దుబాయ్: గతంలో క్రికెట్ ఆడేందుకు ఎక్కడికెళ్లినా... ఓ పూట విశ్రాంతి తీసుకొని కాసేపు కసరత్తు చేసి ఎంచక్కా ఈతకొలనులో సేద తీరేవారు. అంతా కలిసి ఇష్టమైన రుచుల్ని ఆస్వాదించేవారు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేవారు. కానీ కరోనా కాలం కదా... అవన్నీ మారిపోయాయి. కలిసి తిరిగే పరిస్థితి కాదు కదా... కాలు బయటపెట్టే పరిస్థితి కూడా లేదాయే! ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్ వెళ్లిన క్రికెటర్లు అక్కడ హోటల్లో రాజస్తాన్, పంజాబ్ జట్లు ఆటగాళ్లు క్వారంటైన్ అయ్యారు.
అవకాశం దొరికితే బయటకు వెళ్లే భారత ఆటగాళ్లకు ఇది పూర్తిగా కొత్త కావడంతో కొంత ఇబ్బందిగానే అనిపిస్తోంది. హోటల్ గదులకే పరిమితమైన ఆటగాళ్లు... అప్పుడప్పుడు మాత్రం బాల్కనీల్లో మాత్రమే ఒకరితో ఒకరు ముచ్చటించుకున్నారు. ఇక ఫిట్‌నెస్ ట్రెయినర్ చెప్పినట్లుగా గదుల్లో చేయదగిన చిన్నపాటి వర్కవుట్లు చేశారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం అబుదాబీలోని హోటల్లో బసచేసింది. (ఐపీఎల్ సందడి సందడి షురూ...)
Comments
Please login to add a commentAdd a comment