నల్లా కనెక్షన్ల జారీకి ప్రత్యేక క్యాంపులు | Special Camps For Tap Connections | Sakshi
Sakshi News home page

నల్లా కనెక్షన్ల జారీకి ప్రత్యేక క్యాంపులు

Published Tue, May 7 2019 7:22 AM | Last Updated on Thu, May 9 2019 8:37 AM

Special Camps For Tap Connections - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నూతన నల్లా కనెక్షన్ల జారీకి శివారు ప్రాంతాలు, ఔటర్‌ గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్‌ అధికారులను ఆదేశించారు. శివార్లలో చేపట్టిన హడ్కో, ఔటర్‌ గ్రామాల్లో చేపట్టిన తాగునీటి పథకం పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. సోమవారం ఖైరతాబాద్‌లోనిజలమండలి ప్రధాన కార్యాలయంలో ఈ పథకాల పురోగతిపై సమీక్షించారు. హడ్కో, ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుల్లో భాగంగా ఇంకా మిగిలి ఉన్న గ్యాపులు, జంక్షన్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ ప్రాజెక్టుల కింద నూతన నల్లా కనెక్షన్ల జారీపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2వేల కిలోమీటర్ల ప్రధాన రహదారులపై ఉన్న మ్యాన్‌హోళ్లను రోడ్డుకు సమాంతరంగా సరిచేసే ప్రక్రియపై సంబంధిత సీజీఎంలు, జీఎంలతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్లు ఎం.ఎల్లాస్వామి, డి. శ్రీధర్‌బాబు, ఆపరేషన్స్‌–2 డైరెక్టర్‌ పి.రవి, సంబంధిత ప్రాజెక్టు విభాగం సీజీఎంలు, జీఎంలు, నిర్వహణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement