బౌలింగ్ పదును పెరగాలి: ధోని
మిర్పూర్: టి20 ప్రపంచకప్లో తమ బౌలింగ్ పదును పెరగాల్సిన అవసరముందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు. బ్యాట్స్మెన్ కూడా మెరుగ్గా రాణించి బౌలర్లపై భారం తగ్గిస్తారన్న నమ్మకాన్ని అతడు వ్యక్తం చేశాడు. టి20 ప్రపంచకప్లో తన ఆరంభ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో రేపు భారత్ తలపడనుంది.
అయితే బ్యాటింగ్ పోలిస్తే బౌలింగ్లో తాము బలహీనంగా ఉన్నామని ధోని అంగీకరించాడు. బ్యాటింగ్లో శుభారంభం చేయడం ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ఓపెనింగ్ బాగుంటే 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసే అవకాశముందన్నాడు. బ్యాటింగ్ పరంగా ఎక్కువగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరముందన్నారు.
మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ పెద్దగా టి20 మ్యాచ్లు ఆడనప్పటికీ ఐపీఎల్ అనుభవం వారికి పనికొస్తుందని ధోని అన్నాడు. యువరాజ్ సింగ్, సురేష్ రైనా ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అజింక్య రహానేను ఓపెనింగ్ పంపే విషయం ఆలోచిస్తున్నామని చెప్పాడు.