special camps
-
Asia Cup 2023: ఫిట్‌నెస్‌పైనే దృష్టి
బెంగళూరు: ఆసియా కప్‌కు ముందు ఆరు రోజుల స్వల్పకాలిక శిక్షణా శిబిరంలో భారత క్రికెటర్లు చెమటోడుస్తున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో జరుగుతున్న ఈ శిబిరంలో ఫిట్‌నెస్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. జట్టు సభ్యులందరికీ సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కీలకమైన ‘యో–యో టెస్టు’ కూడా నిర్వహించనున్నారు. బీసీసీఐ 16.5 పాయింట్లను యో–యో టెస్టు ఉత్తీర్ణత మార్క్‌గా గుర్తించింది. గురువారం కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, హార్దిక్ పాండ్యాలు ఈ టెస్టులో పాల్గొన్నట్లు సమాచారం. వీరి ఫలితాలను అధికారికంగా ప్రకటించకపోయినా... 17.2 పాయింట్లతో తాను పాస్ అయినట్లు కోహ్లి సోషల్ మీడియాలో వెల్లడించాడు. అయితే అందరి దృష్టీ కేఎల్ రాహుల్‌పైనే నిలిచింది . గాయం నుంచి కోలుకొని ఆసియా కప్ జట్టులోకి ఎంపికైనా, అతను కొంత ‘అసౌకర్యం’తో ఉన్నట్లు సెలక్టర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన ఫిట్నెస్ను నిరూపించుకోవడం అతనికి ఎంతో ముఖ్యం. ఐర్లాండ్ పర్యటన నుంచి ఇంకా భారత్‌కు చేరుకోని బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, సామ్సన్, తిలక్ మినహా మిగతా జట్టు సభ్యులంతా ఎన్సీఏలో ఉన్నారు. -
Aadhaar Special Camps: 22 నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియలో ఆధార్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్‌లో తప్పులు కారణంగా అర్హులెవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ నెల 22 నుంచి 25 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ క్యాంపులు ఉంటాయి. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్చార్జిలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆధార్ అనుసంధానంతో కూడిన కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వివరాలను తాజాగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5.56 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. వీరిలో 1.49 కోట్ల మంది గత పదేళ్లలో ఒక్కసారి కూడా తమ వివరాలను అప్డేట్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో వీరితోపాటు కొత్తగా ఆధార్ నమోదు, ఇతర మార్పులుచేర్పుల సేవలు అందజేసేందుకు ఈ ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నట్టు లక్ష్మీశ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎక్కువ మంది క్యాంపులను వినియోగించుకొని ఆధార్ సేవలు పొందేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు ఇందుకు ప్రచారం చేయించాలని ఆదేశించారు. -
కోనసీమ: వరద బాధితులకు ప్రత్యేక శిబిరాలు
-
నల్లా కనెక్షన్ల జారీకి ప్రత్యేక క్యాంపులు
సాక్షి, సిటీబ్యూరో: నూతన నల్లా కనెక్షన్ల జారీకి శివారు ప్రాంతాలు, ఔటర్ గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. శివార్లలో చేపట్టిన హడ్కో, ఔటర్ గ్రామాల్లో చేపట్టిన తాగునీటి పథకం పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. సోమవారం ఖైరతాబాద్‌లోనిజలమండలి ప్రధాన కార్యాలయంలో ఈ పథకాల పురోగతిపై సమీక్షించారు. హడ్కో, ఓఆర్ఆర్ ప్రాజెక్టుల్లో భాగంగా ఇంకా మిగిలి ఉన్న గ్యాపులు, జంక్షన్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల కింద నూతన నల్లా కనెక్షన్ల జారీపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2వేల కిలోమీటర్ల ప్రధాన రహదారులపై ఉన్న మ్యాన్‌హోళ్లను రోడ్డుకు సమాంతరంగా సరిచేసే ప్రక్రియపై సంబంధిత సీజీఎంలు, జీఎంలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్లు ఎం.ఎల్లాస్వామి, డి. శ్రీధర్‌బాబు, ఆపరేషన్స్–2 డైరెక్టర్ పి.రవి, సంబంధిత ప్రాజెక్టు విభాగం సీజీఎంలు, జీఎంలు, నిర్వహణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రకాశం: ఓటర్ లిస్టుంది సరే.. మరి మీ పేరుందా?
♦ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. ♦ 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ♦ www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ♦ జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. ♦ మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. ♦ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ♦ సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. ► మీ మీ మండలాల తహసీల్దార్ కార్యాలయంలో ఉండే కింది నంబర్లకు చెందిన అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. కనిగిరి - నాసిరుద్దిన్, ఎలక్షన్ డీటీ - 97049 98500 కనిగిరి - కె.రాజ్‌కుమార్, తహసీల్దార్ - 88866 16059 పామూరు - ఆర్.వాసుదేవరావు, డిప్యూటీ తహసీల్దార్ - 88866 16069 వెలిగండ్ల - టి.కోటేశ్వరరావు, తహసీల్దార్ - 88866 16082 పీసీపల్లి - సత్యనారాయణ ప్రసాద్, తహసీల్దార్ - 88866 16068 సీఎస్‌పురం - జి.శ్రీనివాసులు, తహసీల్దార్ - 88866 16049 హెచ్‌ఎంపాడు - ఎస్.రామలింగేశ్వరరావు,తహసీల్దార్ - 88866 16056 - ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
ఆధార్ లేదని ప్రవేశాలు నిరాకరించొద్దు
న్యూఢిల్లీ: ఆధార్ లేదన్న కారణంతో విద్యార్థులకు పాఠశాలల ప్రవేశాలను నిరాకరించరాదని ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు చట్ట ప్రకారం ఆమోదయోగ్యం కావని పేర్కొంది. ఆధార్ లేనందుకు కొన్ని పాఠశాలలు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలేదన్న ఆరోపణలు తన దృష్టికి రావడంతో యూఐడీఏఐ స్పందించింది. విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలు, హక్కులను ఆధార్‌ను కారణంగా చూపుతూ దూరం చేయకూడదని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ఇప్పటి వరకూ ఆధార్ పొందని, బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోని విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాల ను నిర్వహించే బాధ్యత సంబంధిత పాఠశాలలదే అని స్పష్టం చేసింది. స్థానిక బ్యాంకులు, పోస్టాఫీసులు, జిల్లా అధికారులు, రాష్ట్ర విద్యా శాఖ సమన్వయంతో పాఠశాలలే అలాంటి విద్యార్థుల కోసం ఆధార్ నమోదు, అప్డేట్ శిబిరాలు నిర్వహించాలని సూచించింది. ఏటా కనీసం రెండు సార్లు అన్ని పాఠశాల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.విద్యార్థులు ఆధార్ పొందే వరకు, బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునే వరకు ప్రత్యామ్నాయ గుర్తిం పు మార్గాలను అనుమతించాలంది. 5–15 ఏళ్లు నిండిన చిన్నారుల ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరని పేర్కొంది. -
పాతర్లపల్లికి జ్వరమొచ్చింది..!
ఇల్లందకుంట (హుజూరాబాద్): అదో మారుమూల గ్రామం. అక్కడ సుమారు 450 కుటుంబాలు, 1,500 మంది జనాభా ఉంటారు. అలాంటి గ్రామంలో ఇప్పుడు 200 మంది తీవ్రమైన విషజ్వరాలతో బాధపడుతున్నారు. 20 రోజులుగా గ్రామాన్ని జ్వరాలు పీడిస్తున్నాయి. జ్వరాల బారిన పడి 15 రోజుల వ్యవధిలోనే నలుగురు మృతిచెందారు. వీరిలో ఒకరు డెంగీ లక్షణాలతో చనిపోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. మిగిలిన వారంతా వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమకు కూడా జ్వరాలు ఎక్కడ వస్తాయోనన్న భయంతో అనేకమంది గ్రామస్తులు ఊరునే ఖాళీ చేసి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని పాతర్లపల్లిలో ఊరుఊరంతా విషజ్వరాలతో అల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పరిశుభ్రత లోపించింది. చెత్తాచెదారం పేరుకుపోయింది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురికికాలువల్లో దోమల లార్వా పెరిగిపోయింది. దీనికితోడు భారీగా కురుస్తున్న వర్షాలకు జంతు కళేబరాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఫలితంగా అంటువ్యాధులు ప్రబలి.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల్లో నలుగురి దుర్మరణం గ్రామంలో కొద్దిరోజులుగా 200 మందికి పైగా తీవ్రమైన విషజ్వరాలతో బాధపడుతున్నారు. పదిహేను రోజుల క్రితం గ్రామానికి చెందిన రామ్ లచ్చమ్మ, కోడారి రాజవీరు, బాలమ్మ చనిపోయారు. తాజాగా అనుమండ్ల లక్ష్మి అనే మహిళకు విçషజ్వరం రావడంతో ఆమెను కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు డెంగీగా నిర్ధారించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రమైన జ్వరంతో ఆమె ఆదివారం చనిపోయింది. ఈ విషయం తెలియడంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు ఉదయం నుంచే వరంగల్, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల బాటపట్టారు. జమ్మికుంటలోని ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో చూసినా పాతర్లపల్లికి చెందిన వారే కనిపిస్తున్నారు. కొందరు కరీంనగర్, హన్మకొండలలో ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయించుకుం టున్నారు. వైద్యాధికారులు నామమాత్రంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెళ్లిపోయారని, మురికికాలువల్లో మందు చల్లి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గ్రామస్తుల రక్తనమూనాలు సేకరించారు. మంత్రి ఈటల రాజేందర్ ఆరా.. విషజ్వరాలపై ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. ఇంత జరుగుతున్నా స్థానిక వైద్యాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఉపాధి కూలీల కోసం ప్రత్యేక శిబిరాలు
అనంతపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీ లకు ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతా లు తెరిచేందుకు, ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. గురువారం కదిరి, ఓడీసీ క్లస్టర్ల పరిధిలోని కూలీల కోసం కదిరి మునిసిపల్ కార్యాలయం వద్ద క్యాంప్ నిర్వహించనున్నట్లు చెప్పారు. కూలీలు జాబ్‌కార్డు జిరాక్స్, ఆధార్, మూడు ఫొటోలను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 19న అనంతపురం జిల్లా పరిశ్రమల కేంద్రంలో, 25న కళ్యాణదుర్గంలోని వెలుగు కార్యాలయం వద్ద శిబిరం ఉంటుందన్నారు. -
వరంగల్‌లో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం
వరంగల్ జిల్లా కేంద్రంలోని అండర్ రైల్వేగేటు సమీపంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శివానగర్, మైత్రేయ నగర్, పెరకవాడ, శాఖరాజ్ కుంట త దితర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో అధికారులు ఈ ప్రాంతాల్లో నివసించే వారిని ప్రత్యేక శిబిరాలకు తరలించారు. -
నిధులున్నా.. విడుదల కావు
- కేయూ పరిధిలో వింతపోకడలు - బిల్లుల కోసం నిరీక్షిస్తున్న ప్రోగ్రాం ఆఫీసర్లు - ప్రారంభంకాని ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలు - మూలుగుతున్న రూ.1.69కోట్లు - ఇన్చార్జీల పాలనతోనే అస్తవ్యస్తం..! కేయూక్యాంపస్ : కేయూ పరిధిలో జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన ప్రోగ్రాం ఆఫీసర్లకు బిల్లుల చెల్లింపులో యూనివర్సిటీ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, వివిధ జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రోగ్రాం అధికారులు ఏటా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. ఒక్కో శిబిరానికి యూనివర్సిటీ ద్వారా రూ.22,500 చొప్పున ఎన్ఎస్ఎస్ ద్వారా చెల్లిస్తుంది. విద్యార్థులు వారంపాటు గ్రామాలు, ఇతర ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. వీరికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ భోజనం, వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తారు. శిబిరం ముగిశాక ఖర్చుకు సంబంధించిన బిల్లులను యూనివర్సిటీకి సమర్పిస్తారు. అధికారులు పరిశీలించి నిధులు మంజూరు చేస్తారు. మంజూరైన నిధులు.. కేయూ పరిధిలో 2014-15 విద్యాసంవత్సరం లో వివిధ కళాశాలల్లో 350కిపైగా ఎన్ఎస్ఎస్ యూనినట్లు నమోదై ఉన్నాయి. గతేడాది అక్టోబర్ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రో గ్రాం ఆఫీసర్లు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. వీటి తాలూకు వివరాలు, బిల్లుతో కూడిన ఫైలును ప్రోగ్రాం ఆఫీసర్లు యూనివర్సిటీ అధికారులకు సమర్పించారు. ఇప్పటి వరకు ముగ్గురు ఇన్చార్జీ వీసీలు మారారు. వారి వద్ద ఆ ఫైలు ముందుకు కదలలేదు. ఇటీవల ఇన్చార్జీ వీసీగా చిరంజీవులు బాధ్యలు చేపట్టగా ఆయన వద్దకు ఈ ఫైలు వెళ్లింది. సుమారు 200 కళాశాలల్లోని ఎన్ఎస్ఎస్ యూనిట్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలు గడిచినా ఒక్కరూపారుు విడుదల కావడంలేదు. విశేషం ఏమిటంటే.. ప్రభుత్వం ద్వారా యూనివర్సిటీకి రూ.1.69 కోట్లు మంజూరైనా విడుదల ఎందుకు చేయడంలేదో అర్థం కావడంలేదు. బిల్లులపై ఆడిట్‌తోనే..! గత విద్యాసంవత్సరంలోని బిల్లులు కావడంతో ఇవి సరైనవా, కాదా? అనే విషయంపై ఆడిట్ చేరుుంచారని తెలిసింది. ఇదే బిల్లుల విడుదలలో జాప్యానికి కారణమని తెలుస్తోంది. మరోవైపు.. తమకు బిల్లులు చెల్లించాలంటూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు నెలల కొద్దీ కేయూ ఆర్డినేటర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది బిల్లులు అందకపోవడంతో ఈవిద్యాసంవత్సరంలో ఒక్క ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం కూడా నిర్వహించలేకపోయూరు. మిగతా అంశాల మాదిరిగానే ఇన్చార్జీల పాలనలో ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలు సైతం నీరుగారిపోతున్నాయని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. -
ఒకేరోజు 1.7 లక్షల దరఖాస్తులు
న్యూఢిల్లీ: త్వరలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వచ్చే నెల 10న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఢిల్లీ ఎన్నికల సంఘం నగరవ్యాప్తంగా ఆదివారం ఏర్పాటు చేసిన 11,763 ప్రత్యేక శిబిరాల్లో 1.7 లక్షల మంది ఓటరు నమోదు దరఖాస్తులు సమర్పించారు. ఇది వరకే ఓటర్లుగా నమోదైన వాళ్ల వివరాలనూ ఈ సందర్భంగా తనిఖీ చేసుకునే అవకాశం కల్పించారు. ఇలాంటి వారికి సహకరించడానికి బూత్‌స్థాయి అధికారులను (బీఎల్ఓ) నియమించామని ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్లు తమ వివరాలను తనిఖీ చేసుకునేందుకు వీలుగా జాబితాను అంటించారు. అందులో పేర్లు లేని వాళ్లు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఫారం నంబరు 6 ఇచ్చారు. బుధవారం దాకా ఈ ఫారాలను సమర్పించవచ్చు. శ్రీ వెంకటేశ్వర కాలేజీలో అంటించిన ఓటర్ల జాబితా, ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయ సీనియర్ అధికారులు ఈ శిబిరాలను పర్యవేక్షించారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ సైతం హనుమాన్రోడ్డు, లోధీ ఎస్టేట్, పండారా రోడ్డు, ఆర్కే పురం పోలింగ్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓటర్ల పేర్ల పరిశీలన, ధ్రువీకరణతోపాటు కొత్త ఓటర్ల నమోదుకు కూడా శిబిరాల్లో అవకాశం కల్పిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి ఆషిమా జైన్ అన్నారు. మధ్యజిల్లా ఎన్నికల కార్యాలయం 1,056 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించడానికి పాతఢిల్లీ ప్రాంతంలో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమలనూ నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునేవారి సంఖ్యను మరింతగా పెంచి, గత రికార్డులను తిరగరాస్తామని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి విజయ్‌దేవ్ ఇటీవల ప్రకటించారు. నగరంలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో 1.20 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించే అన్ని చర్యలను తీసుకుంటున్నామని, తద్వారా గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 65.86 పోలింగ్ శాతాన్ని ఈసారి అధిగమిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. జనవరి 31 నాటికి ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నవారి సంఖ్య 1,20,60,493కు చేరిందన్నారు. ఇందులో పురుషుల సంఖ్య 66,84,476 ఉండగా, మహిళల సంఖ్య 53,76,017 మంది ఉన్నారని, ఇందులో 638 మంది లింగమార్పిడి చేసుకున్నవారు ఉన్నారని చెప్పారు. ఢిల్లీ ఓటర్లలో స్త్రీ, పురుష నిష్పత్తి 804:1000 గా ఉందని, మొత్తం జనాభాలో ఓటర్ల సంఖ్య 68.12 శాతం ఉందని దేవ్ అన్నారు.