బెంగళూరు: గాయాలకు గురై జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్న ఐదుగురు భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి బీసీసీఐ మెడికల్ బులెటిన్‌ను విడుదల చేసింది. వేర్వేరు కారణాలతో ఎన్‌సీఏలో కోలుకుంటున్న వీరందరి ఫిట్‌నెస్ స్థాయి ప్రస్తుతం మెరుగ్గా ఉందని బోర్డు వెల్లడించింది. బోర్డు చెప్పిన వివరాల ప్రకారం... పేస్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ రీహాబిలిటేషన్ చివరి దశలో ఉన్నారు.
నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ కూడా చేస్తున్నారు. ఎన్‌సీఏ నిర్వహించే ప్రాక్టీస్ మ్యాచ్‌లలో వీరిద్దరు ఆడతారు. ప్రాక్టీస్ గేమ్‌లను పరిశీలించిన తర్వాత వీరిద్దరిపై తుది నిర్ణయం తీసుకుంటారు. బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్ట్రెంత్, ఫిట్‌నెస్ డ్రిల్స్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ డ్రిల్స్ తీవ్రత పెంచి వారి పరిస్థితిని అంచనా వేస్తారు.
కారు ప్రమాదానికి గురై కోలుకుంటున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీహాబిలిటేషన్ చాలా వేగంగా సాగుతోంది. నెట్స్‌లో బ్యాటింగ్ సాధనతో పాటు వికెట్ కీపింగ్ కూడా పంత్ మొదలు పెట్టాడు. స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, రన్నింగ్‌కు సంబంధించి అతని కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఫిట్‌నెస్ కార్యక్రమాన్ని పంత్ అనుసరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment