focus on fitness
-
టైటిల్ సాఫ్ట్... కుర్రాడు రఫ్!
చేసేది ప్రేమకథ అయినంత మాత్రాన హీరోలు సాఫ్ట్‌గా కనిపించాల్సిన అవసరం లేదు. ఇవాళ అన్ని సినిమాలకు హీరోలు భారీ ఫిజిక్ మెయిన్టైన్ చేస్తున్నారు. ప్రజెంట్ హీరో వరుణ్ తేజ్ కూడా కండలు పెంచుతూ, తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఫొటోతో... ‘‘నేనొక గోల్ పెట్టుకుని వర్కౌట్స్ చేస్తున్నాను. సగం దూరం వచ్చేశాను’’ అని వరుణ్ ట్వీట్ చేశారు. సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వరుణ్‌తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ ‘తొలిప్రేమ’ పేరుతో ఓ చిత్రం నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ సాఫ్ట్‌గా ఉన్నా ఇందులో వరుణ్ రఫ్ లుక్‌లో, సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తారేమో. అందుకే జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారేమో! -
సరదా... సరదాగా...
ఆంటిగ్వా: విండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లు మూడో వన్డే కోసం సిద్ధమవుతున్నారు. ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టిన ఆటగాళ్లు బుధవారం కాసేపు జిమ్‌లో కసరత్తులు చేస్తూ సరదాగా గడిపారు. ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, యువరాజ్, భువనేశ్వర్, కేదార్ జాదవ్ జిమ్ సెషన్లో పాల్గొన్నారు. వీరంతా కలిసి కసరత్తులు చేస్తున్న వీడియోను శిఖర్ ధావన్ ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పంచుకున్నాడు. ట్రైనింగ్ ఎల్లప్పుడూ ఉల్లాసంగా సరదాగా సాగుతుంది అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ఈ వీడియోలో ధావన్ డంబెల్స్‌తో సాధన చేస్తుండగా... కోహ్లి ఫిట్నెస్ ట్రైనర్ శంకర్ బసు దగ్గర సలహాలు తీసుకుంటూ కనిపించాడు. పాండ్యా కూడా ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. శుక్రవారం భారత్, విండీస్ జట్ల మధ్య మూడో వన్డే జరుగనుంది.