యూఎస్‌ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఇవాల్టి (జూన్ 1) నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తొలి సారి రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గతంలో ఈ టోర్నీ 12 జట్లతో సాగేది. క్రికెట్ పసికూనలకు ప్రోత్సహించడంలో భాగంగా ఐసీసీ ఈ ఎడిషన్ నుంచి 20 జట్లకు అవకాశం కల్పిస్తుంది.
ఈ ఎడిషన్ ప్రపంచకప్‌లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈసారి ఏకంగా 15 మంది భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. న్యూజిలాండ్ నుంచి ఒక్కరు.. యూఎస్‌ఏ నుంచి ఆరుగురు.. కెనడా నుంచి నలుగురు.. సౌతాఫ్రికా, ఒమన్‌ల నుంచి ఒక్కొక్కరు.. ఉగాండ నుంచి ఇద్దరు చొప్పున ఈ ఎడిషన్‌లో పాల్గొంటున్నారు.
గతంలో ఎన్నడూ ఈ సీజన్‌లో పాల్గొంటున్నంత మంది భారత సంతతి ఆటగాళ్లు పాల్గొనలేదు. ఈ ఎడిషన్ ప్రపంచకప్‌లో అందరి కళ్లు న్యూజిలాండ్‌కు చెందిన భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్రపై ఉన్నాయి. అలాగే సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ప్రదర్శనల కోసం కూడా భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024లో పాల్గొంటున్న భారత సంతతి ఆటగాళ్లు..
రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)
కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా)
కశ్యప్ ప్రజాపతి (ఒమన్)
అల్పేశ్ రాంజనీ (ఉగాండ)
రోనక్ పటేల్ (ఉగాండ)
రవీందర్ పాల్ సింగ్ (కెనడా)
నిఖిల్ దత్తా (కెనడా)
పర్గత్ సింగ్ (కెనడా)
శ్రేయస్ మొవ్వ (కెనడా)
మోనాంక్ పటేల్ (యూఎస్‌ఏ)
హార్మీత్ సింగ్ (యూఎస్‌ఏ)
మిలింద్ కుమార్ (యూఎస్‌ఏ)
నిసర్గ్ పటేల్ (యూఎస్‌ఏ)
నితీశ్ కుమార్ (యూఎస్‌ఏ)
సౌరభ్ నేత్రావాల్కర్ (యూఎస్‌ఏ)
Comments
Please login to add a commentAdd a comment