ఉపాధి కూలీల కోసం ప్రత్యేక శిబిరాలు | special camps for nregs labours | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల కోసం ప్రత్యేక శిబిరాలు

Published Thu, Oct 13 2016 11:35 PM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM

special camps for nregs labours

అనంతపురం టౌన్‌ : జిల్లా వ్యాప్తంగా  ఉపాధి హామీ కూలీ లకు ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన కింద బ్యాంక్‌ ఖాతా లు తెరిచేందుకు, ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు.   గురువారం  కదిరి, ఓడీసీ క్లస్టర్ల పరిధిలోని కూలీల కోసం కదిరి మునిసిపల్‌ కార్యాలయం వద్ద క్యాంప్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు.   కూలీలు జాబ్‌కార్డు జిరాక్స్, ఆధార్, మూడు ఫొటోలను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 19న అనంతపురం  జిల్లా పరిశ్రమల కేంద్రంలో, 25న కళ్యాణదుర్గంలోని వెలుగు కార్యాలయం వద్ద శిబిరం ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement