బంగ్లాదేశ్‌లో మాత్రం అలా కుదరడం లేదు
ఢాకా: సాధారణంగా భారత క్రికెటర్లు విదేశాలకు వెళితే కావలసినంత ఎంజాయ్ చేస్తారు. ప్రపంచకప్ సమయంలో మ్యాచ్‌ల మధ్య విరామం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాగా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక... ఇలా ఎక్కడ ప్రపంచకప్ జరిగినా.... పబ్‌లు, నైట్‌క్లబ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడం ధోని సేనకు బాగా ఇష్టమైన వ్యాపకం. కానీ ఈసారి బంగ్లాదేశ్‌లో మాత్రం అలా కుదరడం లేదు.
ఢాకాలో నైట్‌క్లబ్‌లు, పబ్‌లు ఉండవు. దీనికి తోడు ఈసారి భద్రత బాగా ఎక్కువ చేశారు. దీంతో మొత్తం ఆటగాళ్లంతా గ్రౌండ్‌కు, హోటల్‌కు పరిమితమవుతున్నారు. ప్రాక్టీస్, మ్యాచ్ లేకపోతే గదుల్లోంచి బయటకు కూడా రావడం లేదు. వీడియో గేమ్స్, చాటింగ్‌లతో కాలక్షేపం చేస్తూ ‘గూట్లో పక్షులు’గా మారారు. పాపం..!