సరదా... సరదాగా... | Indian cricketers are the players who have fitness for the third ODI | Sakshi
Sakshi News home page

సరదా... సరదాగా...

Published Thu, Jun 29 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

సరదా... సరదాగా...

సరదా... సరదాగా...

ఆంటిగ్వా: విండీస్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లు మూడో వన్డే కోసం సిద్ధమవుతున్నారు. ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టిన ఆటగాళ్లు బుధవారం కాసేపు జిమ్‌లో కసరత్తులు చేస్తూ సరదాగా గడిపారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, యువరాజ్, భువనేశ్వర్, కేదార్‌ జాదవ్‌ జిమ్‌ సెషన్‌లో పాల్గొన్నారు.

వీరంతా కలిసి కసరత్తులు చేస్తున్న వీడియోను శిఖర్‌ ధావన్‌ ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పంచుకున్నాడు. ట్రైనింగ్‌ ఎల్లప్పుడూ ఉల్లాసంగా సరదాగా సాగుతుంది అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ఈ వీడియోలో ధావన్‌ డంబెల్స్‌తో సాధన చేస్తుండగా... కోహ్లి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శంకర్‌ బసు దగ్గర సలహాలు తీసుకుంటూ కనిపించాడు. పాండ్యా కూడా ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ ఫోటోను అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. శుక్రవారం భారత్, విండీస్‌ జట్ల మధ్య మూడో వన్డే జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement