బెంగళూరు: ఆసియా కప్‌కు ముందు ఆరు రోజుల స్వల్పకాలిక శిక్షణా శిబిరంలో భారత క్రికెటర్లు చెమటోడుస్తున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో జరుగుతున్న ఈ శిబిరంలో ఫిట్‌నెస్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. జట్టు సభ్యులందరికీ సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కీలకమైన ‘యో–యో టెస్టు’ కూడా నిర్వహించనున్నారు.
బీసీసీఐ 16.5 పాయింట్లను యో–యో టెస్టు ఉత్తీర్ణత మార్క్‌గా గుర్తించింది. గురువారం కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, హార్దిక్ పాండ్యాలు ఈ టెస్టులో పాల్గొన్నట్లు సమాచారం. వీరి ఫలితాలను అధికారికంగా ప్రకటించకపోయినా... 17.2 పాయింట్లతో తాను పాస్ అయినట్లు కోహ్లి సోషల్ మీడియాలో వెల్లడించాడు. అయితే అందరి దృష్టీ కేఎల్ రాహుల్‌పైనే నిలిచింది .
గాయం నుంచి కోలుకొని ఆసియా కప్ జట్టులోకి ఎంపికైనా, అతను కొంత ‘అసౌకర్యం’తో ఉన్నట్లు సెలక్టర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడం అతనికి ఎంతో ముఖ్యం. ఐర్లాండ్ పర్యటన నుంచి ఇంకా భారత్‌కు చేరుకోని బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, సామ్సన్, తిలక్ మినహా మిగతా జట్టు సభ్యులంతా ఎన్‌సీఏలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment