హోలీ..జోష్‌ హైలీ | holi 2025 celebration in hyderabad | Sakshi
Sakshi News home page

హోలీ..జోష్‌ హైలీ

Published Thu, Mar 13 2025 8:42 AM | Last Updated on Thu, Mar 13 2025 8:42 AM

holi 2025 celebration in hyderabad

హోలీతో ఇంద్ర ధనుస్సును తలపించే నగరం

10 వేలకుపైగా మందితో వేదికల ఏర్పాటు

హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలతో పాటు గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఈవెంట్స్‌ 

ఈసారి అత్యధికంగా పబ్లిక్‌ ఈవెంట్స్‌కు ప్లాన్‌  

హోలీ సంబరాల్లో మెరవనున్న సెలబ్రిటీలు 

హోలీ సంబరాలకు హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, నానక్‌రామ్‌గూడ, సికింద్రాబాద్‌ వంటి ప్రాంతాల్లో విశాలమైన వేదికలను ఏర్పాటు చేశారు. కొన్ని ఈవెంట్లలో చర్మానికి హాని చేయకుండా ఉండే రసాయనాలు లేని ఆర్గానిక్‌ రంగులను మాత్రమే అనుమతిస్తుండటం విశేషం. ఈ హోలీని మరింత సంబురంగా మార్చడానికి ముంబై,బెంగళూరు, ఢిల్లీ వంటి వివిధ నగరాల నుంచి ప్రముఖ డీజేలు నగరానికి చేరుకున్నారు. మరి కొందరు నిర్వాహకులు.. ఈ వేడుకల్లో వినూత్నంగా సాంస్కృతిక సంబరాలను నిర్వహించనున్నారు. దీని కోసం బ్యాండ్‌ బాజా, డోల్‌ దరువు, జానపద హొయలు పలికే డప్పులను నగరానికి ఆహా్వనించారు. \



వందకు పైగా ఈవెంట్స్‌కు ఏర్పాట్లు 
రిస్టార్టులు, క్లబ్స్, పబ్లిక్‌ గ్రౌండ్స్‌లో భారీస్థాయిలో హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ భారీ వేదికల్లో 5 వేల నుంచి 15 వేల మందికి సరిపడా సౌకర్యాలు, విశాల ప్రాంగణాలు సిద్ధం చేశారు. ఇలాంటి భారీ హోలీ ఫెస్టివల్స్‌ సుమారు 30 నుంచి 40 వరకు నిర్వహిస్తుండగా.. మొత్తం నగరంలో వందకు పైగా హోలీ పబ్లిక్‌ ఈవెంట్స్‌కు ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనడానికి ఎంట్రీ పాస్‌ కోసం రూ.500 నుంచి రూ.5,000 వేలకు పైగా వసూలు చేసే ఈవెంట్స్‌ ఉన్నాయి. కొందరు నిర్వాహకులు రంగులను ఉచితంగా అందిస్తుంటే మరికొందరు రంగులతో పాటు ఫుడ్‌ – డ్రింక్స్‌ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఈవెంట్‌ ఆర్గనైజర్లు హోలీ లవర్స్‌ను ఆకర్షించడానికి పలువురు సినీతారలను, సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు, స్పోర్ట్స్‌ సెలబ్రెటీలను ముఖ్య అతిథులుగా ఆహా్వనిస్తున్నారు.

60 ఫీట్ల ఎత్తయిన భారీ బ్యాక్‌గ్రౌండ్‌ స్టేజ్‌తో..
లాత్‌మర్‌ హోలీ మీట్స్‌ టాలీవుడ్‌ పేరుతో నగరంలో అతిపెద్ద హోలీ సంబరాలను హైటెక్‌ ఎరీనాలో నిర్వహించనున్నారు. 60 ఫీట్ల ఎత్తయిన భారీ బ్యాక్‌గ్రౌండ్‌ స్టేజ్‌తో నగరంలో మొదటిసారి నిర్వహిస్తున్నారు. ఇందులో రంగుల సోయగాలతో పాటు సంగీతం, సెలబ్రెటీలతో అలరించనున్నారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌లోని అంథమ్‌ వేదికగా నియాన్‌ హోలీ పార్టీ 2025కి  ఘనంగా ఏర్పాట్లు చేశారు. బాలీవుడ్‌ బీట్స్‌తో లైవ్‌ మ్యాజిక్‌ ఉంటుంది. సుచిర్‌ ఇండియా ఆధ్వర్యంలో నగర శివార్లలోని హానీ బర్గ్‌ రిసార్ట్స్‌ వేదికగా హోలీ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.  

పదేళ్లుగా రంగ్‌ బర్సే..
పదేళ్లుగా నగరంలో హోలీ సంబరాలను వినూత్నంగా నిర్వహిస్తున్నాం. ఈ సారి సిటీలోని యోలో ఎరీనాలో రంగ్‌ బర్సే 9.0 పేరుతో భారీ స్థాయిలో హోలీ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నాం. ఇందులో మ్యూజిక్‌తో పాటు రెయిన్‌ డ్యాన్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. హోలీ థీం టీ షర్ట్‌తో పాటు స్పెషల్‌ డ్రింక్స్, మీల్‌ బాక్స్‌ అందిస్తున్నాం. మా ఫెస్టివల్‌లో కార్పొరేట్‌ ఉద్యోగులు, యూత్‌తో పాటు కుటుంబ సమేతంగా పాల్గొనే వారు ఎక్కువగా ఉన్నారు. సిటీలో హోలీ అంటే ట్రెండీ కల్చర్‌గా మారింది. దీనికి అనుగుణంగానే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం. 4 వేల మంది వరకు మా వేడుకల్లో పాల్గొంటారని అంచనా.  
– శరత్, రంగ్‌ బర్సే 9.0 నిర్వాహకులు  

మ్యూజిక్, డ్యాన్సింగ్‌తో పాటు బ్రుక్‌ ది పాట్‌ వంటి విభిన్న కార్యక్రమాలతో ఈ సంబరాలను ఏర్పాటు చేస్తున్నారు. సిటీలోని శ్రీపలాని కన్వెన్షన్‌ వేదికగా హోలీ మహోత్సవ్‌ 2.0 పేరుతో అతిపెద్ద ఓపెన్‌ ఎయిర్‌ ఫెస్టివల్‌ జరుపుతున్నారు. ఇందులో డీజే, లైవ్‌ డోల్, ఓపెన్‌ స్కై ఈవెంట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వేడుకల్లో బిగ్‌ బాస్‌ ఫేం అశ్వినీశ్రీ, శుభశ్రీ కలర్‌ఫుల్‌ గెస్టులుగా సందడి చేయనున్నారు.

గచ్చిబౌలిలోని సంధ్య పార్కింగ్‌ గ్రౌండ్‌ వేదికగా టోస్ట్‌ టానిక్‌ ఆధ్వర్యంలో హోలీ కారి్నవాల్‌ 2.0ను ఏర్పాటు చేస్తున్నారు. వేడుకల్లో అర్జున్‌ విజయ్, డీజే ఆకాశ్, డీజే మణి, డీజే రిష్, బీజే రుమీ వంటి వారు లైవ్‌ డీజేతో ఉర్రూతలూగించనున్నారు. బేగంపేట్‌ హాకీ స్టేడియం వేదికగా రంగ్‌ బసంత్‌ 2025 సంబరాలను, ఫ్లిప్‌ సైడ్‌ అడ్వెంచర్‌ పార్క్‌ గచ్చిబౌలిలో హోలీ కలర్‌ ల్యాండ్‌ ఓపెన్‌ ఎయిర్‌ ఫెస్టివల్‌తో పాటు నగరంలోని వివిధ వేదికల్లో హోలీ సంబరాలను నిర్వహిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement