ముంబై: భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ స్థాయిని పరీక్షించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న యో–యో టెస్టుతో పాటు మరో కొత్త తరహా పరీక్షను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. పరుగులో వేగాన్ని బట్టి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కొలవనున్నారు. పేస్ బౌలర్లయితే 2 కిలోమీటర్ల పరుగును 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. స్పిన్నర్లు, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌కు మరో 15 సెకన్లు అదనపు అవకాశం కల్పిస్తూ 8 నిమిషాల 30 సెకన్ల గరిష్ట సమయాన్ని నిర్దేశించారు. కాంట్రాక్ట్ ప్లేయర్లతో పాటు జట్టులోకి వచ్చే అవకాశం ఉన్న అందరికీ ఇది వర్తిస్తుంది. ఏడాదిలో మూడుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇంగ్లండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పాల్గొనే ఆటగాళ్లు ముందుగా ఈ పరీక్షను ఎదుర్కోనున్నారు. అయితే అత్యున్నత స్థాయిలో ఆడే అథ్లెట్లు సాధారణంగా 6 నిమిషాల్లోనే 2 కిలోమీటర్లు పూర్తి చేస్తుంటారు కాబట్టి కొత్త పరీక్ష వల్ల క్రికెటర్లు పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు.
(చదవండి: ‘ఫైండ్ ఆఫ్ ది టూర్’ అతడే: రవిశాస్త్రి)
భారత క్రికెటర్లు ఇక 2 కిలోమీటర్లు పరుగెత్తాల్సిందే!
Published Sat, Jan 23 2021 6:12 AM | Last Updated on Sat, Jan 23 2021 8:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment