెట్టుకున్నారు. వాస్తవానికి తొలుత ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో టాయిలెట్లు నిర్మించుకోవచ్చని.. 12 వేలు ప్రభుత్వం నుంచి వస్తాయని చెప్పడంతో నిర్మాణం ప్రారంభించారు. కానీ, అన్నట్లుగానే రెండు దఫాల్లో రూ.8000 మాత్రమే వచ్చింది. అయితే, టాయిలెట్ పూర్తయ్యేందుకు అంతకంటే ఎక్కువ అవసరం కావడంతో వారు ఈ పని చేశారు. తమ మేకల్ని అమ్ముకొని మరీ వారు టాయిలెట్ నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దుంగార్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కేకే గుప్తా వారిని సన్మానించారు. అనంతరం అతడికి విడుదల కావాల్సిన మరో రూ.4వేలు కూడా మంజూరుకావడంతో తిరిగి తన భార్య కడియాన్ని విడిపించుకున్నాడు. -
వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందని..
దంగార్పూర్: రాజస్థాన్ లోని దంగార్పూర్ లో పరువు హత్య సంచలనం సృష్టించింది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో సొంత కుటుంబ సభ్యులే ఓ మహిళను దారుణంగా చంపారు. గ్రామస్తులు అందరూ చూస్తుండగానే సజీవ దహనం చేశారు. మృతురాలు తన కుటుంబ సభ్యులను కాదని ప్రేమించిన వ్యక్తితో కొన్నేళ్ల క్రితం సొంతూరు విడిచి వెళ్లిపోయింది. ప్రియుడిని పెళ్లి చేసుకుని 8 ఏళ్ల తర్వాత ఇటీవల దంగార్పూర్ కు వచ్చింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఈ నెల 4న కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో మృతురాలి తండ్రితో పాటు 35 మంది కేసులు నమోదు చేశామని, ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు సాగ్వారా డీఎస్పీ బ్రిజ్ రాజ్ సింగ్ చరణ్ తెలిపారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు సాగిస్తున్నామని పేర్కొన్నారు.